Author: Editor's Desk, Tattva News

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. `ఎక్స్’ నుంచి భద్రతను పెంచుతూ ‘వై ప్లస్’ కేటగిరి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సల్మా్న్‌ను చంపుతామంటూ ఆయనకు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదరింపు లేఖలు వచ్చాయన్న కారణంతో మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్‌కు తాజాగా పెంచిన భధ్రతా కేటగిరి కింద స‌ల్మాన్ వెంట నిత్యం ఇద్ద‌రు సాయుధ గార్డులు ఉంటారు. మ‌రోవైపు స‌ల్మాన్ ఇంటి వ‌ద్ద రోజంతా ఇద్ద‌రు గార్డులు ప‌హారా కాస్తారు. స‌ల్మాన్ భ‌ద్ర‌త విధుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక సాయుధ గార్డు ప‌నిచేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో స‌ల్మాన్ ఖాన్ ఉన్నారనే స‌మాచారంతో బాలీవుడ్ కండ‌ల‌వీరుడికి భ‌ద్ర‌త‌ను పెంచారు. స‌ల్మాన్‌ను హ‌త్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యులు ఆయ‌న ఫామ్ హౌస్ వ‌ద్ద మాటు వేశార‌నే స‌మాచారంతో ముంబై పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌ల…

Read More

ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో రూ.1,51,718 కోట్ల వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లయ్యింది. ఈ నూతన పన్ను విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే రెండో సారి అతిపెద్ద వసూళ్లు కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.67 లక్షల కోట్ల జిఎఎస్‌టి వసూళ్లయ్యింది. గత నెల పన్ను వసూళ్లలో సిజిఎస్‌టి కింద రూ.26,039 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.33,396 కోట్ల రాబడి చోటు చేసుకుంది. ఐజిఎస్‌టి కింద రూ.81,778 కోట్లు, సెస్సెల రూపంలో రూ.10,505 కోట్ల చొప్పున నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌ వసూళ్లతో పోల్చితే గడిచిన నెలలో 16.6 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.3,579 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ.2,879 కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లోలో వసూళ్లయిన రూ.3,854 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం వృద్థితో రూ.4,284 కోట్లకు…

Read More

గత కొన్ని రోజులుగా బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సెల్ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు జరుగుతున్నాయని చెబుతూ పలిమెల గ్రామంలో ఈటల కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు.  మునుగోడులో బిజెపి గెలుపు కోసం పనిచేస్తున్న ఈటలపై కుట్ర జరుగుతోందని పేర్కొంటూ ఈటల మొహం చూడొద్దని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని ఆయన  గుర్తు చేశారు. అసెంబ్లీ లో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో లేదని స్పష్టం చేశారు.  పలివెల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే దాడులకు దిగారని, పక్కా ప్లాన్ తో ఇలా చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. పోలీసులు వద్దు అని చెప్పినా వినకుండా టిఆర్‌ఎస్‌ నేతలు దాడులకు దిగినట్లు  ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం చివరి సమయంలో ఉద్రిక్తలకు దారితీసింది. పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్…

Read More

మునుగోడు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్సమగ్ర దర్యాప్తు చేపట్టి, శిక్షించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి,  తెలంగాణ ఇన్ ఛార్జ్  తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.  మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య గొంతుకను అణచివేసే కేసీఆర్ ప్రభుత్వ చర్యలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా నియోజకవర్గంలో పని చేస్తున్న బిజెపి నేతల ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నారని, ఇది చాలా చట్టవిరుద్ధమని, తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియ లేకుండా ఎవరి టెలిఫోన్‌ అయినా ట్యాప్‌ చేయడానికి చట్టం అనుమతించదని ఆయన తెలిపారు. బిజెపి నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.‘‘ఎమ్మెల్యేల కొనుగోలు’’ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా బిజెపిపై తప్పుడు ఆరోపణలు గుప్పిస్తూ, బిజెపిని బద్నాం చేయడానికి, ఓటర్లను…

