Author: Editor's Desk, Tattva News

క్రెడిట్‌ కార్డు, యూపిఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ కొలుకుందని చెప్పడానికి ఇది సంకేతమని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. వినియోగం పెరగడం వల్లే చెల్లింపులు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ వెల్లడించిన డేటా ప్రకారం యూపిఐ లావాదేవీలు ఏప్రిల్‌లో 9.83 లక్షల కోట్లు ఉంటే, ఆగస్టులో 10.73 లక్షల కోట్లకు పెరిగాయి. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఏప్రిల్‌లో 29,988 కోట్లు ఉంటే, ఆగస్టు లో ఇది 32,383 కోట్లకు పెరిగాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా ఇ-కామర్స్‌ సంస్థల నుంచి కొనుగోళ్లు ఏప్రిల్‌లో 51,375 కోట్లు జరిగాయి. ఆగస్టులో ఇవి 55,264 కోట్లకు పెరిగాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా జరుగుతున్న లావాదేవీలు 16 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసినట్లు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఎండీ, సీఈఓ రామ్మెహన్‌రావు చెప్పారు. కార్డుల వినియోగం భాగా పెరిగిందని, సంస్థలు జారీ చేసే క్రెడిట్‌…

Read More

జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించే విధంగా అధికరణ 370ని భారత రాజ్యాంగంలో మళ్లీ ప్రవేశపెడతామనే హామీని తాను ఇవ్వబోనని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. తప్పుడు వాగ్దానాలివ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుందని తాను విశ్వసించనని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా ఉత్తర కశ్మీరులోని బారాముల్లా పట్టణంలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, అధికరణ 370ని పునరుద్ధరించాలంటే లోక్‌సభలో కనీసం 350 ఓట్లు, రాజ్యసభలో కనీసం 175 ఓట్లు అవసరమని గుర్తు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు ఏ రాజకీయ పార్టీకి లేవని, సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. 50 కన్నా తక్కువ స్థానాలకు కాంగ్రెస్ క్షీణించిందని చెబుతూ ఈ నేపథ్యంలో అధికరణ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మాట్లాడితే, ఆ పార్టీ తప్పుడు వాగ్దానం చేస్తున్నట్లేనని ఎద్దేవా చేశారు. తన రాజకీయ ఎజెండాలోని అంశాలను వివరిస్తూ, జమ్మూ-కశ్మీరుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, స్థానికులకు…

Read More

ఈనెల 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన 15 మంది అగ్రనేతలు సదస్సులో పాల్గొంటారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రెండు రోజులపాటు సదస్సు జరుగుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా పలువురు ప్రపంచ నాయకులు సమావేశానికి హాజరవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన తర్వాత, తొలిసారి ఈ సమావేశంలో నేతలు వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు. చివరిసారి 2019 జూన్‌లో కిర్గిస్తాన్‌లోని బిష్‌కెక్‌లో వ్యక్తిగత సమావేశం జరిగింది. 2020, 2021లో సదస్సు వర్చువల్‌గా నిర్వహించారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ప్రధాని మోడీ 14వతేదీన సమర్‌కండ్‌ చేరుకుంటారు. 16వ తేదీన అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. సమర్‌ఖండ్‌ శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత ఎస్‌సిఒ తదుపరి అధ్య పదవిని చేపట్టనున్న నేపథ్యంలో ఈ సదస్సు భారత్‌కు కీలకమైంది. సెప్టెంబర్‌ 2023 వరకు…

Read More

ఆప్‌ ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె.సక్సేనాల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం వెయ్యి లోఫ్లోర్‌ బస్సుల కొనుగోలుపై సిబిఐ విచారణకు ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వి.కె. సక్సేనా ఆమోదం తెలిపి, విచారణ బాధ్యతలను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ)కి అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చీఫ్‌ సెక్రటరీ నరేష్‌కుమార్‌ సూచన మేరకు ఈ కేసును దర్యాప్తు సంస్థకు అ్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భేటీ అయిన సంసగతి తెలిసిందే. బస్సుల టెండర్లు, కొనుగోలుకు సంబంధించిన కమిటీకి చైర్మన్‌గా ఢిల్లీ రవాణా మంత్రిని నియమించడంతో బస్సుల కొనుగోలులో అవినీతి, అవతవకలు జరిగాయని జూన్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి ఫిర్యాదు అందిందని తెలిపారు. అలాగే బస్సుల కొనుగోలులో అవతవకలను సులభతరం చేసేందుకు ఢిల్లీ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (డిఐఎంటిఎస్‌) ని మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా నియమించినట్లు ఆ ఫిర్యాదులో…

Read More

పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి నిరసనగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు 150 రోజుల పాటు ‘భారత్‌ జోడో’ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో కన్యాకుమారి జిల్లా మార్తాండం ప్రాంతంలో ఉపాధి హామీ మహిళా కూలీలతో రాహుల్ ముచ్చటించారు. వాళ్ల సంపాదన, స్థితిగతులను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. ‘‘మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తన ట్విటర్‌లో వెల్లడించారు. “ఈ రోజు మధ్యాహ్నం మార్తాండమ్‌లో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ సందర్భంగా, ఒక మహిళ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తమిళనాడును ప్రేమిస్తున్నాడని, వారు అతనితో తమిళ అమ్మాయిని…

Read More

ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా చేసిన కృష్ణంరాజు తెలుగు చిత్రసీమలో రెబెల్‌ స్టార్‌గా పేరొందారు. కృష్ణంరాజుకు భార్య (శ్యామలాదేవి), ముగ్గురు కుమార్తెలున్నారు. ప్రముఖ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పెదనాన్న కూడా. కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ లో జరగనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు అసుపత్రిలో చేరారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికీ రెండు సార్లు పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆయన బాధ పడినట్లు సమాచారం. పరిస్థితి అత్యంత…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నుండి చేపట్టే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. గణేష్‌, విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పదిరోజులకే కుదించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, ఉప్పల్‌, ఎల్బీ నగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా శనివారం పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి. మనోహర్‌ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. పాదయాత్రను ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్నందున ఆయా కమిషనరేట్లకు పాదయాత్ర వివరాలను అందజేశారు. ఈనెల 12న కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్‌ ప్రత్యేక పూజలను నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు.…

Read More

అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థానంలోనే రామమందిరం ఉండేదని గుర్తించి, అందుకు సంబంధించిన ఆధారాలు వెలికితీసిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బ్రజ్‌ బాసిలాల్‌ అలియాస్‌ బీబీ లాల్‌ (101) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బీబీ లాల్‌ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బీబీలాల్‌ మే 2, 1921న ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీ జిల్లాలోని బడోరా గ్రామంలో జన్మించారు. సివ్లూలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ డైరెక్టర్‌గా సేవలందించారు. 1968 నుంచి 1972 వరకు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు అత్యంత పిన్నవయస్సులో డైరెక్టర్‌ జనరల్ గా పనిచేశారు. యునెస్కోలో వివిధ కమిటీలలో కూడా పాల్గొన్నాడు. కు బీబీలాల్‌ నాయకత్వం వహించారు. ఆ ప్రదేశంలో ఒక పురాతన దేవాలయం ఉందని నిరూపించారు. తదనంతరం ఆలయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బీబీలాల్‌ మహాభారతం, రామాయణం సంబంధించి సింధు లోయ, కాళీబంగన్‌కు సంబంధించిన ప్రదేశాలలో విస్తృతంగా పరిశోధనలు చేశారు. బీబీలాల్‌ మృతి పట్ల…

Read More

రాజకీయ సుస్థిరత, పరిపాలన సామర్థ్యం కోసం బలమైన ప్రధానులు లేదా ముఖ్యమంత్రులు, ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ గల ప్రభుత్వాలను కోరుకొంటుంటాము. కానీ హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రమే పరిమితంగా గల బలంతో జాతీయస్థాయి నాయకునిగా చెలామణి అవుతున్నమజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బలహీనమైన ప్రధాని, కిచిడి ప్రభుత్వం నేడు దేశానికి అవసరం అని పిలుపిచ్చారు. శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడని, కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం అని, ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడని అంటూ `విచిత్రమైన’ సిద్ధాంతీకరణ చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలతో అస్థిర ప్రభుత్వాల పనితీరును ప్రజలు ఇంకా మరచిపోలేదు. అయినా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘కిచిడీ’ ప్రభుత్వం వస్తేనే మంచిదని కూడా ఆయన చెప్పారు. ‘ఆప్’ పార్టీ అధికారంలో ఉన్న బిజెపికి భిన్నమైనదేమి కాదని మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న గుజరాత్ పర్యటన సందర్భంగా తెలిపారు. గుజరాత్‌లో డిసెంబర్‌లో జరుగనున్న ఎన్నికల్లో మజ్లీస్ తన అభ్యర్థిని పోటీకి నిలబెడుతుందని కూడా…

Read More

గోవాలోని తమ ఆస్తిని ఆక్రమించారని బ్రిటన్ కొత్త హోంమంత్రి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బ్రిటన్‌లో కొత్త ప్రధాని లిజ్ ట్రస్ సారధ్యంలో కొత్త హోంమంత్రి భారతీయ సంతతికి చెందిన మహిళ సూవెల్లా బ్రెవెర్మన్ నియమితులు అయ్యారు. ఆమె తండ్రి క్రిస్టి ఫెర్నాండెజ్ తనకు చెందిన పూర్వీకుల స్థలాలు రెండు కలిపి దాదాపు 13,900 చదరపు మీటర్ల వరకూ గోవాలోని అస్సాగోలో కొందరు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆస్తులను ఆక్రమించారని ఆరోపించారు. బ్రిటన్ హోంమంత్రి తండ్రి ఆస్తి అని తెలిసిన మరుక్షణం గోవా ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేసిందని అధికారులు శనివారం తెలిపారు. నార్త్ గోవాలో ఈ ఘరానా కబ్జాకు పాల్పడ్డారు. మొత్తం 13,900 చదరపు మీటర్ల స్థలం కావడంతో దీని విలువ భారీగానే ఉంటుందని వెల్లడైంది. ఈ…

Read More