తిరుపతి జిల్లాచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో 37వ నిందితుడైన వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని బెంగళూరులో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కి వెళ్లేందుకు విమానం ఎక్కేందుకు వచ్చిన సందర్భంగా బెంగుళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరుపతి పోలీసులు అప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీచేసి ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. పులివర్తి నానిపై వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైనగణపతిరెడ్డి, భానుకుమార్‌రెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ముందస్తు ప్రణాళికతో రాడ్లు, సుత్తి, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. పులిపర్తి నానిపై హత్యాయత్నం ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి…
Author: Editor's Desk, Tattva News
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు శనివారం తెలిపాయి. హరిబౌ కిషన్ రావు బాగ్డే రాజస్థాన్‌గా గవర్నర్‌గా, జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా, ఓమ్ ప్రకాశ్ మాథూర్ సిక్కిం గవర్నర్‌గా, సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్‌గా, రామెన్ దేకా ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా, సీహెచ్ విజయ్ శంకర్ మేఘాలయా గవర్నగా నియమితులైనట్లు సమాచారం. తెలంగాణ ఇన్ ఛార్జ్ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా, అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్‌గా, చంఢీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు.…
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దాదాపు 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనలేదని నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మొత్తం 26 మంది సమావేశానికి హాజరయ్యారని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. సమావేశానికి హాజరుకాని రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, బీహార్, ఢఙల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి(యుటి) ఉన్నాయని ఆయన తెలిపారు. సమావేశానికి హాజరుకాకపోవడం వల్ల వారికే నష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం గురించి విలేకరులు ప్రశ్నించగా రాష్ట్రాల అక్షర క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు భోజన విరామం అనంతరం మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ మమతా బెనర్జీ అభ్యర్థనను మన్నించి ఆమెకు భోజన విరామానికి ముందే మాట్లాడే అవకాశం కల్పించామని సిఇఓ…
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 2015 నుంచి ఢిల్లీలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అధికారంలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్‌కు అధికారం అందని ద్రాక్షగా ఉంటోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 8 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజాతీర్పు ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఐసీపీఎల్‌తో కలిసి ‘జీన్యూస్’ ఒపీనియన్ పోల్ నిర్వహించింది ఒపీనియన్ పోల్ ప్రకారం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే ప్రశ్నకు 62 శాతం మంది ప్రభుత్వాన్ని ‘ఆప్’ ఏర్పాటు చేస్తుందని చెప్పగా, 38 శాతం మంది ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందన్నారు. సీట్ల విషయానికి వస్తే ‘ఆప్’ 50 నుంచి 60 సీట్లు…
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ ఆఫ్ చేశారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టించేవని కేంద్రం తెలిపింది. మమతా బెనర్జీ మాట్లాడేందుకు తగిన మాట్లాడే అవకాశం ఇచ్చారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో తెలిపింది. ‘అక్షర క్రమంలో వెళ్తే మమతా బెనర్జీకి మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రమే మాట్లాడే అవకాశం దక్కేది. అయితే సీఎం నుంచి అధికారిక అభ్యర్థన మేరకు ఆమెకు ఏడో స్పీకర్గా మాట్లాడే అవకాశం ఇచ్చారు’ అని పేర్కొంది. అలాగే నీతి ఆయోగ్ మీటింగ్లో మైక్ ఆఫ్ చేశారని మమత చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడటానికి తగిన సమయం కేటాయించామని వెల్లడించారు. “నీతి ఆయోగ్ సమావేశానికి బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. సమావేశంలో ఉన్నవారంతా ఆమె మాటలను విన్నాం. సమావేశానికి హాజరైన…
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన 9వ పాలక మండలి భేటీలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోనే వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో బెంగాల్‌కు కేంద్ర నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా.. తన మైక్‌ను మ్యూట్ చేసినట్లు దీదీ ఆరోపించారు. ఐదు నిమిషాలకు మించి మాట్లాడేందుకు అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే భేటీ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ‘నాకు ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అనుమతించారు. పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని సమావేశంలో ప్రస్తావించాను. అంతే నామైక్‌ను మ్యూట్ చేసేశారు. నాకంటే ముందు…
భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్‌బాలర్ జిదానే ఒలింపిక్ టార్చ్ పట్టుకుని పరిగెత్తగా..అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది. ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఫ్యాషన్‌కు పెట్టింది పేరు అయిన పారిస్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అంతకుముందు జరిగిన షోలో పలువురు క్రీడా ప్రముఖులు తమదైన శైలిలో దుస్తులు ధరించి ఈఫిల్ టవర్ ముందు ఫొటోలు ఫోజులు ఇచ్చారు. ఈ పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్…
పశ్చిమబెంగాల్, కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు పెండింగ్‌లో ఉంచడంపై ఆయా రాష్ర్టాల్లోని టీఎంసీ, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం పరిగణనలోకి తీసుకొన్నది. మూడు వారాల్లోగా పిటిషన్లపై స్పందన తెలియజేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పశ్చిమబెంగాల్, కేరళ గవర్నర్ల కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. పిటిషన్‌లో కేంద్ర హోంశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి ముర్ముకు కూడా సిఫారసు చేశారని, అవి కూడా ఇంకా ఆమోదం పొందలేదని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఏడు బిల్లుల్లో ఒక్కదానికి కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలతో సంబంధం లేదని తెలిపింది. ఈ బిల్లులను గవర్నర్ రెండేండ్లుగా పెండింగ్‌లో ఉంచారని,…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎట్టకేలకు నీట్ యూజీ 2024 సవరించిన ఫలితాలను జూలై 26, శుక్రవారం ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో విడుదల చేసి, వివాదాస్పదం అయిన ఫలితాల్లో టాప్ ర్యాంక్ ను మొత్తం 61 మంది పంచుకోగా, ఈ రివైజ్డ్, ఫైనల్ ఫలితాల్లో కేవలం 17 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది. 2024 జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో మొత్తం 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించడం అనుమానాలకు తావిచ్చింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా కావడంతో గ్రేస్ మార్కులు పొందిన ఆరుగురిని టాపర్స్ లిస్ట్ నుంచి ఎన్టీఏ తొలగించిన తరువాత, ఆ సంఖ్యను…
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రస్తావిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసివస్తే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. నిర్మలా సీతారామన్ శుక్రవారం ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బిహార్‌లను మాత్రమే బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని, ఏ ఒక్క రాష్ట్రానికీ నిధులను నిరాకరించలేదని సీతారామన్ తేల్చి చెప్పారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో…