Author: Editor's Desk, Tattva News

నీట్-యూజీ 2024 ప‌రీక్ష‌లో వ్య‌వ‌స్థీకృత ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని సుప్రీంకోర్టు తెలింది. ప‌రీక్ష ప‌త్రాల లీకేజీ కేవ‌లం పాట్నా, హ‌జారిబాగ్‌లో మాత్ర‌మే జ‌రిగిన‌ట్లు అత్యున్న‌త న్యాయ స్థానం వెల్ల‌డించింది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర స‌ర్కారు కూడా మ‌ళ్లీ భ‌విష్య‌త్తులో పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న‌ది. పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని గత నెలలో తీర్పునిచ్చింది. అందుకు గల కారణాలను ఈ రోజు వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం సరిదిద్దాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎగ్జామ్ వ్య‌వ‌స్థ‌లో ఉన్న సైబ‌ర్ సెక్యూర్టీ లోపాల‌ను స‌రిదిద్దేందుకు వీలైన సాంకేతికత‌కు తీసుకురావాల‌ని కేంద్రం నియ‌మించిన క‌మిటీ పేర్కొన్న‌ట్లు సుప్రీం…

Read More

హైదరాబాద్‌లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు బ్యాంక్‌లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో కోటి రూపాయిల నగదుతో పాటు 5 కోట్ల రూపాయిల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు. 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్‌ ఇచ్చినట్లు తమ సోదాల్లో తేలిందన్నారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నారన్నారు. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ తెలిపింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ పేర్కొంది. మహేష్‌ కో-ఆపరేటీవ్‌ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం సోదాలు…

Read More

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. పూజా ఖేద్కర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఈమెకు యూపీఎస్సీకి చెందిన వారు ఎవరైనా సాయం చేశారా? అనే విషయాలను కూడా ఆరా తీయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.  దీంతోపాటు నకిలీ సర్టిఫికేట్‌లను ఉపయోగించి ఇతర అభ్యర్థులెవరైనా రిజర్వేషన్‌ను అన్యాయంగా పొందారా అనే దానిపై కూడా దర్యాప్తు చేయాలని కోర్టు తెలిపింది. మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తన వైకల్యాల గురించి అబద్ధం చెప్పి, సివిల్ సర్వీసెస్ పరీక్షలో నకిలీ గుర్తింపును తయారు చేయించుకుంది. ఈ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో వివాదాస్పద ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్ ఎంపికను యూపీఎస్సీరద్దు చేసింది. యూపీఎస్సీప్రకారం పూజా ఖేద్కర్ తన ఎంపిక కోసం వివిధ స్థాయిలలో మోసం చేసింది. పూజ 2022 బ్యాచ్‌లో ఎంపికైంది. ఎంపిక…

Read More

తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను పోలీసులు ప్రయోగించారు.  ఇంఫాల్‌ లోయలో ఆధిపత్యమున్న మైతీ, కొండ ప్రాంతాలకు చెందిన కుకీల మధ్య 2023 మేలో జాతి హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో మోరేలోని ఇళ్ల నుంచి పారిపోయిన నిర్వాసితులు ఇంఫాల్‌లోని అకంపత్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. కాగా, ఏడాదికిపైగా కఠోర పరిస్థితుల్లో రిలీఫ్ క్యాంపుల్లో జీవిస్తున్న నిర్వాసితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. దీని కోసం గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమకు భద్రత కల్పించాలని, తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందేందుకు నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు నిర్వాసితులు ర్యాలీగా సీఎం బంగ్లా వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారీగా…

