Author: Editor's Desk, Tattva News

జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆల‌యాన్నిమంగళవారం ఉద‌యం 6.20 నిమిషాల‌కు తెరిచారు. వేదోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య ఆల‌య ద్వారాల‌ను ప్ర‌ధాన పూజారి జ‌గ‌ద్గురు రావ‌ల్ బీమా శంక‌ర్ లింగ శివాచార్య ఓపెన్ చేశారు. సోమ‌వార‌మే కేదార్‌నాథ్ ఆల‌యానికి ఉత్స‌వ మూర్తిని తీసుకువచ్చారు. గ‌త 72 గంట‌ల నుంచి కేదార్‌నాథ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భీక‌రంగా మంచు కురిసింది. బాబా కేదార్ ద‌ర్శ‌నం కోసం ఇవాళ సుమారు 8 వేల మంది వేచి ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేదారీశ్వ‌రుడి ఆల‌యం తీరుస్తున్న సంద‌ర్భంగా ఆల‌యాన్ని పువ్వుల‌తో ముస్తాబు చేశారు. సుమారు 20 క్వింటాళ్ల పువ్వుల‌తో ఆల‌యాన్ని అలంక‌రించారు. ఇవాళ దేవాలయంను తెర‌వ‌నున్న నేప‌థ్యంలో భారీ సంఖ్య‌లో భ‌క్తులు చేరుకున్నారు. అక్క‌డ మైన‌స్ ఆరు డిగ్రీల టెంప‌రేచ‌ర్ ఉంది. అయినా వేలాది మంది ద‌ర్శ‌నం కోసం నిరీక్షిస్తున్నారు. ఉద‌యం 4 గంట‌ల నుంచి ఆల‌య ద్వారాల ముందు భ‌క్తులు క్యూక‌ట్టారు. ఆల‌యాన్ని తెరిచిన త‌ర్వాత స్థానికులు డోలు వాయించారు. క‌ళాకారుల…

Read More

లిక్కర్ పాలసీపై తమిళనాడులో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని క్రీడా మైదానాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానానికి అనుమతులిచ్చింది. కన్వెన్షన్ సెంటర్లు, కల్యాణ మండపాలు, బ్యాంక్వెట్ క్రీడా మైదానాలు, సమావేశ మందిరాలతోపాటు ఇళ్లల్లో చేసుకునే వేడుకల్లో మద్యం అందించేందుకు ప్రత్యేక లైసెన్స్ విధానాన్ని స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు తమిళనాడు లిక్కర్ పాలసీ (లైసెన్స్ అండ్ పర్మిట్) 1981లో సవరణలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే అతిథులు, సందర్శకులు, పార్టిసిపేంట్స్‌కు మద్యం అందించాలంటే ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి చేసింది. అదేవిధంగా విందులు, వేడుకలు, వాణిజ్యేతర ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో అతిథులుకు మద్యం అందించాలన్నా లైసెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. స్టాలిన్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం స్పెషల్ లైసెన్స్ రుసుం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో రూ.లక్ష, మున్సిపాలిటీ ఏరియాల్లో రూ.75వేలు, ఇతర ప్రాంతాల్లో రూ.50వేలు ఏడాది కాలానికి చెల్లించాలి. కేవలం ఒక్కరోజుకు…

Read More

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సోమ‌వారం గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై అవినాశ్‌, సునీత త‌ర‌ఫు న్యాయ‌వాద‌న‌ల‌ను ధ‌ర్మాస‌నం నిశితంగా విన్న త‌ర్వాత కీల‌క ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌ను త‌ప్పుబ‌డుతూ ముంద‌స్తు బెయిల్‌ను నిలిపేసింది. విచార‌ణ‌కు లిఖిత పూర్వ‌క ప్ర‌శ్న‌లు ఇవ్వాల‌ని సీబీఐని హైకోర్టు ఆదేశించ‌డాన్ని కూడా సుప్రీంకోర్టు త‌ప్పుబ‌ట్టింది. దీంతో ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల‌తో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ర‌క్ష‌ణ తొల‌గిపోయింది. వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ గ‌డువును జూన్ 30 లోపు ముగించాల‌ని సీబీఐని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత‌కుముందు ఏప్రిల్ 30 లోపు విచార‌ణ పూర్తి చేయాల‌ని…

Read More

అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న సూడాన్ దేశం నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ భారత ప్రభుత్వం చేపట్టింది. `ఆపరేషన్ కావేరీ’ పేరుతో సూడాన్ దేశంలోని భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేయబోతున్నారు. సూడాన్ దేశంలో 4 వేల మంది మనోళ్లు ఉండగా, ఇప్పటికే 500 మందిని సూడాన్ పోర్టుకు సోమవారం చేరుకున్నారు. పరస్పర దాడులతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న సూడాన్‌ నుంచి భారతీయ పౌరుల్ని సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ఊపందుకుంటున్నాయి. ఏమాత్రం సానుకూలత లభించినా భారతీయుల్ని తీసుకువచ్చేందుకు వీలుగా సి-130జె రకం సైనిక రవాణా విమానాలు రెండింటిని జెడ్డాలో సిద్ధంగా ఉంచారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ నౌకను సూడాన్‌ ఓడరేవుకు చేర్చారు. విమానాశ్రయాలన్నీ మూతపడటంతో రోడ్డు మార్గంలోనే దగ్గర్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి మన దౌత్యకార్యాలయం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సూడాన్‌ నుంచి తమ దౌత్య సిబ్బంది 70 మందిని స్వదేశానికి తరలించినట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది.…

