బీహార్‌లో మద్యం పై సంపూర్ణ నిషేధం ఉండగా, కల్తీ మద్యం తాగి ప్రజలు మృత్యువాత పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చాప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాగేసి వచ్చారా? అంటూ ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలపై విరుచుకుపడడంతో దుమారం చెలరేగింది. ఈ ఘటనపై బీహార్ అసెంబ్లీలో బుధవారం ప్రతిపక్ష బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు నిరసన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శాసన సభలో ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం నితీశ్ కుమార్ అసహనంతో విపక్షాలపై విరుచుకు పడ్డారు. “ఏం జరుగుతోంది. అరవకండి. మద్యం సేవించి సభకు వచ్చారా ?…
Author: Editor's Desk, Tattva News
పశ్చిమ్ బెంగాల్‌లోని బీర్భూమ్ హింసాత్మక అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు లలన్ షేక్ సీబీఐ కస్టడీలో అనుమానాస్పదరీతిలో సోమవారం మృతి చెందడంతో సీబీఐ అధికారులపై బెంగాల్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి 22న బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో ఓ మహిళ, చిన్నారులు సహా 10 మంది సజీవదహనమయ్యారు. ఈ కేసులో లలన్ షేక్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. లలన్ మృతిపై పశ్చిమ్ బెంగాల్ పోలీసులను నమోదుచేసి ఎఫ్ఐఆర్‌ను కలకత్తా హైకోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ సవాలు చేసే అవకాశం ఉందని సమాచారం. లనన్‌ను డిసెంబరు 4న ఝార్ఖండ్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంపులో లలన్‌ను ఉంచి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అతడు అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. సీబీఐ అధికారులు చిత్ర హింసలకు గురిచేయడం వల్లే లలన్ చనిపోయాడని అతడి కుటుంబసభ్యులు…
బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్‌తో కలిసి అగ్రశ్రేణి నటి దీపికా పడుకోనే నటిస్తోన్న పఠాన్ సినిమాలోని ఓ పాట యాడ్ విడుదలైన దశలో ఇందులో దీపిక భంగిమపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె వస్త్రధారణ అసభ్యంగా ఉండడమే కాకుండా, అస్లీల భంగిమలో ఆమె కాషాయ బికినీలు ధరించడంతో నెటిజన్లు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దానితో, దుస్తులు సరిచేసుకోండి లేకపోతే మధ్యప్రదేశ్‌లో మీ సినిమా నడవదని దీపికాను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరికలు వెలువరించారు. ఈ సినిమాపై మధ్యప్రదేశ్ మంత్రి రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి హోదాలో మిశ్రా ఘాటుగా స్పందించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో షారూక్ సినిమా పఠాన్ భారీ అంచనాల నడుమ జనవరి 25న విడుదల కానుంది. ఈ దశలో సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవలే ఇందులోని బేషరమ్ రంగ్ పాట సన్నివేశాలు విడుదల అయ్యాయి. ఇందులో దీపిక బికినీ డ్రస్సు , బీచ్‌లో ఈ పాట చిత్రీకరణ…
జమ్మూ కాశ్మీర్‌లో సరిహద్దు ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం సైన్యానికి పెద్ద సవాలుగా ఉంది. కశ్మీర్‌ను సరిహద్దుల నుంచి అస్థిరపరిచేందుకు నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌లోకి చొరబడేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే, 2019 నుండి చొరబాటు కేసులలో నిరంతర తగ్గుదల ఉంది. దేశంలో చొరబాటు కేసులు తగ్గుముఖం పట్టాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్‌లో సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. గత సంవత్సరాలలో అంటే జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 వరకు చొరబాటు వివరాలను కూడా ఇచ్చారు. గత 1 సంవత్సరంలో, సరిహద్దులో మొత్తం 34 చొరబాటు ప్రయత్నాలు జరిగాయని చెప్పబడింది. గత ఏడాది కాలంలో సరిహద్దుల్లో 12 మంది చొరబాటుదారులను సైన్యం హతమార్చిందని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగించారు. అప్పటి నుంచి అక్కడి పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం…
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2023 జనవరి 14న ముగియనున్నాయి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ వారసత్వ రాజకీయాలలో మరో ముందడుగు వేశారు. తన కుమారుడుని మంత్రివర్గంలో చేర్చుకున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ సీటీ రవి సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ తో మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సహా, పలువురు డిఎంకే నాయకులు హాజరయ్యారు. ఉధయనిధికి సీఎం స్టాలిన్ రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖను కట్టబెట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్ సీటీ రవి ఆమోదం తెలిపారు. తమిళ నటుడు, నిర్మాత, పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి కూడా అయ్యారు. డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో…
ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ప్రారంభించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 77,511 కోట్ల మేర రుణాలను మంజూరు చేయగా రూ. 33,100 కోట్ల రుణాల పంపిణీ జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా. ఘవత్ కరాడ్ రాతపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 31.14 లక్షల ఖాతాలకు రూ. 33,100.79 కోట్ల రూపాయణ ముద్ర రుణాల పంపిణీ జరిగిందని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు (పంట రుణాలు, కాలువలు, నీటిపారుదల, బావుల నిర్మాణం వంటి పనులు మినహా) చేపల పెంపకం, తేనెటీగల పెంపకం ఈ రుణాల పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్, ఆగ్రో పరిశ్రమలు, డైరీ, ఫిషరీ, అగ్రి-క్లినిక్‌లు, వ్యవసాయ వ్యాపార…
తెలంగాణాలో కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయడం కోసమై 80 మందితో ఏఐసీసీ ఏర్పాటు చేసిన జంబో కమిటీలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పలువురు సీనియర్ నేతలు కమిటీల కూర్పు పట్ల ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ, పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ కార్యవర్గంకు రాజీనామాలు చేసారు. తాజాగా, కోవర్టుల వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్ళుగా కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న కోవర్టు రోగం ప్రమాదకరంగా మారిందని పేర్కొంటూ కోవర్టులు కాంగ్రెస్‌లోనే ఉంటూ కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ బలోపేతం కోసం కష్టపడుతున్న బలహీనవర్గాలకు పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏమిటో తెలియని వారికి పార్టీ పదవుల్లో ఎలా స్థానం కల్పించారని ఆయన ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్…
దేశవ్యాప్తంగా 45 సెంట్రల్ యూనివర్శిటీల్లో దాదాపు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి మంజూరు చేసిన మొత్తం 18,956 పోస్టుల్లో సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం మొత్తం 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి. వీటిలో మొత్తం మంజూరైన 2,553 పోస్టుల్లో ప్రొఫెసర్ల పోస్టులు 1,529, మొత్తం మంజూరైన 5,110పోస్టుల్లో 2,304 అసోసియేట్ ప్రొఫెసర్లు, మొత్తం మంజూరైన 1,293 పోస్టుల్లో 2,347 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల విభాగంలో, మూడు కేటగిరీలలో మొత్తం మంజూరైన పోస్టుల సంఖ్య 3,451 కాగా, అందులో 1,559 ఇప్పటికీ భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఐఐటిలలో (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ )…
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతి చెందలేదని, ఒక్కరు కూడా తీవ్రంగా గాయపడలేదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టర్‌లోని యాంగ్జి ప్రాంతంలో చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని, ఆ దళాలు ఆక్రమణకు పాల్పడినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. చైనా దళాలు చేసిన ప్రయత్నాల్ని మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆయన చెప్పారు. భూభాగాన్ని ఆక్రమించకుండా పీఎల్ఏను మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నట్లు మంత్రి తెలిపారు. చైనా సైనికులను విజయవంతంగా తమ పోస్టు నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. చైనా ప్రభుత్వంతో ఈ అంశం గురించి దౌత్యపరమైన పద్ధతిలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. సరిహద్దుల్ని రక్షించేందుకు మన దళాలు కట్టుబడి ఉన్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా మన భూభాగంలోకి…