ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు అద్దాలు పగిలిపోయాయి. సోమవారం సాయంత్రం బర్రింకల పాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వాహనం గ్రామంలో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారని డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పందించారు. పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ విచారణ జరిపారు. కారు అద్దాల పగిలిన ప్రదేశంలో అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు. కారు పై రాయి పడడంతో వెనకగా ఉన్న అద్దాలు బ్రేక్ అయ్యాయి. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉన్నాయి. సోమవారం రాత్రి పోలవరం…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లైబ్రరీలో వరదనీరు చేరడంతో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్ధులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్యమే కారణమన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు కేంద్రం కూడా దీనిపై స్పందించింది. ఇప్పటికే పోలీసులు విచారణ జరుపుతుండగా.. మరోవైపు కేంద్ర హోంశాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కోచింగ్ సెంటర్ ఘటన, మరణాలకు కారణం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనుంది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి కేంద్రం గడువు విధించింది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), ఢిల్లీ ప్రభుత్వం, స్పెషల్ సీపీ, ఢిల్లీ పోలీస్, అగ్నిమాపక సలహాదారు, జాయింట్ సెక్రటరీతో కూడిన కమిటీ 30 రోజులలోపు తన నివేదికను సమర్పించాలని ప్రభుత్వం…
భారత్ – చైనా మధ్య సంబంధాలు క్షీణించాయని చెబుతూనే చైనాతో భారత్ సరిహద్దు వివాదంలో మూడో పక్షం లేదా వేరే దేశం జోక్యం చేసుకునే అవకాశాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ తోసిపుచ్చారు. ఈ సమస్య 2 పొరుగు దేశాల మధ్య ఉంది. దీనిని భారత్, చైనాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, భారత్ వంటి పొరుగు దేశాల మధ్య సమస్య ఉన్న మాట వాస్తవమేనని చెప్పిన ఆయన.. దాన్ని పరిష్కరించడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనాలని చెప్పారు. టోక్యోలో విలేకరుల సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ఇతర దేశాల జోక్యాన్ని కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు టోక్యో వచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని, అది సరిగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. సహజంగానే ప్రపంచంలోని ఇతర…
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద జలాలు చేరుకోవడంతో సోమవారం ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. కృష్ణ్ణా బేసిన్‌కు జూలై మాసంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తింది. కృష్ణా నదికి వచ్చిన మొదటి దఫా వరదలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సోమవారం సాయంత్రం ఎపి సాగునీటి శాఖ సిఇ కబీర్‌భాష, ఎస్‌ఈ రామచంద్రమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు కుంకుమ, సారే సమర్పించి అనంతరం మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 6, 7, 8 నంబర్ గేట్లను ఎత్తడం ద్వారా దిగువ నాగార్జునసాగర్‌కు 76 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతోపాటు ఎపి పవర్‌హౌస్ ద్వారా మరో 27 వేల క్యూసెక్కులు, తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా 35 వేల క్యూసెక్కుల చొప్పున నీరు దిగువ నాగార్జునసాగర్ వైపు…
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేష్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లు తెలిపారు. ప్రమాదాలు, వైద్య పరిస్థితులు, దాడులు వంటి కారణాల వల్ల 2019 నుంచి 41 దేశాల్లో 633 మంది భారతీయ విద్యార్థులు చనిపోయినట్లు చెప్పారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కెనడాలో అత్యధికంగా 172 మంది భారతీయ విద్యార్థుల మరణించారు. ఆ తర్వాత 108 మరణాలతో అమెరికా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్‌లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒక భారతీయ విద్యార్థి మరణాలు నమోదయ్యాయి. మరోవైపు విదేశాల్లో జరిగిన…
గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు వస్తున్న వరద రోజురోజుకూ పెరుగుతోంది. కృష్ణాతో పాటు తుంగభద్ర నదుల్లో వరద పోటెత్తడంతో శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. శ్రీశైలంలోకి 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి దాదాపు 3.04 లక్షల క్యూసెక్కులు, తుంగభధ్ర నుండి 1.56 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872 అడుగులకు చేరుకుంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 14.145 ఎంయు ఉత్పత్తితో 25,768 కూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 17.939 ఎంయు ఉత్పత్తితో 35,597 క్యూసెక్కులు కలిపి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తితో 62 వేల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌లోకి వదులుతున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 15 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిమట్టం…
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. ఆదివారం శ్రీలంకతో జరిగిన తుదిపోరులో హర్మన్సేన ఓడిపోయింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే 2 ఛేదించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (61 పరుగులు), హర్షిత (69* పరుగులు) హాఫ్ సెంచరీలతో లంక విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 1 వికెట్ దక్కించుకుంది. 166 పరుగుల లక్ష్య ఛేదనలో లంక రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వినీశి (1) రనౌట్గా పెవిలియన్ చేరింది. అయితే ఈ అవకాశాన్ని టీమ్ఇండియ అందిపుచ్చుకోలేదు. వన్డౌన్లో వచ్చిన హర్షితతో, ఆటపట్టు జట్టును విజయం వైపు నడిపించింది. ఈ క్రమంలోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. వీరిద్దరూ రెండో వికెట్కు 87 పరుగుల భాగస్వామం నెలకొల్పారు. 94 పరుగుల వద్ద ఆటపట్టును దీప్తి శర్మ వెనక్కిపంపింది. ఆ తర్వాత క్రీజులోకి…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ‘జన్ సురాజ్ అభియాన్’ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా ‘జన్ సురాజ్’ అవతరించనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా ఎనిమిది రాష్ట్ర స్థాయి సమావేశాలను ‘జన్ సురాజ్’ చేపట్టనుంది. రాబోయే మరికొద్ది వారాల్లో ఈ సమావేశాల తేదీలు ఖరారవుతాయి. బీహార్ వ్యాప్తంగా 1.5 లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించింది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ఫైనలైజ్ చేయడం ‘జన్ సురాజ్’ సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉంది. నాయకత్వ నిర్మాణం, పార్టీ రాజ్యాంగం, పార్టీ ప్రాధాన్యతా క్రమాలపై సమావేశాల్లో చర్చిస్తారు. ఇందుకోసం పాట్నాలో ఆదివారంనాడు జిల్లా, బ్లాక్ స్థాయి ఆఫీస్ బేరర్లతో సమావేశం నిర్వహించారు. రాజకీయ వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్ ‘బీహార్‌లో మార్పు’ పేరుతో ‘జన్ సురాజ్’ క్యాంపయిన్‌ను కొద్దికాలం క్రితం ప్రారంభించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి…
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను బాకర్ చరిత్ర సృష్టించింది. విశ్వ వేదికపై తొలి పతకం అందించి యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ ఫైనల్లో బాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కొల్లగొట్టింది. దాంతో, షూటింగ్ విభాగంలో తొలి మెడల్ గెలుపొందిన మొదటి మహిళా షూటర్‌గా బాకర్ రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్ ప్రారంభమైన మూడో రోజు ఎట్టకేలకు భారత్ విశ్వ క్రీడల్లో పతకాల ఖాతా తెరిచింది. క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో 580-27x స్కోరుతో అదరగొట్టిన భాకర్ మూడో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపింది. అనుకున్నట్టుగానే కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షను నిజం చేసింది. ఫైనల్లోనూ చెక్కు చెదరని గురితో 221.7 పాయింట్లు సాధించింది. దాంతో, ఒలింపిక్స్‌లో తొలి మెడల్ గెలిచిన మహిళా షూటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణంతో మెరిసిన విసయం తెలిసిందే. 221.7 పాయింట్లతో మను భాకర్…
ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి శనివారం రాత్రి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఒకరు తెలంగాణవాసి అని తెలుస్తోంది. ఢిల్లీలో శనివారం విపరీతమైన వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. కాగా రాజేంద్ర నగర్‌లోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులను ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తానియా సోనీ, కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నివిన్ డాల్విన్‌గా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందంటూ ఆ కోచింగ్ సెంటర్ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్…