మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం మంచి నిర్ణయమే అయినప్పటికీ, దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని, మిగతా రాష్ట్రాల్లోనూ దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం చీఫ్‌జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి తరువాత ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. “మహిళలకు నెలసరి సెలవులు ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు ప్రోత్సహించినట్టు అవుతుంది. అయితే వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారి తీయవచ్చు. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గొచ్చు. అది మేం కోరుకోవడం లేదు. మహిళల ప్రయోజనాల కోసం కొన్నిసార్లు మనం చేసే…
Author: Editor's Desk, Tattva News
మయన్మార్‌లో రాఖైన్ మైనార్టీ తెగల రెబెల్ సైన్యం సైనిక ప్రభుత్వంపై తిరుగుబాటులో తమ పట్టు బిగించింది. తాము దేశంలోని అత్యంత కీలకమైన రిసార్ట్ ప్రాంతపు తాండ్వే ఎయిర్‌పోర్టు (దీనినే మా జిన్ ఎయిర్‌పోర్టు అని కూడా అంటారు)ను స్వాధీనపర్చుకున్నట్లు ఈ వర్గం ప్రకటించింది. తమకు ప్రత్యేక ప్రాంతం ఏర్పాటు కోసం ఈ తెగ చాలా కాలంగా మయన్మార్ సైనిక ప్రభుత్వంతో పోరాడుతోంది. ఇప్పుడు తమకు భారీ విజయం దక్కినట్లు ఈ రెబెల్స్ సోమవారం తెలిపారు. ఈ ప్రాంతం వారు కూడా ఈ ఎయిర్‌పోర్టు స్వాధీనాన్ని ధృవీకరించారు. ఈ రెబెల్ సైన్యాన్ని అరకాన్ ఆర్మీగా వ్యవహరిస్తారు. ఈ సైన్యం స్థానిక బౌద్ధ రాఖైన్ మైనార్టీ వర్గానికి అనుబంధంగా ఉంది. సైనిక ప్రభుత్వంతో తలపడుతోంది. దేశంలో ఎన్నికల ద్వారా ఏర్పాటు అయిన అంగ్ సాన్ సూకి ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం తమ జుంటాను నెలకొల్పిన తరువాత ఈ వర్గం నుంచి తొలిసారిగా గట్టి దెబ్బతిందని…
వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమలలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు పాల్పడిన అవినీతి, అక్రమ చర్యలపై ఏపీ సిఐడి లేదా ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్‌కు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వైసీపీకి లబ్ది చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని వారు ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సంప్రదాయానికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారిని కాకుండా ధర్మారెడ్డిని ముందు జేఈఓగా తరువాత, తర్వాత ఈఓగా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించిందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు ధర్మారెడ్డి ప్రయత్నించారని వారు ఆరోపించారు. తిరుమలలో గెస్ట్ హౌస్‌లకు…
హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ గెలుపొందారు. 45 మంది ఎమ్మెల్యేల ఓట్లతో విశ్వాస పరీక్షలో నెగ్గారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. ఇందులో అధికార కూటమిలోని జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 42 మంది సభ్యుల మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మార్కు 38కి తగ్గింది. జేఎంఎంకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగానే సోరెన్ విశ్వాస పరీక్షలో నెగ్గేశారు. ఇక విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. గతవారం రాజ్‌భవన్‌లో హేమంత్ సోరెన్…
నీట్ అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. పేపర్ లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకైందన్న మాట వాస్తవమేనని కోర్టు పేర్కొంది. లీకైన పేపర్ ఎంత మందికి చేరిందో తేలాల్సి ఉందని అభిప్రాయపడింది. పేపర్ లీక్‌తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందంటున్నారన్న పేర్కొంది. లీకేజీలో ఇద్దరు విద్యార్థుల పాత్రే ఉండడంతో పరీక్షను రద్దు చేయలేమని చెప్పింది. లీక్ అయిన పేపర్ ఎంత మందికి చేరిందో గుర్తించారా?.. పేపర్ లీక్ లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారో తెలుసుకున్నారా? అని కేంద్రం, ఎన్‌టీఏను ప్రశ్నించింది. పేపర్ లీక్ అనేది 23లక్షల మందితో ముడిపడి ఉన్న అంశమని, జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని వెల్లడించింది. లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారని, ఎంతమంది ఫలితాలను హోల్డ్‌లో…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సతీమణి విజయమ్మ, ఇతర ముఖ్య నాయకులు నివాళులు అర్పించారు. జగన్‌తో పాటు తల్లి