Author: Editor's Desk, Tattva News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని బిజెపి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య బూతుల పోటీలు మాత్రమే జరుగుతున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదు, ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి గతంలోనే స్పష్టం చేశామని, ఆనాడు అన్ని పక్షాలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నది తమ విధానమని తేల్చి చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం కోసం భూమిని కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయని, కొన్ని సంస్థలు చెల్లింపులు కూడా…

Read More

న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. ఈ మేరకు రాజ్యాంగంలో తక్షణ సవరణలు కోరుతూ తీర్మానం రూపొందించారు. ఇటీవల రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 67 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే ప్రధాన మంత్రి, న్యాయశాఖకు పంపనున్నట్లు బీసీఐ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ కూడా జడ్జీల పదవీ…

Read More

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ సెక్రటేరియట్‌ )కు అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం అంటూ భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉందని అంటూ ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి తమను నడిపిస్తోందని పేర్కొన్నారు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే భారత నూతన పార్లమెంట్ కుకూడా అంబేద్కర్ పేరును మించిన పేరు లేదనే…

Read More

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకి చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కర్తవ్య పథ్ ప్రారంభోత్సవం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని  నెలరోజుల పాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కి చెందిన సాంగ్ అండ్  డ్రామా విభాగం కళాకారులు  వినోదం, విద్య తో కూడిన సాంస్కృతిక,  వినోద కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. సంగీతం, నృత్యం, వీధి నాటకాలు, వినోద కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రజలను మంత్రముగ్దులను చేస్తున్నాయి. స్టెప్ ప్లాజా ఓపెన్-ఎయిర్ వేదికపై జరిగే కార్యక్రమాలను   ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత అన్ని వయసుల వారు ఉచితంగా చూడవచ్చు. రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. వారాంతాల్లో కార్యక్రమాలు మరింత ఆకర్షణీయంగా నిర్వహిస్తున్నారు.  భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక మేళవింపుతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆహ్లాదకర  వాతావరణంలో నిర్వహిస్తారు. వినోదంతో కార్యక్రమాల ద్వారా…

Read More

సెప్టెంబర్ 17 విముక్తా? విలీనమా? – 1స్వతంత్ర చరిత్రలో హైదరాబాద్ సంస్థానం విలీనం ఓ చారిత్రక ఘట్టం. దేశం మధ్యలో ఓ నిప్పుల కుంపటి వలే `విద్రోహ సామ్రాజ్యం’ నెలకొనేటట్లు చేసిన బ్రిటిష్ పాలకుల కుట్రలను సర్దార్ పటేల్ ధైర్యసాహసాలతో వమ్ము చేసి, `ఆపరేషన్ పోలో’ ద్వారా విర్రవీగిన నిజాంను దారిలోకి తెచ్చిన చారిత్రక ఘట్టం. ఏది ఏమైతేనేం నాటి నిజాం ఏలుబడిలో గల తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు నిజాం వారసులుగా భావించే మజ్లీస్ పార్టీ వారు కూడా సెప్టెంబర్ 17న అధికారిక కార్యక్రమాలను మొదటిసారిగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు నిజాం నిరంకుశ పాలన నుండి `విముక్తి పొందిన’ రోజుగా ప్రజానీకం భావిస్తుంటే, కొందరు రాజకీయ కారణాలతో కేవలం `విలీనం’ జరిగిన రోజు మాత్రమే అంటూ ఆ నాటి ప్రజల త్యాగాలను తక్కువచేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నిజాం? ఏమిటా…

Read More

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్‌ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో జెలెన్‌స్కీ తీవ్రమైన గాయాలేమీ కాలేదని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని జెలెన్‌స్కీ ప్రతినిధి సెర్హీ నైకిఫొరోవ్‌ తెలిపారు. అయితే ఈ రోడ్ ప్రమాదం ఎప్పుడు జరిగిందనే విషయాన్ని ఆయన తెలియజేయలేదు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ రాజధాని కీవ్‌లో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్‌ కారు వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుతోపాటు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే జెలెన్‌స్కీకి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అధ్యక్షుడితోపాటు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం జెలెన్‌స్కీని అంబులెన్సులో తరలించామని తెలిపారు. జెలెన్‌స్కీని పరిశీలించిన వైద్యులు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతారని తెలిపారు. హత్యాయత్నమా లేదా ప్రమాద వశాత్తు జరిగిందా…

