ఫాం హౌస్ కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రభుత్వ తరుపు న్యాయవాది దుష్యంతు దవే సీజేఐ ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే సాక్ష్యాలన్నీ ధ్వసం అవుతాయని పిటిషన్ లో ఆందోళన వెలిబుచ్చారు. ఈ విషయాలను బుధవారం ధర్మాసనం దృష్టికి తెస్తే వచ్చే వారం విచారణకు అనుమతిస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగించాలన్న తీర్పుపై స్టే విధించాలంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు 3 వారాల గడువు కోరింది. ఉదయం హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన సర్కారు సాయంత్రానికి సుప్రీంను ఆశ్రయించింది. ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈనెల 17వతేదీన జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం…
Author: Editor's Desk, Tattva News
టర్కీకి ఆగ్నేయంగా..సిరియాకి ఉత్తరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో గంటల గ్యాప్‌లో వచ్చిన 3 భూకంపాలు ఆ రెండు దేశాలనూ అల్లకల్లోలం చేశాయి. టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటిదాకా 5వేల మందికిపైగా మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20వేల మంది వరకు మృతుల సంఖ్య ఉండొచ్చనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తక్షణమే స్పందించిన భారత్ భూకంపాల కారణంగా భవనాలు పెద్దఎత్తున కుప్పకూలి శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీ పంపించింది. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపింది. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్లాయి. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కు చెందిన రెండు బృందాలు…
కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్‌ను కూడా ఆవిష్కరించారు. గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ 615 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దేశంలోని అన్ని హెలికాప్టర్ అవసరాలకు ఒక-స్టాప్ సొల్యూషన్‌గా మారాలనే లక్ష్యంతో ప్రణాళిక చేయబడింది. ఇది భారతదేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా ఉంది. ప్రారంభంలో లైట్-యుటిలిటీ హెలికాప్టర్లను (ఎల్ యు హెచ్ లను) ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేయబడిన 3-టన్నుల తరగతి, ఒకే-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ హెలికాప్టర్, ఇది అధిక యుక్తులతో కూడిన ప్రత్యేక లక్షణాలతో ఉంటుంది. ప్రారంభ దశలో కర్మాగారం సంవత్సరానికి సుమారు 30 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. తరువాత దాని సామర్థ్యాన్ని దశలవారీగా సంవత్సరానికి 60 మరియు 90 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. మొదటి ఫ్లైట్ టెస్ట్ జరిగి, ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. తేలికపాటి యుద్ధ…
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. కొన్ని రోజులుగా నిరంతరం నికర విలువను కోల్పోతున్నాడు. తన సంస్థల స్టాక్‌లు మరింత దిగజారడంతో సోమవారం టాప్ లూజర్‌గా నిలిచాడు. సోమవారం అదానీ గ్రూప్‌కు చెందిన చాలా స్టాక్‌లు వాటి లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఐదు శాతం క్షీణించగా.. అదానీ ట్రాన్స్ మిషన్ స్టాక్స్ 10 శాతం పడిపోయాయి.ఎన్ డి టి వి స్టాక్ ధర కూడా ఈరోజు 4.98 శాతం నష్టపోయింది. గ్రూప్ కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అంబుజా సిమెంట్స్ ఇతర కంపెనీల కంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. అయితే ఈ రెండు స్టాక్స్ కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ప్రస్తుతానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 1.55 శాతం క్షీణించగా, అంబుజా సిమెంట్ షేరు ధర ఈ రోజు 0.47 శాతం నష్టపోయింది. ఇక.. అదానీ నికర విలువ, కంపెనీల స్టాక్‌లపై హిండెన్‌బర్గ్ నివేదిక…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కేవలం మోడీని తిట్టడానికి, బీజేపీపై నిందలు వేయడానికి మాత్రమే పెట్టుకున్నారని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో విపక్షాలకు అధికార పార్టీ సమయమివ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆరోపించారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు కేంద్రంపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. 9 ఏళ్ల వార్షిక బడ్జెట్లు ఏనుగు తొండంలా.. కేటాయింపులు మాత్రం ఎలుకంత ఉన్నాయని విమర్శించారు. ప్రజలను భ్రమల్లోకి నెట్టేశారన్న లక్ష్మణ్… తెలంగాణలో మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న సొమ్ముకు వడ్డీ లేదని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉందని.. కానీ ప్రభుత్వం మాత్రం ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటోందని ఎద్దేవా చేశారు. “కేటీఆర్ తమది 4 కోట్ల కుటుంబ పాలన అంటున్నారు… నాలుగు కోట్ల మంది వాళ్ల కుటుంబం అయితే, నలుగురికి మాత్రమే మంత్రి పదవులు ఎందుకు”…