విజయమ్మ, మేనత్త విమలమ్మ, సతీమణి భారతి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మూడ్రోజులుగా కడప పర్యటనలో భాగంగా జగన్ సామాన్య ప్రజల్ని నేరుగా కలుస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో సొంత ప్రజల్ని కూడా దగ్గరకు రానివ్వలేదని అపవాదును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులు, పార్టీశ్రేణుల్ని ఎలాంటి అటంకాలు లేకుండా కలుస్తున్నారు. ఇడుపులపాయ ఘాట్ వద్దకు వచ్చిన స్థానికులు, అభిమానుల్ని జగన్ అప్యాయంగా పలకరించారు. మరోవంక, ఇడుపులపాయలో వైఎస్సార్‌కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా నివాళులు అర్పించారు. షర్మిల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తారని ప్రచారం జరిగినా జగన్ నివాళులు అర్పించే సమయంలో…
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మధ్య వివాదాలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎన్నికల ముందు నుంచి రాజ్‌భవన్, సీఎంవోకు మధ్య విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసుశాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, కోల్‌కతా సెంట్రల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీపై హోం మంత్రిత్వ శాఖ క్రమశిక్షణా చర్యలను ప్రారంభించింది. సీపీ వినీత్ గోయల్, డీసీపీ ఇందిరా ముఖర్జీల పనితీరుపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. ఈ అధికారులు పని చేస్తున్న తీరు ప్రభుత్వోద్యోగికి పూర్తిగా తగదని గవర్నర్ తన నివేదికలో ఆరోపించారు. జూన్ నెలాఖరులో గవర్నర్ సీవీ…
జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. అలాగే రాజౌరిలో జరిగిన ఉగ్రదాడిలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగుర్ని చంపడం ఉగ్రవాదుల ఏరివేతలో ప్రధానమైన ముందడుగుగా జమ్ముకాశ్మీర్ డిజిపి ఆర్‌ఆర్ స్వైన్ పేర్కొన్నారు. కాగా, రాజౌరి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో జమ్ము కశ్మీర్‌లో ఇటీవల పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాల వెనుక లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉన్నట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. కుల్గాంలోని చినిగాం, మోటర్‌గామ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో శనివారం నుంచి . పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయని అన్నారు. తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరిపారని డిజిపి తెలిపారు. చినిగాంలో ఒకరు, మోటర్‌గామ్‌లో ఒకరు మొత్తం ఇద్దరు సైనికులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందినట్లు చెప్పారు. చనిపోయిన…
బోనాల పండుగ హైదరాబాద్ జంట నగరాల సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, గతంలో బోనం మట్టి కుండలోనే చేసేవారని, ఇప్పుడు కూడా బోనం ప్రకృతి పర్యావరణమే కాకుండా అమ్మవారికి ఇష్టమైన మట్టి కుండలోనే చేయాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల పండుగ వైభవంగా ప్రారంభం కాగా, శివసత్తుల పూనకాలతో, పోతరాజుల వీరంగాలతో, డప్పు దరువులతో భాగ్యనగరం శివమెత్తింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పలు ఆలయాలకు వెళ్లిన మంత్రులు కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌లు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఘటాలు సమర్పించుకున్నారు. అనంతర మంత్రి పొన్నం మాట్లాడుతూ బోనం మట్టి కుండలో సమర్పిస్తేనే మరింత పుణ్యం ఉంటుందని, ఇతర పాత్రల్లో చేసిన దానికంటే మట్టి కుండలో చేస్తేనే అమ్మవారి ఆశీర్వచనం అందుతుందని చెప్పారు. హైదరాబాద్ బోనాల్లో పాల్గొనే భక్తులందరూ మట్టి కుండలోనే బోనం చేయాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి…
పూరీలో జగన్నాథుడి రథయాత్ర తొలిరోజు ఆదివారం శోభాయమానంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. గుండిచా దేవి ఆలయానికి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు బయలుదేరాడు. కాగా ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ వీధులన్నీ మార్మోగాయి. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామున రత్నసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువుదీరారు. అనంతరం జగన్నాథుడిని అలంకరించారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహరా చేశారు. సాయంత్రం 4 గంటలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టి 5…