Author: Editor's Desk, Tattva News

ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల‌ను రిల‌య‌న్స్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ ను జియో సినిమాలో ఉచితంగా అందించాలని యోచనలో ఉన్నారు. టెలికాం దిగ్గజం జియో భారత్ లో ఐపీఎల్ 2023 సీజన్‌ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్లాన్ చేస్తోంది. గత నెల ఫిఫా ప్రపంచ కప్ ను ఉచితంగా ప్రసారం చేసి విజయం తర్వాత, రిలయన్స్ ఇప్పుడు ఐపీఎల్ కోసం ఇదే విధమైన వ్యూహాన్ని వర్తింపజేయాలని యోచిస్తోంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ హవా పెరగడంతో మొబైల్ ఫోన్లలోనూ మ్యాచ్ లను చూస్తున్నారు. ఇందుకోసం ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అదనపు రేట్లతో సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉంచుతాయి. అయితే, రిలయన్స్ జియో రాబోయే ఐపీఎల్ ను ఎలాంటి అదనపు డబ్బు చెల్లించుకుండా చూసేందుకు వీలు కల్పించనుంది. వచ్చే సీజన్ మొత్తం తమ సబ్ స్క్రైబర్స్…

Read More

ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవి గంగా విలాస్’ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. భారత్‌లో కొత్త తరం పర్యాటకానికి ఇది నాంది పలుకనుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. దీని స్ఫూర్తితో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని ప్రధాని తెలిపారు. “ప్రపంచ రివర్​ క్రూయిజ్​ చరిత్రలో ఇదొక మర్చిపోలేని రోజు! అతి పొడవైన క్రూయిజ్​లో.. అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం ప్రారంభమైంది. యూపీ, బిహార్​, ఝార్ఖండ్​, పశ్చిమ్​ బెంగాల్​, బంగ్లాదేశ్​లో ప్రయాణించి.. చివరికి అసోంలోని డిబ్రూగఢ్​కు చేరుకుంటుంది. ఈ ప్రయాణంతో టూరిజంతో పాటు ట్రేడింగ్​ అవకాశాలు కూడా పెరుగుతాయి” అని ప్రధాని తెలిపారు. ఇన్​లాండ్​ వాటర్​వేస్ అభివృద్ధిని భారత్ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో ఈ గంగా విలాస్​ చెబుతుందని చెప్పారు. గంగా విలాస్​లో ఉన్న ప్రయాణికులకు ఒక విషయం చెబుతున్నా అంటూ భారత్ అనేది మీ అంచనాలకు మించి…

Read More

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సి) జోషిమఠ్ ఉపగ్రహ చిత్రాలను, మొత్తం పట్టణం మునిపోయే అవకాశమున్న భూక్షీణత ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. చిత్రాలను కార్టోశాట్2ఎస్ ఉపగ్రహం నుంచి తీశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఎస్‌సి కుంగిపోతున్న ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను విడుదలచేసింది. చిత్రాలలో ఆర్మీ హెలిపాడ్, నరసింహ గుడి సహా యావత్ పట్టణంను సెన్సిటివ్ జోన్‌గా మార్క్ చేశారు. ఇస్రో ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నివేదిక ప్రకారం, 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భూక్షీణత నెమ్మదిగా ఉండింది, ఆ సమయంలో జోషిమఠ్ 8.9 సెమీ. మేరకు కుంగింది. కానీ 2022 డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్య భూక్షీణత తీవ్రత పెరిగింది. జోషిమఠ్ పట్టణం 12 రోజుల్లో దాదాపు 5.4 సెమీ. కుంగిపోయింది.భూమి కుంగిపోవడం వల్ల…

Read More

తమ గౌరవం తగ్గకుండా, లొంగుబాటు లేకుండా ఉండేట్లయితే పొత్తులకు ఓకే అంటామని, లేకుంటే ఒంటరిగానే బరిలోకి దిగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ గతంలో తనను తిట్టినప్పటికీ, ఒక పెద్ద రాక్షసుడ్ని ఎదిరించాలంటే మిగిలిన శత్రువులను కూడా కలుపుకొని వెళ్లాలని, అందుకని టిడిపితో సర్దుబాటు తప్పదని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు 6.9 శాతం ఓట్లు వచ్చాయని, అవన్నీ ఒక్కచొటే వచ్చి ఉంటే అసెంబ్లిdలో పోరాడడానికి కావాల్సిన సీట్లు వచ్చేవని ఆయన గుర్తు చేశారు. ఓట్లు చీలినందువల్ల వైసిపి 53 సీట్లలో టెక్నికల్‌గా గెలిచిందని, ఆ పరిస్థితి రాకుండా చూసేందుకే తాను ఓటు చీలినివ్వకూ డదనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. అయితే ఎన్ని సీట్లు అనే విషయం తాను ఇప్పుడే చెప్పనని పేర్కొన్నారు. అయితే, ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం…

