రెండు ఫైళ్లకు ఆమోదముద్ర వేసేందుకు తనకు రూ. 300కోట్ల ముడుపులు ఆశ చూపారంటూ ఆరోపణలు చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించేందుకు శుక్రవారం సిబిఐ ఆయన నివాసానికి చేరుకుంది. ఆర్‌కె పురం ప్రాంతంలోని సోమ్ విహార్‌లో నివసిస్తున్న మాలిక్ నివాసానికి ఉదయం 11.45 సమయంలో సిబిఐ అధికారులు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆరోపణలపై వివరణ కోరేందుకే సిబిఐ ఆయనను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మాలిక నిందితుడు లేదా అనుమానితుడు కాదని వారు చెప్పారు. గత ఏడు నెలల కాలంలో మాలిక్‌ను సిబిఐ ప్రశ్నించడం ఇది రెండవసారి. జమ్మూ కశ్మీరు గవర్నర్‌గా పదవి నుంచి తప్పుకున్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మాలిక్ వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు నమోదు చేశారు. తాజాగా..వివరణ కోరుతూ సిబిఐ అధికారులు పంపించిన నోటీసుకు మాలిక్ ట్విటర్ వేదికగా స్పందించారు. నిజాలు మాట్లాడి కొందరు వ్యక్తుల పాపాలను నేను బయటపెట్టాను. అందుకే…
Author: Editor's Desk, Tattva News
గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత మొదటిసారిగా భారత్, చైనా రక్షణ మంత్రులు తొలిసారిగా ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బలమైన సందేశం పంపారు. తూర్పు లడఖ్‌లో సరిహద్దుల ఒప్పందాలను ఉల్లంఘించి ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశారని చైనా మంత్రి లీ షాంగ్‌ఫూనకు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అన్ని వివాదాలను ప్రస్తుత ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారమే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. భారత్ పర్యటనకు వచ్చిన చైనా మంత్రి లీ షాంగ్‌ఫూతో సుమారు 45 నిమిషాలపాటు రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. దాదాపు మూడేళ్లుగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడితే సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా లీతో పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొనడంపైనే భారత్, చైనాల మధ్య సంబంధాల అభివృద్ధి జరుగుతుందని…
శిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రతిపాదించిన సీఐఎస్‌ఎఫ్ భద్రతను గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. దానికి నిరసనగా మే 1 నుంచి శిర్డీలో నిరవధిక బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. శిర్డీలోని సాయిబాబా ఆలయానికి మరింత భద్రతను కల్పించాలని సాయి సంస్థాన్ ట్రస్టు పెద్దలు, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆలయానికి సీఐఎస్‌ఎఫ్ భద్రతను ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని శిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది చూస్తున్నారు. ఆలయ ప్రాంగణం భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఆలయాన్ని ప్రతి రోజూ బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో ఆలయ భద్రతపై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సీఐఎస్‌ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ మద్దతు పలికింది. అయితే ఈ…
అమెరికా-దక్షిణ కొరియా మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కింద ఉత్తర కొరియాను అదుపు చేసేందుకు అమెరికా అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణకొరియా తీరంలో మోహరించనుంది. అలాగే సియోల్ న్యూక్లియర్ ప్లానింగ్ ఆపరేషన్స్‌లో భాగం కానుంది. దీనికి బదులుగా దక్షిణ కొరియా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలనుకొన్న ప్రణాళికలను వదులుకోనుంది. దీనిని ‘వాషింగ్టన్ డిక్లరేషన్’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ ”ఈ ఒప్పందం వల్ల ఉత్తర కొరియాను నిలువరించే క్రమంలో భాగస్వాముల మధ్య సమన్వయం పెరుగుతుంది” అని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం యుద్ధ సమయాల్లో దక్షిణ కొరియాను రక్షించాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. దీనికి తోడు అవసరమైన సమయంలో అమెరికా అణ్వాయుధాలను వినియోగిస్తామని కూడా హామీ ఇచ్చింది. కానీ, దక్షిణ కొరియాలోని కొన్ని వర్గాలు అమెరికా మాటలను నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో సొంతంగా అణ్వస్త్రాలను అభివఅద్ధి చేసుకోవాలనే డిమాండ్…