Read More

సినీ నటి రంభకు తృటిలో ప్రమాదం తప్పింది. కెనడాలో స్కూల్ నుంచి పిల్లల్ని కారులో తీసుకొస్తుండగా.. మరో కారు వచ్చి ఢీకొట్టింది. దాంతో రంభతో పాటు ఆమె పిల్లలకి కూడా గాయాలయ్యాయి. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రంభ తీవ్ర గాయాలైన కూతురు సాషా త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేయాలని సూచించింది. “ఇంటర్‌సెక్షన్ వద్ద మా కారుని మరో కారు వచ్చి ఢీకొట్టింది. కారులో నాతో పాటు పిల్లలు, అమ్మమ్మ ఉన్నారు. అందరం స్వల్ప గాయాలతో బయటపడ్డాం. కానీ నా చిట్టి తల్లి సాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. బ్యాడ్ డేస్.. బ్యాడ్ టైమ్.. సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయండి’’ అని రంభ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తమకు చిన్నపాటి గాయాలయ్యాయని రంభ రాసుకొచ్చింది. ప్రస్తుతం తామంతా క్షేమంగా ఉన్నామని.. తన చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలోనే ఉందని స్పష్టం చేసింది.…

Read More

ఇరానీ టాటా స్టీల్ రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ జంషెడ్ పూర్ లో కన్నుమూసారు. ఆయన భారత ఉక్కు మనిషిగాపేరొందారు. ఇరానీ 2011లో టాటా స్టీల్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి పదవీ విరమణ పొందారు. టాటా స్టీల్ కంపెనీ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జంషెడ్ ఇరానీ.. 43 ఏళ్ల పాటు సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.  జూన్ 2, 1936 న నాగ్‌పూర్‌లో జిజి ఇరానీ, ఖోర్షెడ్ ఇరానీలకు జన్మించాడు 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.  ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించడంపై దృష్టి సారించి, టాటా స్టీల్‌ను తిరిగి ఆవిష్కరించుకునేలా చేశారు.  2003లో టాటా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. ఇరానీ 1992-93కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1996లో రాయల్…

Read More

మునుగోడు ఉప ఎన్నిక సందడి నడుస్తున్న క్రమంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మంత్రి జగదీశ్ పీఏ ఇంట్లో ఐటీ దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. నల్గొండలో గల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఐటీ అధికారుల బృందం చేరుకుంది.. అక్కడ సోదాలు ఐదు గంటల సేపు సోదాలు జరిపి  రూ 49 లక్షల  నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు సోదాల కోసం ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఈ విషయం తెలిసి హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే.. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నగదు ఉందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారని వార్తలు వస్తున్నాయి.  మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం గడువు మంగళవారంతో ముగుస్తుండగా, సోమవారం సాయంత్రం 6 గంటల నుండి…

Read More

వివాదాస్పదంగా మారిన బ్రిటిష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టానికి వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సవరణలు చేసే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. భారత శిక్షాస్మతిలోని సెక్షన్ 124 (ఎ) కింద దేశద్రోహ చట్టాన్ని చేర్చారు. ఈ సెక్షన్‌ ప్రకారం ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసినా సదరు నేరస్తులుగా పరిగణించబడుతారు. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దేశద్రోహ చట్టాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాయి. అందుకే ఈ చట్టానికి సవరణలు చేయాలని ఏండ్లుగా డిమాండ్‌లు వస్తున్నాయి. దేశద్రోహ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన కోర్టు.. చట్టానికి సవరణలు చేయాలని గత మే నెలలోనే ఆదేశించింది. అంతేగాక, దేశద్రోహ చట్టంపై కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేవరకు.. కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఎవరిమీదా ఈ చట్టాన్ని ప్రయోగించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది.…

Read More

నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను కేవలం పీజీ విద్యార్థినులకు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. హాస్టల్ వసతిని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినులకు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థినులు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యార్థుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థులు వినతిపత్రం ఇస్తే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రిన్సిపాల్ తక్షణమే నిర్ణయం ప్రకటించాలని స్టూడెంట్స్ ఆందోళన కొనసాగించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Read More

అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష ఇప్పటికీ సమాజం నుంచి తొలగిపోకపోవestడంపై సుప్రీంకోర్టు సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల పరీక్ష జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని జార్ఖాండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ, దోషిగా నిర్ధారించిన ట్రయిల్ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ సందర్భంగా, రెండు వేళ్ల పరీక్షలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార నిర్ధారణకు వైద్యులు ‘రెండు వేళ్ల’ పరీక్షను నిర్వహించడం అత్యంత అమానవీయమని, ఈ పరీక్ష బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమని పేర్కొంటూ 2013 మేలో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో…

Read More