వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం శుక్రవారం స్పష్టం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లెమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలపుదల చేసినట్లు వస్త్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ పనితీరు మెరుగుకు ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ తమ వంతు కృషి చేస్తున్నాయంటూ ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని అనుకోవడం లేదని, ప్లాంటును బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్ గురువారం విశాఖలో చేసిన ప్రకటన దీనికి నేపథ్యం. ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో ప్లాంట్ పని చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఉక్కు యాజమాన్యం, కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా చర్చిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే ఆ తర్వాత…
Author: Editor's Desk, Tattva News
దేశంలోని ప్రధాన నగరాల నుంచి సమీపంలోని పట్టణాలకు వందేభారత్ తరహా మెట్రో రైళ్లు నడపాలనే ప్రధాన మంతి నరేంద్ర మోదీ ఆశయం త్వరలో నెరవేరనుంది. ఈ ఏడాది డిసెంబరు నాటికే వందే మెట్రో నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.”వందే భారత్‌తో పోలిస్తే.. వందే మెట్రో విభిన్నంగా ఉంటుంది. చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రోజుకు నాలుగు-ఐదు సర్వీసులు నడిపేలా దీన్ని రూపొందిస్తున్నాం. పెద్ద నగరాల నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకు ఇవి రాకపోకలు సాగిస్తాయి” అని ఆయన తెలిపారు. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని, ఈ ఏడాది డిసెంబరు నాటికి ఇవి పట్టాలెక్కనున్నాయని ఆయన చెప్పారు. పెద్ద నగరాల చుట్టుపక్కల ఉన్నవారు పనికోసం నగరానికి వచ్చి మళ్లీ తమ స్వస్థలాలకు సత్వరం చేరుకునేలా చేయడానికి వందే మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారని రైల్వే మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ…
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లను సీబీఐ జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు ఈ నెల 16న సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నది. అయితే ఒక ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారిగా తెలుస్తున్నది. ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల గుర్తించింది. ఈ తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సమన్లు జారీ చేయడం గమనార్హం. కాగా, ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేయగా ఆయన జైలులో ఉన్నారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో బౌద్ధ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంబేడ్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేడ్కర్ సందర్శించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా అంబేడ్కర్ విగ్రహంపై రాష్ట్ర ప్రభుత్వం పూలవర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రతియేటా జాతీయ అవార్డులు ఇస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. దేశంలోని వివిధ స్థాయిల్లో సేవలందించిన వారికి ఈ అవార్డులు ప్రతియేటా అంబేద్కర్ జయంతి రోజున అందజేస్తామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వపరంగా రూ.51కోట్ల ను ఫిక్సెడ్ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డిపాజిట్ ద్వారా ఏటా…
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కాగా నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు.ఆయన ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.దీంతో హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరారు పోసాని కృష్ణ మురళి. సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. దగ్గు, జలుబుతోపాటు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. గతంలో కూడా పోసాని కృష్ణమురళీకి సోకిన సంగతి తెలిసిందే! ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. పోసాని కృష్ణ మురళి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా..తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచనలు…
2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృస్టించడంతో పాటు, నాటి ప్రతిపక్షం వైసిపి ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్న `కోటి కత్తి’ ఘటనలో ఎటువంటి కుట్రకోణం లేదని ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఎ) స్పష్టం చేసింది. అంతేకాకుండా, నిందితుడికి నాటి అధికార పక్షం టిడిపితో ఎటువంటి సంబంధం కూడా లేదని తేల్చి చెపింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్‌ఐఎ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన సిఎం జగన్‌ను విచారణకు హాజరు కావాలని కోర్టు కోరగా, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని, అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు అనుమతించాలని సిఎం జగన్ కోర్టును అభ్యర్థించారు. అలాగే కోడిపందాల కోసం ఉపయోగించే కత్తిని ఉపయోగించి తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి కుట్ర కోణంపై…
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్ర మంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందని అంటూ ఆయన స్వాగతించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవ్వకుండా, కార్మికుల పక్షాన తొలి నుండి పోరాడుతూ, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ఏకైక పార్టీ జనసేన అని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడినదని తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాలతో.. ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ అని అంటూ ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారని పవన్…
ఉత్తరప్రదేశ్‌లో గురువారం రాజకీయనేత అయిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ కుమారుడు అసద్‌ను, అతని సహచరుడు ఒక్కరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. గ్యాంగ్‌స్టర్స్, మాటవినని రౌడీల పని పడుతామని, వారిని ఏరేస్తామని పలుసార్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రకటిస్తూ వస్తున్న దశలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 2005 నాటి ఓ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్చిచంపిన ఉదంతం తీవ్ర ప్రకంపనలు ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌కు దారితీశాయి. లాయర్ కూడా అయిన ఉమేష్ పాల్ హత్యకేసులో అతీఖ్ అహ్మద్ ప్రధాన నిందితుడు. కాగా ఈ కేసులో ఆయన కుమారుడు, అనుచరుడు గులామ్ కూడా నిందితులు. వీరు తప్పించుకుని తిరుగుతున్నారని, వాంటెడ్‌గా ఉన్న వీరిని గురువారం తెల్లవారుజామున గుర్తించినట్లు, ఈ క్రమంలో తాము జరిపిన కాల్పుల్లో వీరిద్దరూ చనిపోయినట్లు ఝాన్సీ పోలీసులు విలేకరులకు తెలిపారు. ఓ వైపు ఉమేష్ పాల్ హత్యకేసులో నిందితుడు అయిన అతీఖ్‌ను…
భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు మహేశ్వర్‌రెడ్డి పంపించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరతారని చెప్పారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రజలకు చేరేలా చూస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన సంచలన…
విదేశీ మారకం(ఫోరెక్స్) ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం కేసు నమోదు చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలను ఆదాయం పన్ను శాఖ సోదా చేసిన విషయం తెలిసిందే. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనల కింద వాంగ్మూలాలను నమోదు చేసేందుకు దస్త్రాలతో బిబిసి ఎగ్జిక్యూటివ్‌లు తమ ఎదుట హాజరుకావాలని బిబిసి ఇండియాను ఇడి అదేశించినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. ఎఫ్‌డియు నిబంధనలను బిబిసి ఉల్లంఘించడంపై ఇడి దర్యాప్తు జరుపుతుందని వారు చెప్పారు. బిబిసి గ్రూపు సంస్థలు చూపుతున్న ఆదాయం, లాభాలు ఆ సంస్థ భారత్‌లో జరుపుతున్న కార్యకలాపాల స్థాయితో సరిపోలడం లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సిబిడిటి) చెప్పడంతో ఇడి రంగంలోకి దిగింది. ఆ సంస్థ విదేశీ కార్యాలయాలకు జమ చేసిన మొత్తాలను భారత్‌లో వచ్చిన ఆదాయంగా చూపలేదని సిబిడిటి పేర్కొంది.…