టర్కీ, సిరియాలలో ఒకేరోజు మూడు భారీ భూకంపాలతో వణికిపోయాయి. ఈ దేశాల సరిహద్దుల్లోని నగరాల ప్రజలు గాఢనిద్రలో ఉండగా భూవిలయం సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. దీంతో 4000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6వేల మందికిపైగా గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇంకెంతో మంది భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 4372కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం టర్కీలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయపడ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొన్నది. సిరియాలో భూకంపం వల్ల సుమారు 1451 మంది మరణించారు. మరో 3531 మంది గాయపడ్డారు. వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీలో ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. టర్కీ, సిరియాలలోని ప్రభావిత నగరాల్లో…
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. కొత్త మేయర్‌ను ఎన్నుకునే కసరత్తు వరుసగా మూడోసారి విఫలమైంది. ఆప్, బీజేపీ సభ్యులు సోమవారం ఢిల్లీ మున్సిపల్ హౌజ్ లో గందరగోళం సృష్టించారు. దాంతో సభ వాయిదా పడింది. డిసెంబరు 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత మూడోసారి సమావేశమైన సభలో నగరంలోని ప్రముఖులకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఆప్ సభ్యులు నిరసనకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా నామినేట్ చేసిన సభ్యులను కూడా మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తామని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ ప్రకటించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఓటింగ్ హక్కుల అంశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. దీంతో మేయర్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో…
ఎంఎల్‌ఏల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐకి అప్పగించొద్దంటూ రాష్ట్రప్రభుత్వం, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిబిఐకి గతంలో కేసును అప్పగించిన సింగిల్ జడ్జీ తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.ఇదిలావుండగా హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని తెలిసింది. అందుకు తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. దానికి కూడా హైకోర్టు నిరాకరించింది. గతంలో హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి ఎంఎల్‌ఏల ఎర కేసును సిబిఐకి బదిలీ చేయాలని తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా రద్దు చేసింది. సింగిల్ జడ్జీ తీర్పును సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి ఎన్. తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపింది. తాజాగా…
తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లుగా ఉందని, పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా ఉందన్నారు. తలసరి ఆదాయం రూ.3,17,155గా అంచానా వేస్తున్నారు. తెలంగాణ ఆచరిస్తోందని, దేశం అనుసరిస్తోందన్న స్థాయిలో రాష్ట్రం దూసుకపోతుందన్నారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమం ఆగలేదని, అన్ని సామాజిక వర్గాల ఆకాంక్షలకు అనుకూలంగా సమగ్రాభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జిఎస్‌డిపి క్రమేణా పెరుగుతూ వచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఊరురూవాడ చర్చ జరుగుతోందన్నారు. 2019-20 సంవత్సరానిని జిఎస్‌డిపి వృద్ధి రేటు 13.2 శాతానికి పెరిగిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా తలసరి ఆదాయం 11.8 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని హరీష్ రావు ప్రశంసించారు. దేశ జిడిపిలో తెలంగాణ…
మహారాష్ట్రలోని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇయ్యాల కేసీఆర్ చెప్పిన మాటలు విని జనం నవ్వుకుంటున్నారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సి వస్తే… ఇయ్యాల కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు ఆస్కార్ అవార్డ్ కచ్చితంగా దక్కేది” అని ఆయన విమర్శించారు. ‘‘నాందేడ్ లో బీఆర్ఎస్ సభ తుస్సుమంది. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా సభ అట్టర్ ఫ్లాప్ అయింది. మహారాష్ట్ర జనం అస్సలు పట్టించుకోలేదు. చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి జనాన్ని తరలించారు” అని సంజయ్ పేర్కొన్నారు. పెద్ద పెద్ద నాయకులు చేరుతారని మొదట ప్రచారం చేసుకున్నా, చివరకు అవుట్ డేటెడ్ నాయకులే చేరారని ఎద్దేవా చేశారు. ‘‘ఇయ్యాల సభలో బీఆర్ఎస్ పార్టీ కాదు మిషన్ అని కేసీఆర్ చెప్పారు.…