గతంలో ఎన్నడూ లేని విధంగా తన ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్న అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. భారతీయ అమెరికన్, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ ఆరతీ ప్రభాకర్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ (ఓఎస్‌టీపీ) సలహాదారుగా నామినేట్ చేశారు. ఈ నామినేషన్ చారిత్రాత్మకమైంది. ఓఎస్‌టీపికీ సెనేట్ ధృవీకరించిన డైరెక్టర్‌గా నామినేట్ చేసిన తొలి మహిళ, వలసదారు ప్రభాకర్ అని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. దీనికి సెనేట్ ఆమోదం లభిస్తే చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రభాకర్. అలాగే బైడెన్ సర్కార్‌లో పనిచేయనున్న మూడవ ఆసియా అమెరికన్‌గా కూడా ఆమె నిలుస్తారు. ముఖ్య సలహాదారుగా, సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్స్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌కు కో-చైర్‌గా, ప్రెసిడెంట్ క్యాబినెట్ సభ్యునిగా ఉంటారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్ ప్రభుత్వంలో ఇప్పటికే పలువురు భారత సంతతి…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అవినీతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్), ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై ఫిర్యాదు చేశారు. రూ.9 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిందని ఆరోపించారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రూ 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా, కేసీఆర్ సర్కార్ రూ. 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. తెలంగాణతో పాటు సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. …
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ద్వారా ఈ అత్యున్నత పదవికి తొలిసారి ఓ గిరిజన మహిళ చేరుకొనే అవకాశాన్ని బిజెపి కలిగించింది. ఇప్పటి వరకు గిరిజనులు ఎవరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత అడవులను చేపట్టలేదు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా. నితిన్ గడ్కరీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో దాదాపు 20 మంది పేర్లను పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అనేక మంది పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ రాష్ట్రపతిగా ఎస్‌టి మహిళను చేయాలని నిర్ణయించినట్లు నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి వెనుక ఆరోపణలు ఎదురుకుంటున్న ఆవుల సుబ్బారావును ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నుండి ఆయన్ను విచారించబోతున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ విధ్వంసంలో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. అయినా, ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయక పోవడం, కనీసం విచారణ కూడా చేయక పోవడంతో అతనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు చెలరేగాయి. అతనికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కధనాలు వెలువడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖ రాజకీయ నేతలతో అతనికి గల సన్నిహిత…
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన శివసేన తిరుగుబాటు నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో సూరత్‌ను విడిచిపెట్టి బుధవారం ఉదయం గౌహతికి చేరుకున్నారు. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేసిన 34 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర శాసనసభ్యులు ఏక్‌నాథ్ షిండేతో కలిసి గౌహతి నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ కు వచ్చారు. సూరత్‌లోని లే మెరిడియన్ హోటల్‌లో బస చేసిన దాదాపు శివసేన ఎమ్మెల్యేలను బుధవారం తెల్లవారుజామున విమానంలో గౌహతికి తరలించారు. ‘ ‘మేం బాలాసాహెబ్ థాకరే శివసేనను విడిచిపెట్టలేదు…మేం బాలాసాహెబ్ హిందుత్వను అనుసరిస్తున్నాం. దానిని మరింత ముందుకు తీసుకువెళతాం’’ అని ఏక్‌నాథ్ షిండే సూరత్ విమానాశ్రయంలో విలేకరులతో స్పష్టం చేశారు. తనతో పాటు 40 మంది ఎమ్యెల్యేలు ఉన్నారని, మరో 10 మంది ఎమ్యెల్యేల మద్దతు తనకు ఉన్నదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం లేదని,…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అగ్నిపథ్ పథకంపై మూడు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు కావడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు వినాలని సుప్రీం కోర్టును అభ్యర్థించింది. అడ్వకేట్ హరీష్ అజయ్‌సింగ్ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. హరీష్ అజయ్ సింగ్ సోమవారం దాఖలు చేసిన తన పిటిషన్‌లో మిలిటరీ వ్యవహారాలు, రక్షణ మంత్రిత్వశాఖకు సమాచారం అందించడానికి, రిటైర్డు మిలిటరీ ఆఫీసర్లతో సహా సూచనలు ఆహ్వానించడానికి, రిటైర్‌మెంట్ అయిన తరువాత 75 శాతం అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించడానికి పథకం సవరించడానికి, వీలుగా చట్టపరమైన కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే పథకంపై అంతకు ముందు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఇటీవల అగ్నిపథ్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వందల ఏళ్ల నుంచి ఉన్న ఎంపిక విధానాన్ని…
