Author: Editor's Desk, Tattva News

ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమని, ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా , ఓరాయ్ సమీపం లోని కైతేరి గ్రామంలో నాలుగు లేన్ల బుండేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించిన తరువాత జరిగిన సభలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో రహదారుల అనుసంధానం లేకపోవడానికి కారణం గత ప్రభుత్వాలేనని విమర్శించారు.  ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని, ఇవి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలని చెబుతూ  అనుసంధానం వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో రాష్ట్రం గొప్పగా పరివర్తన చెందుతోందని తెలిపారు. బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే వల్ల చిత్రకూట్ ఢిల్లీ మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయంఆదా అవుతుందని వెల్లడించారు.  అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల కలిగే ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ అని వివరించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే కేవలం వాహనాల వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా…

Read More

న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసుల పరిష్కారానికి నోచుకోక పెండింగ్ పేరుకుపోతున్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జైపూర్‌లో జరిగిన అఖిల భారత న్యాయసేవల అథారిటీస్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లేవనెత్తిన అంశాలకు ప్రస్తావిస్తూ న్యాయమూర్తులుగా తాము విదేశాలకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటారని, ఓ కేసును పరిష్కరించేందుకు ఎన్నేళ్ల సమయం పడుతుందని అడుగుతుంటారని చెప్పుకొచ్చారు. పెండింగ్ కేసులకు కారణమేమిటో మీ అందరికీ తెలుసని , దానిపై తాను సవివరింగా చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టక పోవడంతో పాటు జ్యుడీషియల్ మౌలిక వసతులను మెరుగుపర్చకపోవడమే పెండింగ్ కేసులు పేరుకుపోడానికి కారణమని స్పష్టం చేశారు. ఇదే విషయం తాను గతంలో ప్రధాన న్యాయమూర్తులు ముఖ్యమంత్రుల సమావేశంలోనూ తేల్చి చెప్పానని గుర్తు చేశారు. ఈ అంశాలను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థ శ్రమిస్తోందని, ప్రభుత్వం ఖాళీల భర్తీ, కోర్టుల్లో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని జస్టిస్…

Read More

రాష్ట్రపతి పదవి దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్రపతిని దేశపు మొదటి పౌరునిగా భావిస్తారు. అటువంటి అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలలో దేశంలోని పార్లమెంట్, శాసన సభల సభ్యులు అందరికి ఓట్ ఉంటుంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపిలు, ఎమ్మెల్యే (ఓటర్లు)ల్లో 43 శాతం మంది క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఇడబ్ల్యు) పేర్కొన్నాయి. 28 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 4,809 మంది ఎంపిలు, ఎమ్మెల్యేల్లో 4,759 మంది ఎంపిలు, ఎమ్మెల్యేల నేర చరిత్ర, ఆస్తుల వివరాలు పరిశీలించి నివేదిక రూపొందించారు. నేర చరిత్రలో తొలిస్థానంలో కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపి డిన్‌ కురియాకోజ్‌ ఉండగా, ఐదో స్థానంలో తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నారని పేర్కొంది. 2,030 ఎంపిలు, ఎమ్మెల్యేలు (43 శాతం)పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో…

Read More

ఇకపై పార్లమెంట్‌ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, దీక్ష‌లు, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌ను అనుమ‌తించ‌డం లేదు. దీనికి సంబంధించిన స‌ర్క్యూల‌ర్‌ను రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జారీ చేశారు.  జూలై 18 నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో.. రాజ్య‌స‌భ కార్య‌ద‌ర్శి జ‌న‌ర‌ల్ పీసీ మోడీ ఈ కొత్త ఆదేశాల‌ను ఓ బులెటిన్‌లో తెలిపారు.  ‘పార్లమెంటు ప్రాంగణాన్ని సభ్యులు ‘ధర్నా, సమ్మె, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోరాదు’ అని పేర్కొన్నారు.  స‌భ్యులంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.  రాజ్య‌స‌భ కార్య‌ద‌ర్శి తీసుకున్న నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం ర‌మేశ్ ఖండించారు. విశ్వ‌గురు కొత్త నాట‌క‌మ‌ని, ధ‌ర్నా మ‌నా హై అంటూ జైరాం త‌న ట్విట్ట‌ర్‌లో ఆరోపించారు. గ‌తంలో విప‌క్షాలు పార్ల‌మెంట్ కాంప్లెక్స్ లోప‌ల‌, గాంధీ విగ్ర‌హం ముందు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాయి. కొన్ని ప‌దాల‌ను పార్ల‌మెంట్‌లో వాడ‌రాద‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కొట్టిపారేసిన విష‌యం తెలిసిందే. కానీ…

Read More

భారత్‌ లో మొట్టమొదటిసారి ‘డిజిటల్ న్యూస్ నియంత్రణ పరిధిలోకి రాబోతుంది. డిజిటల్ న్యూస్ సైట్లు సహా సంబంధిత డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే వెబ్‌సైటు రిజిస్ట్రేషన్ రద్దు లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పిరియాడికల్స్ చట్ట సవరణ ప్రక్రియను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మొదలుపెట్టింది. డిజిటల్ న్యూస్ సంస్థలను పర్యవేక్షించే ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 90 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కాగా సంబంధిత బిల్లు ఆమోదం పొందితే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిర్వహించే అన్ని రకాల డిజిటల్ మీడియా న్యూస్‌ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే రిజిస్ట్రేషన్ రద్దు లేదా జరిమానా విధిస్తారు. ప్రెస్…

Read More

ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ కాన్వాయ్‌తో పాటు మరో రెండు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న అరవింద్‌కు చెప్పుల దండ వేసేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ భద్రత నడుమ బీజేపీ ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించివేశారు. వరద బాధితులను పరామర్శించి, వరద సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్న సమయంలో టీఆర్ఎస్‌ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. అర్వింద్ పై జరిగిన దాడి గురించి తెలిసి ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షా‌కు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు తెలిపారు. నిజామాబాద్…

Read More

ఒకవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 50 దేశాల్లో మంకీపాక్స్‌ వైరస్‌ కేసులు నమోదవగా, ఒక్కరు మరణించారు. ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల హెచ్చరించింది. తాజాగా, భారత్‌లో తొలి మంకీపాక్స్‌ కేసు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళలోని కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి ఈ వైరస్‌ బారిన పడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇటీవల కేరళకు వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు నిర్ధారణ అయిందని మేరకు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ వ్యాధి నిర్వహణ నిమిత్తం కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సమీప ప్రాంతాల్లో ఈ వైరస్‌ లక్షణాలు కన్పించినా, మంకీపాక్స్‌ కేసులు నమోదైనా, లేదా మంకీపాక్స్‌ లక్షణాలతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని…

Read More

ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో, ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్‌ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్‌ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచి పారిపోయాడు. ఆపై సింగపూర్‌ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో లంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్‌ జస్టిస్‌ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో…

Read More

కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని సాధారణ ప్రజలు, వ్యాపార-వాణిజ్య వర్గాలపైననే కాకుండా రాజకీయ పార్టీల ఆదాయవనరులపై సైతం పడింది. వివిధ రాజకీయ పార్టీలకు 2020-21లో అందిన విరాళాల గణాంకాలతో ఈ విషయం స్పష్టం అయింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో పార్టీలకు వివిధ రూపాలలో వచ్చిన విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గాయి. ఇది గత ఆర్థిక సంవత్సరపు విరాళాలతో పోలిస్తే 41.49 శాతం తక్కువ అని నిర్థారణ అయింది. 2020 మార్చి చివరిలో దేశంలో కరోనా తొలివేవ్ నమోదైంది. ఆర్థిక సంవత్సరం ఆరంభానికి కొద్దిగా ముందు తలెత్తిన వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా సుదీర్ఘకాల లాక్‌డౌన్ నెలకొంది. ఈ దశలోనే పార్టీల విరాళాల మొత్తాలు గణనీయంగా పడిపొయ్యాయని వెల్లడైంది. ఎన్నికల సంస్కరణల ప్రచార వేదిక అయిన ఎడిఆర్ ఈ వివరాలను తెలిపింది. అధికారంలో ఉన్న బిజెపికి ఈ కాలంలోనూ రూ  477.54 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతకు ముందటి ఏడాది…

Read More

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్ర అక్టోబరు 2 న ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ ప్రకటించారు. ఈ యాత్ర 148 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల మేర జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 25 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమై.. కాశ్మీర్‌లో ముగియనుంది. దాదాపు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా యాత్ర జరుగుతుందని తెలిపారు. గురువారం జరిగిన అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ పదాధికారుల సమావేశంలో ‘భారత్ జాగో’ యాత్ర విధివిధానాలపై చర్చించినట్లు దిగ్విజయ్ చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలు, ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగ సంస్థలను వ్యక్తులపై ఉసిగొల్పడం, అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల…

Read More