సీనియర్ నటి జమున (86) శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ సహా దక్షిణాదిన పలువురు సూపర్ స్టార్స్ సరసన ఆమె నటించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆమె మరణం టాలీవుడ్‌కి తీరని లోటు. జమున మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. అంతే కాదు మా భూమి అనే నాటకంలోనూ జమున కీలక పాత్ర పోషించి, అందర్నీ మెప్పించారు. అలా ఆమె అభినయం నచ్చి 16 ఏళ్ల వయసులోనే పుట్టిల్లు (1953) అనే సినిమాలో ఆమెకు నటిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య వంటి…
Author: Editor's Desk, Tattva News
ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లాంచనంగా ప్రారంభించారు. ప్రతీ ఏడాది తరహాలోనే హల్వా తయారు చేసి సిబ్బందికి పంచడం ద్వారా ఈ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్‌లో జరిగే ఈ బడ్జెట్ కసరత్తు సమయంలో ఎంపిక చేసిన ఉన్నతాధికారులు మినహా ఎవరినీ లోనికి, బయటికి పంపించరు. కనీసం కుటుంబ సభ్యులతోనూ ఎలాంటి సంప్రదింపులకు వీలుండదు. ఇందులో పాల్గొన్న అధికారులను పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే ఇంటికి అనుమతిస్తారు. హల్వా కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరీ, భగ్వత్ కిసన్‌రావు కరడ్, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంతక్రితం రెండు బడ్జెట్‌ల తరహాలోనే 2023-24 బడ్జెట్‌ను కూడా కాగితపురహితంగా విడుదల చేయనున్నారు. బడ్జెట్ రూపకల్పన, ప్రక్రియలో ఫైనాన్స్ సెక్రటరీ టివి సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, దీపమ్ సెక్రటరీ…
సాప్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతోంది. ప్రముఖ మల్టినేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాప్ట్, మెటా బాటలో మరిన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఐబిఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్) 3,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీలో మొత్తం 2.80 లక్షల మంది ఉద్యోగులకు గాను 1.4 శాతం లేఆఫ్ ఉంటుందని కంపెనీ వార్షిక నివేదికలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తొలగించిన దిగ్గజ ఐటి కంపెనీలు మెటా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, గూగుల్ జాబితాలో ఇప్పుడు ఐబిఎం చేరింది. ఐబిఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ ప్రకారం, ఉద్యోగుల తొలగింపుల వల్ల జనవరి- మార్చి కాలంలో కంపెనీకి 300 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ అనేక కీలక చర్యలను తీసుకుందని, దీని ఫలితంగా వ్యాపారంలో కొన్ని ఖర్చులు పెరిగాయని అన్నారు. 2022 డిసెంబర్…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ నుంచి ఈ ఏడాది చివరిలోపు 11 రాకెట్ ప్రయోగాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్ సెంటర్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ తెలియజేశారు. గురువారం షార్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో షార్ డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ 5, ఎల్‌వీఎం 2, ఎస్‌ఎస్‌ఎల్‌వీ 2, జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్12 రాకెట్‌తో పాటు మరో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం కూడా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది చివరలో గగన్‌యాన్ -డి1 ప్రయోగం ఉంటుందని దీనికి సంబంధించిన వివిధ భూ పరీక్షలను ఇప్పటికే ఇస్రో పూర్తి చేసిందని ఈ ఏడాదిలో ప్రధానంగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ ప్రయోగము, చంద్రయాన్ -3, వన్‌వెబ్, ఎల్‌వీఎం -3 మానవరహిత గగన్ యాన్ -డీ1 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే షార్‌లో రాకెట్ తయారీకి రాకెట్ ప్రయోగానికి కావాలసిన అన్ని…
