Author: Editor's Desk, Tattva News

రాష్ట్రానికి నిధుల కోసం డిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్రావు చేసిన డిమాండ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశరాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ వస్తే, పాలకపక్షనేతగా తాను వస్తానని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్‌ ముందుకురావాలని కోరారు. మీరే తారీఖు డిసైడ్ చేయండి దీక్షకు మేం సిద్దమంటూ సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు తెచ్చుడో, సచ్చుడో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చామని మేమెప్పుడూ పదే పదే చెప్పలేదన్నారు. రూ.100 పెట్టి పెట్రోల్‌ కొన్నారు కానీ, అగ్గిపెట్టి కొనలేదని ప్రతిపక్ష పార్టీనుద్దేశించి ఎద్దేవా చేశారు. అగ్గిపెట్టి మర్చిపోయినట్టు నటించి అమాయక విద్యార్థులను బలిగొనలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర…

Read More

ఈసారి బ‌డ్జెట్ లో తెలుగు రాస్త్రాలలో రైల్వే ల‌కు భారీగా నిధులు కేటాయించామ‌ని వెల్ల‌డించారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామబు తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే పదింతలు పెంచామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వంద శాతం రైల్వే లైన్ల విద్యుద్దీకరణ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రూ.73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్‌ పథకం కింద 73 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ”అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయి. అమరావతిని అనుసంధానిస్తూ 56 కి.మీ మేర రూ.2,047 కోట్లతో ప్రాజెక్టు రూపొందించాం. రైల్వే పనులపై డీపీఆర్‌ను నీతి ఆయోగ్‌ ఆమోదించింది. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశముంది. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు స్థలం కేటాయింపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. భూమి కేటాయించాలని అధికారులను ఇప్పటికే ఏపీ సీఎం…

Read More

రాజధాని అమరావతి నిర్మాణాకి కేంద్ర బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వేగంగా పని చేస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. వివిధ శాఖల ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్గా ఉంటారు. సభ్యులుగా రహదారులు, భవనాలు, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్లు ఉంటారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి ప్రతినిధిని కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాల్ని పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని కోరింది. వివిధ నిర్మాణాల పటిష్టత, స్థితిగతుల్ని పరిశీలించి కమిటీ సిఫార్సులు చేయనుంది. రాజాధాని…

Read More

మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మద్యంతో వ్యాపారం చేసి కోట్లు వెనకేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విమర్శించారు. అసెంబ్లీ మద్యంపై శ్వేత పత్రం విడుదలచేస్తూ  2019-24లో వైసీపీ మద్యం పాలసీపై సీఐడీతో విచారణ చేయిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి జరిగిందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు.  అంతా నగదు లావాదేవీలు చేశారని పేర్కొంటూ సీఐడీ విచారణలో వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. నగదు లావాదేవీలపై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  లంచం తీసుకునే అధికారులను కఠినంగా శిక్షించే ప్రభుత్వం, రూ. వేల కోట్లు లూటీ చేసిన వారిని శిక్షించదా? అని పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.  గత ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ…

Read More

తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ నేపథ్యంలో శాసనభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.  మండలిలో బీఆర్‌ఎస్‌ పక్షనేతగా మధుసూదనాచారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే తన కుమార్తెను జైలులోపెట్టారట్టాని ఆరోపించారు.  సొంత బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అంటూ ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులు ఏమీ లేని.. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు.  నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని.. పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని విమర్శించారు. శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని నిలదీశారు.  ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని…

Read More

ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయని కొనియాడారు. 93 శాతం స్ట్రైక్ రేట్.. 57 శాతం కూటమికి ఓట్లు పడ్డాయనని చెబుతూ తన రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి ఫలితాలు చూడలేదని స్పష్టం చేశారు. ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉందని, గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. జైలుకు వచ్చి పవన్ కల్యాణ్ తనను పరామర్శించారని, క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ ముందుకొచ్చారని ప్రశంసించారు. “రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం…

Read More

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిస్టమిక్ పేపర్ లీకేజీని నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లేవు కాబట్టి.. మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని మంగళవారం పేర్కొంది. తాజాగా మరోసారి నీట్-యూజీ పరీక్షలు నిర్వహిస్తే.. తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని తాము గ్రహించామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాగా.. 24 లక్షల మంది ఈ పరీక్షలు రాయగా, మరోసారి వీటిని నిర్వహిస్తే వాళ్లపై అది ప్రభావం చూపుతుందని సుప్రీం తెలిపింది. నీట్ పేపర్ లీకైంది వాస్తవమేనని తేల్చిన సుప్రీంకోర్టు.. నీట్ నిర్వహణలో లోపాలున్నాయని తెలిపింది. పేపర్‌ లీక్‌ ద్వారా 155 మంది లబ్ధి పొందారని.. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. హజారీబాగ్‌, పాట్నాలోనే పేపర్ లీక్ అయ్యిందని స్పష్టం చేసింది. మరోసారి నీట్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని, నీట్‌ను రద్దు చేస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని…

Read More

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 కేంద్ర బడ్జెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ బహుధా ప్రశంసించారు. ‘ఈ బడ్జెట్ సమాజంలోని ప్రతి వర్గాన్నీ బలోపేతం చేస్తుంది. దేశంలోని నిరుపేదలు, గ్రామాలు, రైతులను సౌభాగ్య పథంలోకి బడ్జెట్ తీసుకువెళుతుంది’ అని ప్రధాని ఒక వీడియో సందేశంలో సూచించారు. ‘గడచిన పది సంవత్సరాల్లో ఐదు కోట్ల మందికి దారిద్య్రం నుంచి విముక్తి లభించింది. ఈ బడ్జెట్ కొత్త మధ్య తరగతి సాధికారత కోసం ఉద్దేశించినది. యువతకు ఈ బడ్జెట్ నుంచి అపరిమిత అవకాశాలు లభిస్తాయి. విద్య, నైపుణ్య రంగాలు ఈ బడ్జెట్ నుంచి కొత్త స్థాయి పొందుతాయి. ఈ బడ్జెట్ కొత్త మధ్య తరగతికి అధికారం ఇస్తుంది& ఈ బడ్జెట్ మహిళలు, చిన్న వాణిజ్యవేత్తలు, ఎంఎస్‌ఎంఇలకు చేయూత ఇస్తుంది’ అని ప్రధాని తెలియజేశారు. ‘మధ్య తరగతికి ఇది కొత్త బలం ఇస్తుంది. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల బలోపేతం లక్షంగా పటిష్ఠ…

Read More

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని సూచిస్తూనే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని, తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని లేఖ రాసినా ఇవ్వలేదని ఆరోపించారు. రెండు నెలల క్రితం జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓటమి పాలైంది. 151 స్థానాల నుంచి ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాలుండగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనకు కలిపి 164 స్థానాలు దక్కించుకున్నాయి. గతంలో వైసీపీకి 21 ఎంపీ స్థానాల్లో…

Read More

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తున్నామని ఆమె ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయాన్ని బడ్జెట్‌లో కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అలాగే విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయింపు బడ్జెట్‌లో చేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడిగా ఆమె అభివర్ణించారు.భారతదేశ ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టుఎంతో కీలకమైంనదిగా ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి కూడా కేంద్రం ప్రత్యేక సహకారం ఉంటుందని తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ , హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి…

Read More