Author: Editor's Desk, Tattva News

అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదిక దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. అదానీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనున్నది. అదానీ గ్రూప్ పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం… దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపింది. దీనిపై గత వారం కూడా సుప్రీం…

Read More

రాజ్యసభలో గురువారం అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మేటి అథ్లెట్, ఎంపీ పీటీ ఉష, రాజ్యసభ చైర్మన్ చైర్‌లో కూర్చుని సభా వ్యవహారాలను నడిపించారు. ఛైర్మన్ జగదీష్ థన్‌కర్ సభలో లేని సమయంలో పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహించారు. పయ్యోలీ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పీటీ ఉష, తన ట్విట్టర్ లో ఈ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేశారు. సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందని, మరిన్ని మైలు రాళ్లను అందుకోనున్నట్టు ఆమె ఆ వీడియోపై కామెంట్ చేశారు. 2022లో బీజేపీ తరఫున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే. గొప్పశక్తి గొప్ప బాధ్యతలో ఉంటుందని, ఫ్రాంక్టిన్ డీ రూజ్‌వెల్ట్‌కు చెందిన కొటేషన్‌ను ఆమె తన వీడియోలో పోస్ట్ చేశారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యత, నమ్మకంతో మరిన్ని మైలు రాళ్లను క్రియేట్ చేయనున్నట్టు ఆమె చెప్పారు. పిటి ఉష వీడియో పోస్టు చేయగానే ఆమె అభిమానులు…

Read More

ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వల్ల ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని, ఎన్నికల వల్ల ఇది సాధ్యం కాలేదని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలను ఎండగడుతూ, ఒక విధంగా ఈ ఏడాది జరిగే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు బిజెపి ప్రచార అస్త్రాలను సిద్ధం చేసినట్లయింది. “ఎన్నికల ఫలితాలు అలాంటి వారిని (ప్రతిపక్షాలు) ఏకతాటిపైకి తీసుకొస్తాయని నేను ఇంతకాలం అనుకున్నా. కానీ వారు ఇప్పుడు ఏకమయ్యారు. ఇందుకు వారు ఈడీకి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్నికలు చేయలేని పనిని ఈడీ చేసింది. ఈడీ వల్లే వారు ఏకమవుతున్నారు” అని మోదీ పేర్కొన్నారు. ఈడీ దాడులపై ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన గురించి అబద్ధాలు చెబితే…

Read More

సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు కేటాయించడం వాస్తవం కాదా ? ఇప్పటివరకు సింగరేణి కంపెనీకి చెందిన ఎన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించారు ? సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించే ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారా? అని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం రాతపూర్వక సమాధానమిచ్చారు. బొగ్గు గనుల చట్టం ( ప్రత్యేక నిబంధనలు ) – 2015లో నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బొగ్గు గనులు కేటాయింపుదారుని ఎంపిక చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తేల్చి చెప్పారు. మైన్స్,…

Read More

గవర్నర్ ప్రసంగంపై మంత్రి కె. తారకరామారావు, బడ్జెట్ పై మంత్రి హరీష్‌రావులు అసెంబ్లిలో మూడు గంటల సమయం ప్రసంగించి సమావేశాలను పార్టీవేదిక మార్చారని హుజూరాబాద్ బిజెపి ఎంఎల్‌ఏ ఈటెల రాజేందర్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లిలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావు చేసిన ప్రసంగం అబద్దాలతో నిండిపోయిందని ధ్వజమెత్తారు. రూ 13 వేల కోట్లు భూములు అమ్మకం ద్వారా వస్తాయని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 25 వేల కోట్లు సహాయం కింద వస్తుందనడం, జిఎస్టీ కాంపెన్సేషన్ వస్తుందని చెప్పడం అబద్దమని ఆయన ఆరోపించారు. రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా మారిందని, ఎఫ్‌ఆర్‌బిఎం, గ్యారెంటి రుణాలు కలిపి అప్పుల కింద రూరూ. 5 లక్షల కోట్టుకు చేరుకుందని ధ్వజమెత్తారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఉచితంగా మంచి భోజనం పెట్టారని, ప్రస్తుతం వాటి పరిస్థితి సోష్ వెల్ఫేర్ హాస్టళ్ళకన్నా దారుణంగా మారిందని…

