Author: Editor's Desk, Tattva News

తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్ నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు… ప్ర‌స్తుత డిజిపి ర‌వి గుప్తాను హోం శాఖ‌కు బ‌దిలీ చేశారు.. ఆయ‌న‌కు హోం శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కాగా, జితేందర్ నేడు బాధ్యతలు స్వీకరించారు  కొత్త డిజిపిగా నియమితులైన జితేందర్ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. డీజీపీగా జితేందర్ ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్‌ 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు…

Read More

ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భర్త నుండి భరణం పొందవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. భార్య భరణ హక్కుకు సంబంధించిన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుంచి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. భార్యకు భరణం పొందే చట్టబద్ధమైన హక్కును సూచించే పాత సీఆర్ పిసిలోని సెక్షన్ 125 ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. భరణం అనేది దాతృత్వం కాదని, వివాహిత మహిళల హక్కు అని, వారి మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తిస్తుందని బెంచ్ నొక్కి చెప్పింది. ఫ్యామిలీ కోర్టు మెయింటెనెన్స్ ఆర్డర్‌లో జోక్యం చేసుకోకూడదన్న తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేసిన మహ్మద్ అబ్దుల్ సమద్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విడాకులు తీసుకున్న ముస్లిం…

Read More

భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా నుంచి అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సబంధాలను పెంపొందించడానికి కృషి చేసిన ప్రధాని మోదీకి తమ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం అధికారికంగా ప్రదానం చేశారు. క్రెమ్లిన్‌లోని సెయింట్ ఆండ్రూ హాలులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీకి అ పురస్కారాన్ని పుతిన్ అందచేశారు. 2019లో ఈ అవార్డును రష్యా ప్రకటించింది. ఈ పౌర పురస్కారానికి ఎంపికైన తొలి భారత నాయకుడు నరేంద్ర మోదీ కావడం విశేషం. 1698లో అ వార్డును నెలకొల్పారు. ఏసు క్రీస్తు ముఖ్య శిష్యుడైన సెయింట్ ఆండ్రూ గౌరవార్థం ఈ అవార్డును అపరాజు జార్ పీటర్ ది గ్రేట్ నెలకొల్పారు. కాగా..రష్యా అత్యున్నత పౌర పురస్కారం తనకు లభించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం…

Read More

ఒడిశాలోని పూరీ జగన్నాథుని రత్న భాండాగారం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్‌ విశ్వనాథ్‌ రథ్‌ కమిటీ.. ఆ మేరకు ఒడిశా సర్కారుకు సిఫారసు చేసింది. దాంతో జూలై 14న జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాలను ఐదు చెక్క పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. అయితే గతంలో అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి సంపద లెక్కించేవారు. కానీ 1978 నుంచి దాన్ని తెరవడం ఆపేశారు. దాంతో ఆ భాండాగారం విషయంలో వివాదాలెన్నో తెరపైకి వచ్చాయి. ఆ భాండాగారానికి సంబంధించిన తాళం ఏమైందనే అంశం మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. బీజేడీ పాలన ముగిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ సర్కారు జగన్నాథుడి…

Read More

భారత క్రికెట్‌లో గౌతం గంభీర్‌ శకం మొదలైంది. జాతీయ పురుషుల సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తున్నట్టు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌తో మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ పదవీకాలం ముగియడంతో గంభీర్‌కు ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు అందులో పేర్కొంది.  అశోక్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని అడ్వైజరీ కమిటీ సూచన మేరకు గంభీర్‌ను ద్రావిడ్‌ వారసుడిగా ప్రకటించింది. వాస్తవానికి ఐపీఎల్‌-17 ఫైనల్‌ ముగిసిన వెంటనే హెడ్‌కోచ్‌ రేసులో గంభీర్‌ పేరు ప్రధానంగా వినిపించినా జీతభత్యాలు, సహాయక కోచింగ్‌ సిబ్బంది, ఇతర అంశాలపై చర్చలతో అధికారిక ప్రకటన ఆలస్యమైనట్టు బోర్డు వర్గాల సమాచారం. ద్రావిడ్‌ హయాంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలోనూ అప్రతిహత విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిందని, ఆ వారసత్వాన్ని గంభీర్‌ మరింత ముందుకు తీసుకెళ్తాడని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై…

