కెసీఆర్ విడుదల చేసిన ముగ్గురు స్వాములు – నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వీడియోపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా కేసును సిట్టింగ్ న్యాయమూర్తికి అప్పజెబితే తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. న్యాయమూర్తులకు వీడియోలు పంపే బదులు న్యాయవిచారణకు సిద్ధంకావాలని సూచించారు. వివాదం మొదలైన మరుక్షణమే నిజానిజాలు తేలేందుకు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వాలను కూలదోసే ఆలోచన తమది కాదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసి ప్రజల ఓట్లడిగి విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నలుగురు ఆర్టిస్టులను కూర్చోబెట్టి వీడియో రికార్డింగ్ చేసి ఇది అన్యాయం, అక్రమం అని గోలచేస్తే.. నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని హితవు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని చీల్చి కేటీఆరే వస్తానన్నా తాము…
Author: Editor's Desk, Tattva News
ఫామ్‌హౌస్ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మంత్రిస్థాయి భద్రత కల్పించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 4+4 గన్‌మెన్లు ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నివాసంతో పాటు, సొంతూళ్లలోనూ భద్రత ఇవ్వనున్నారు. అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు, దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోందిగానీ, పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. టీఆర్‌ఎస్…
దశాబ్దాల పాటుగా అంతర్ రాష్ట్ర జల ప్రాజెక్టుగా అనేక సమస్యలకు కేంద్ర బిందువుగా రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్ డి ఎస్) మిగిలింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఏలుబడిలో ఉన్న ఆర్ డి ఎస్ ఆ రాష్ట్రం కుడికాలువ నిర్మించి నీటినితరలించుకు పోయేందుకు ప్రారంభించిన పనులు వేగం పుంజుకున్నాయే కానీ తెలంగాణ అభ్యంతరాలు అడ్డు కట్ట వేయలేక పోతున్నాయు. కృష్ణా నదీ యాజమానం బోర్డు ఫిర్యాదులు చేసినా నిర్మాణాలను ఆంధ్ర ప్రభుత్వం ఆపక పోవడంతో తాజాగా కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కుడికాలువ నిర్మించి నీటిని తరలించుకుపోతే ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా రైతులు మరిన్ని సమస్యల్లో చిక్కునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆయకట్టు రైతాంగం ఆందోళనలకు సిద్ధమవు తున్నప్పటికీ ఈ ప్రాజెక్టుద్వారా ప్రయోజనం పొందుతున్న కర్నూలు జిల్లా రైతులు ప్రతిఘటించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆర్ డిఎస్ తూములను…
దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ శుక్రవారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 14న నామినేషన్‌ల గడువు ముగియనుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 ఆఖరి తేదీగా నిర్ణయించారు. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో వెంటనే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని విజయ్ దేవ్ పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నదని ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ చెప్పారు. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, అందులో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలని ఆయన…
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవి శ్రీ ప్రసాద్ ‘ఓ పరి’ ప్రైవేట్ వీడియో సాంగ్‌లో హరే రామ-హరే కృష్ణ అని పాడుతూ అభ్యంతరకంగా డ్యాన్స్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దేవీ శ్రీ ప్రసాద్‌పై సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంలో న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఐటెం సాంగ్‌లా ఉందని, అందులో హరే రామ హరే కృష్ణ మంత్రం ఎలా వాడతారని పలువురు మండిపడుతున్నారు. సాంగ్ వీడియోలో అమ్మాయిలతో డీఎస్పీ డ్యాన్స్ చేస్తుండగా.. హరే రామ హరే కృష్ణ లిరిక్స్ కనిపిస్తున్నాయి. సాంగ్ లో హరే రామ లిరిక్స్ తొలగించాలని ఇప్పటికే డిమాండ్స్…
గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ జర్నలిస్ట్, టివి యాంకర్ ఇసుదాన్ గాధ్వీ (40) పేరును ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ సిఎం అభ్యర్థి కోసం ఆప్ నిర్వహించిన సర్వేలో ఇసుదాన్ 73 శాతం ఓట్లను గెలుచుకున్నారు. ఇసుదాన్ గాధ్వీ గతేడాది జూన్‌లో ఆప్‌లో చేరారు. రాజకీయ నేతగా మారక ముందు ఇసుదాన్ గాధ్వి జర్నలిస్టుగా పని చేశారు. వీటీవీ గుజరాతికి ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన.. వీటివీ న్యూస్ కూ ఎడిటర్ గా పని చేశారు. అంతకుముందు వీటీవీలో ప్రసారమైన మహామంతన్ కు యాంకర్ గానూ వ్యవహరించారు. ఆప్ లో చేరిన తర్వాత జర్నలిజానికి స్వస్తి చెప్పారు. న లాంటి సాధారణ, నిరాడంబర రైతు కుమారుడికి కేజ్రీవాల్ ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని ఇసుదాన్ పేర్కొన్నారు. ఆప్ గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా సిఎం అభ్యర్థిగా పోటీపడ్డారు. ఫోన్ నెంబర్ ద్వారా నచ్చిన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా …
అవినీతి రుజువై జైలుకు వెళ్లివారిని సైతం కీర్తిస్తున్నారని, వారికి బహుమతులు ఇవ్వాలని సిఫారసులు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఆయన ఎవరి పేరూ పేర్కొనకపోయినా, కేసులు ఎదుర్కొంటున్న కొందరు సామాజిక కార్యకర్తల పేర్లు నోబెల్ బహుమతి కోసం ఇటీవల వెళ్లడాన్ని ఆయన ప్రస్తావించినట్టు భావిస్తున్నారు. విజిలెన్స్ జాగరూకత వారోత్సవాలలో భాగంగా ఢిల్లీలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ అవినీతిని సహించరాదని, అవినీతిపరులకు రాజకీయ, సామాజిక మద్దతు లభించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ‘వెనక్కి తగ్గొద్దు. మీ వెంట నేనుంటా’నంటూ సీవీసీ సహా అవినీతి నిరోధక సంస్థలను ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి అవినీతిపరుడూ మూల్యం చెల్లించుకునే పరిస్థితి సమాజంలో రావాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అవినీతిపరులుగా తేలినవారికి భజనలు చేయడం చూస్తున్నామని, వారితో ఫొటోలు దిగడానికి కూడా సిగ్గుపడటం లేదని ప్రధాని మండిపడ్డారు. ‘‘చాలా సందర్భాల్లో అవినీతికి పాల్పడిన వారు, నేరం రుజువై జైలుకెళ్లి…
టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా వెరవకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మునుగోడు ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ తొత్తులుగా మారి లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా, లాఠీఛార్జ్ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. గులాబీలకు గులాంగిరీ చేసే అధికారుల, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలను చేధించుకుని ఓటు హక్కును వినియోగించుకున్న మునుగోడు ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున హ్రుదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఓటింగ్ సరళి, శాతాన్ని చూశాక ప్రతి ఒక్కరికి…
టీ 20 వరల్డ్ కప్‌లో వరుస హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆట తీరుతో అక్టోబర్ నెలకు అతను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డ్‌కి నామినేట్ అయ్యాడు. అక్టోబర్ నెలలో టీ 20 మ్యాచ్‌ల్లో కోహ్లీ 200 సగటు, 150. 73 స్ట్రైక్ రేటుతో 205 పరుగులు చేశాడు. ఈ అవార్డుకి కోహ్లీ నామినేట్ కావడం ఇదే మొదటి సారి. ఇతనితో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సికిందర్ నామినేట్ అయ్యారు. అన్ని క్రికెట్ ఫార్మట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి, వాళ్లను గౌరవించడం కోసం ఐసీసీ 2021 జనవరిలో ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుని మొదలు పెట్టింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ అవార్డుని ఇప్పటివరకు నలుగురు భారత…
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో వాయు నాణ్యత సూచి (ఎక్యూఐ) 408కి చేరుకోగా.. ‘తీవ్రత’ విభాగానికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. కోరలు చాచిన వాయు కాలుష్యంతో ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే మానవ తప్పిదాలు ఈ వాయుకాలుష్యం స్థాయులను మరింత పెంచి పీల్చేగాలిని విషతుల్యం చేస్తున్నాయి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో పాటు వాహనాల నుండి వచ్చే పొగతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. మంగళవారం 424గా ఉన్న ఎక్యూఐ బుధవారం నాటికి 376కి మెరుగైంది. గతేడాది డిసెంబర్ 26న ఎక్యూఐ 459కి చేరుకుందని, ఇది అతిచెత్తరికార్డుగా పేర్కొన్నారు.…