Read More

ఏపీ రాజధాని విషయంలో మరోసారి కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని, విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని తెలిపింది. వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ సూచనలు, సలహాలు, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. అనంతరం ఏపీసీఆర్డీయేను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 2020లో సీఆర్డీయేను రద్దు చేసి, మూడు రాజధానుల…

Read More

పిడిపి నేత మెహబూబా ముఫ్తీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోని కూల్చివేతలకు వ్యతిరేకంగా బుధవారం విజయ్ చౌక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా పిడిపినేతలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.  కాగా, అనుమతి లేకుండా ఆందోళనకు పూనుకోవడంతో మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు పిడిపి కార్యకర్తలను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్ము కశ్మీర్‌లో గూండా ప్రభుత్వం నడుస్తున్నదని జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ నిరసన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌ను ఆఫ్ఘనిస్తాన్‌లా నాశనం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా చేపడుతున్న కూల్చివేతలను నిరసిస్తూ ఢిల్లీ విజయ్‌చౌక్‌లో ఆందోళనకు దిగారు. 20 జిల్లాల్లో స్థలాలు ఆక్రమించారంటూ అక్కడి అధికారులు కూల్చివేతలకు దిగడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఇప్పటివరకు అనేక భవనాలను కూల్చివేయడంతో అమాయక ముస్లిం పేదలు రోడ్డున పడ్డారని…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు వెంటనే అతన్ని ఢిల్లీ తరలించారు. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా.. ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ ఛైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల దగ్గర ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. గోరంట్ల బుచ్చిబాబు పేరుమీద గోరంట్ల, అసోసియేట్స్, శ్రీ ఎంటర్‌ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. అతను హైదరాబాద్‌కు చెందిన పలు…

Read More

రాజస్థాన్ లో జరిగిన మిసెస్ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్ చేరుకోగా, తుది పోటీల్లో కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా తెలంగాణ రీజినల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ ఆమెకు మెంటర్‌గా వ్యవహరించారు. కిరణ్మయికి వీణా పుజారి దుస్తులు డిజైన్ చేయగా, 10 కేటగిరీల్లో 30 మందితో పోటీ పడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్, సఫారీ రౌండ్‌తోపాటు ఫ్యాషన్ రౌండ్స్‌లో గట్టిపోటీ నడిచినప్పటికీ, జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చి కిరణ్మయి ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరికి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు. కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ గెలిచారు. వివాహం తరువాత కూడా మహిళలు కుటుంబానికి పరిమితం కాకుండా ఏదైనా…

Read More

రాబోయే 40 ఏళ్ల ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దేందుకు దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన తిరుపతి స్టేషన్‌ పునరాభివృద్ది పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.  మే 2022లో ప్రారంభించిన ఈ పనులు  ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి స్టేషన్‌ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్‌ భవనం రాబోతోంది. జియోలాజికల్‌ సర్వే పూర్తయిన తర్వాత, క్యాంపు కార్యాలయం, కాంక్రీట్‌ ల్యాబ్‌, స్టోరేజీ షెడ్ల ఏర్పాటుకు సంబందించిన పనులతో పాటు మిగిలిన పనులు కుడా వేగంగా కొనసాగుతున్నాయి. కొత్త స్టేషన్‌ భవనానికి పునాదుల కాంక్రీటింగ్‌ పనులు 100 శాతం పూర్తయ్యాయి . ఇప్పటి వరకు, ఫౌండేషన్‌లు, బేస్‌మెంట్‌ ప్లnోర్‌ యొక్క స్తంభాలు మరియు రిటైనింగ్‌ వాల్‌లో సుమారు 7,450 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు. తదుపరి దశలో, బేస్‌మెంట్‌ ఫ్లోర్ కోసం కాంక్రీట్‌ స్లాబ్‌ను సెంట్రింగ్‌ మరియు షట్టరింగ్‌కు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.…

Read More