అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కాల్పుల్లో షూటర్, ఒక వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరపడంతో ట్రంప్ చెవికి గాయమైంది. వెంటనే ట్రంప్ ను ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద హత్యాయత్నం తర్వాత ‘పోరాడమని’ మద్దతుదారులకు రక్తసిక్తమైన ట్రంప్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సభావేదికకు 182 మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఓ బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లింది. దీంతో ఆయన స్టేజిపై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే మాజీ అధ్యక్షుడి చుట్టూ రక్షణగా చేరారు. వేదిక పైనుంచి దించి దవాఖానకు తరలించారు. అనంతరం స్టేజీ పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన…
Author: Editor's Desk, Tattva News
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్‌లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అదేవిధంగా బీహార్‌లో ఉప ఎన్నిక జరిగిన ఏకైక అసెంబ్లీ స్థానాన్ని కూడా అధికార ఎన్డీఏ కూటమి నిలబెట్టుకోలేకపోయింది. మొత్తంగా 13 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 4, టీఎంసీ 4, బీజేపీ 2, ఆప్ 1, డీఎంకే 1, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు. ఇండియా కూటమి 10 స్థానాలను గెల్చుకోగా, ఎన్డీయే రెండు సీట్లకు పరిమితమైనది. ఒక సీట్ స్వతంత్ర అభ్యర్హ్డికి దక్కింది. పశ్చిమబెంగాల్‌లో రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మనిక్‌తలా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా మొత్తం నాలుగు స్థానాలను అధికార టీఎంసీ కైవసం చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా రెండు…
మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీకి భంగపాటు ఎదురైంది. క్రాస్ ఓటింగ్ ద్వారా అదనంగా ఎమ్మెల్సీ స్థానం పొందవచ్చని భావించింది. అయితే అధికార మహాయుతి కూటమికి అనుకూలంగా ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులకుగాను ప్రస్తుతం 274 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి 23 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. బీజేపీ, షిండే శివనేన, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమి తొమ్మిది మంది అభ్యర్థులను పోటీలో ఉంచింది. స్వతంత్రులు, చిన్న పార్టీలతో సహా 201 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. కాగా, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీతో కూడిన మహా వికాస్ అఘాడికి కేవలం 67 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సహా…
జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టాన్ని సవరించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. త్వరలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 అధికారాలను అమలు చేసే సెక్షన్ 55 నిబంధనలకు కేంద్ర హోం శాఖ చేసిన సవరణలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జులై 12న గెజిట్ విడుదల కావడంతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ పేర్కొంది. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ వ్యాపార లావాదేవీల సవరణకు రాష్ట్రపతి మరిన్ని నిబంధనలను రూపొందించినట్లు ఈ నోటిఫికేషన్ వెల్లడించింది. తాజాగా, సవరించిన చట్టాన్ని జమ్మూ కశ్మీర్ (రెండో సవరణ)- నియమాలు 2024 అని పిలవాలని ఎంహెచ్ నోటిఫికేషన్ తెలిపింది. తాజా సవరణలతో శాంతి భద్రతలకు…
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు కారణాలు తెలుసుకునేందుకు వచ్చి న కురియన్ కమిటీ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. మూడు రోజుల పర్యటనను రెండు రోజులకే కుదించుకొని శుక్రవారం తిరిగి వెళ్ళిపోయింది. కమిటీకి నేతృత్వం వహించిన పీజే కురియన్ శుక్రవారం ఉదయం కేరళకు వెళ్లిపోగా, మిగతా ఇద్దరు సభ్యులు సాయంత్రం 4 గంటల వరకు పార్లమెంట్ ని యోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, డీసీసీ అ ధ్యక్షుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ముందు హాజరైన ఓడిపోయిన ఎం పీ అభ్యర్థులు, గెలిచిన ఎంపీలు ఒకేలా రాసిచ్చిన స్క్రిప్ట్ మాదిరిగా బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడం వల్లనే ఓడిపోయామని చెప్ప డం పట్ల కురియన్ పెదవి విరిచింది. ‘ఇలా అయితే వాస్తవాలెలా బయటికి వస్తాయి? మమ్మల్ని కలువడానికి ముందు మీరంతా ఒకే విధంగా చెప్పాలని నిర్ణయించుకున్నారా?’ అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండో రోజు కూడా అవే కారణాలనే…
కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అ ధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో కూడా బిజెపి జెండా ఎగిరిందని వ్యాఖ్యానించారు. గతంలో రే వంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరిలో కూడా బిజెపి సత్తా చాటిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకు 14 శాతం నుంచి 35 శాతానికి పెరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్షంగా చేసుకుని పార్లమెంటు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) తొలి రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో నిర్వహించారు. గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటు శాతం పెరగడంతో రెట్టించిన ఉత్సాహం మీద ఉ న్న బిజెపి నాయకత్వం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే…
సుస్థిరాభివృద్ధిలో కేరళ అగ్రగామిగా నిలిచింది. అలాగే బీహార్ అత్యంత దిగువన నిలిచింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ, పేదరికం నిర్మూలన, విద్య, ఆకలి, వైద్యం వంటి 16 అంశాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు అంచనా వేసే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజి) ఇండియా ఇండెక్స్ 2023-24 రిపోర్టును శుక్రవారం నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఉత్తరాఖండ్, కేరళ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా నిలిచాయి. బీహార్ పనితీరు అధ్వానంగా నిలిచింది. కేరళ, ఉత్తరాఖండ్ 79 స్కోర్‌తో అగ్రగామిగా నిలిచాయి. తమిళనాడు 78 స్కోర్ సాధించి రెండో స్థానంలో ఉంది. గోవా 77 స్కోర్‌తో మూడో స్థానంలో ఉంది. అలాగే బీహార్ 57 స్కోర్, జార్ఖండ్ 62 స్కోర్, నాగాలాండ్ 63 స్కోర్, మేఘాలయ 63 స్కోర్‌తో అట్టడుగున ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చండీగఢ్, జమ్మూకాశ్మీర్, పుదుచ్ఛేరి, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇండియా 71 స్కోర్‌ను…
2023 సంవత్సరానికి 68వ సౌత్ ఫిలింపేర్ అవార్డులను ప్రకటించారు. ఫిలింపేర్ అవార్డులు ఆర్‌ఆర్‌ఆర్, సీతారామం సినిమాలు దక్కించుకున్నాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు రాగా ఉత్తమ దర్శకుడు రాజమౌళి దక్కింది. ఉత్తమ నటుడు రామచరణ్, జూనియర్ ఎన్‌టిఆర్, ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్‌ను వరించింది. విరాట్ పర్వం సినిమాలో నటించిన సాయిపల్లవికి ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగం, ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్‌కు అవార్డు వరించింది. ఉత్తమ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తమ దర్శకుడు రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తమ నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ (సీతారామం) ఉత్తమ సంగీత దర్శుడు కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం) ఉత్తమ గాయకుడు కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్ కొమరం భీముడో) ఉత్తమ గాయని (ఫిమేల్) చిన్మయి శ్రీపాద (సీతారామం) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) సీతారామం ఉత్తమ నటుడు (క్రిటిక్స్) దుల్కర్…
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25న రాజ్యాంగ హత్యాదినంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ను శుక్రవారం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించటమే కాకుండా ప్రజాస్వామ్య ఆత్మను ఉరితీశారని ఆరోపించారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలోకి తోశారని, మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. అందువల్ల ప్రతి ఏడాది జూన్ 25న సంవిధాన్ హత్యా దినంగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులులపై గుంటూరు లోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయింది. మాజీ వైసిపి ఎంపీ, ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఓ కేసులో తనను హైదరాబాద్‌లో అరెస్ట్ గుంటూరుకు తీసుకొచ్చి తనను నిర్బంధంలో చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా తనపై హత్యాయత్నం చేశారని రఘురామ నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ సునీల్‌కుమార్ (ఏ1), ఇంటెలిజెన్స్ మాజీ డీజీ సీతారామాంజనేయులు (ఏ2), వైఎస్ జగన్ (ఏ3), అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్ (ఏ4), గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (ఏ5)లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్…