యావత్ తెలుగు ప్రజలు గర్వగా చెప్పుకునే సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి దక్షిణాది సాంగ్ గా నాటు నాటు నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు ప్రకటించగానే థియేటర్ దద్దరిల్లిపోయింది. మరోవైపు, లైవ్‌లో చూస్తున్న తెలుగు సినీ అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆనందం మాటల్లో చెప్పలేం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన టెల్ ఇట్ లైక్ ఎ విమెన్ సినిమాలో ‘అప్లాజ్’, బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ‘దిస్ ఈజ్ లైఫ్’, టాప్ గన్ మావెరిక్ సినిమాలో ‘హోల్డ్…
Author: Editor's Desk, Tattva News
కర్ణాటకలో పర్యటన సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కర్ణాటకలోని శ్రీ సిద్ధారూఢ స్వామీజీ స్టేషన్‌లో ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణంలో భాగంగా రూ. 20.1 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. సిద్ధారూఢ స్వామి రైల్వే స్టేషన్‌లో 1.5 కిలోమీటర్ల పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ నిర్మాణ పనులు ఫిబ్రవరి 2021లో ప్రారంభించారు. ఈ స్టేషన్ కర్ణాటకలో ఒక ముఖ్యమైన జంక్షన్, బెంగళూరు (దావణగెరె వైపు), హోసపేట (గడగ్ వైపు), మరియు వాస్కో-డ-గామ/బెలగావి (లోండా వైపు) లను కలుపుతుంది. మెరుగైన సేవలందించేందుకు ఇప్పటికే ఉన్న ఐదు ప్లాట్‌ఫారమ్‌లకు అదనంగా మరో మూడు ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేసారు. ప్లాట్‌ఫారమ్ నెం. 8, ఇది 1507 మీటర్లు, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలుమార్గం ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు పొందింది. పొడవైన ప్లాట్‌ఫారమ్ నుండి, ఎలక్ట్రిక్…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ ఆ తర్వాత రాజకీయాలలో క్రియాశీలకంగా లేరు. కానీ.. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు వచ్చారు. అక్కడ కొన్ని రాజకీయ పరమైన అంశాలను ప్రస్తావించినా, ఆ తర్వాత మళ్లీ మౌనం వహించారు. ఆయన బీజేపీలో చేరతారని, జాతీయ స్థాయిలో పదవీ కూడా ఇవ్వగలమని హామీ పొందారని వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. పీలేరు నుంచి 2019లో పోటీచేసి ఓటమి చెందారు.…
తెలంగాణాలో నేరస్తులు సత్యాగ్రహులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలనలో ఆయన కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ధనదాహంతో ఆప్ నేతలతో కలిసి దోపిడిలో చేరేందుకు న్యూఢిల్లీలో కుంభకోణం చేశారని ఆరోపించారు. ఈడీ కార్యాలయాలకు వెళ్లే ముందు మనీష్ సిసోడియా ర్యాలీలు నిర్వహిస్తారు. కవిత వెంట పార్టీ అగ్రనేతలు వెళ్తారని ఎద్దేవ చేశారు. అయితే, ప్రజలు తెలివైనవారని, అవినీతికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకుంటారని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే కెసిఆర్ సర్కారు ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో…
ఎలుకల్లో కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ సిటీ ఎలుకలకు కరోనా వైరస్ సంక్రమించవచ్చని అధ్యయనం కనుగొంది. న్యూయార్క్ నగరంలో మొత్తం 8 మిలియన్ల ఎలుకలు ఉన్నాయి. ఇవి ప్రజలతో కాంటాక్ట్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. న్యూయార్క్ ఎలుకలు సార్స్ కోవ్-2 యొక్క ఆల్పా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు పాజిటివ్ గా పరీక్షించబడ్డాయి. మొత్తం 79 ఎలుకల్లో 16.5 శాతం ఎలుకలకు కరోనా సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలకు కరోనా సోకుతుందని నిరూపించిన తొలి ప్రయోగం ఇదే అని అన్నారు. అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ యొక్క ఓపెన్-యాక్సెస్ జర్నల్ ఎంబియోలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే, కోవిడ్ సోకిన ఎలుకలకు ఎలా కరోనా సోకింది..? ఇది మానవులకు ప్రమాదాన్ని తీసుకువస్తుందా..? అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ వైరస్ ఎలుకల్లో కొత్త వేరియంట్ల పరిణామం చెందుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని…
