అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల యాత్రలో వాటర్ విజన్ @ 2047 అనేది ఒక ముఖ్యమైనటువంటి పార్శ్వంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వీడియో సందేశం మాధ్యం ద్వారా జల సంరక్షణ అంశంపై రాష్ట్రాల మంత్రుల ప్రథమ అఖిల భారతీయ వార్షిక సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరంతర అభివృద్ధి, మానవ వికాసం కోసం జల వనరులను వినియోగం లోకి తెచ్చుకొనేందుకు అనుసరించవలసిన మార్గాలను గురించి ముఖ్య విధాన రూపకర్తలకు ఒక వేదికను అందించడం ఈ సమావేశపు ఉద్దేశ్యం అని చెప్పారు. ప్రధాన మంత్రి ‘సమగ్ర ప్రభుత్వం’’, ‘సంపూర్ణ దేశం’ లకు సంబంధించి తన దృష్టికోణాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రభుత్వాలు అన్నీ కూడాను ఒక వ్యవస్థ లాగా పని చేయాలని పిలుపిచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలలోని విభిన్న మంత్రిత్వ శాఖలు, ఉదాహరణకు జల మంత్రిత్వ శాఖ, సేద్యపు నీటిపారుదల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, విపత్తు నిర్వహణ…
Author: Editor's Desk, Tattva News
పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన కేంద్రం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ కోసం రూ. 19,744 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. కర్బన ఉద్గారాలను తగ్గించి, గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పొందడం ఈ మిషన్ ప్రత్యేకత. దేశంలో శిలాజ ఇంధన (పెట్రోల్, డీజిల్) వినియోగం తగ్గించి, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని.. ఇందులో భాగంగా క్లీన్ ఎనర్జీ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలపడమే లక్ష్యంగా రూపొందించిన హైడ్రోజన్ మిషన్ కోసం కేంద్రం రూ.19,744 కోట్లు కేటాయించిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందులో రూ. 17,490 కోట్లు సైట్ ప్రోగ్రామ్ కోసమే…
ప్రపంచంలోనే అత్యంత అభద్రత కలిగిన దేశం ఆఫ్ఘనిస్తాన్ అని ఖామా ప్రెస్ మంగళవారం వెల్లడించింది. ఆఫ్గనిస్తాన్‌లోని ప్రధానమీడియాగా ఉన్న ఖామా ప్రెస్.. ఆ దేశ అభద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ పీస్ అండ్ ఎకనామిక్స్ (ఐఇపి) నివేదికను ఖామా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ పీస్ ఇండెక్స్ (జిపిఐ) ప్రతి ఏడాది 163 దేశాల్లో శాంతి భద్రతల సూచికను వెల్లడిస్తుంది. ఈ సంస్థ వార్షిక నివేదిక ప్రకారం తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి కూడా ఆఫ్ఘనిస్తానే 163వ స్థానంలో నిలిచింది. కాగా, ఖామా వెల్లడించిన నివేదికలో ప్రపంచంలో శాంతియుత వాతావరణంలో సురక్షితంగా, అభద్రతకు లోనవ్వకుండా నివశించే దేశంగా మొదటిస్థానంలో ఐస్‌లాండ్ నిలిచింది. ఆ తర్వాత అంతర్జాతీయ శాంతి సూచికల ప్రకారం.. న్యూజిలాండ్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్‌లు నిలిచాయి. మొదటి పదిస్థానాల్లో సింగపూర్ రెండవస్థానం,…
ప్రభుత్వ అధికారులు ఈ మధ్య తాము చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అమాయకపు ప్రజలను వేధింపులు గురిచేస్తున్నారు. ఆ మధ్య ఇల్లందులో మున్సీపాలిటి ఆఫీస్ ముందు ఆవు మూత్రం పోసిందని సదరు ఆవు యజమానికి జరిమానా విధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబదించిన వీడియో పలు రోజుల పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. ఈ ఘటన మరువక ముందే ములుగు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన వాహనానికి గేదెలు అడ్డొచ్చాయని పాడి రైతుకు జరిమానా విధించి కలెక్టర్ కృష్ణ ఆదిత్య వివాదంలో చిక్కుకున్నారు. గంపోని గూడెం గ్రామానికి చెందిన బోయిని యాకయ్య అనే రైతు తన గేదెలను మేపేందుకు గానూ సోమవారం పొలం వద్దకు తోలుకెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి గేదెలు అడ్డుగా వచ్చాయి. వాహనం డ్రైవర్…
గోదావరి నదిలో నీటి లభ్యతపైన సర్వే చే యాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను కేంద్ర జల సంఘం (సిడబ్లుసి)లోని హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ తెలుగు రాష్ట్రాల డిమాండ్లను తోసిపుచ్చారు. ఈ మేరకు మంగళవారం జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జి.ఆర్.ఎం.బి) సమావేశంలో న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నిత్యానందరాయ్ నీటి లభ్యతపై సర్వేకు నిర్దంధ్వంగా తిరస్కరించారు. గోదావరి నదిలో ఎంత నీరుందనే అంశాలపై గతంలోనే స ర్వేలు చేశామని, ఆ మేరకు భాగస్వామ్య రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయడం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ రీ సర్వే చేయడమంటే భాగస్వామ్య రాష్ట్రాలతో తమకు (కేంద్రానికి) ఇబ్బందులు వస్తాయని, అందుచేతనే తమ పరిధిలో నిర్ణయం తీ సుకొని సర్వే చేయడం కుదరదని సి.డబ్లు.సి. హై డ్రాలజి డైరెక్టర్ కరాఖండిగా చెప్పినట్లుగా తెలిసిం ది. అంతేగాక ఒకవేళ గోదావరి నదిలోని నీటి ల భ్యతపై తప్పకుండా రీ…
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ – రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, ఎగ్మూర్, చెంగల్‌పట్టు, విల్లుపురం, తిరుప్పదిరిపులియూర్, చిదంబరం, శీర్గాళి, మైలాడుదురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, ఆదిరాంపట్టినం, పట్టుకోట్టయి, ఆరంతాంగి, కారైక్కుడి, శివగంగ, మానామధురై స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి. ఆయా రోజుల్లో రాత్రి 9.10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.30 గంటలకు రామనాథపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (07696) ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 9.50 గంటలకు రామనాథపురంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నది.
రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని దేశాలు తమపై కరోనా ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదని చైనా స్పష్టం చేసింది. శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని కరోనా ఆంక్షలు విధిస్తున్నారని మండిపడింది. ఈ చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా నిబంధనలను ప్రయోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ తేల్చి చెప్పారు. ఈ చర్యల్లో కొన్ని అసమానమైనవి, ఆమోదయోగ్యం కానివి ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడంపై చైనా తీవ్రంగా మండిపడింది. చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి వచ్చేటోళ్లపై మొత్తం 12 దేశాలు ఆంక్షలు విధించాయి. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే దేశంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నాయి. ఇలా ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియా, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి. అయితే, ఈ ఆంక్షలపై…
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతా పార్టీ మిషన్ 90 (90 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం)లో భాగంగా వివిధ కార్యక్రమాలను త్వరలో తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనున్నది. ఏప్రిల్ నెలలోగా 10 వేల గ్రామస్థాయి సభలను నిర్వహించడం కూడా ఇందులో భాగమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల నగరంలో జరిగిన పార్లమెంటరీ విస్తారక్ సమావేశంలో మిషన్ 90 పేరిట ఒక కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలలో 90 స్థానాలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చేజిక్కించుకోవాలని తీర్మానించారు. కెసిఆర్‌కో హఠావో తెలంగాణకో బచావో నినాదంతో జనవరి 15 సంక్రాంతి తర్వాత 10 వేల గ్రామస్థాయి సభలను నిర్వహించాలని తీర్మానించినట్లు లక్ష్మణ్…
సినిమా హాళ్లలోకి బయటినుంచి తినుబండారాలను తీసుకు రావడాన్ని నిషేధించాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలోకి బయటినుంచి తినుబండారాలు, కూల్‌డ్రింక్స్‌ను తీసుకు రాకుండా నిషేధించే అధికారం సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌లకు ఉందని ఈ సందర్భంగా బెంచ్ స్పష్టం చేసింది. థియేటర్లకు వచ్చే వారు తమ వెంట తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ తీసుకు రావచ్చంటూ జమ్మూ, కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. సినిమా హాలు ప్రైవేటు ఆస్తి అని, సినిమా హాళ్లలోపల తినుబండారాలు, కూల్‌డ్రింక్స్ విక్రయాలకు సంబంధించి నిబంధనలను నిర్ణయించే హక్కు థియేటర్ యజమానులకే ఉంటుందని, వారు నిర్ణయించిన ధరలకే వాటిని ప్రేక్షకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. అయితే థియేటర్లలో ఉచితంగా మంచినీరు సరఫరాను మాత్రం కొనసాగించాలని…
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఏపీ శాఖకు అధ్యక్షుడిని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌కు తెలంగాణలో అధ్యక్షుడు లేడు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు అధ్యక్షుడిని ప్రకటించారంటూ ఎద్దేవా చేశారు. అసలు బిఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి.. ఆంధ్రావాళ్లను తిట్టారని సంజయ్ గుర్తుచేశారు. ఆంధ్రా బిర్యానీని పెండ బిర్యానీ అని తిట్టి.. ఇప్పుడు ఏపీ నేతలకు పిలిపించుకుని చేర్చుకొంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం మీద కేసీఆర్ స్టాండ్ ఎంటో తెలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణలో ఆర్టీసీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. అటు విద్యుత్ ఛార్జీలను కూడా పెంచారంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఏం ఉద్దరించారని ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. సీఎం కేసీఆర్ ఇంకా అప్‌డేట్ కాలేదని..…