Author: Editor's Desk, Tattva News

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు గర్జనలో ఇచ్చిన హమీని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘విశాఖ ఉక్కు గర్జనలో,అన్ని రాజకీయ పార్టీలు (బీజేపీయేతర) వైజాగ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవడానికి, అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చేపట్టడానికి పోరాటం చేస్తామని హామీ ఇచ్చాయి. వారు చేస్తారని ఆశిస్తున్నాను #Savevizagsteel’అని జేడీ నినదించారు. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా ట్యాగ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న లక్ష్మీనారాయణ ఈ విషయమై రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలురు. కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో…

Read More

గుజరాత్‌లోని మోర్బీ జిల్లా మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలిన కేసులో నిందితుడైన ఒరేవా గ్రూపునకు చెందిన అజంతా మాన్యుఫ్యాక్టరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్ మంగళవారంనాడు కోర్టు ముందు లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనను కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. ఈ కేసులో గుజరాత్ పోలీసులు 1262 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు. జైసుఖ్ పటేల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. జనవరి 24న గుజరాత్ కోర్టు పటేల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్టోబర్‌లో సంఘటన జరిగినప్పటి నుంచి జైసుఖ్‌ పటేల్ కనిపించకుండా పోయారని, చార్జిషీట్‌లో ‘పరారీ’గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒరేవా గ్రూప్‌కు చెందిన నలుగురు ఉద్యోగులతో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పటేల్‌పై గుజరాత్ పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన నాలుగు రోజుల తర్వాత ఆయన కోర్టుకు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో చీఫ్ జ్యుడిషియల్…

Read More

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆప్ కు రాజీనామా చేశారు. ఆ లేఖను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ దోస్తీని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ తో కలిసి నడవాలని నిర్ణయించడంతో ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లైందని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్థాపానికి గురైనట్టు ఇందిరా శోభన్ వెల్లడించారు. ఖమ్మం సభకు వచ్చినప్పుడే కేజ్రీవాల్ ముందు తన సందేహాన్ని ఉంచానని ఆమె చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ బాయ్ కాట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. అంబేద్కర్ ఫోటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆమె ఆవేదన…

Read More

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తనను జైలుకు పంపినా ధర్మం కోసం పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో తాను వ్యాఖ్యానించినట్లు రాజాసింగ్ చెప్పారు. మహారాష్ట్రలో తాను మాట్లాడితే మంగళ్‌హాట్ పోలీసులు తనకు లేఖలు అందిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Read More

2023-24  ఆర్ధిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.5శాతం వృద్ధి చెందుతుందని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చితుల కారణంగా వాస్తవ జీడీపీ లిమిట్​ని 6- 6.8శాతం మధ్యలో ఉంచుతున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కన్నా వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధి నెమ్మదించినప్పటికీ.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉందని పేర్కొంది. పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఎకనామిక్​ సర్వే 2023ని మంగళవారం . కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న బడ్జెట్​ ఉండనున్న నేపథ్యంలో ఎకనామిక్​ సర్వేకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్​ ఎదుగుతోందని ప్రపంచంలోని వివిధ సంస్థలు చెబుతున్న మాటలను ఎకనామిక్​ సర్వే పునరుద్ఘాటించింది. కరోనా, రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, వడ్డి రేట్ల పెంపు వంటి ప్రమాదకరమైన…

Read More

మ‌హిళ‌ల సాధికార‌త కోసం కేంద్ర స‌ర్కార్ ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని, బేటీ బ‌చావో.. బేటీ ప‌డావో విజయవంతం అయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  దేశంలో పురుషుల సంఖ్య క‌న్నా ఇప్పుడు మ‌హిళ‌ల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని, మ‌హిళ ఆరోగ్య స్థితి కూడా మెరుగుప‌డిన‌ట్లు ఆమె చెప్పారు. “మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం.. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకుంటున్నాం. సైన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించాం..” అని రాష్ట్రపతి తెలిపారు. రైతుల ఆదాయాన్ని వృద్ధి చేశామ‌ని, గ్రామాల‌ను కూడా అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌రీబీ హ‌ఠావో పథకంతో దేశంలో పేద‌రికాన్ని నిర్మూలించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని ఆమె కొనియాడారు. పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న్ స్కీమ్‌ను విస్త‌రించ‌డం ప‌ట్ల ఆమె సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ స్కీమ్‌పై ప్ర‌పంచ దేశాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. కరోనా మ‌హ‌మ్మారి వేళ ప్ర‌జ‌ల ప్రాణ ర‌క్ష‌ణ కోసం…

