Author: Editor's Desk, Tattva News

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసును సిట్‌కు బ‌దిలీ చేసింది. ఈ కేసును సిట్‌కు బ‌దిలీ చేస్తూ హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అద‌న‌పు సీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టి వర‌కు ఈ కేసును బేగంబ‌జార్ పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీకి సంబంధించి నిందితుల‌పై 409, 420, 120(బీ) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్ర‌శ్నాప‌త్రం లీకేజీ కేసులో 9 మంది నిందితుల‌కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంప‌ల్లి కోర్టు. ఏ3 రేణుక‌ను చంచ‌ల్‌గూడ మ‌హిళా జైలుకు త‌ర‌లించారు. మిగ‌తా 8 మందిని చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.…

Read More

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్‌ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. మంగళవారం ఉదయం 10 : 03 గంటలకు 15,062 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు వెల్లడించారు. ఇక సోమవారం నాడు 14,138 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్‌ వినియోగం పెరుగుతోందని ప్రభాకర్‌రావు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువైందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ డిమాండ్‌లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగించబడుతోందని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్‌ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో అత్యధికంగా 14,160 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగిందని సీఎండీ…

Read More

ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు కలిగిన దేశాల జాబితాలో భారత్‌, అమెరికాలకు స్థానం దక్కలేదు. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (డబ్ల్యుఓఎస్‌) తాజాగా ప్రపంచంలో అత్యధిక విద్యావంతులు కలిగిన దేశాల జాబితాను విడుదల చేసింది. డబ్య్లుఓఎస్‌ విడుదల చేసిన టాప్‌ -20 దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో జపాన్‌, మూడోస్థానంలో స్వీడెన్‌ నిలిచాయి. కానీ టాప్‌ 20 దేశాల జాబితాలో అమెరికా, భారత్‌కు చోటు దక్కలేదని డబ్ల్యుఓఎస్‌ తాజా నివేదిక వెల్లడించింది. అయితే డబ్య్లుఓఎస్‌ ఆయా దేశాలకు ఏ ప్రాతిపదిక ఆధారంగా ర్యాంకింగ్‌ ఇచ్చిందోననే దానిపై ప్రమాణాల్ని పేర్కొనలేదు. కాగా టాప్‌ 10 దేశాల జాబితాలో జర్మనీ (4), లండన్‌ (5), డెన్మార్క్‌ (6), నార్వే (7), ఫిన్లాండ్‌ (8), కెనడా (9), నెదర్లాండ్స్‌ (10)వ స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇందులో అమెరికా (21), స్పెయిన్‌ (23), ఇజ్రాయెల్‌ (24), చైనా 26వ స్థానంలో నిలిచినట్లు ఈ నివేదిక…

Read More

ప్రపంచంలోని టాప్‌ 50 కాలుష్య నగరాల్లో 37 నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు గతేడాది భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య దేశాల్లో ఎనిమిదవదిగా నిలిచింది. 2021లో ఈ సూచిలో భారత్‌ ఐదవ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారత్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. స్విస్‌కి చెందిన సంస్థ ఐక్యూఎయిర్‌ ‘వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ’ పేరుతో ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. 131 దేశాల నుండి 30,000 కి పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల మానిటర్‌ల నుండి ఈ సమాచారాన్ని సేకరించింది. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించిన పిఎం 2.5 స్థాయిపై ఆధారపడి ఈ నివేదికను రూపొందించింది. 7,300 కంటే ఎక్కువ నగరాలను కలిగి ఉన్న ఈ జాబితాలో భారత్‌లోని పలు నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2017 నుండి ఇప్పటివరకు 2,200కు పైగా నగరాలు తక్కువ ర్యాంకులను సాధించినట్లు నివేదిక…

Read More

వైఎసార్తిపి అధినేత్రి వైస్ షర్మిల ను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో షర్మిల ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ మందుకు సాగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయని, ఈ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. అయినా షర్మిల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో.. ఆమెతో పాటు వైఎస్సార్‌టీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు. అంతకు ముందు అక్కడి మీడియా తో మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో…

Read More

కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు సమానంగా పంపిణీ చేసినట్లైతే అనేక మరణాలను నివారించగలిగే వారమని పీపుల్స్‌ వాక్సిన్‌ అలయెన్స్‌ పేర్కొంది. ఈ వ్యాక్సిన్లు అందరికీ అందినట్లైతే కరోనా వచ్చిన మొదటి ఏడాదిలోనే కనీసం 13 లక్షల మంది జీవితాలను కాపాడేందుకు అవకాశం వుండేదని, అంటే ప్రతి 24 సెకన్లకు ఒకరి మృతిని నివారించగలిగి వుండేవారమని అది తెలిపింది. కరోనాని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రకటించి మూడేళ్లు అయిన సందర్భంగా వందకుపైగా సంస్థలు, నెట్‌వర్క్‌ల సంకీర్ణమైన పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్‌ ఈ మేరకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. లాభాలను, జాతీయవాదాన్ని పక్కకు పెట్టి అంతర్జాతీయంగా వెల్లువెత్తిన స్పందనను కూడా మనం ఈ సందర్భంగా చూశాం. అవసరాన్ని బట్టి పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లను తయారుచేయడానికి బదులుగా, ఔషధ కంపెనీలు వ్యాక్సిన్‌ డోసులను సంపన్న…

