అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన కురిసిన కుంభవృష్టికి వరద పోటెత్తి 15 మందికిపైగా చనిపోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఎయిర్ అంబులెన్సుల్లో తరలిస్తున్నారు. కుండపోతగా వాన కురుస్తున్న సమయంలో అమర్‌నాథ్ గుహ దగ్గర దాదాపు 12 వేల మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. వరదల్లో చనిపోయిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అమర్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్లుఅదని తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. భక్తులతో అమర్‌నాథ్ గుహ దగ్గరి బేస్ క్యాంప్ కిక్కిరిసి ఉంది. వందలాది మంది అక్కడ టెంట్లు వేసుకుని సేద తీరుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 సమయంలో ఆకాశానికి చిల్లుపడినట్లుగా…
Author: Editor's Desk, Tattva News
రాష్ట్రంలో 8 వేలకుపైగా స్కూళ్లకు తాళాలు వేసి, భావి భారత పౌరులకు విద్యను దూరం చేస్తున్న ముద్దుల మామయ్య అమ్మఒడి నుంచి తప్పించుకోవటానికా? అసలు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడానికా? అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు వైసీపీ నాయకత్వం సమాధానం చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 స్కూళ్ళను మూసేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడున్న చిన్నారుల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. తమ బడి కోసం పిల్లలు పోరాటం చేస్తున్న తీరు, పిల్లలను రోడ్లపై కూర్చోపెట్టిన ఘన చరిత్ర వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బహిరంగ వేదికలపై ‘మాట తప్పం..’ అనే ఊత పదాలతో జనాన్ని మభ్య పెడుతున్న వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా మాట తప్పుతోందని నాగబాబు ధ్వజమెత్తారు. సంఖ్యాపరంగా అంచనా వేసి.. ఉన్న బడులను మూసేసి, దూర ప్రాంతాలలో విలీనం చేసి,…
రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకు పోయాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యాన్ని సేకరించి, మిల్లుల్లో బియ్యంగా మార్చి, ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ వాటాను మిగుల్చుకుని మిగతా మొత్తాన్ని సెంట్రల్ పూల్ కింద కేంద్ర ప్రభుత్వానికి (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అందజేయాల్సి ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మిల్లుల నుంచి సేకరించకపోవడం వల్ల నిల్వలు పేరుకు పోయాయని తెలిపారు. ఈ కారణంగా రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేను కలిసి తెలంగాణలో రైస్ మిల్లర్ల ఇబ్బందులను వివరించానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని…
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఫెమా ఉల్లంఘనల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఈ సంస్థకు భారీ పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కంపెనీ మాజీ సీఈవో ఆకర్ పటేల్‌కూ భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ‘విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం’ (ఎఫ్‌సిఆర్‌ఎ)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు రుజువు అయ్యాయని చెప్తూఉల్లంఘనల కింద రూ.51.72 కోట్లను పెనాల్టీని విధిస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. అలాగే మాజీ సీఈఓ ఆకర్ పటేల్‌కు సైతం రూ 10 కోట్లను జరిమానాగా విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్‌లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు ఆమ్నెస్టీ స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని గతంలోనే పేర్కొంది. భారతదేశంలో తన ఎన్జీవో కార్యకలాపాలను విస్తరించేందుకు విదేశీ భాగస్వామ్య…
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై శుక్రవారం ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. పశ్చిమ జపాన్‌లోని నారా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు జరిపినట్లు జపాన్ అధికారులు చెప్పారు. నారాలోని ఒక వీధిలో ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తున్నప్పుడు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో షింజో అబేపై వెనుక నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షింజో అబే ఛాతీలో బుల్లెట్ తగిలిందని అధికారులు పేర్కొన్నారు. అబే కుప్పకూలిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి తరలించారు. కాల్పులతో తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు చెబుతున్నారు. అబే కుప్పకూలిన సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. సంఘటనా స్థలంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అబే ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి షాట్‌గన్‌తో దాడి చేసినట్లు జపాన్ అధికారులు చెప్పారు. బూడిదరంగు టీ-షర్టు ధరించిన 41 ఏళ్ల అనుమానితుడిని ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అబేపై కాల్పులు…
