రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ విమర్శకుడు పావెల్ అంతోవ్, అతడి మిత్రుడు వ్లాదిమీర్ బైదనోవ్ పక్షం రోజుల క్రితం ఒడిశాలోని రాయగడ హోటల్‌లో అనుమానస్పదంగా మృతి చెందిన ఉదంతం మరువక ముందే మరో రష్యన్ జగత్‌సింగ్‌పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్ట్‌లో ఓ కార్గో నౌకలో చనిపోయి దొరికాడు. పోలీసులు అతడిని సెర్గీ మిల్యాకోవ్ (51)గా గుర్తించారు. అతడు గుండెపోటుతో చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ‘కార్గో నౌకను నడిపే సిబ్బందిలో అతడొకడని మేము గుర్తించాము. పోస్ట్‌మార్టం అయ్యాక అతడెలా మరణించాడని ధ్రువీకరించనున్నాం. మా ప్రాథమిక దర్యాప్తులో అతడు ఉన్నపళంగా నౌకలో కుప్పకూలిపోయాడని తెలిసింది. అతడు బహుశా గుండెపోటుతో మరణించి ఉంటాడు’ అని జగత్‌సింగ్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు. మిల్యాకోవ్ పోస్ట్‌మార్టంను పోలీసులు వీడియోగ్రాఫ్ తీస్తారు. అతడి విసెరల్ శాంపిల్స్‌ను, అతడి భౌతిక కాయాన్ని కూడా భద్రపరుస్తారని సింగ్ తెలిపారు. ఇదివరకు పావెల్ విసెరాను లేక అతడి అటాప్సీ వీడియోగ్రాఫ్‌ను…
Author: Editor's Desk, Tattva News
ప్రముఖ పాటల రచయిత, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జర్నలిస్ట్ గా కెరీర్ గా ప్రారంభించిన పెద్దాడ మూర్తి.. టాలీవుడ్ లో పలు సినిమాలకు పాటలు కూడా రాశారు. వేటూరి స్ఫూర్తితో రైటర్ కావాలని మూర్తి హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత ఓ తెలుగు దినపత్రికలో కొన్నాళ్ల పాటు సినీ జర్నలిస్ట్ గా పని చేశారు. జర్నలిస్టుగా పనిచేస్తూనే మూర్తి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘కూతురు’ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన మూర్తి.. రవితేజ నటించిన ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, చిరంజీవి నటించిన స్టాలిన్, చందమామ తదితర సినిమాలకు పాటలు అందించారు. `చందమామ` మూవీలోని లోని పాటలకు మంచి గుర్తింపు దక్కింది. `అమ్మానాన్న ఓ తమిళమ్మాయి`లో `నీవే నీవే..`, `ఇడియట్` లో `చెలియా చెలియా.. ` తదితర పాటలు మూర్తికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు `ఇష్ట సఖి`,…
ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమిష్టి బాధ్యత సూత్రాన్ని వర్తింపచేసినప్పటికీ ఓ మంత్రి ప్రకటనను ప్రభుత్వానికి వర్తింప చేయలేమని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. బహిరంగ వేడుకలు, సమావేశాల్లో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల భావప్రకనటనా స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు జస్టిస్ ఎస్.ఎ. నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) కింద పేర్కొన్నవి తప్ప ఏ పౌరుడి వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ఎలాంటి అదనపు పరిమితులు విధించలేమని తెలిపింది. రాష్ట్ర వ్యవహారాలు లేదా ప్రభుత్వాన్ని రక్షించడం కోసం ఒక మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని అన్నారు. ఆర్టికల్ 19(1)(ఎ) కింద ఉన్న ప్రాథమిక హక్కును రాష్ట్రం కాకుండా ఇతర సాధనాలకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించవచ్చని జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ ఎ.ఎస్…
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసుల ఎదురు హాజరు కావాల్సిందేనని సునీల్ కనుగోలుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని మంగళవారం విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ నెల 8వ తేదీన పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సిఆర్‌పిసి 41(ఎ) కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆర్.సామ్రాట్ ఫిర్యాదుతో గతేడాది నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ…
హిందువుల ఆరాధ్య దైవం అయ్యప్పస్వామిపై బైరి నరేశ్ ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నాడని కొడంగల్ పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. రెండు రోజుల క్రితం బైరి నరేశ్ తోపాటు హనుమంతును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను పొందుపర్చారు. ఈ కేసులో ఏ2గా ఉన్న హనుమంతు కొడంగల్‌లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని తెలిపారు. ఇందు కోసం బైరి నరేశ్‌ను ఆహ్వానించగా.. అతను హాజరయ్యాడని పోలీసులు చెప్పారు. ఆ క్రమంలోనే అయ్యప్పస్వామిపై.. బైరి నరేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉమాపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. నరేశ్‌పై గతంలో వికారాబాద్ జిల్లా నవాబుపేటలో ఒక కేసు, హనుమకొండ జమ్మికుంటలో రెండు కేసులు…
ఎప్పుడూ ట్వి్ట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. టిట్టర్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ.. అటు రాజకీయ విషయాలతో పాటు ఎవరికై సహాయం చేయాలన్నా వెంటనే స్పందిస్తుంటారు కేటీఆర్. అలాంటి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు హ్యాకర్లు. అయితే.. హ్యక్ చేయటమే కాకుండా.. ట్విట్టర్ హ్యాండిల్ పేరు, ప్రొఫైల్ ఫిక్చర్‌ను కూడా మార్చారు. కేటీఆర్‌గా ఉంటే పేరును “కూల్ క్యాట్”గా మార్చారు హ్యాకర్లు. అయితే.. ఈ విషయాన్ని వెంటనే గ్రహించిన ఐటీ టీమ్.. అప్రమత్తమై కేవలం గంటలోపే అకౌంట్‌ని రికవరీ చేశారు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన గతేడాది డిసెంబర్ 28 బుధవారం రోజు జరగగా.. ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే.. హ్యాకర్లు పేరు, ప్రొఫైల్ పిక్ మార్చారు కానీ.. ఎవ్వరికీ ఎలాంటి మెస్సేజ్‌లు పెట్టలేదు. అందుకే ఈ విషయం…
మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన ఆమరణ దీక్ష ను విరమించారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య (85 ) సోమవారం ఉదయం నుండి అమరణ దీక్ష తలపెట్టారు. కాపులకు 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని..లేని పక్షంలో అమరణ దీక్ష చేస్తానని హరిరామ జోగయ్య హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని జోగయ్య అల్టిమేట్ జారీ చేసారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరి రామ జోగయ్య ఆదివారం రాత్రి నుంచి పాలకొల్లులో దీక్ష మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఆయన దీక్ష ను భగ్నం చేసి.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ జోగయ్య ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. దీక్ష విరమించాలని కోరారు. పవన్ కోరిక మేరకు హరిరామ జోగయ్య తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్…
కేంద్ర ప్రభుత్వం 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న (డిమానిటైజేషన్) నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. న్యాయమూర్తి ఎస్.ఎ. నజీర్ నేతృత్వంలో ఐదుగురు జడ్జీల ధర్మాసనం పెద్ద నోట్ల రద్దు విషయంలో తప్పేమి జరగలేదని, కేంద్ర ప్రభుత్వం, భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ)తో సంప్రదింపులు జరిపే ఆచరణకు దిగిందని పేర్కొన్నారు. ఆర్‌బిఐ, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగినందున నాటి ఆ ప్రకటనను కొట్టివేయలేమంది. ‘మూడు ప్రయోజనాలు సరైన ప్రయోజనాలే… లక్షాలు, లక్షాన్ని సాధించే విధానం మధ్య సహేతుకమైన కారణం ఉందని మేము కనుగొన్నాము. దామాషా సిద్ధాంతం ఆధారంగా ఆ చర్యను కొట్టివేయలేము’ అని న్యాయమూర్తి గవాయ్ ప్రకటించారు. పైగా 52 రోజుల గడువును కూడా సరైనదేనని ఆయన తెలిపారు. అనుకున్న లక్షాన్ని సాధించారా, లేదా అన్నది అప్రస్తుతం అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం కేంద్రం అధికారం అంశంలో…
మధ్యాహ్నం 3 గంటల తర్వాత రోడ్లపై సవారీ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వాహనదారులను బెంబేలెత్తిస్తూనే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆ సమయం అత్యంత ప్రమాదకరమని వాహనదారులను ఆ గణాంకాలు అప్రమత్తం చేశాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ సురక్షితమని, ఆ సమయంలో 10 శాతం లోపు ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు వెల్లడించాయి. 2021లో నమోదైన 4.12 లక్షలకు పైబడిన ప్రమాదాల్లో 1.58 లక్షల ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగాయని భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2021 పేరిట ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రచురించిన వార్షిక నివేదిక పేర్కొంది. ఇక సాయంత్రం 6…
గుంటూరు జిల్లాలో మరో దురదృష్ట సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు వికాస్‌నగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. ఈసభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన తర్వాత చంద్రన్న కానుకలు పంపిణి కార్యక్రమం చేపట్టారు పార్టీ శ్రేణులు. అదే సమయంలో మహిళలు కానుకలు తీసుకునేందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈసంఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వాళ్లను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ తొక్కిసలాటలో మొత్తం ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రన్న కానుక కార్యక్రమాన్ని అస్తవ్యస్తంగా నిర్వహించడం వల్లే ఈ అపశృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రవాసాంధ్రుడు ఈ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ నాయకులు,…