Read More

సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె.విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1959లో ట్రైనీ ఐపీఎస్ గా విధుల్లో చేరిన విజయరామారావు హైదరాబాద్ కమిషనర్ గా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గా హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు దర్యాప్తు చేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. నాటి సీఎల్పీ నేత పి జనార్ధనరెడ్డిని ఓడించడంతో ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేత అయి, తదుపరి ముఖ్యమంత్రి కాగలిగారు. కాగా, ఆయనను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసం అదే సామాజికవర్గంకు చెందిన కేసీఆర్ కు మంత్రిపదవి ఇవ్వలేకపోయారు. డిప్యూటీ స్పీకర్ గా చేశారు. ఆ ఆగ్రహంతోనే ఆయన తదుపరి టిఆర్ఎస్ స్థాపించి, తెలంగాణ ఉద్యమం చేపట్టి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కారకులయ్యారు.…

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి హ‌ర్జోత్ సింగ్ బెయిన్స్ ఐపీఎస్ ఆఫీస‌ర్ జ్యోతి యాద‌వ్‌ ను వివాహం చేసుకోబోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఇటీవ‌లే హ‌ర్జోత్ సింగ్, జ్యోతి యాద‌వ్ ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ నెల చివ‌ర్లో వీరిద్ద‌రూ మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్క‌టి కాబోతున్న‌ట్లు పేర్కొన్నారు. పంజాబ్ రూప్‌న‌గ‌ర్ జిల్లాలోని అనంద్‌పూర్ సాహిబ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి హ‌ర్జోత్ సింగ్ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా సింగ్ కొన‌సాగుతున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజ‌క‌వ‌ర్గంలోని గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన బెయిన్స్ 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో షానేవాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. 2014లో పంజాబ్ యూనివ‌ర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. 2018లో లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ హ్యుమ‌న్ రైట్స్ లా స‌ర్టిఫికెట్ పొందారు. పంజాబ్ కేడ‌ర్‌కు చెందిన…

Read More

దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు తమ బలగాలను ఉక్కుసైన్యంగా తీర్చిదిద్దుతామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించాయిరు. అంతర్జాతీయ వ్యవహారాలతోపాటు ప్రపంచ పాలనా వ్యవస్థ సంస్కరణలు, అభివృద్ధిలో చైనా క్రియాశీల పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దేశాధినేతగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిన్‌పింగ్ మొదటిసారి ప్రసంగించారు. 2050 నాటికి చైనాను ఒక గొప్ప ఆధునిక సామ్యవాద దేశంగా నిర్మించే , జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉందని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జిన్‌పింగ్ ఈ మేరకు మాట్లాడారు. “దేశాభివృద్ధికి భద్రతే పునాది, సుసంపన్నతకు స్థిరత్వం అవసరం. ఈ క్రమం లోనే చైనా సాయుధ బలగాల ఆధునికీకరణ చేపడతాం. చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధిని, సమర్ధంగా రక్షించ గల శక్తిగా సైన్యాన్ని గ్రేట్ వాల్ ఆఫ్‌స్టీల్‌గా మలుస్తాం. సరికొత్త భద్రతా విధానాలతో ముందుకెళ్తాం.” అని జిన్‌పింగ్ ప్రకటించారు. మరోవైపు తైవాన్‌ చైనాలో భాగమని స్పష్టం…

Read More

దేశంలో ప్రజాస్వామ్యం పడిందంటూ గతవారం లండన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని అధికార బిజెపి సభలు పార్లమెంట్ ఉభయ సభల్లో డిమాండ్‌ చేయడంతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి. బడ్జెట్‌ మలివిడత సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, ఉభయసభల్లోనూ బిజెపి నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అదానీ అక్రమాలు, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం తదితర అంశాలపై అధికారపక్షాన్ని నిలదీశాయి. దీంతో పోటాపోటీ నినాదీలతో పార్లమెంటు దద్ధరిల్లింది. ‘భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది’ అని విదేశీ పర్యటనలో అన్నందుకు కాంగ్రెస్ అగ్రనేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘రాహుల్ గాంధీ ఈ సభ సభ్యుడు, ఆయన లండన్‌లో భారత్‌ను అవమానించారు. అక్కడ…

Read More