Author: Editor's Desk, Tattva News

దేశ భద్రతపై ప్రభావం చూపుతున్నందున ఆచరణను ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వంచన, ప్రలోభపెట్టి, బలవంతంగా మత మార్పిడికి పాల్పడుతున్నారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ, అలాంటి మతమార్పిడిలను అరికట్టకపోతే దేశ భద్రతతో పాటు పౌరుల ప్రాథమిక హక్కుకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.  మతానికి సంబంధించినంతవరకు మనస్సాక్షి స్వేచ్ఛకు.బలవంతపు మత మార్పిడిని “చాలా తీవ్రమైన” సమస్యగా పేర్కొంటూ, అటువంటి ఆచారాలను కట్టడి చేయడం కోసం చిత్తశుద్ధి గల ప్రయత్నాలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బలవంతపు మత మార్పిడులను ఆపకపోతే “చాలా క్లిష్ట పరిస్థితి” తలెత్తుతుందని హెచ్చరించింది. ఈ దిశలో ఎటువంటి చర్యలు తీసుకోదలచారో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది. ప్రలోభాలు, ఆర్ధిక ప్రయోజనాలు, బెదిరింపులు,  మోసపూరితంగా ప్రలోభపెట్టడం ద్వారా మోసపూరిత మత మార్పిడిని నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం,  రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను…

Read More

ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపాదనలో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం మిగతా ప్రపంచదేశాల పౌరుల వ్యక్తిగత సంసాదనగా ఉందని తాజాగా విడుదలయిన ఓ నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఒక దేశ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జిడిపి (జాతీయ స్థూల ఉత్పత్తి)ని చూస్తాం. ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులను కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు. ‘ క్రెడిట్ సూయిస్’ అనే సంస్థ ఏటా ‘గ్లోబల్ వెల్త్ ’ రిపోర్టును విడుదల చేస్తుంది. తాజాగా ఆ సంస్థ ‘ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్2022’ను విడుదల చేసింది. ఇందులో 2021సంవత్సరం గణాంకాలను పేర్కొంది.  2021డిసెంబర్ చివరి నాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. ఇందులో సగం అమెరికా, చైనా పౌరులది కాగా, మిగతా…

Read More

* పోస్కో చట్టానికి పదేళ్లు లైంగికదాడి నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కలిగించే చట్టం పోక్సో దేశంలో అమలులోకి వచ్చి నేటికి (నవంబర్‌ 14) సరిగ్గా పదేళ్లు. అయితే, పోక్సో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఎట్టకేలకు నిర్దోషులుగా బయటపడుతున్నారు. ప్రతి ముగ్గురు నిర్దోషులుగా తేలితే ఒకరు మాత్రమే దోషిగా శిక్షను అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య అధికంగానే ఉన్నది. కానీ ఆ కేసుల విచారణకు అధిక సమయమూ పడుతున్నది. ఇది న్యాయవ్యవస్థలో పోక్సో కేసుల విషయంలో న్యాయవ్యస్థ తీరును ఎత్తి చూపుతున్నదని సామాజిక కార్యకర్తలు తెలిపారు. కాగా, ఈ సమాచారాన్ని ఢిల్లీ కేంద్రంగా పని చేసే విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలసీ వివరించింది. చాలా వరకు కేసులు కనీసం రెండేళ్లు వరకు సమయాన్ని తీసుకుంటున్నాయి. పోక్సో కింద నమోదైన మొత్తం కేసుల్లో 47.7 శాతం కేసుల విచారణకు ఏడాది కంటే తక్కువ సమయం పట్టింది. 1…

Read More

ఉప్పల్ మాజీ బిజెపి ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్..రైతు కూలీగా మారారు. కీసరలోని తన వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి వరి కోత కోశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని, దేశానికి వెన్నుముక ఆయిన రైతులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్బంగా తెలిపారు. పంటలకు మద్దతు ధర కల్పించటం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని చెప్పారు. రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను మోడీ ప్రభుత్వం సబ్బిడీతో అందిస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడి కోసం పీఎం కిసాన్ యోజన, పండిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కోనుగోలు కేంద్రాలు, ఈ మార్కెటింగ్ విధానులు తీసుకొచ్చామని తెలిపారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రధాని మోదీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని ట్వీటర్ వేదికగా ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ప్రభాకర్ 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ…

