Author: Editor's Desk, Tattva News

శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్న భండార్‌కు(కోశాగారం) చెందిన లోపలి గదిలో(ఇన్నర్ ఛాంబర్) రహస్య సొరంగం ఉన్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేసేందుకు భారత పురావస్తు సంస్థ(ఎఎస్‌ఐ) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పూరీ సంస్థానాధీశుడు గజపతి మహరాజా దివ్య సింఘ దేబ్ సూచించారు. రత్న భండార్‌కు చెందిన లోపలి గదిలో రహస్య సొరంగం లేదా రహస్య తదులు ఉండే అవకాశం ఉందని వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందిస్తూ ఆలయ కోశాగారానికి చెందిన లోపలి గదిలో రహస్య సొరంగం ఉన్నట్లు స్థానిక ప్రజలు నమ్ముతారని చెప్పారు. లోపలి గది పరిస్థితిని అంచనా వేసేందుకు ఎఎస్‌ఐ లేజర్ స్కానింగ్ వంటి ఆధునిక పరికరాలను ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా రహస్య సొరంగం వంటి కట్టడాలు ఏవైనా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే..స్వామి వారి నగల తరలింపు కోసం ఇతర సభ్యులతో…

Read More

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌పై  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం కేసు నమోదు చేసింది.  నకిలీ గుర్తింపు ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి ప్రయత్నించినందుకు ఆమెపై పోలీసు కేసు నమోదు నమోదయింది కూడా. అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు, భవిష్యత్తు పరీక్షల నుంచి కూడా ఆమెను డిబార్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును పూజా ఖేద్కర్‌కు జారీ చేసింది. యూపీఎస్సీ తనపై పలు చేర్యాలకు ఉపక్రమించగానే న్యాయస్థానం ద్వారా సమాధానం ఇస్తానని పూజా ఖేద్కర్ ప్రకటించారు. ఇటీవల పూణేలో శిక్షణ సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని, అధికారాలను దుర్వినియోగం చేశారనే అదనపు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఖేద్కర్ మీడియాతో మాట్లాడుతూ, “న్యాయ వ్యవస్థ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటాను. ఏది ఏమైనా,…

Read More

మాజీ విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను అమెరికాలో తదుపరి భారతీయ రాయబారిగా నియమితులయ్యారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను సజావుగా కొనసాగించడంలో భారత రాయబారి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. 61 ఏళ్ల క్వాత్రా త్వరలోనే ఈ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు విదేశాంగ కార్యదర్శిగా సర్వీసు పొడిగింపును వినయ్ క్వాత్రా పొందారు. జూలై 14న విదేశాంగ కార్యదర్శిగా తన పదవీకాలాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. గత రాయబారి తరణ్ జిత్ సంధు జనవరిలో పదవీ విరమణ చేసినప్పటి నుంచి అమెరికాలో భారత రాయబారి పదవి ఖాళీగా ఉంది. 2015-2017 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా, ప్రధాని కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన క్వాత్రా పలు రంగాల్లో అమెరికాతో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఇటీవల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేసిన అనేక చికాకులను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాంగ వ్యవహారాల్లో…

Read More

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసీపీ కార్యకర్తగా ఉండడం వల్లే రాజకీయ కక్షతో చంపివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితుడిపై అనేక కేసులున్నాయని వివరించారు. హత్య వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని వాపోయారు. తన కుమారుడితో ఎవరితోనూ పాత కక్షలు లేవని జగన్‌కు తెలిపారు. నిందితులను, వారికి సహకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ  45 రోజుల్లో రాష్ట్రమంతా అతలకుతలం అయ్యిందని వాపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై వైసీపీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలో వైసీపీ తరుఫున వచ్చే బుధవారం ధర్నా చేస్తామని ప్రకటించారు. దాడులతో భయందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జులై 24వ…

Read More

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో పెద్ద అంతరాయం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా విమానాలు రద్దు, ఆలస్యానికి కారణమైంది. దీంతో పలు విమానయాన సంస్థల చెక్ ఇన్ సేవలు నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్, బ్యాంకింగ్ సర్వీసెస్ కు అంతరాయం ఏర్పడింది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో తమ ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని అకాస ఎయిర్లైన్స్ ప్రకటించింది, “మా సర్వీస్ ప్రొవైడర్తో మౌలిక సదుపాయాల సమస్యల కారణంగా, బుకింగ్, చెక్-ఇన్ సేవల నిర్వహణతో సహా మా ఆన్లైన్ సేవలు కొన్ని తాత్కాలికంగా అందుబాటులో ఉండవు. ప్రస్తుతం మేము విమానాశ్రయాలలో మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియలను అనుసరిస్తున్నాము. ప్రయాణీకులు మా కౌంటర్లలో చెక్ ఇన్ కోసం విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలని అభ్యర్థిస్తున్నాము’’ అని ఆకాస ఎయిర్ లైన్స్ తెలిపింది. విమానయాన సేవలను అందించే విషయంలో ప్రస్తుతం సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నామని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో…