Read More

నీట్-యుజి పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ పాట్నాకు చెందిన అభ్యర్థితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేసింది. దీంతో ఏజెన్సీ అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరుకుందని అధికారులు మంగళవారం తెలిపారు. నలందకు చెందిన నీట్-యుజి ఆశించిన సన్నీ, గయకు చెందిన మరో అభ్యర్థి రంజిత్ కుమార్ తండ్రిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. బీహార్ నీట్-యుజి పేపర్ లీక్ కేసులో గుజరాత్‌లోని లాతూర్, గోద్రాలలో అవకతవకలకు సంబంధించి ఒక్కొక్కరిని, సాధారణ కుట్రకు సంబంధించి డెహ్రాడూన్‌కు చెందిన ఒకరిని సిబిఐ ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బీహార్ నీట్-యుజి పేపర్ లీక్ కేసులో గుజరాత్‌లోని లాతూర్ , గోద్రాలలో అవకతవకలకు సంబంధించి ఒక్కొక్కరిని, సాధారణ కుట్రకు సంబంధించి డెహ్రాడూన్‌కు చెందిన ఒకరిని సిబిఐ ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మెడికల్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టిన సిబిఐ ఆరు…

Read More

2019-2024 మధ్యకాలంలో విద్యుత్ రంగంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని చెబుతూ ప్రజలపై మొత్తంగా రూ 32,166 కోట్ల అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ రంగంలో మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయామని తెలిపారు.  అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని, సోలార్ విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించారని వెల్లడించారు. గృహ వినియోగదారులపై రూ.8,180 కోట్ల భారం పడిందని చెప్పారు.  ‘‘పెత్తందారులు, పేదవారికి పోటీ అని చెప్పేవాడు. ఈ పెత్తందారీ పాలనలో పేదవాడు ఎలా నలిగిపోయాడో అందరికీ తెలిసింది. చేతకాని పరిపాలన కారణంగా మొత్తం విద్యుత్ సంస్థలు దెబ్బతిన్నాయి. అసమర్థుడు కారణంగా మొత్తం రూ.47,741 కోట్లు నష్టపోయాం. పోలవరం పవర్ ప్రాజెక్టు జాప్యం కారణంగా రూ.4,700 కోట్లు నష్టం వచ్చింది” అని తెలిపారు.  దేశంలోనే మొదటగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్‌ సంస్కరణలను…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 సంవత్సరానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 5.4 లక్షల కోట్ల రుణ ప్రణాళికను  విడుదల చేశారు. మంగళవారం విజయవాడలో సీఎం అధ్యక్షతన బ్యాంకర్ల ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఇందులో రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ. 1.65 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను ఖరారు చేశారు.  వ్యవసాయ రంగానికి రూ. 2.64 లక్షల కోట్లు రుణాల లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయ రంగానికి =గతం కంటే 14 శాతం అధిక రుణాలు ఇవ్వనున్నట్లు  చంద్రబాబు తెలిపారు. డెయిరీ, పౌల్ట్రీ, ఫిషరీస్‌, సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఏపీలో గత ఐదేండ్లలో జగన్‌ ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగాన్ని ఛిన్నాబిన్నం చేశారని ఆరోపించారు.  కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. బ్యాంకర్లకు ప్రభుత్వ…

Read More

భారత్‌ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్‌ లిఖిస్తోందని పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా భారత సంతతి వారితో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ రష్యా పర్యటనకు తాను ఒక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను, దేశ మట్టి వాసనను తీసుకొచ్చానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సమావేశ మందిరం కరతాళ ధ్వనులతో మార్మోగింది. ‘ఇటీవలే మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశాను. అందుకే మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతా. భారత్‌ సాధించిన విజయాలను చూసి ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయన్నాయి. ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్‌ ప్రయోగం చేశాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ గుర్తింపు పొందింది’ ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్‌…

Read More

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. తనపై వేసిన అనర్హత వేటును సవాలు చేస్తూ జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన జంగా కృష్ణమూర్తి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీంతో ఫార్టీ ఫిరాయించినందుకు గానూ ఆయనపై వేటు వేయాలని అప్పటి విప్‌ అప్పిరెడ్డితో పాటు వైసీపీకి చెందిన పలువురు సభ్యులు మండలి చైర్మన్‌ మోషెన్‌ రాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో జంగా కృష్ణమూర్తి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని.. ఇది కక్షపూరిత చర్య అని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పార్టీ మారిన…

Read More