Read More

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో విమానయానం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బందికి శ్వాస పరీక్షలు (బ్రీత్ అనలైజర్) పునరుద్ధరించింది. అక్టోబర్ 15 నుంచి పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సహా ప్రతి ఉద్యోగికి ఈ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. విమాన సిబ్బంది మద్యం సేవించారా లేదా అన్నది తెలుసుకోడానికి రోజువారీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే కొవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత ఈ నిబంధనపై కొన్ని పరిమితులు విధించారు. ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బందిలో 50 శాతం మందికి మాత్రమే ఈ శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 2021 మే నెలలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు గంటకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆదేశాలను న్యాయస్థానం ఇటీవల సవరించింది. దీంతోపాటు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడం, ప్రయాణికుల…

Read More

ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సంఘీభావంతో వ్యవహరించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ పిలుపిచ్చారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 77వ సమావేశాలు ప్రారంభమయ్యాయని జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు కసాబా కొరొసి ప్రకటించారు. కొత్త సమావేశాలు ప్రారంభమైనా గత సమావేశాల్లో పేర్కొన్న అనేక సవాళ్ళు ఇంకా అపరిష్కృతంగానే వున్నాయని గుటెరస్‌ పేర్కొన్నారు. ఘర్షణలు, వాతావరణ మార్పు, చిన్నాభిన్నమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, దారిద్య్రం, అసమానతలు, ఆకలి, అవిశ్వాసం వంటి పరిస్థితుల నుండి శాంతి, మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి దిశగా మనం ముందుకు సాగాల్సిన పరిస్థితుల్లో సంక్షోభంతో నిండిన ప్రపంచంలో మనం వున్నామని గుటెరస్‌ తెలిపారు. ఈ ఉమ్మడి సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మనమంతా సంఘీభావంగా వ్యవహరించాల్సి వుందని, ఈ క్రమంలో ఈ సంస్థ యొక్క పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించాల్సి వుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి అంటేనే సహకారానికి కేంద్ర బిందువు. అందులో జనరల్‌ అసెంబ్లీ అనేది జీవనాడి…

Read More

దేశంలో చిన్న కమతాలు కలిగి ఉన్న రైతుల అభ్యున్నతి, అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ అంకుర సంస్థలు పని చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సూచించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో రైతులు పండించే పంటకు తగిన ధర లభించేలా చూసి, రైతుల ఆదాయం పెరిగేలా చూసేందుకు సహకరించాలని కోరారు. మేనేజ్-సమున్నతి అవార్డులు 2022ను హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న మేనేజ్ సంస్థలో ఆమె అందజేస్తూ వ్యవసాయరంగంలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం సాధించేలా చూసేందుకు అవసరమైన వినూత్న ఆవిష్కరణలకు అంకుర సంస్థలు శ్రీకారం చుట్టాలని పిలుపు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నూనె గింజల మిషన్ ను ప్రారంభించిందని, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వ్యవసాయ అంకుర సంస్థల స్థాపన, ఎఫ్ పీఓల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలంబన…

Read More

కేవలం మైనారిటీ విద్యా సంస్థను నిర్వహించినంత మాత్రాన ఎంఇఆర్‌ఇ విద్యా సంస్థకు మైనారిటీ హోదాను ఇవ్వలేమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం ఆ విద్యా సంస్థను మైనార్టీ సంఘం స్థాపించాల్సి ఉందని తెలిపింది. ఆ విద్యాసంస్థను మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్‌గా కొనసాగించలేమంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు కూడా చట్ట వ్యతిరేకం కాదని పేర్కొంది. ట్రస్ట్‌ విద్యా సంస్థ విద్యార్థుల నుండి వసూలు చేయవలసిన ఫీజును వైద్య విద్యాశాఖ ఆమోదించింది. కొందరు ట్రస్ట్‌ సభ్యులు 2001లో ఓ మెడికల్‌ కాలేజీని స్థాపించారు. అనంతరం 2015లో ఆ ట్రస్ట్‌ సభ్యులు బుద్దిజమ్‌లోకి మారినప్పటికీ కాలేజీని కొనసాగించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మైనారిటీ హోదా కల్పించేందుకు నిరాకరించడంతో ఆ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు పూర్తి ఫీజును చెల్లించాలంటూ వైద్య విద్యాశాఖ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ తమ…

Read More