అస్సాంలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. భారీ వరదలు పోటెత్తడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయిలవుతున్నారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులతో పాటు దాని ఉప నదులు ఉప్పొంగడంతో ఈశాన్య రాష్ట్రంలో దాదాపు 48 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడింది. వరదల కారణంగా.. 449 గ్రామాల్లోని 2 లక్షల 07 వేల 143 మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. వరదల వల్ల 113485.37 హెక్టార్ల పంట నష్టానికి గురైందని అంచనా వేస్తున్నారు. 33 లక్షల 84 వేల 326 జంతువులపై ఎఫెక్ట్ పడిందని, ఇందులో 5 వేల 232 పశువులు కొట్టుకుపోయాయని పేర్కొంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది. బరాక్ లోయలో ఉన్న కాచర్ కు సిబ్బందిని తరలించారు. భువనేశ్వర్ నుంచి నాలుగు యూనిట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించామని…
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ వంటి గొప్ప సినిమాను రూపొందించినందుకు చిత్రబృందాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా నాథ్ అభినందించారు. ‘మేజర్’ మంచి విజయం సాధించిన సందర్భంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు మూవీ యూనిట్‌ను మంగళవారం కలిసి ప్రశంసించారు. తర్వాత సినిమాలో 10 నిమిషాలను సీఎంకు చూపించి పూర్తి చిత్రాన్ని వీక్షించాలని వారు కోరారు. చిత్ర విశేషాలను సుధీర్ఘంగా చర్చించిన తర్వాత మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పేరును ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం చిత్రబృందానికి, మేజర్ సందీప్ తల్లిదండ్రులకు శాలువ కప్పి, వెండి నాణేన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులతోపాటు హీరో అడవి శేష్, నిర్మాత శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అడవి శేష్ పంచుకున్నారు. యంగ్ హీరో అడివి…
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తాజాగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పేరు వినిపిస్తోంది. గతంలో బీజేపీలో మంత్రిగా చేసిన యశ్వంత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే ఆ పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోనున్నట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంపై చర్చించినా.. ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా యశ్వంత్.. చేసిన ట్వీట్ తో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ఆలోచిస్తే.. విపక్షాల తరపు నుంచి యశ్వంత్ సిన్హా బరిలో దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీఎంసీ ప్రస్తుత ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్ వేదికగా ప్రకటించారు. “టీఎంసీలో మమతా గారు(మమతా బెనర్జీని ఉద్దేశించి..) నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు నేను కృతజ్ఞుడిని. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను విపక్షాల ఐక్యత కోసం పని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ,,7,660 కోట్ల పంచాయతీల నిధులను దొంగిలించి వేసిందంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు వ్రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులు (2018 నుంచి 2022 వరకు) రూ 7,660 కోట్లను సర్పంచులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, తన సొంత పథకాలకు, అవసరాలకు వాడేసుకుందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. సర్పంచుల చెక్కుల పై సంతకాలు లేకుండా, సర్పంచులకు చెప్పకుండా, గ్రామ పంచాయతీల, గ్రామ సభల తీర్మానాలు లేకుండా పంచాయితీ సర్పంచ్ ల సిఎఫ్ఎంఎస్ అకౌంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని దొంగిలించి వేసిందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అకౌంట్లు జీరో/ నిల్ బ్యాలెన్స్ లు చూపించడంతో సర్పంచులు షాక్ కు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు, డ్రైన్లు, శానిటేషన్…