Read More

లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఎన్నిక పూర్తి అయ్యింది. 15 మంది సభ్యులతో 18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఏర్పడింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఛైర్మన్‌గా ప్రజాపద్దుల కమిటి ఏర్పాటు జరిగింది. 15 మందిలో ముగ్గురు తెలుగువారికి అవకాశం కల్పించారు. కొత్త లోక్‌సభ కొలువుదీరిన తర్వాత ఎన్నిక ద్వారా ప్రజాపద్దుల కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు.  కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది లోక్‌సభ సభ్యులు పోటీ పడ్డారు. చివరి నిముషంలో నలుగురు సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. 2025 ఏప్రిల్‌ 30తో సభ్యుల కాలపరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. 18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌ గాంధీ ఎన్నికయ్యారు. సభ్యులుగా టిఆర్‌ బాలు, నిషికాంత్‌ దూబే, జగదాంబికా పాల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, సిఎం రమేష్‌, త్రివేంద్ర సింగ్‌ రావత్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సౌగతరాయ్‌, అపరాజితా సారంగి, అమర్‌ సింగ్‌,…

Read More

పారిస్ ఒలింపిక్స్‌లో  భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ 29 ఏళ్ల షూటర్‌కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. ఈ ఆటగాడు తొలి ఒలింపిక్స్‌లోనే పతకం సాధించాడు. ఈ ఆటగాడు 12 ఏళ్లుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్నాడు.  పారిస్‌లో అతనికి అవకాశం రావడంతో చరిత్ర సృష్టించాడు. ఇక చైనాకు చెందిన లియు యుకున్ 463.6 పాయింట్లతో స్వర్ణం గెల్చుకోగా, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి కులిష్ 461.3 స్కోరు చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.  స్వప్నిల్ కుసాలే 451.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 షూటర్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు.  ఈ క్రమంలో స్వప్నిల్ కుసాలే భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించిన 7వ షూటర్‌గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు ముగ్గురు షూటర్లు…

Read More

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చిచెప్పింది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్​ గవై, జస్టిస్ విక్రమ్​ నాథ్​, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో 6 తీర్పులను…

Read More

దేశ రాజధాని ఢిల్లీ వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేకుండా వాన కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు వర్షపునీటితో మునిగాయి. కొందరు వరదనీటిలోనే ఉండాల్సి వచ్చింది. మురికినీటి కాలువలో ఓ మహిళ కుమారుడితో సహా పడిపోయింది.  వారిద్దరూ చనిపోయారని అధికారులు ప్రకటించారు. వర్ష ప్రభావంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు నిలిపే పరిస్థితి లేదు. 10 విమానాలను దారి మళ్లించారు. 8 విమానాలు జైపూర్, రెండు విమానాలు లక్నోకు డైవర్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలో గల ఘాజిపూర్‌‌లో విషాదం నెలకొంది. తనూజ కుమారుడితో కలిసి వార సంతలో కూరగాయాలు కొనేందుకు వచ్చింది. వారిద్దరూ ప్రమాదవశాత్తు మురికినీటి కాలువలో పడిపోయారు. ఆ నాలలో పడి చని పోయారు. ఆ నాలా నిర్మాణంలో ఉందని పోలీసులు వివరించారు. దాని లోతు 15 ఫీట్ల వరకు ఉంటుందని, వెడల్పు ఆరు ఫీట్లు ఉందని పేర్కొన్నారు.…

Read More

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాల్గవ గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాజ్ భవన్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొత్త గవర్నతో ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కిషన్ రెడ్డితో సహా మంత్రులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై గవర్నర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. 1957 ఆగస్టు 15 రోజున త్రిపురకు చెందిన రాజ కుటుంబంలో జిష్ణు దేవ్ వర్మ జన్మించారు. జిష్ణు దేవ్ వర్మ, సుధా దేవవర్మ దంపతులకు ప్రతీక్ కిషోర్ దేవ్ వర్మ, జైబంత్ దేవ్ వర్మ అనే…

Read More

రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ అందని బాధితులకు బిజెపి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను బుధవారం ప్రారంభిస్తూ రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఎందుకు రుణమాఫీ కాలేదో మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలకి, రైతులకు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని, మరోవైపు భవిష్యత్‌లో చాలా మంది రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు సహాయం అందిస్తామని చెప్పి ఆ హామీ కూడా నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజమని చెబుతూ ఏ విడతలో కూడా రైతులకు న్యాయం జరుగడం లేదని తెలిపారు. లక్షలాది రూపాయలతో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని,…

Read More