భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మరింతగా ప్రొత్సహించే విధంగా పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ వ్యవహరిస్తుంది. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని కోట్లి ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో యువతకు పాకిస్థాన్ ఆర్మీ స్వయంగా శిక్షణ అందిస్తుంది. భారత్‌లోకి ప్రవేశించడంతోపాటు ఉగ్రవాదులుగా అక్కడ ఎలా మసులుకోవాలనే విధంగా వారికి తర్పీదు ఇస్తుంది. ఇక ఈ శిక్షణ కోసం ఆర్మీకి చెందిన మాజీ సైనికులతోపాటు కమాండెంట్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం వర్షా కాలం కావడంతో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోని నదులు, వాగులు పొంగి ప్రవహిస్తుంటాయి. దీంతో ఇదో మంచి అవకాశంగా చొరబాటుదారులు భావిస్తుంటారు. భారత్‌లో ప్రవేశించేందుకు జమ్మూ డివిజన్‌లోని పర్వత ప్రాంతం అత్యంత అనువైనదని చొరబాటుదారులు విశ్వసిస్తారు. తద్వారా భారత్‌లోకి వారు సులువుగా ప్రవేశిస్తారు. అయితే ఆ యా ప్రాంతాల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తే.. చోరబాటుదారులను కనిపెట్టడం కష్టమని ఓ అభిప్రాయం సైతం పాక్ ఆర్మీలో ఉన్నట్లు సమాచారం. …
Author: Editor's Desk, Tattva News
* జిన్‌పింగ్‌కు గుండెనొప్పి వచ్చిందా! ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. డజనుకుపైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జియాంగ్షులోని నాన్‌టోంగ్ పట్టణంలో 16 కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు తెలిసింది. నియామకాలు పొందిన 168 మంది మహిళలు, ముందస్తు ఫిజికల్ టెస్ట్‌లు చేసుకున్నట్టు ప్రాసిక్యూటర్స్ గుర్తించారు. దర్యాప్తులో భాగంగా రెండు ప్రధాన దవాఖానలను, ఒక మెడికల్ ఎగ్జాం సెంటర్‌కు వెళ్లి ప్రాసిక్యూటర్స్ విచారించారు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోయినా, పిల్లల్ని కనాలనుకునే ఉద్దేశమున్నా, గర్భంతో ఉన్నా.. అలాంటి మహిళలను ఇం టర్వ్యూ దశలోనే చైనాలోని పలు కంపెనీలు పక్కకు తప్పిస్తున్నాయి. వారికి ఉద్యో గం ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయి. ప్రెగ్నె న్సీ టెస్ట్‌లు అడుగుతున్నాయి. అయితే ఇలా చేయటం చైనా చట్టాల ప్రకారం నేరం. ప్రెగ్నెన్సీతో ఉన్న కార్మికుల పట్ల వివక్ష…
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కనీసం 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇద్దరు భద్రతా జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలోని వాండోలి గ్రామం వద్ద మధ్యాహ్నం ఆరు గంటల పాటు ఎన్‌కౌంటర్ జరిగిందని గడ్చిరోలి జిల్లా ఎస్‌పి నీలోత్పల్ తెలిపారు. ఈ ప్రాంతంలో సి 60 కమాండోలు , మావోయిస్టు బృందాల మధ్య భారీ స్థాయిలో పోరు సాగింది. ఘటనాస్థలిలో ఇప్పటివరకు 12 మంది నక్సలైట్ల మృతదేహాలను కనుగొన్నారు. మావోయిస్టులకు చెందిన అత్యంత అధునాతన ఆటోమోటిక్ ఆయుదాలను కూడా స్వాధీనపర్చుకున్నట్లు ఎస్‌పి వెల్లడించారు. వీటిలో 3 ఎకె 47లు, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఓ కార్బైన్ ఓ ఎస్‌ఎల్‌ఆర్ ఉన్నాయని తెలిపారు. నక్సల్స్ దళం భారీ ఆయుధాలతో తరలివచ్చినట్లు గుర్తించామన్నారు. మృతుల్లో ఒక్క నక్సల్‌ను డివిసిఎం లక్ష్మణ్ అలియాస్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం గుర్తించారు. ఈ వ్యక్తి తిపగద్ నక్సల్ దళం ఇన్‌చార్జీగా నిర్థారించారు. మృతి…
రాష్ట్రంలోని కన్నడిగులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక మంత్రివర్గం ఓ బిల్లుకు ఆమోదం తెలపడంతో పారిశ్రామిక వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనది. దానితో ఆ బిల్లును తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో మరోసారి చర్చిస్తామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రైవేట్ రంగం వద్దకు తీసుకువెళతామని, వారి ప్రయోజనాలను కాపడతామని రాష్ట్ర ప్రభుత్వం రాష్త్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక క్యాబినెట్ సోమవారం సమావేశమై కర్ణాటక రాష్ట్ర పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపార సంస్థలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి బిల్లు, 2024కు ఆమోదం తెలిపింది. తమ సంస్థలలో స్థానిక కన్నడిగులకు ఉద్యోగాలలో తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలన్నది ఈ బిల్లు ఉద్దేశం. మేనేజ్‌మెంట్ కేటగిరిలలో స్థానిక అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్లు, నాన్ మేనేజ్‌మెంట్ కేటగిరిలలో 70 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత…
