Author: Editor's Desk, Tattva News

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాష్‌రెడ్డి విచారణ ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని హైకోర్టు సూచించిన కోర్టు.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై 25న తుది తీర్పును వెల్లడించనున్నట్లు వెల్లడించింది. అంతకు ముందు బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, సునీతారెడ్డి న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీబీఐ బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరింది. అయితే అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ఎందుకు తొందరపడుతుందని ఆయన తరఫు న్యాయవాది ప్రశ్నించారు. అవినాష్‌ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అధికారులు హంతకులను వదిలేసి భాస్కర్‌రెడ్డి, అవినాష్…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లంతా సాక్షి పేపర్‌ కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిఓలను విడుదల చేసిందని పేర్కొంటూ ఉషోదయ పబ్లికేషన్స్‌ ఆధ్వర్యాన ఈనాడు దాఖలు చేసిన కేసు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. వాలంటీర్లకు నెలనెలా రూ.200 మంజూరు చేసి, సాక్షి పత్రిక కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు జిఓలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్‌ సవాల్‌ చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో సుప్రీం కోర్టులో ఉషోదయ పబ్లికేషన్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు కోరింది. న్యాయ, పరిపాలన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విచారణను ఎపి హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ…

Read More

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు. అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక ప్రణాళిక ప్రకారం కాంపా కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అడవుల పెంపకం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన వార్షిక ప్రణాళికలకు ఆమోదం తెలిపి కాంపా నిధుల కింద గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.3,110 కోట్ల నిధులను 2019-20 సంవత్సరంలో విడుదల చేయడం చేసిందని ఆయన లేఖలో తెలిపారు. 2019-20 నుంచి 2021-22 వరకు గత 3 సంవత్సరాల…

Read More

తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదని హితవు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని పేర్కొంటూ వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్‌పై వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం.. ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా నాయకులకు నేను ఒకటి చెప్పాను. పాలకులు వేరు. ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “మంత్రి హరీశ్‌ రావు ఏ సందర్భంగా వ్యాఖ్యలు చేశారో తెలియదు.…

Read More

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు లో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు, వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని, కేంద్రం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను, ప్రస్తుత వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. అంతేగాక, వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది. “వివాహం చట్టబద్ధత అనేది ఒక సామాజిక చట్టపరమైన వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం… దీన్ని చట్టసభలు సృష్టించాయి. దాని ప్రకారమే వివాహానికి చట్టబద్ధత రావాలి. వివాహాలకు చట్టబద్ధతనిచ్చే అంశంలో పార్లమెంట్ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది” అని కేంద్రం తెలిపింది. గ్రామీణ, సెమీ రూరల్, పట్టణ, నగర…

Read More

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్ పురస్కార్‌‌-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. దేశంలో మొత్తం 46 గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కగా.. అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే 13 పురస్కారాలు రావడం విశేషం. ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు అందుకున్నారు. జాతీయ అవార్డులతో పాటు ప్రత్యేకంగా నగదు పురస్కారాలను ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు – 2023లో తెలంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్ గా నిలిచాయి. అందులో -ఆరోగ్య పంచాయతీ విభాగంలో గౌతంపూర్ (భద్రాద్రి కొత్త గూడెం ), -సమృద్ధిగా మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో నెల్లుట్ల (…

Read More

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచార‌ణ జ‌రిగింది. ఇరు వర్గాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం విచార‌ణ‌ను మంగళవారంకు వాయిదా వేసింది అలాగే తీర్పు రేపు మ‌ధ్యాహ్నం వెలువ‌రిస్తామ‌ని పేర్కొంటూ మంగళవారం సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు అవినాష్ ను విచార‌ణ‌కు పిలువ వ‌ద్ద‌ని సిబిఐని ఆదేశించింది. ఈ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై అవినాష్ త‌ర‌పు న్యాయ‌వాది త‌న వాద‌న వినిపిస్తూ , ‘వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసింది’ అని ఆరోపించారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. దస్తగిరి సీబీఐకి…

Read More

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే పదవి, బీజేపీకి రాజీనామా చేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ కు కాంగ్రెస్ తరుపున టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ గతంలో కర్ణాటక సీఎంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీనియర్‌ నాయకుడనైన తనకు బీజేపీ నుంచి టిక్కెట్‌ వస్తుందని అనుకున్నాననని జగదీశ్ శెట్టర్ తెలిపారు. కానీ తనకు అది రాలేదని తెలియగానే షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఎవరూ తనతో మాట్లాడలేదని, కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. తనకు బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని జగదీశ్…

Read More

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారులు ఆదివారం తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కార్యాలయంలో అధికారుల ముందు కేజ్రీవాల్‌ మధ్యాహుం 12 గంటల సమయంలో హాజరయ్యారు. లిక్కర్‌ కుంభకోణంలో సాక్షిగా వాంగ్మూలం నమోదుకే కేజ్రీవాల్‌ను సిబిఐ ప్రశ్నించిన్నట్లు సమాచారం. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజీవాల్ పాత్ర గురించి ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రూ. 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్, ఇతర నిందితులతో సంబంధాలపై ఆరా తీశారు. మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ సంబంధాలు, ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజీవాల్ ను అధికారులు ప్రశ్నించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.…

Read More

మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన ఖడ్గాన్ని బ్రిటన్‌ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. దీని కోసం వచ్చే నెలలో బ్రిటన్‌ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన కత్తి, బాకును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఆదివారం రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్ఘర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన కార్యక్రమంలో ముంగంటివార్ మాట్లాడారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. కాగా, మరాఠీ ప్రజల వీక్షణ కోసం ‘జగదాంబ’ ఖడ్గం, ‘వాఘ్-నఖ్’ (పులి గోళ్లలా కనిపించే బాకు)ను అందుబాటులో ఉంచాలని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ, ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్ ఇమోజెన్ స్టోన్‌తో చర్చించినట్లు మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. ‘నేను మే మొదటి వారంలో బ్రిటన్‌కు వెళ్తున్నాను. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350 వ…

Read More