Author: Editor's Desk, Tattva News

శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబై మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పదిహేను రోజుల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధించింది. ఈమేరకు ఓ కేసులో గురువారం తీర్పు వెలువరించింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన భార్య డాక్టర్ మేధా కిరీట్ సోమయ్యలపై సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మీరా భాయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో భారీ స్కాం జరిగిందని సంజయ్ రౌత్ గతంలో ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కిరీట్ సోమయ్య దంపతులు రూ.100 కోట్ల స్కాం చేశారని విమర్శించారు. దీనిపై తీవ్రంగా మండిపడ్డ డాక్టర్ మేధా కిరీట్ సోమయ్య.. సంజయ్ రౌత్ పై పరువునష్టం దావా వేశారు. ఈ దావాను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్.. సంజయ్ రౌత్ నిరాధార ఆరోపణలు చేశారని…

Read More

ముంబయి మహా నగరాన్ని వరుణుడు వణికిస్తున్నాడు.  ముంబైలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వానతో ముంబై అతలాకుతలం అయ్యింది. బుధవారం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వర్షం దంచికొట్టింది. ఈ నేపత్యంలో గురువారం పుణె, ముంబైలోని విద్యాసంస్థలకు సెలవు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. రోడ్లు రహదారులు జలయమయ్యాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై దేశ ఆర్ధిక రాజధానిలో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై నడుం లోతు వరకు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  భారీ వర్షాల కారణంగా ముంబ్రా బైపాస్ వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు జామ్ అయ్యింది.  అగ్నిమాపక అధికారి స్వప్నిల్ సర్నోబత్ మాట్లాడుతూ.. దాదాపు 3 గంటలపాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని, ఈ సమయంలో ట్రాఫిక్‌ విభాగం కూడా ట్రాఫిక్‌ను ఒకవైపు…

Read More

శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టుగా గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు కాఫ్‌ ల్యాబ్‌ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారు సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి వాటిని ముందే హెచ్చరించామన్నారు. మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని కానీ, ఎన్ని హెచ్చరికలు చేసినా ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌లో మాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థ ఈ ఏడాది జూన్‌ 12, 20, 25, జులై నాలుగో తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి…

Read More

రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలో నెంబర్‌ 1 అభివృద్ధి చేయడానికి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్టు రాష్ట్ర విద్య, ఐటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. ఉత్తరాంధ్రను అతిపెద్ద ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని బుధవారం విశాఖలో భారత పారిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యాన జరిగిన ఎపి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సమ్మిట్‌-2024కు ముఖ్యఅతిథిగా పాల్గొంటూ చెప్పారు. 2019-2024 మధ్య కాలంలో బయటకుపోయిన పెట్టుబడిదారులంతా ఇప్పుడు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఐటి, పారిశ్రామిక పాలసీని రూపొందించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. విశాఖకు ఎప్పుడూ తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, మరిన్ని పెట్టుబడులు విశాఖకు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఇడిబి)ను ఏర్పాటు చేసి శాఖల ప్రగతిని సమీక్షిస్తామని, సిఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఇది నడుస్తుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో గ్రీన్‌ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, దేశంలోనే అతిపెద్ద పెట్రో…

Read More

తిరుపతి లడ్డుకు సరఫరా చేసిన నెయ్యిని వైసీపీ పాలనలో కల్తీ చేశారని దేశ వ్యాప్తంగా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతుండగా, ఈ అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతీసేలా వ్యవహారించి ముఖ్యమంత్రి చదన్రాబాబు నాయుడు వ్యవహరించిన తీరుకు ప్రక్షాళన జరగాలని కోరుకోవాలని ప్రకటన విడుదల చేశారు. రాజకీయ దుర్భిద్ధితో కావాలని అబద్ధాలడారని వైఎస్ జగన్ ఆరోపించారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చంద్రబాబు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని ఆయన కోరారు. మరోవంక, 28న…

Read More

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై జరుగుతున్న దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్​పై హత్యాయత్నం జరగగా, తాజాగా కమలా హారిస్​ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రిపూట తుపాకులతో దాడి చేశారు. అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు బరిలో ఉన్నారు. అయితే వీరిపై జరుగుతున్న దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కమలా హారిస్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గడచిన అర్థరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరిజోనాలోని డెమోక్రటిక్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అర్థరాత్రి…

Read More

కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద అడ్మిషన్లు అనేది పెద్ద మోసమని, దీన్ని వెంటనే ఆపాల్సి వుందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. పంజాబ్‌ రాష్ట్రంలో అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్‌ఆర్‌ఐ కోటా నిర్వచనం పరిధిని విస్తరించాలని పంజాబ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసింది. ఆ అప్పీల్‌ను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎన్‌ఆర్‌ఐల అంకుల్స్‌, ఆంటీలు, కజిన్లతో సహా దూరపు బంధువులందరినీ 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కిందకు చేరుస్తూ ఆగస్టు 20న ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యను పంజాబ్‌, హర్యానా హైకోర్టు సెప్టెంబరు 10న కొట్టివేసింది. ‘ఇది డబ్బు సృష్టించే యంత్రం తప్ప మరొకటి కాదు.’ అని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. ”అన్ని పిటిషన్లను కొట్టివేయాలి. ఈ…

Read More

వైఎస్సార్సీపీకి, జగన్కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇదే బాటలో మరి కొందరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి రాజ్యసభలో మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలను వైఎస్సార్సీపీ సాధించింది. సంఖ్యా బలం పరంగా రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా…

Read More

శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. మంగళవారం ఆమె నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మరో మహిళ హరిణి. 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మరో ఇద్దరు నేతలను క్యాబినెట్‌ మంత్రులుగా నియమించారు. దాంతో శ్రీలంకలో దిసనాయకేతోపాటు మొత్తం నలుగురితో కూడిన క్యాబినెట్‌ కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్యం, పెట్టుబడులు లాంటి కీలక శాఖలను కేటాయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్ర లిఖించారు.…

Read More

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు. సీఐలు, ఎస్‌ఐలు సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని చంద్రబాబు వారం రోజుల క్రితం వెల్లడించడంతో ఆ అంశంపై దుమారం చెలరేగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కల్తీనూనే వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని…

Read More