Read More

దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌ కేంద్రంలో ప్రైవేట్‌ సంస్థ రూపొందించిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తొలి మిషన్‌ను నవంబర్‌ 18న ప్రారంభించనున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాకెట్‌ను 3 రోజులు ఆలస్యం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌- ఉపకక్ష్య ప్రయోగాన్ని నవంబర్‌ 18న ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తెలిపింది. ”ప్రతికూల వాతావరణ సూచన కారణంగా, శ్రీ హరికోట నుండి మా విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నవంబర్‌ 15 నుండి 19 నుండి ప్రయోగించేందుకు అవకాశం ఏర్పడినట్లు నవంబరు 18 ఉదయం 11:30 గంటలకు జరిగే అవకాశం ఉందని” అని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి తెలిపారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ యొక్క తొలి మిషన్‌, ‘ప్రారంభ్‌’ (ప్రారంభం) అని పేరు పెట్టామన్నారు. శ్రీ హరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క లాంచ్‌ప్యాడ్‌ నుండి ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ మిషన్‌ స్కైరూట్‌కు ఒక ముఖ్యమైన…

Read More

రాజధాని అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటును రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ప్రజలు మూకుమ్మడిగా తిరస్కరించారు. సీఆర్‌డీఏ చట్ట సవరణ, ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 17 గ్రామాల్లో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించింది. ఈ సభల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. అమరావతిని అభివృద్ధి చేయడానికి సీఆర్‌డీఏతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చర్యలుండాలని డిమాండ్‌ చేశారు. అమరావతి ప్రణాళికను విచ్ఛిన్నం చేసేలా వ్యవహారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాపురం, ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, వెలగపూడి, గ్రామసభల్లో రైతులు ముక్తకంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మంగళగిరి మండలం నీరుకొండ, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాల్లోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించారు. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు సెంటు స్థలం ఆశ…

Read More

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌ తో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మరో అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది. ఇంగ్లండ్ ఇప్పటికే 2019 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని మరోమారు విశ్వవిజేతగా అవతరించింది. ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను ఇంగ్లండ్ 137/8 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 138 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలుత తడబడినా ఆ తర్వాత కుదురుకుని విజయాన్ని అందుకుంది. 19 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి…

Read More

జగనన్న ఇళ్ల పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.  దీనిపై ప్రధాని మోడీకి పిర్యాదు చేస్తానని తెలిపారు.   జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఇళ్లను పరిశీలించిన పవన్  ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంటే అవి పక్కదారి పట్టాయని విమర్శించారు.  ప్రభుత్వం చెప్పిన ధర ఒకటి ప్రభుత్వం పెద్దలు దోచుకుంది మరొకటి.. అసలు ఇళ్ల పేరుతో కేటాయించిన రూ. 23,400 కోట్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ మోసాన్ని ప్రజలంతా గుర్తించాలని కోరుతూ ఉత్తరాంధ్రులకు బలమైన రాజకీయ అధికారం దక్కాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తామని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం తనను…

Read More

సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.. మెజార్టీ వాటా రాష్ట్రానిది.. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలా విక్రయిస్తుంది? అని ప్రశ్నించారు. ఇదంతా తప్పుడు ప్రచారం.. నిజం కాదు.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు అని ప్రధాని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ మహాత్మా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా మోదీ రూ. 6338 కోట్ల వ్యయంతో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)ను వేదిక నుంచి జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి ప్రధాని రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ పను లు, బోధన్-బాసర-భైంసా హైవే పనులకు, సిరొంచామహాదేవ్‌పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. …

Read More

ప్రజలను అణివేసేందుకు చట్టాన్ని ఒక పరికరంగా ఉపయోగించరాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ హెచ్చరించారు. చట్టమనేది న్యాయాన్ని ప్రసాదించే పరికరంగానే ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం న్యాయస్థానాలే కాకుండా విధాన నిర్ణేతలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. హిందూస్థాన్‌ టైమ్స్‌ వార్తా సంస్థ నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన ప్రసంగీస్తూ సంస్థలుగా న్యాయస్థానాల సమర్థతకు కూడా పరిమితులు ఉంటాయను విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కొన్ని సందర్భాల్లో చట్టం, న్యాయం ఒకే దారిలో నడవాలని తప్పనిసరి సూత్రమేదీ లేదని స్పష్టం చేశారు. ఒక చట్టాన్ని న్యాయ పరికరంగానూ, అదే చట్టానిు అణిచివేత పరికరంగానూ వాడే వీలుందని చెప్పారు. మన శాసన పుస్తకాల్లో ఇప్పటికీ ఉనికిలో ఉను చట్టాలనే బ్రిటీష్‌ వలసవాద పాలనలో ఎంతటి తీవ్ర అణిచివేతకు ఉపయోగించారో ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పౌరులుగా మనమందరం ఒక చట్టాన్ని ఎలా ఉపయోగించాలనేది విజ్ఞతతో…

Read More