భాగస్వాములుగా కలిసి జీవించడం, స్వలింగ సంపర్కులు లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరంగా పరిగణించాలని, ఇది భారతీయ కుటుంబానికి తగదని కేంద్రం స్పష్టం చేసింది. భర్త, భార్యల సహగమనం నుండి పుట్టిన పిల్లలతో అనైతిక లైంగిక చర్య పోల్చదగినది కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహానికి గుర్తింపు కోరుతూ అభ్యర్ధనలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ వివాహం సామాజిక నైతికత, భారతీయ తత్వానికి అనుగుణంగా లేదని అఫిడవిట్లో కేంద్రం నొక్కి చెప్పింది. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ ఈ పిటిషన్ని దాఖలు చేశారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఇట్లాంటి ఫిర్యాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, దీనిపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరగా.. అఫిడవిట్ని దాఖలు చేసింది. అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం…
కేంద్ర మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం అమిత్ షా హైదరాబాదులో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించి, ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ అధికారులకు అమిత్ షా రివార్డులు అందజేశారు. అనంతరం అమిత్ షా హైదరాబాద్ నుండి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో ఆయన హకీంపేట విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతీం చేసే విషయమై అమిత్ షాతో పార్టీ నేతలు చర్చించారు. బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన తీరుపై నేతలకు అమిత్ షా దిశా నిర్ధేశం చేశారని సమాచారం. కాగా, సీఐఎస్ఎఫ్ వల్ల నక్సలైట్లు, టెర్రరిస్టులు అదుపులో ఉన్నారని కేంద్ర…
ప్రముఖ సాహితీవేత్త మధురాంతకం నరేంద్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, ఉపాధ్యక్షురాలు కుముద్ శర్మ ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. పురస్కారంలో భాగంగా ఆయన కు రూ.లక్ష నగదు, తామ్రపత్రం, దుశ్శాలువతో సత్కరించారు. మధురాంతకం నరేంద్ర రచించిన మనోధర్మ పరాగం నవలకు 2022 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ హిందీ కవి మాధవ్ కౌశిక్ ఎన్నికయ్యారు. ఇక, కేంద్ర సాహిత్య అకాడమీలోని తెలుగు సలహా బోర్డు కన్వీనర్‌గా సి. మృణాళిని ఎన్నికయ్యారు. అట్టహాసంగా ప్రారంభమైన కేంద్ర సాహిత్య అకాడమీ 2023 సాహిత్యోత్సవంలో శనివారం, తొలిరోజే తెలుగు రచయితలు, కవులు చాలామంది పాల్గొన్నారు. బహుభాషా కవుల సమ్మేళనంలో ‘ఆంధ్రజ్యోతి’ అసోసియేట్ ఎడిటర్ కృష్ణారావు(కృష్ణుడు) కవితను చదివారు. యువసాహితీ కార్యక్రమంలో ప్రముఖ కవి అనిల్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మార్గదర్శిపై సిఐడి సోదాలు చేపట్టింది.కొంతకా లం నుంచి ఖాతాదారుల సొమ్ము మళ్లించినట్టు మార్గదర్శిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధుల మ ళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సిఐడికి ఫిర్యాదు చేయడంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సిఐడి కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఎండి చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కూడా కేసు పెట్టారు. ఎ1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఎ2గా చెరుకూరి శైలజ, ఎ3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లపై సెక్షన్ 120 బి,409, 420, 477(a) రెడ్ వి త్ 34 ఆఫ్ ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 5, ఎపి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసు నమోదుతో పాటు 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు…
సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో శనివారం ఢిల్లీలో సుమారు తొమ్మిది గంటలపాటు విచారించడం తెలంగాణాలో రాజకీయ ఉత్కంఠకు దారితీసింది. ఆమెను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చనే కధనాలు వ్యాప్తి చెందడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనతో పెద్దపెట్టున నిరసనలు చేపట్టారు. ఈ లోగా, బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవిత గురించి అనుచితంగా మాట్లాడారంటూ నిరసనలకు దిగారు. ఢిల్లీతో పాటు తెలంగాణాలో పలుచోట్ల సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం లేశారు. పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా చేపట్టి విచారణ జరిపామని డిజిపిని ఆదేశించింది. మరోవంక, ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, కవితను ఈడీ అధికారులు ఈనెల 13న మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆరోజు కవిత జన్మదినం కావడం వల్ల 16వ తేదిన వస్తానని…