Author: Editor's Desk, Tattva News

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ సాగిన ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 23 ఓట్లు ఆమెకు లభించాయి. వైసిపి నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో అనురాధను విజయం వరించింది. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. సాంకేతికంగా టిడిపికి 23 స్థానాలు ఉన్నప్పటికీ. . ఎంఎల్‌ఎలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైఎస్‌ఆర్‌సిపికి ఫిరాయించారు. నలుగురు ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించడంతో టిడిపికి 19 సీట్లు మాత్రమే ఉన్నాయి. దానితో తమ ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగలరని ధీమాతో వైసిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఆ మరుసటిరోజే టిడిపి అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ అనురాధను పోటీకి నిలబెట్టడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. టిడిపి కూడా…

Read More

ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సెక్షన్లు 499, 504 కింద కోర్టు రాహుల్ గాంధీకి ఈ శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది.కోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలును 30 రోజులపాటు నిలిపివేసింది. ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలే ’ అంటూ 2019లో రాహుల్ గాంధీ కర్ణాటకలో జరిగిన ఓ సభ్యలో వ్యాఖ్యనించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ పూర్ణేశ్ మోడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరువు నష్టం దావా వేశారు. రాహుల్ వ్యాఖ్యలు మొత్తం `మోదీ’ సముదాయాన్నే అపఖ్యాతిపాలు చేసేదిగా ఉందని పేర్కొన్నారు.   దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ…వీరందరి…

Read More

విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెద్ద ఎత్తున బంగారం స్వాధీని చేసుకున్నారు. క‌స్ట‌మ్స్ అధికారుల త‌నిఖీల్లో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. తమిళనాడు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు ప‌క్కా సమాచారం అందిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. ఈ సందర్భంగా అనుమానాస్పందగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 5 కిలోల‌ బంగారం లభించింది. అనంతరం వారిని ప్రశ్నించగా మరికొందరి సమాచారం లభించింది. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 12.97 కిలోల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని…

Read More

దేశంలో గృహహింస కేసుల జాబితాలో 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అసోం(75 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా, ఢిల్లీ(48.9 శాతం) మూడో స్థానంలో ఉంది. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా-2022’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో మూడో వంతు కట్టుకున్న భర్త, అతని బంధువుల నుంచే ఎదుర్కొంటున్నారు. ఉద్దేశపూర్వక దాడులు, కిడ్నాప్‌, అత్యాచార ప్రయత్న ఘటనలు.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన వేధింపులు 2015-16లో 33.3 శాతం ఉండగా, 2019-21 నాటికి కొద్దిగా తగ్గి 31.9 శాతానికి చేరాయి. అయినా మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నట్లు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించి 2021 నాటికి కోర్టుల్లో 21.22 లక్షల కేసులున్నాయి. వీటిలో ఇప్పటివరకు 83,536 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ తరహా కేసుల విషయంలో…

Read More

హైదరాబాద్ లోని బొలారంలో గల రాష్ట్రపతి దక్షిణాది విడిది `రాష్ట్రపతి నిలయం’లో ఇక నుండి సంవత్సరంలో 11 నెలలపాటు సందర్శకులకు వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఒక పక్షం రోజులు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినం రోజున రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మువీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఇతర ప్రముఖులు రాష్ట్రపతి నిలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జైహింద్ ర్యాంప్ పునరుద్ధరణ, పరిరక్షణకు, చారిత్రక పతాక స్తంభం ప్రతి రూపం నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. జైహింద్ ర్యాంప్ ఒక చారిత్రాత్మక మెట్ల బావి. గతంలో ప్రాంగణం నీటి అవసరాలు తీర్చింది, 1948 లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయిన సందర్భంగా చారిత్రక పతాక స్తంభం…

Read More

భారత్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే కుప్పకూలింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు శుభారంభం అందించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 17 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 2 ఫోర్లతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే శుభ్‌ మన్ గిల్ (37) కూడా వెనుదిరిగాడు. తర్వాత ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను విరాట్ కోహ్లి, రాహుల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. రాహుల్ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (2),…

Read More

మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో.. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద “నిరుద్యోగ మహా ధర్నా” నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో బిజెపి మరో ఆందోళనకు సిద్ధమైంది. బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు. పేపర్ లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని, సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవ చేశారాయన. టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో తాము సిట్ దర్యాప్తును ఒప్పుకోవట్లేదని స్పష్టం చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం, డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ…

Read More

దేశ రాజధాని ఢిల్లీని భూకంపాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. మార్చి 21న ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో దాదాపు రెండు నిమిషాల పాటు భూమి కంపించగా తాజాగా బుధవారం భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్‌ స్కేల్‌పై 2.7 తీవ్రతతో మధ్యాహ్నం 4.42 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ తెలిపింది. హర్యానాలోని జాజ్జర్‌కు 37 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని, ఇవి స్వల్ప ప్రకంపనలేనని పేర్కొంది. మంగళవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు స్పష్టం చేశారు. భూకంప కేంద్రాన్ని హిందుకుష్‌ పర్వత శ్రేణులు గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. దీని ప్రభావంతో…

Read More

తాజాగా, రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ జారీ చేయడంతో రైతులలో మరోసారి అలజడి మొదలండి. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసేందుకు మరోసారి రాజధాని రైతులు సిద్ధమయ్యారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. అయినా, రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేసింది. ఆ…

Read More

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వివక్షత కు తావులేకుండా, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడానికి అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సమిష్టి బాధ్యతతో పనిచేసే విధంగా ఒక వ్యవస్థకు రూపకల్పన చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. వ్యవస్థ అభివృద్ధి కోసం సంబంధిత వర్గాల నుంచి ఆన్‌లైన్ విధానంలో సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లింగ సమానత్వం, కుల సున్నితత్వం, విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడం, పటిష్టమైన కౌన్సిలింగ్ వ్యవస్థ మొదలైన వివిధ అంశాలను ప్రధాన్ ప్రస్తావించారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్య అంశాలకు ప్రాధాన్యత ఇస్తూన్న విద్యా మంత్రిత్వ శాఖ దీనికోసం చర్యలు అమలు చేస్తుందని తెలిపారు. విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పలు చర్యలు అమలు చేస్తోంది. పాఠాలు నేర్చుకోవడంలో విద్యార్థులకు సహకారం…

Read More