Read More

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిల కారుతో ఢీకొట్టడంతో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. పోలీసులపై దాడి చేసి కారుతో ఢీకొట్టిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. షర్మిలను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తున్నారు.  వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదని ఖండించారు. తనను అరెస్టు చేస్తుంటే వారిని అడ్డుకున్నానని వివరించారు. వైఎస్ షర్మిల అరెస్టుపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. షర్మిల సిట్ కార్యాలయానికి దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సిట్ ఆఫీస్…

Read More

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలా? వద్దా? అంటూ కార్యకర్తలను అడిగిన అమిత్ షా సమాధానం ఢిల్లీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి వినపడేలా చెప్పాలని కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన చేవెళ్ల విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతి పాలన కొనసాగిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ రావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని., . రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మరోవైపు పేపర్‌ లీకేజీ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు అమిత్ షా. పేపర్ లీక్ ఘటన గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ని…

Read More

ఘర్షణ వాతావరణం నెలకొన్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా అక్కడ నుంచి తరలించడానికి ప్రత్యామ్నామ మార్గాల కోసం భారత ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. యుద్ధం బీకరంగా మారుతుండడంతో విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. ఖార్తోమ్ లోని విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గాల ద్వారా తరలించడమే సురక్షితమని ప్రభుత్వం యోచిస్తోంది. సూడాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆర్మీ, పారామిలటరీ గ్రూపు రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) బలగాల మధ్య ఏప్రిల్ 15 నుంచి పోరాటం భీకరంగా సాగుతోంది. తరలింపు కార్యక్రమాలు పర్యవేక్షించడానికి భారత దౌత్య సిబ్బంది అక్కడే ఉంటోంది. రోడ్డు మార్గం లోనే దగ్గర లో గల సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖార్తోమ్‌లో తాత్కాలికంగా రాయబార కార్యాలయ విధులను అమెరికా ఆపేసింది. తమ దౌత్యసిబ్బందిని స్వదేశానికి రప్పించింది. రాపిడ్ సెక్యూరిటీ బలగాలు కొంతవరకు తరలింపు ఆపరేషన్‌లో తమకు సహకరిస్తున్నారని, సోషల్ మీడియాలో కొన్ని వాదనలు…

Read More

ఉత్తరప్రదేశ్‌లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ రాష్ట్ర రాజధాని పాట్నా జిల్లాలో ప్రార్థనా సంఘం వద్ద ఒక వ్యక్తి అతీక్‌కు మద్దతుగా, ప్రధాని దీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంఘటనపై చౌబే మండిపడ్డారు. ‘‘జుమ్మా నమాజ్ చేసిన తర్వాత వారిలో ఒకరు ‘అతిక్ అహ్మద్ అమర్ రహే’ అని అరిచాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసాడు’’ అని పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. ఈ విషయంపై మంత్రి అశ్విని చౌబే ఆగ్రహం వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ సంఘటన చాలా విచారకరం. బీహార్‌లో ఇటువంటి ప్రకటనలు, నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలని స్పష్టం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌,…

Read More

భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ఎన్నో పతకాలు సాధించి పెట్టిన టాప్ రెజ్లర్లు ఢిల్లీలో మళ్లీ ఆందోళనకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్ల నుంచి మహిళా రెజ్లర్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై కొన్ని వారాల క్రితం వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి పలు హామీలు రావడంతో అప్పట్లో వారు ఆందోళనను విరమించారు. అయితే, ఇప్పటికీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, ఇతర ట్రైనర్లపై చర్యలు తీసుకోకపోవడంతో విసుగెత్తిపోయిన టాప్ రెజ్లర్లు మళ్లీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే తింటాం, ఇక్కడే నిద్రపోతాం అని రెజ్లర్లు స్పష్టం చేశారు. అంతేకాదు, వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్రాంత పోలీస్ స్టేషన్ లో…

Read More

ఎక్కడెక్కడి నుండో గంజాయి సేకరించి, అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉంటారు. కానీ, ఓ పోలీస్ స్టేషన్ లోని జప్తు చేసిన గంజాయి బస్తాలపై కన్ను వేసి, వాటిలో ఒక్కదానిని దొంగతనంగా పట్టుకు వెడుతుండగా పట్టుబడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే పరువు పోతుందని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి పై అంతస్తులోకి చొరబడిన గుర్తు తెలియని దుండగుడు గతంలో పోలీసులు సీజ్ చేసిన గంజాయి బస్తాల్లో ఓ బస్తా ను చాకచక్యంగా చోరీ చేసి సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు మోసుకుంటూ వచ్చాడు. ఇంతలో నైట్ బీట్ పోలీసులు గమనించి దుండగుడిని వెంబడించడంతో గంజాయి బస్తాను వదిలి పారిపోయాడు. దీంతో పట్టణ పోలీసులు దుండగుడు వదిలి వెళ్లిన గంజాయి బస్తాను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఆరునెలల క్రితం కూడా ఇదే తరహాలో ఓ గుర్తు తెలియని దుండగుడు రూరల్ స్టేషన్ పై…

Read More