Read More

పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా గోదావరి నీటిమట్టం పెరిగింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువ నీటిమట్టం 29 మీటర్లకు చేరింది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే దిగువ నీటిమట్టం 19.16 మీటర్లుగా ఉంది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ నీటిమట్టం 29.15 మీటర్లకు చేరింది. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్ నీటిమట్టం 18.70 మీటర్లుగా ఉంది.  పోలవరం అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా స్పిల్ వే నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేేశ్వరం వద్ద నీటి ప్రవాహం పదిన్నర అడుగులకు చేరడంతో 176 గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో నేడు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు శ్రీకాకుళం, పార్వతీపురం,…

Read More

ఒడిశాలోని పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో ఉన్న ర‌త్న‌భండార్‌ లోని లొప‌లి గ‌దిని గురువారం మరోసారి తెరిచారు. ఆ గ‌దిలో ఉన్న విలువైన వ‌స్తువుల‌ను.. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు త‌ర‌లిస్తున్నారు. ఈ వారంలోనే ర‌త్న‌భండార్‌ను తెర‌వ‌డం ఇది రెండ‌వ‌సారి. ఉద‌యం 9.51 నిమిషాల‌కు ఆ గ‌దిని తెరిచారు.  జ‌గ‌న్నాథుడికి పూజ‌లు చేసిన త‌ర్వాత‌ ఒడిశా స‌ర్కార్ నియ‌మించిన సూప‌ర్‌వైజ‌రీ క‌మిటీ  ర‌త్న‌భండార్‌లోకి అడుగుపెట్టింది. జూలై 14వ తేదీన బ‌య‌టి గ‌దిలో ఉన్న అమూల్య‌మైన ఆభ‌ర‌ణాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను స్ట్రాంగ్ రూమ్‌కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు లొప‌లిగ‌దిలోని ట్రెజ‌రీ పెట్ట‌ల‌ను త‌ర‌లించ‌నున్న‌ట్లు క‌మిటీ చైర్మ‌న్ జ‌స్టిస్ బిశ్వంత్ రాథ్ తెలిపారు. పూరి రాజు గ‌జ‌ప‌తి మ‌హారాజ దివ్య సింగ్ దేబ్ స‌మక్షంలోనే ఆభ‌ర‌ణాలు, విలువైన వ‌స్తువుల‌ను స్ట్రాంగ్ రూమ్‌కు త‌ర‌లిస్తున్నారు. ఆభ‌ర‌ణాల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను వీడియో తీస్తున్నారు. పాములు ప‌ట్టేవాళ్ల‌తో పాటు ప్ర‌త్యేక భ‌ద్ర‌తా సిబ్బంది  ఆల‌యం వ‌ద్దే ఉన్నారు. షెడ్యూల్…

Read More

శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. గురువారం జట్ల జాబితాను సెలెక్టర్లు ప్రకటించారు. భారత టి20 జట్టు సారథిగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడు. సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను టి20 జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని భావించినా సెలెక్టర్లు మాత్రం సూర్యకుమార్ యాదవ్‌వైపే మొగ్గు చూపారు. రెండు ఫార్మాట్‌లలో కూడా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా, శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టి20లు, మరో 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జులై 27, 28, 30 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. మూడు మ్యాచ్‌లో పల్లెకెలెలోనే జరుగుతాయి. ఇక వన్డే సిరీస్ ఆగస్టు తొలి వారంలో జరుగుతుంది. తొలి వన్డే ఆగస్టు 2న, రెండో వన్డే 4న, మూడో…

Read More

నీట్ యుజి పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అధీకృత సంస్థ ఎన్‌టిఎకు కీలక ఆదేశాలు వెలువరించింది. ఎల్లుండి అంటే ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా పరీక్షా కేంద్రం, నగరాల వారిగా ఫలితాల వివరాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. వీటిని వెబ్‌సైట్‌లో ఎన్‌టిఎ పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో విద్యార్థుల గుర్తింపు వివరాలను వెల్లడించరాదని సూచించింది. నీట్ యుజి పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఇతరత్రా అక్రమాల విషయం దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో నీట్ పిజి రద్దు కావాలని కొన్ని పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే కొన్ని చోట్లనే పరీక్షల విషయంలో అక్రమాలు జరిగాయని మొత్తం పరీక్ష రద్దు వద్దని కేంద్ర ప్రభుత్వం, కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేసినందున , అత్యున్నత న్యాయస్థానం దీనిని తాము క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు వెలువరించాల్సి ఉందని ప్రధాన…

Read More

చండీగఢ్ -దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని గోండా వద్ద పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. 20 మందికి గాయాలు అయ్యాయి. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంతో నాలుగు ఎసి బోగీలు సహా మొత్తం 12 బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికుకు ముప్పు తలెత్తింది. నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు, గాయపడ్డవారిని వెంటనే చికిత్సకు ఆసుపత్రికి తరలించినట్లు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ మీడియాకు తెలిపారు. సహాయక బృందాలను రంగంలోకి దిగాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ నెంబరు 15904 రైలు చండీగఢ్ నుంచి బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం యుపిలోని మోతీగంజ్ ఝులాహీ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ప్రమాదం జరిగింది. యుపి సహాయక కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్, గోండా జిల్లా కలెక్టర్ నెహా శర్మ హుటాహుటిన ఘటనాస్థలికి చేరారు. ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి…

Read More