ఒక ప్రైవేట్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీఎస్ ఝా, ఆరుగురు టాటా ప్రాజెక్ట అధికారులను అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. టాటా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు దేశ్‌రాజ్ పాఠక్, అసిస్టెంట్ ఉపాధ్యక్షుడు ఆర్‌ఎన్ సింగ్‌లు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ అభియోగాలకు సంబంధించి సీబీఐ అధికారులు ఘజియాబాద్, నొయిడా, గురుగ్రామ్ తదితర 11 ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేశారు. బిఎస్ ఝా ఇంట్లో రూ. 93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈటానగర్‌లో బీఎస్ ఝా పనిచేస్తున్నారు. టాటా ప్రాజెక్టుకు చెందిన పలు ప్రాజెక్టులకు బీఎస్ ఝా అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు ఆరోపించారు. అందుకు ముడుపులు అందుకున్నారని తెలిపారు. టాటా ప్రాజెక్ట్ , ఇతర కంపెనీలకు వివిధ ప్రాజెక్టులపై అనుకూలంగా వ్యవహరించినందుకు ఆయా కంపెనీల నుంచి ఝా ముడుపులు స్వీకరించినట్టు సమాచారం అందినప్పటి నుంచి ఝాపై సీబీఐ అధికారులు నిఘా…
నాగాలాండ్‌లోని తిరు ఊటింగ్ ఏరియాలో గతేడాది డిసెంబరు 4న జరిగిన మిలటరీ ఆపరేషన్‌లో అయాయకులనే సైనిక బలగాలు బలిగొన్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిటి) నిర్ధారించింది. టీమ్ కమాండర్ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పులు, తదనంతరం చేపట్టిన హింసాత్మక చర్యలు, మాఫీ ప్రయత్నాల వల్లనే రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 13 మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని సిట్ తేల్చి చెప్పింది. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని కావాలనే నొక్కి పెట్టారని వెల్లడించింది. ఆర్మీ మేజర్ ర్యాంక్ టీమ్ కమాండర్ దాదాపు 50 నిముషాల పాటు ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన అనంతరం ఈ దాడి తప్పుడు మార్గంలో వెళుతోందనే విషయం గ్రహించారు. అయితే కీలకమైన ఈ సమాచారాన్ని కావాలనే తొక్కి పెట్టి 21 పారా స్పెషల్ ఫోర్సెస్‌లో అత్యంత అధునాతనమైన ఆల్ఫా టీమ్‌కి చెందిన 30మంది ఆర్మీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత మాన్ జిల్లాలో ఆపరేషన్ జరపాల్సిందిగా…
బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించిన ప్రధాని జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలని ఆయన సూచించారు. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందని చెప్పారు.…
మంత్రుల తిరుగుబాటుతో ప్రధాన మంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించడంతో తదుపరి బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ కు అవకాశాలు ఉన్నట్లు మీడియా కధనాలు వెల్లడిస్తున్నాయి. మొదటగా రాజీనామా చేసింది ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్ ఆయనే కావడం గమనార్హం. తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న ఆయన కనుక ప్రధాని అయితే ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. 42 ఏళ్ల రిషి సునక్‌ను ప్రధాని బోరిస్ జాన్సన్ ఫిబ్ర వారి 2020లో ఎక్స్‌చెకర్ చాన్స్‌లర్‌గా నియమించారు. ఫలితంగా తొలిసారి పూర్తిస్థాయి కేబినెట్ హోదా పొందారు. బ్రిటన్ ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి కూడా రాజీనామా చేస్తున్నల్టు బోరిస్ జాన్సస్ గురువారం ప్రకటించారు. . దీంతో కొత్త ప్రధాని ఎంపికకు మార్గం సుగుమం చేసినట్లయింది. ఇటీవల దేశంలో వరుస కుంభకోణాలు బయటపడటంతో సొంత పార్టీకి చెందిన మంత్రులే రాజీనామా చేశారు. సుమారు 59 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో…
పోచారం ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి మాట తప్పిందని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె మండిపడ్డారు. కమీషన్ వచ్చే ప్రాజెక్టులు తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్‌ల గురించి కేసీఆర్‌కు పట్టదని ఆమె ఎద్దేవాచేశారు. ‘‘కాళేశ్వరం సర్వరోగ నివారిణిగా చెబుతూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుండు. పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్టు ఎత్తు పెంచి మరో 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించాలన్న జిల్లా రైతుల డిమాండ్‌ను పాలకులు అసలు పట్టించుకుంటలేరు” అంటూ ఆమె విమర్శించారు. అధికార పార్టీ పాలకులు ఎన్నికల సమయంలో ప్రాజెక్ట్ పెంపుపై హామీలిచ్చి ఆ తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారిందని విజయశాంతి విచారం వ్యక్తం చేశారు. వందేండ్ల కింద 2.43 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్టు…