మైనారిటీల మద్దతు లేకపోవడమే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పేలవ పనితీరుకు కారణమని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో మైనార్టీల మద్దతు లేకపోవడం వల్లనే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలువలేకపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చాను తప్పనిసరిగా రద్దు చేయాలని స్పష్టం చేశారు. కాగా, అదేవిధంగా బీజేపీ నినాదమైన ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’కు స్వస్తి పలకాలని సువేందు అధికారి పిలుపునిచ్చారు. ‘హమ్ ఉంకే సాథ్ జో హమారే సాథ్’ (మనతో ఉన్న వారితో మేం ఉంటాం) అనే కొత్త నినాదాన్ని పార్టీ అనుసరించాలని సూచించారు. ‘నేను జాతీయవాద ముస్లింల గురించి కూడా మాట్లాడా. మేమంతా ‘సబ్…
వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె విషయంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పూజా ఖేడ్కర్ అడ్డదారుల్లో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారని కూడా పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమె ట్రెయినింగ్‌ను నిలిపేశారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు వచ్చి రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించడం లాంటి ఆరోపణలతో పూజా ఖేడ్కర్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్ చేస్తున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక ప్రటకనలో కూడా తెలిపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాల్లో ఆమె తనకు దృష్టి లోపం ఉన్నట్లుగా పేర్కొన్నారు. దాంతో ఆ…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ తో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు జస్టిస్ నరసింహా రెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త జడ్జి నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. సోమవారం లోపు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిషన్ విచారణను సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం ఉదయం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల తరపున…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురైయ్యారు. తీహార్ జైలులో ఉన్న ఆమెకు జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం కవిత అనారోగ్యం పట్ల తీహార్ జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచనతో కవితను జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. అయితే, కవితకు దీన్ దయాల్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన ఆమె 100 రోజులకు పైగా జైలులో ఉన్నారు. గత నాలుగు నెలలుగా జైలులోనే ఉన్న ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆమె గత కొంత కాలంగా లోబీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యులు సూచనతో ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు. జైలులో కూడా వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత మరింత అస్వస్థతకు గురికావటంతో జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల…
సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా జస్టిస్ హెచ్ఎన్ కోటిశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు ఈ విషయం తెలిపారు. జస్టిస్ సింగ్ ప్రస్తుతం జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లడక్ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తుండగా, మద్రాసు హైకోర్టు జడ్జిగా ఆర్.మాధవన్ ఉన్నారు. జస్టిస్ కోటిశ్వర్ సింగ్ గత ఫిబ్రవరిలో 12 జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లఢక్ చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. 2023 ఫిబ్రవరి 15న ప్రమాణస్వీకారం చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం జూన్ 12న కోటిశ్వర్ సింగ్ పేరును ఏకగ్రీంగా సిఫారసు చేసింది. కొలిజియంలో ఇతర సభ్యులుగా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్య కాంత్, హృషికేష్ రాయ్…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పేరును ఖరారు చేశారు. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును కూడా ప్రకటించారు. అయితే జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ మన తెలుగమ్మాయే. భారతీయ సంతతికి చెందిన ఉషా చిలుకూరి.. కాలిఫోర్నియాలో తెలుగు కుటుంబంలో జన్మించారు. భర్త జేడీ వాన్స్‌కు ఆమె ఎంతో సహాకారం అందించారు. జేడీ వాన్స్ రాజకీయ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఓహియో నుంచి రిపబ్లికన్ సేనేటర్ గా జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. అయితే ఈసారి దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌తో పాటు జేడీ వాన్స్ తన భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. మిల్‌వాకూలో జరిగిన పార్టీ మీటింగ్‌లో ఇద్దరి ఎన్నికను ఖరారు చేశారు. ఒకప్పుడు ట్రంప్‌ను జేడీ వాన్స్ తీవ్ర విమర్శించారు. అయితే రాజకీయంగా తనకు తన భార్య నుంచి పూర్తి మద్దతు దొరికినట్లు జేడీ వాన్స్ ప్రకటించారు. ఉషా చిలుకూరి…