Read More

ఈ నెల 15న సికింద్రాబాద్‌–విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి దీన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. వాస్తవానికి ఈ రైలు ప్రారంభంకు ఈ నెల19న ప్రధాని మోదీ జరపవలసిన సికింద్రాబాద్ పర్యటన వాయిదా నేపథ్యంలో నాలుగు రోజుల ముందుగానే తెలుగువారికి ముఖ్యమైన సంక్రాంత్రి పండుగ సమయంలో ఈ రైలును అందిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన వందేభారత్ విశాఖ – సికింద్రాబాద్ మధ్య ట్రెయిల్ రన్ పూర్తి చేసారు. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఇప్పటికే పలు రైళ్లు నడుపుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటం తో ఉదయం వేళ ఈ రైలును నడపాలని నిర్ణయించారు. మిగిలిన రైళ్ల కంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకొనే అవకాశం కలుగుతుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే నడవనుంది. రైలు…

Read More

మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌జెడి నేత శరద్ యాదవ్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి గురువారం (జనవరి 12) రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. ‘పాపా నహీ రహే: (నాన్న ఇక లేరు)’ అని ఆమె పోస్టు పెట్టారు. శరద్ యాదవ్ 1999, 2004 మధ్య అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో పలు శాఖలను నిర్వహించారు. అంతకు ముందు విపి సింగ్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. 2003లో ఆయన జెడియు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ పార్టీకి చెందిన వారే. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత నితీశ్ కుమార్ ఆయన రాజ్యసభ టికెట్ పొందడంలో సాయం చేశారు. 2009లో ఆయన మళ్లీ మాధేపురనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో జెడి(యు) ఓటమి…

Read More

గత ఏడాది ఓ టివి డిబేట్ సందర్భంగా ముస్లింల ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది బిజెపి నుండి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపూర్ శర్మకు ఇప్పుడు గన్ లైసెన్సు ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తన భద్రతకు ముప్పు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా తనతోపాటు ఓ తుపాకీని తీసుకెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె చేసిన దరఖాస్తుపై సానుకూలంగా స్పందించారు. జ్ఞానవాపి కేసు విచారణ సమయంలో నూపుర్ శర్మ గత ఏడాది ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేగింది. దీంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను గాయపరచేందుకు కాదని, శివలింగాన్ని ఎగతాళి చేస్తూ ఓ ప్యానెలిస్ట్ మాట్లాడటంతో తాను తిప్పికొట్టడం కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. అయినప్పటికీ ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన…

Read More

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 90 సీట్లను గెలుపొందడం ద్వారా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్న బిజెపి ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం ప్రజానీకంకు బిజెపి సందేశం తీసుకు వెళ్లడం కోసం రాబోవు 60 రోజుల్లో 9వేల కార్నర్ సమావేశాలు జరపాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు నిర్ధేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు.. మోడీ విజయాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతి ఇంటికి కమలం గుర్తు వెళ్లాలన్నారు. రేపటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని జాయింట్ కన్వీనర్లు, ప్రభారీలు, విస్తారక్‭ల సమావేశంలో సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్‭లో ఇదే వ్యూహాన్ని అమలు చేశామని సునీల్ బన్సల్ తెలిపారు. అక్కడ రెండు సార్లు అధికారంలో వచ్చామని.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని చెప్పారు. తెలంగాణలో…

Read More

ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కేరళలోని మున్నార్‌లో ఉష్ణోగ్రత ఈ శీతాకాలంలో తొలిసారిగా బుధవారం సున్నా కంటే తక్కువకు పడిపోయింది. సమీపంలోని చెందువార, వట్టవాడ తదితర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చలి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా డిసెంబర్‌లో మైనస్‌ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అయితే ఈసారి వర్షం కారణంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మున్నార్‌కు చెందిన సురేష్‌ తెలిపారు.”ఈ శీతాకాలంలో మున్నార్‌లో ఇంత తీవ్రమైన చలిని అనుభవించడం ఇదే మొదటిసారి” అన్నారాయన. మున్నార్‌లోని కన్నిమల, చెందువార, చిటువార, ఎల్లపెట్టి, లక్ష్మి, సేవాన్‌మల, లాకట్‌తో సహా పలు ప్రాంతాల్లో నిన్న మైనస్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా మంది పర్యాటకులు ఉదయం మంచుతో కప్పబడిన పచ్చిక బయళ్లను సందర్శించారు. కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామమైన వట్టవాడలోనూ చలి తీవ్రత నమోదైంది. బుధవారం ఉదయం వట్టవాడలో కనిష్ట ఉష్ణోగ్రత సున్నా…

Read More

శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప స్వామివారి ప్ర‌సాద అమ్మ‌కాల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి వ‌స్తున్న భ‌క్తులు పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని తీసుకోకుండానే తిరుగుపయనం అవుతున్నారు.ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ నివేదికలో వెల్లడైంది. ఈ యాలకుల్లో 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదికలో స్పష్టం చేసింది. ఈ విషయం కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దాంతో ట్రావెన్‌కోర్ ట్రస్ట్ ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే, అయితే రసాయన పదార్థాలతో కూడిన యాలకులు లేకుండా తయారుచేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డుకు స్పష్టం చేసింది. కాగా, కోర్టు ఆదేశాలతో బుధ‌వారం నుంచి విక్రయాలు ఆగిపోయాయి.…

Read More