ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) 2023 సీజన్-16 శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ప్రారంభం కానుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ తారలు రష్మిక, తమన్నా భాటియా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. నేడు ప్రారంభోత్సవ వేడుకలు జరగనుండగా.. ఇప్పటికే స్టేడియం వెలుపల డ్రోన్ షోలతో ఐపిఎల్ ట్రోఫీని మేఘాల్లో ఆవిష్కరించారు. గురువారం 10జట్ల కెప్టెన్లు కలిసి సీజన్-16 ఐపిఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేండ్లుగా కొన్ని పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్.. తిరిగి పూర్వవైభవం సంతరించుకుంది. మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో.. మూడేండ్లకు ముందు మాదిరిగా సొంత మైదానంలో సగం మ్యాచ్‌లు.. మిగిలిన సగం మ్యాచ్‌లు ప్రత్యర్థి వేదికలపై…
Author: Editor's Desk, Tattva News
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో పలువురు భక్తులు మెట్లబావిలో పడిపోగా, వారిలో మృతుల సంఖ్యా 35కు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పై కప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 50 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. వారిలో 35 మంది వరకు మృతి చెందగా, మరో 18 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. నిచ్చెన సాయంతో బావిలో పడ్డ వారిని బయటకు తీసుకొచ్చారు పోలీసులు. బావి లోతు 50 అడుగులపైనే ఉండటంతో భక్తులకు తీవ్ర గాయాలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అధికంగా మహిళలే ఉన్నారు. పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ…
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. స్టేడియంలోని కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి రామయ్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అంద చందాలను వర్ణించారు. భక్త రామదాసు సీతారాముల కోసం చేయించిన ఆభరణాలు, ఆలయ క్షేత్ర ప్రాశస్త్యం, కల్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. ఈ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి అందజేశారు. మిథిలా మైదానంలో కిక్కిరిసిన భక్తజనసందోహం మధ్య త్రిదండి చినజీయస్వామి సమక్షంలో అర్చకులు సాంప్రదాయ బద్ధంగా కల్యాణ క్రతువును వైభవంగా జరిపించారు. తొలుత భద్రాద్రి రామునికి…
దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 3,016 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. గతేడాది అక్టోబర్ 2వ తేదీన 3,375 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692కి చేరింది. కాగా నిన్నటితో పోలిస్తే (నిన్న 2151 కేసులు) కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశంలో రోజూవారీ కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం పెరుగుదల…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీబీఐ నుంచి వచ్చిన ప్రతిపాదనపై అంగీకారం తెలిపింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో దాగిన విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని ఆదేశించింది. ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది. కొత్తగా ఏర్పాటైన సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముకేష్ కుమార్, ఇన్స్పెకర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పూనియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో జాప్యాన్ని కారణంగా చూపుతూ బెయిల్ కోరిన పిటిషనర్ తులసమ్మకు నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చార్జిషీటు దాఖలు చేయాలని, 6 నెలల్లోగా ట్రయల్ (కోర్టులో విచారణ) మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ 6 నెలల్లోగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతున్న ఈస్ట్ కోస్ట్ కారిడార్ ( ఖరగ్‌పూర్-విజయవాడ), నార్త్ సౌత్ సబ్ కారిడార్ (ఇటార్సీ – విజయవాడ) కోసం ప్రత్యేక సరుకు రవాణా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఎల్) ద్వారా సర్వే, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రెండు కారిడార్‌లలో దేనినైనా రాష్ట్రానికి మంజూరు చేయడమనేది అక్కడి ట్రాఫిక్, సాంకేతిక, ఆర్థిక అంశాలపై ఆధారాపడి ఉంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా? అందుకు కేటాయించిన నిధులు, కారిడార్ ఏర్పాటుకు జరుగుతున్న జాప్యంపై వివరాలు అందించవలసినదిగా వైసీపీ ఎంపీ మారగాని భరత్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కొత్త రైళ్ల ప్రతిపాదన లేదుకాగా, కొత్త రైలు సేవలను ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అశ్విని వైష్ణవ్…
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు. పదిహేనవ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదని, కొత్తగా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న…
టిఎస్‌పిఎస్‌సి లీకేజీపై కాకతీయ యూనివర్సిటీలో నిరుద్యోగ విద్యార్థులు ఒక్కసారిగా మండిపడ్డారు. బుధవారం కెయు విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై జెఎసి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాలో నిరుద్యోగ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. ఈనిరసన యూనివర్సిటీలోని లైబ్రరి నుండి కెయు రెండోగేట్ వరకు భారీ ర్యాలీ తీసి విసి భవన్‌ను ముట్టడించారు. విసి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. మూడుగంటలైనా కూడా విసి స్పందించకపోవడంతో విద్యార్థులు భవనం లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కొద్ది సేపు పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఉక్రోషానికి గురై విసి భవనంలోని కిటికిలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. ఏకంగా ఇద్దరు విద్యార్థులైతే భవనం ఎక్కి నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని విద్యార్థులను నిలవరించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘర్షణ జరగడానికి ముఖ్య…
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే 10న పోలింగ్ నిర్వహించి, మే 13న కౌంటింగ్ జరపనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్లకు ఏప్రిల్ 20 చివరి తేదీ కాగా, ఏప్రిల్ 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కొత్తగా ఒక వెసులుబాటును కల్పించారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.…
అధికారపక్షం ఎంత ఎక్కువ విజయాలు సాధిస్తే అంతగా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపిలకు తెలిపారు. ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్రిపురలో పార్టీ అధికారాన్ని నిలుపుకోగలిగిన తర్వాత జరిగిన తొలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ప్రతిపక్షాల నిరంతర నిరసనలను ప్రస్తావించారు. బీజేపీ మరిన్ని ఎన్నికలలో విజయం సాధిస్తున్న కొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని గుజరాత్ ఎన్నికల సమయంలో తాను చెప్పానని మోదీ గుర్తు చేశారు. పార్టీ మరింత తీవ్రమైన, దిగువ స్థాయి దాడులను ఎదుర్కొంటుందని ఆయన ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిందంటూ ఈ సమావేశంలో ప్రధాని మోదీని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా సత్కరించారు. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి మధ్య కాలాన్ని…