ఓ ఐఎఎస్ అధికారి హత్య కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ గురువారం సహర్సా జైలునుంచి విడుదలయ్యారు. ఆనంద్ మోహన్‌తో పాటుగా 27 మంది దోషులను శిక్షాకాలం పూర్తి కాకముందే విడుదల చేయడానికి వీలుగా బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ఇటీవల నిబంధనలను సవరించడంతో ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం అయింది. 1994లో అప్పటి గోపాల్ గంజ్ కలెక్టర్ జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ గత 15 ఏళ్లుగా జైలులో ఉన్నాడు.2007లో స్థానిక కోర్టు ఆయనకు మొదట మరణ శిక్ష విధించగా ఆ తర్వాత ఆయన కింది కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకోవడంతో పాట్నా హైకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. అయితే ఓ ఐఎఎస్ అధికారిని దారుణంగా హత్య చేసిన దోషులను విడుదల చేయాలన్న బీహార్ ప్రభుత్వం నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది. నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయంపై ప్రతిపక్ష…
కాపు రిజర్వేషన్ చాలా సున్నితమైన అంశమని పేర్కొంటూ కోర్టులో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వంపై ఇతర మార్గాల్లో ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం మాజీ హోమ్ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్వస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్యకు సూచించింది. లేకపోతే కోర్టులో పెండింగ్‌లో ఉందంటూ ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం లేకపోలేదని తెలిపింది. విద్యా, ఉపాథి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకు వచ్చిన చట్టాన్ని, జీవో 60ను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల తో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. …
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో ప్రసంగిస్తూ ‘మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తాం’ అంటూ భరోసా వ్యక్తం చేశారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని దిశానిర్ధేశం చేశారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని చెప్పారు. క్యాడర్‌లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం,…
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను మాకివ్వండి అని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చోటు చేసుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. తాజాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ అంశంపై జరిగిన సమావేశంలోనూ మరోసారి ఇదే పరిస్థితి ఎదురైంది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులకు సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న ప్రకారం రాష్ట్రం వెలుపల ఆస్తులను సైతం 58:42 నిష్పత్తిలో పంచాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ లెక్కన మొత్తం 19.73 ఎకరాల స్థలంలో తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం,…
‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ 99 ఎపిసోడ్‌ల పాటు ప్రజలతో సంభాషించారని, అయితే ఈ ఎపిసోడ్‌లలో రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ‘మన్ కీ బాత్’ వేదిక ద్వారా దేశ శక్తిని నిర్వహించే పని జరిగిందని, ప్రజాస్వామ్య విజయాన్ని 99 ఎపిసోడ్‌ల ద్వారా బయటపెట్టామని ఆయన తెలిపారు. ‘మన్ కీ బాత్’ జాతీయ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా.. ప్రజాస్వామ్యానికి ప్రధాని మోదీ భారీ కృషి చేశారని పేర్కొన్నారు. రాజకీయాల నుంచి కులతత్వం, కుటుంబ వివక్ష, బుజ్జగింపులను తొలగించారని అమిత్ షా తెలిపారు. పనితీరు ఒక్కటే ప్రమాణమని.., ప్రజాస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేశారని ఆయన కొనియాడారు. పద్మ అవార్డులలో ప్రజాస్వామ్యం తీసుకొచ్చారని అమిత్ షా చెప్పారు. గతంలో పద్మ అవార్డులు సిఫారసుల ఆధారంగా ఇచ్చేవారన్న అమిత్ షా. ఇప్పుడు చిన్న వ్యక్తికి కూడా సహకారం ఆధారంగా పద్మ…
సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ సేఫ్టీకీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే ముందంజలో ఉందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్, డిజిటల్ ఇండియా సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ -2023 అనే అంశంపై న్యూఢిల్లీ నుండి ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సదస్సులో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడారు. “నేషనల్ అర్కిటెక్చర్ ఫర్ సైబర్ స్పేస్ మేనేజ్‌మెంట్ బై స్టేట్ గవర్నమెంట్” అనే అంశంపై డీజీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలను దర్యాప్తు చేసి, వాటిని అరికట్టేందుకుసైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ బ్యూరోలో 500 మంది అధికారులు, సిబ్బందిని నియమించామని వివరించారు. సైబర్ నేరాల నియంత్రణకు ఇప్పటికే ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని…