Author: Editor's Desk, Tattva News

చైనాలో క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. రాబోయే మూడు నెల‌ల్లో 60 శాతం జ‌నాభాకి వైర‌స్ సోక‌నున్న‌ట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.  ప్రజలు ఆందోళనలు చేయడంతో చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తేయడంతో  వైరస్ కు గేట్లు తెరిచినట్టయిందని అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  చైనాలో దాదాపుగా అన్ని ఆసుపత్రులలో రద్దీ నెలకొందని చెబుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులలో బెడ్లు నిండిపోవడంతో పాటు బెడ్ల మధ్య కూడా పేషెంట్లను పడుకోబెట్టి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  వైరస్ మరణాలను చైనా ప్రభుత్వం చాలా తక్కువ చేసి చూపుతోందని ఎరిక్ ఫెయిగిల్ డింగ్ అనే టాప్ ఎపిడమాలజిస్ట్ ఆరోపిస్తున్నారు. ఒక్క బీజింగ్ విషయమే తీసుకుంటే ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం ఈ సిటీలో కరోనాతో చనిపోతున్న వాళ్ల సంఖ్య ఇరవై లోపే.. అదే సమయంలో సిటీలోని ఓ క్రిమటోరియంలో పరిస్థితి భిన్నంగా ఉందంటున్నారు.…

Read More

భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన 1971నాటి యుద్ధంలో దాయాది పాక్‌పై వీరోచితంగా పోరాడిన బిఎస్‌ఎఫ్ హీరో భైరోన్‌సింగ్ షెకావత్ రాథోడ్ సోమవారం కన్నుమూశారు. రాజస్థాన్‌లోని పోస్టులో పాక్ బలగాలపై షెకావత్ పోరాడి బిఎస్‌ఎఫ్ హీరోగా గుర్తింపు పొందారు. 81ఏళ్ల రాథోడ్ సోమవారం జోథ్‌పూర్‌లో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. భైరోన్‌సింగ్ జోథ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సోమవారం తుదిశ్వాస విడిచారని బిఎస్‌ఎఫ్ డిజి ట్విట్టర్ వేదికగా తెలిపారు. విధినిర్వహణలో నాయక్ అసమాన సాహసం, ధైర్యం, త్యాగానికి సెల్యూట్ చేస్తున్నట్లు బిఎస్‌ఎఫ్ ట్వీట్ చేసింది. రాథోడ్ కుమారుడు మీడియాతో మాట్లాడుతూ ఇండో పాక్ యుద్ధం 51వ వార్షికోత్సవం రెండు రోజుల ముందు ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 14న తమ తండ్రి జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో చేరారని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనపడటంతో వైద్యులు ఐసియులో ఉంచి చికిత్స అందించారని సింగ్ వివరించారు. జోధ్‌పూర్‌కు వంద కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో రాథోడ్ కుటుంబం నివసిస్తుంది. ఈ సందర్భంగా బిఎస్‌ఎఫ్…

Read More

సామాన్య ప్రజలకు అమితమైన పౌష్టికాహారంగా భావించే కోడిగుట్ట ధరలు భగ్గుమంటున్నాయి. దానితో గుడ్డు తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్నమొన్నటి వరకు నాలుగైదు రూపాయలున్న గుడ్డు ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. బహిరంగ మార్కెట్లో ఏకంగా ఏడు రూపాయలకు పెరగడంతో సామాన్యులు అటువైపు చూడాలంటేనే భయపడుతున్నారు  ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెపుతుంటారు. ఇక కరోనా సమయంలో కోడి గుడ్లు వినియోగం మరింత పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారంతా కోడిగుడ్డు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేయడం తో ప్రతి ఒక్కరు కూడా రోజు రెండేసి , మూడేసి గుడ్లు తిన్నారు.  ఆ తర్వాత కూడా కొంతమంది అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కోడి గుడ్డు కొనాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్డు ధర భారీగా పెరిగింది. ఏపీలో 100 గుడ్ల ధర గరిష్ఠంగా రూ. 547 పలుకుతోంది.  ఫామ్‌‌గేట్‌లో గుడ్డు రేటు రూ.…

Read More

కరోనా మహమ్మారి అనంతరం, దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత నాగపుర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైనప్పుడు ఓ మహిళా ఎమ్యెల్యే మూడు నెలలు కూడా నిండని పసిబిడ్డతో హాజరు కావడం అందరి దృష్టి ఆకట్టుకొంది. నాసిక్ జిల్లాలోని దేవ్‌లాలీ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సరోజ అహిరే తన రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఈ ఏఢాది సెప్టెంబర్ 30న బిడ్డకు జన్మనివ్వగా, బిడ్డతో కలిసి అసెంబ్లీలోకి వచ్చారు. ఎమ్మెల్యేతో పాటు తన భర్త, అత్త కూడా చంటి బిడ్డను చూసుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యే సరోజ అహిరే చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన చేతుల్లో నిద్రిస్తున్న శిశువును పట్టుకుని కనిపించింది. సభకు హాజరయ్యే ముందు ఎమ్మెల్యే సరోజ అహిరే విలేకర్లతో మాట్లాడుతూ…”కరోనా కారణంగా నాగ్‌పూర్‌లో గత రెండున్నర సంవత్సరాలుగా ఎటువంటి…

Read More

పాకిస్థాన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ని తాలిబన్లు నిర్బంధించారు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కౌంటర్‌ టెర్రరిజమ్‌ డిపార్ట్‌మెంట్‌ (సిటిడి)పై దాడి చేశారు. ఆ కేంద్రంలో ఉన్న 9 మంది భద్రతా సిబ్బందిని నిర్బంధించారు. గతంలో అరెస్ట్‌ చేసిన కొందరు తాలిబన్‌ ఉగ్రవాదుల్లో ఒకరిని ఆదివారం సిటిడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అతడు ఒక అధికారి నుండి ఎకె-47ని లాక్కుని  అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్‌ అధికారులు మృతి  చెందారు.  ఇతర ఉగ్రవాదుల్ని కూడా విడిపించి, ఆ కేంద్రాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం ఆ తాలిబన్‌ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు. సిటిడి  తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని సైతం తాము బంధించామని ఆ వీడియోలో పేర్కొన్నారు.  వాళ్లను విడిచిపెట్టాలంటే, తాము  ఆఫ్ఘనిస్తాన్‌ చేరేందుకు  ఒక హెలికాప్టర్‌ సిద్ధం చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పాకిస్తాన్‌ సైన్యం…

Read More

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడంకు ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంబరాలు చేసుకొంటున్న తరుణంలో కమీషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్‌కు కేంద్రం ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. బంగారు కూలి పేరుతో టీఆర్ఎస్ నిధులు సమకూర్చుకోవడానికి సంబంధించి ఈసీకి రేవంత్ గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖకు అప్పట్లో ఈసీ లేఖ రాసింది. టీఆర్ఎస్ నిధుల కూర్పు అంశంపై విచారణ పూర్తికాకముందే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేందుకు ఈసీ అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐటీ విచారణ పూర్తి కాకముందే ఎలా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకునేందుకకు అనుమతి ఇస్తారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నెలలో బీఆర్‌ఎస్‌కు ఆమోదముద్ర వేస్తూ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌కు ఈసీ లేఖ పంపింది. ఈ లేఖపై…

Read More

మిసెస్‌ వరల్డ్‌  అందాల పోటీల్లో కశ్మీర్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ విజేతగా నిలిచారు.  దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్‌కు దక్కింది.  మిసెస్ వరల్డ్ కిరీటాన్ని సర్గమ్‌కు ‘2021 మిసెస్‌ వరల్డ్‌ విజేత’ షాయలిన్‌ ఫోర్డ్‌(అమెరికా) అందజేసింది.  అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో 63 దేశాల మహిళలు పాల్గొన్నారు. మిసెస్‌ పాలినేషియా తొలి రన్నరప్‌గా.. మిసెస్‌ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు. ‘‘దాదాపు 21 ఏళ్ల తర్వాత మనకు మళ్లీ కిరీటం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ ఇండియా, లవ్‌ యూ వరల్డ్‌’’ అని సర్గమ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. సర్గమ్ ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తిచేసి విశాఖపట్నంలో కొంతకాలం టీచర్‌గా పనిచేశారు. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఆమె భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఇక వివాహిత మహిళల కోసం ఈ అందాల…

Read More

ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ లో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ నువ్వానేనా అనుట్టుగా తలపడగా చివరకు అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలుత ఇరుజట్లు సమానంగా 2-2 స్కోర్‌ సాధించడంతో మ్యాచ్‌ను అదనపు సమయానికి పొడిగించారు . అదనపు సమయంలోనూ రెండు జట్లు 1-1 గోల్స్‌ చూసి మ్యాచ్‌ను 3-3తో సమం చేశాయి. దీంతో పెనాల్టీ షూటవుట్‌ అనివార్యమైంది. పెనాల్టీ షూట్‌వుట్‌ కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబపే తొలిగోల్‌ సాధించి ఆ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత బంతినిఅర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీ గోల్‌ గా మలచడంతో రెండు జట్టు మళ్లీ సమానంగా నిలిచాయి. ఆ తరువాత ఫ్రాన్స్‌ ఆటగాళ్లు విఫలం కావడం రిజర్వు బెంచ్‌ నుండి వచ్చిన ఆటగాడు పౌలో డోబెల్లా గోల్‌ చేయడంతో అర్జెంటీనా జట్టు పెనాల్టీ షూటవుట్‌లో 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లింది. ఆ తరువాత పెరడెస్‌ చేసిన గోల్‌తో 3-1 ఆధిక్యానికి…

Read More

ఈశాన్య భారత దేశ అభివృద్ధికి అడ్డంకులుగా ఉన్న అవినీతి, పక్షపాతం, హింస వంటి వాటిని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. షిల్లాంగ్‌లోని స్టేట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. ఫుట్‌బాల్‌లో ఎవరైనా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడితే వారికి రెడ్‌ కార్డ్‌ ఇచ్చి బయటకు పంపిస్తారని, అదే విధంగా గత ఎనిమిదేళ్లలో ఈశాన్యప్రాంతం అభివృద్ధిని అడుకున్న వారికి రెడ్‌కార్డ్‌ ఇచ్చామని చెప్పారు. ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని.. దేశంలోనే మొట్ట మొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ఈప్రాంతంలో 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఖతార్‌లో ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగాల్సివుండగా, ఇక్కడ తాను ఫుట్‌బాల్‌ అభిమానుల మధ్య ఓ ఫుట్‌బాల్‌ మైదానంలో ర్యాలీ నిర్వహించడం యాదృచ్ఛికమని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి శకం నడుస్తోందని ప్రధాని…

Read More

దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ మోర్ముగావ్ ’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఆదివారం నౌకాదళం లోకి ప్రవేశ పెట్టారు. దీంతో భారత నౌకాదళ శక్తి సామర్థాలు మరింత పెరిగాయి. ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ మోర్ముగావ్‌ను భారత్‌లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా అభివర్ణించారు. ‘ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలనూ తీర్చగలవు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసి పెడతాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఈ యుద్ధనౌక పొడవు 163 మీటర్లు కాగా, వెడల్పు 17 మీటర్లు. బరువు 7400 టన్నులు. గోవా లోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. భారత…

Read More