దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న లోన్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లపై కేంద్రం నిషేధించింది. రుణ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న సామాన్య, మధ్య తరగతి వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. వీరి ఒత్తిడికి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్‌లపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటపడి రుణాలు ఇస్తున్న ఈ యాప్‌ల నిర్వహకులు విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ప్రజల నుంచి ఈ తరహా యాప్‌లపై వచ్చిన ఫిర్యాదులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్ యాప్‌లు, 94 రుణ చెల్లింపుల యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖకు హోంశాఖ ఈ వారంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ యాప్‌లను బ్లాక్ చేసే ప్రక్రియను ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ ప్రారంభించింది. ఐటీ చట్టంలోని సెక్షన్…
Author: Editor's Desk, Tattva News
పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. 79 ఏళ్ల ముషారఫ్ గత కొంతకాలంగా అమైలాయిడోసిస్ అనే రుగ్మతతో బాధపడుతూ దుబాయిలోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ఆదివారం తెలిపాయి. పాక్ అధ్యక్షుడిగా 8 ఏళ్ల పాటు నియంతలా పాలించిన ముషారఫ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్ – పాక్ మధ్య కార్గిల్ యుద్ధానికి కుట్రలు పన్నడం దర్గర్నుంచి.. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య వరకు పలు కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై దేశద్రోహం అభియోగాలు నమోదవడం, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు 2019లో మరణశిక్ష పడింది. ఆ తరువాత ఆ శిక్ష తాత్కాలికంగా వేశారు. 2016లో…
భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హెచ్చరించింది. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) హైదరాబాద్‌లో మారణహోమానికి ప్లాన్ చేస్తున్నాయని ఎన్‌ఐఏ తన ప్రాథమిక సమాచార నివేదికలో వెల్లడించింది. నిఘావర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ తమ సానుభూతి పరులకు హ్యాండ్ గ్రనేడ్‌లను అందుబాటులో ఉంచింది. భాగ్యనగరంలో దాడులు, పేలుళ్లకు కుట్ర పన్నింది. జనవరి 25న నమోదైన ఓ కేసులో హైదరాబాద్‌పై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు వెల్లడైంది. మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టేందుకు బహిరంగసభలు, ఊరేగింపులను లక్ష్యంగా చేసుకోవాలని ప్రణాళిక రచించారు. హ్యాండ్ గ్రనేడ్లు విసరడం ద్వారా తమ వ్యూహాలను అమలు చేయాలని ముష్కరులు భావిస్తున్నారని ఎన్‌ఐఏకు పట్టుబడిన వ్యక్తుల నుంచి దర్యాప్తు సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్ ప్రకారం, హైదరాబాద్‌లో అనేక ఉగ్రసంబంధిత కేసులలో నిందితుడిగా ఉన్న అబ్దుల్ జాహెద్ అలియాస్ జాహెద్ అలియాస్ మహ్మద్‌కు కీలక ఈ…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని బిజెపి ఎమ్మెల్యే రఘనందనరావు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, స్పెషల్ డెవలెప్మెంట్ స్కీం కింద గజ్వేల్ కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790కోట్ల నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేనని, ఎన్నిసార్లు కోరిన ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు.. భాగ్యనగరంలో పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదని రఘునందన్ విమర్శించారు. ఇంటి నిర్మాణానికి గతంలో రూ.5లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3లక్షలకు తగ్గించిందని చెబుతూ అసలు సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయం ఎప్పుడిస్తారని…
అసోం ప్రభుత్వం బాల్యా వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,258 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. బిస్వనాథ్‌లో ఇప్పటి వరకు కనీసం 139 మంది, బార్‌పేటలో 128 మంది, ధుబ్రిలో 127 మంది పట్టుబడ్డారని పోలీసులు ప్రకటించారు. అసోంలో మైనర్లను వివాహం చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లుగానే ఆయన అటువంటి భర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు రోజులో 24 గంటల పాటూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది వేల మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, 2,258 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ మరో మూడేళ్లపాటు నిర్వహిస్తూనే ఉంటామని ప్రభుత్వం…
తమ పార్టీ గురించి మంత్రి కేటీఆర్ చులకనగా మాట్లాడడంతో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి అధికార పక్షంకు ఊహించని షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో 50 స్థానాలలో పోటీచేసి, కనీసం 15 స్థానాలలో గెలుపొంది అసెంబ్లీకి వస్తామని సవాల్ చేశారు. దానితో బిఆర్ఎస్ సభ్యులు నివ్వెరపోయారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏడుగురు సభ్యులున్న పార్టీకి గంటలకద్దీ సమయం ఇవ్వడం భావ్యం కాదని ఎంఐఎంను ఉద్దేశిస్తూ స్పీకర్ కు సూచించారు. దీంతో అక్బరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో 50 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని, కనీసం 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఉండేటట్లు చూస్తామన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో వరుసగా మూడోసారి కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాలేరని అంటూ పరోక్షంగా సంకేతం ఇచ్చారు. జాతీయపార్టీ కావాలంటూ దేశంలో పలు రాస్త్రాలలో డిపాజిట్లు రాకపోయినా ఎక్కువ నియోజకవర్గాలలో పోటీచేస్తున్న ఎంఐఎం తెలంగాణాలో మాత్రం పాతబస్తీ ప్రాంతంలోని 8 నియోజకవర్గాలను మించి పోటీచేయడం లేదు.…
ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. చెన్నై నుంగబాకంలోని ఆమె నివాసంలో జారిపడి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలుగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారీమె. 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో పది వేల పాటలకు పైగానే పాడారు. సినిమాలతో పాటు వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా ఆమె ఆలపించారు. తెలుగు, తమిళం సహా 19 భాషల్లో ఆమె పాటలు పాడటం విశేషం. మూడుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డులను పొందారు. పాడిన తొలి పాటకే ఐదు అవార్డులు వచ్చాయి. తొలితరం గాయనీమణుల్లో సుశీల, జానకి వంటి హేమాహేమీల సరసన తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న వాణీజయరాం గాత్రం సంగీత భాండాగారం. హిందీ సినిమాలతో ఆమె కెరియర్…
ఎన్నో ఏళ్ళకు నిరాధరణకు గురైన గుంటూరు రైల్వే డివిజన్‌కు మహర్ధశ పట్టింది.. కేంద్రం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో అభివృద్ధి పనులకు సింహభాగం కేటాయింపులు జరిగాయి. గత ఏడు, ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే రైల్వే శాఖనే సొంతంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. కేవలం మూడు ప్రాజెక్టులకు రూ.1,242 కోట్లు కేటాయించడం విశేషం. ఇవికాక స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక సదుపాయాల పనులకు పెద్దమొత్తంలోనే నిధుల కేటాయింపు జరిగినట్లు- రైల్వే వర్గాలు తెలిపాయి. గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్, నడికుడి – శ్రీకాళహస్తి, గుంటూరు – బీబీనగర్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. గత కొన్ని దశాబ్ధాలుగా డిమాండ్‌లో ఉన్న గుంటూరు – బీబీనగర్ డబ్లింగ్‌ని ఈ దఫా పింక్‌బుక్‌లో చోటు కల్పించి రూ.60 కోట్లు కేటాయించింది. దీంతో ఈ ప్రాజెక్టుని చేపట్టడానికి…
ముంబైలో మరోసారి ఉగ్రదాడి చేస్తామంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి ఈ-మెయిల్ రావడం కలకలం రేపుతోంది. తాను తాలిబాస్ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపిన విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. దీంతో ముంబై ప్రజలను మరోసారి 26/11 చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భయపడుతున్నారు. నిజంగా ముంబైకి మరోసారి ఉగ్ర ముప్పు పొంచి ఉందా..? ఎన్‌ఐఏ చెబుతున్న మెయిల్‌లో ఏముంది..? ఈ మెయిల్ నిజంగానే తాలిబన్ లింకులున్న వ్యక్తి పంపాడా..? లేక ఫేక్‌గా భయ పెట్టడానికి వేరే ఎవరైనా పంపారా..? మెయిల్‌లో వచ్చిన వార్నింగ్‌తో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రత పెంచాలని సూచించారు. ఈ సూచనలతో ముంబై పోలీసులతో…
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అధికార పార్టీవిజయభేరి మ్రోగించింది. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్ష, కో– ఆప్షన్ సభ్యుల పదవులకు ఉప ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్‌సీపీ విజయాన్ని అందుకుంది. ఏడు మండలాల్లో ఎంపీపీ పదవుల్లో.. చిత్తూరు జిల్లా రామకుప్పం మినహా మిగిలిన ఆరు మండలాల్లో గెలుపొందింది. అలాగే 11 మండలాల్లో ఉపాధ్యక్ష పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించగా.. రామకుప్పం మినహా మిగిలిన 10 మండలాల్లో తొమ్మిది చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒకచోట మాత్రం స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. రామకుప్పం మండలంలో ఎంపీటీసీ సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేదు. దీంతో అక్కడ ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు రెండూ వాయిదా పడ్డాయి. ఆరు మండలాల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించగా.. ఐదు చోట్ల వైఎస్సార్ సీపీ సానుభూతిపరులే కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాలో కో ఆప్షన్ సభ్యుడి…