రిపబ్లిక్ డే పెరేడ్ లో ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో మిగ్ 29, స్యూ 30ఎంకెఐ, రాఫెల్ ఫైటర్స్ , సి 130 సూపర్ హెర్కులస్, సి17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బహుళా తొలిసారిగా చివరిసారిగా నేవీకి చెందిన ఐఎల్ 38 కూడా పాల్గొంది. భారతీయ నౌకాదళంలో ఈ యుద్ధ విమానం దాదాపుగా 42 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివరికి దీనిని సేవల నుంచి విరమింపచేస్తారు. దేశంలో స్వయంగా నిర్మించిన సైనిక పరికరాలను ఆత్మనిర్బర్ భారత్‌లో భాగంగా ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన యుద్ధ ట్యాంక్ అయిన అర్జున్, నాగ్ మిస్సైల్ సిస్టమ్ (నామిస్), కె 9 వజ్రలను కూడా ప్రదర్శించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇప్పుడు పాల్గొన్న అన్ని సైనిక పరికరాలు భారత్ నిర్మితాలని ఢిల్లీ…
దేశంలో తొలి ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్‌ను ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించారు. ఇంకోవాక్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. గతవారంలో కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌లో వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్‌గా వయోజనులకు హెటిరోలాగస్ బూస్టర్ డోస్‌గా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. టీకాను ప్రభుత్వానికి రూ.325, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలకు రూ.800 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది.
దేశవ్యాప్తంగా గురువారం 74వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కర్తవ్యపథ్‍పై రిపబ్లిడే పరేడ్ జరగడం ఇదే తొలిసారి. బ్రిటీష్ కాలం నుంచి రాజ్‍పథ్‍గా ఉన్న దీని పేరును గతేడాది కర్తవ్యపథ్‍గా మార్చింది కేంద్ర ప్రభుత్వం. కర్తవ్యపథ్‍గా నామకరణం చేశాక ఇక్కడ జరుగుతున్న గణతంత్ర వేడుకలు ఇవే. పరేడ్‍లో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు అబ్బురపరిచే విన్యాసాలు చేస్తాయి. కవాతులు నిర్వహిస్తాయి. ఆర్మీ కవాతులో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్’ కింద…
రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశాలిచ్చినా పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించకపోవడమంటే ముమ్మాటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని స్పష్టం చేశారు. మహిళా గవర్నర్ ను అడుగడుగునా అవమానిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పదేపదే ఆహ్వానిస్తున్న కేసీఆర్ కు ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలకు గవర్నర్లను ఆహ్వానించొద్దని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని చెప్పే దమ్ముందా? అని సవాల్ విసిరారు. దేశంలో సగర్వంగా తలెత్తుకుని తిరిగేలా రూపొందించిన అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? తలదించుకుని బానిసల్లాగా బతికే కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. అంబేద్కర్, ప్రధాని నరేంద్రమోదీ స్పూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ కోసం…
భారత రాజ్యాంగమే మనకు అన్నివేళలా మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి బుధవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాత దార్శనికత మన గణతంత్ర దేశానికి నిరంతరం మార్గదర్శకంగా పనిచేస్తుందని ఆమె చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకల్పనలో పాలుపంచుకొన్న వారందరినీ ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకొంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి తుది రూపం ఇవ్వడంలో అంబేద్కర్ కీలక భూమిక పోషించారని ఆమె చెప్పారు. గతంలో పేద, నిరక్షరాస్య దేశంగా ఉన్న భారత్.. ఇప్పుడు ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసం నిండిన దేశంగా పరివర్తన చెందిందని ముర్ము గుర్తు చేశారు. భారత దేశంలో విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ, అవి మనల్ని ఏకం చేశాయే తప్ప ఏనాడూ విభజించలేదని, అందువల్లే మనం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా విజయవంతమయ్యాయని, ఇది భారతదేశ గొప్పతనమని ఆమె వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు…
రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్నిగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందని చెబుతూ శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని ఆమె కొనియాడారు. వైద్యం, ఐటీ రంగాల్లో…