Read More

భారత రాష్ట్రపతి ముర్ము మొదటిసారి పార్లమెంట్ లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని చెబుతూ ‘ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంటులో నూతన సభ్యుడు ఎవరైనామాట్లాడాలనుకుంటే వారిని ప్రోత్సహిస్తుందని పేర్కొంటూ దేశ ఆర్ధికమంత్రి కూడా మహిళ అని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ‘ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్’ అనే కాన్సెఫ్ట్ ను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు అన్ని అంశాలపై పార్లమెంట్ లో లేవనెత్తెందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతూ అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, కాంగ్రెస్ …

Read More

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌) ఈ ఏడాదికి చెందిన ఆర్ధిక అంచ‌నాల‌ను విడుదల చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2022లో 3.4 శాతంగా ఉన్న‌ వృద్ధి .. 2023 నాటికి 2.9 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఐఎంఎఫ్ తెలిపింది. ఆ త‌ర్వాత 2024 నాటికి 3.1 శాతానికి ఆర్ధిక వృద్ధి చేరుతుంద‌ని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భార‌త్‌లో ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో ప్ర‌గ‌తి మంద‌గించ‌నున్న‌ట్లు ఐఎంఎఫ్ చెప్పింది. ప్ర‌స్తుతం 6.8 శాతం ఉన్న వృద్ధి.. ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు అలాగే ఉండి, ఆ త‌ర్వాత 6.1 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు ఐఎంఎఫ్ త‌న జ‌న‌వ‌రి రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. అయితే ఇండియాలో 2023 చివ‌రి నాటికి వృద్ధి బాగుంటుంద‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం ఆర్ధిక సంవ‌త్స‌రానికి ఇండియాలో వృద్ధి 6.8 శాతంగా ఉంద‌ని, మార్చి త‌ర్వాత 6.1 శాతానికి ప‌డిపోయే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఐఎంఎఫ్ రీస‌ర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ పీర్ ఒలివ‌ర్ గౌరించాస్…

Read More

బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం రాకపోయే సరికి అయోమయంలో పడి కోర్టుకెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ భంగపడక తప్పలేదు. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తామని, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలియచేయడం ద్వారా గవర్నర్ తో సయోధ్యకు వచ్చారు. ఇక సాయంత్రానికల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు,అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తమిళిసైని కలిసారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాలంటూ ఆమెను లాంఛనంగా ఆహ్వానించారు. ఇక సత్వరమే తెలంగాణ బడ్జెట్‌కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. మొత్తమ్మీద, రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో గవర్నర్‌ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభం హైకోర్టు వేదికగా పరిష్కారమైంది. ఈ కేసును నిన్న విచారించిన హైకోర్టు చివరకు ఇరువురి మధ్య సయోధ్యను కుదిర్చింది. మధ్యాహ్న…

Read More

పాకిస్థాన్‍లో ఘోరం సంభవించింది. ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం భీకరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు పేలుడు మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ బాంబు దాడికి తామే పాల్పడ్డామని పాక్ తాలిబన్ కామాండర్ సర్బకఫ్ మొమంద్ ప్రకటన విడుదల చేశారు. వందలాది మంది ప్రజలు సామూహికంగా మసీదులో ప్రార్థనలు చేస్తుండగా పేలుడు పదార్థాలతో వచ్చి ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అక్కడి స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏపీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ బాంబు పేలుడుతో పెషావర్‌లోని ఆ మసీదు చాలా భాగం కూలిపోయిందని, కాగా, ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని…

Read More