Author: Editor's Desk, Tattva News

స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసిన ఆస్తిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ భార్య, మాజీ దౌత్యవేత్త లక్ష్మీ ముర్దేశ్వర్ పురీకి వ్యతిరేకంగా ట్వీట్లు పోస్టు చేసిన టిఎంసి ఎంపీ సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించింది. లక్ష్మీ ముర్దేశ్వర్ పురీకి క్షమాపణ చెప్పడంతోపాటు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సాకేత్ గోఖలేను హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఐక్య రాజ్య సమితి మాజీ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దుశ్వర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై జస్టిస్ అనూప్ జైరాం భంభానీ తీర్పు వెలువరించారు. పరువునష్టం కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం కాని ఎలెక్ట్రానిక్ వేదికలపైన కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని కూడా టిఎంసి ఎంపీని హైకోర్టు ఆదేశించింది. జెనీవాలో తనకు గల సొంత అపార్ట్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని తన ఆర్థిక వ్యవహారాల గురించి తప్పుడు ఆరోపణలు చేసినందుకు సాకేత్ గోఖలేపై లక్ష్మీ ముర్దేశ్వర్…

Read More

నర్మదా బచావ్ ఆందోళన్ సహా దేశంలో పలు సామాజిక ఉద్యమాలు నిర్వహించి బాధితులకు న్యాయం చేసిన సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓ 24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ఆమెకు 5 నెలల జైలుశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  ఢిల్లీ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాఖలు చేసిన ఈ కేసులో మేథా పాట్కర్ ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతే కాదు ఆయనకు 10 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ పేరుతో ఓ స్వచ్చంద సంస్థను నడుపుతున్న వీకే సక్సేనా.. తనతో పాటు తాను నడుపుతున్న నర్మదా బచావ్ ఆందోళన్ కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారన్న కారణంతో మేథా పాట్కర్ పరువు నష్టం దావా వేశారు. …

Read More

బీఆర్ఎస్ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కుంభకోణంలో కవిత ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కవిత సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కవిత తీహార్ జైల్లో 108 రోజులుగా ఉంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో కవితను కూడా అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ట్రయల్ కోర్టును కోరింది. కవితకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది.  ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను…

Read More

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని అంటూ మధ్యలో జోక్యం చేసుకొంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపణ తెలిపారు. ‘హిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లే కాదని.. సభలో ఉన్నవారు, బయట ఉన్నవారు అంతా హిందువులేనని, ఒక్క మోదీయే కాదు’ అని రాహుల్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని, దీనిని అడ్డుకుని తాము అండగా నిలబడతామని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. హిందూ మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతోందని దుయ్యబట్టారు. ఏ మతమైనా మనుషులకు ధైర్యం ఇస్తుందని, కొందరు తమను తాము హిందువులుగా ప్రచారం చేసుకుంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అలాంటి వాళ్లు అసలు హిందువులే కాదని, హింసను ప్రేరేపించే వాళ్లను హిందువులు అని ఎలా అనగలమని ప్రశ్నించారు. శివుడి వెనుక త్రిశూలం ఉంటుందని,…

Read More

అరకు కాఫీ అద్భుతమని ప్రధాని మోదీ ప్రశంసించారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఈ కాఫీ రుచి చూశానన్నారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. గొప్ప రుచికి, సువాసనకు ఇది ప్రసిద్థి చెందిందన్నారు. ‘దేశంలోని స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్‌ ప్రాశస్త్యం రావడం గర్వకారణం. అటువంటిదే అరకు కాఫీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇది ఉత్పత్తి అవుతోంది. దాదాపు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు దీని సాగుతో ముడిపడి ఉన్నాయి. అరకు కాఫీని కొత్త పుంతలు తొక్కించడంలో గిరిజన సహకార సంఘానిది కీలక పాత్ర. దీంతో రైతుల ఆదాయం బాగా పెరిగింది. ఒకసారి విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఈ కాఫీని రుచి చూేస అవకాశం నాకు లభించింది. చాలా అద్భుతంగా ఉంది. అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సులోనూ దీని మాధుర్యాన్ని అతిథులు రుచి చూశారు. మీకూ అవకాశం…

Read More

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగుపడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని చెబుతూ వారి జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగుపడిందని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం అని… ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారనీ, ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పేదలపై శ్రద్ధ పెడతామని, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చెబుతూ ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశామని, వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం…

Read More

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు స్మార్ట్ సిటీస్ మిషన్ గడువును 2025 వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూన్ తోనే స్మార్ట్ సిటీస్ మిషన్ గడువు ముగియనుండగా, మరో ఏడాది పాటు 2025 మార్చి 31వ తేదీ వరకు గడువును కేంద్రం పెంచింది. గత నెల 24వ తేదీన ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రితో ఈ విషయమై భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే గడువు పెంచాలని సిఎం రేవంత్ కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్‌లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, రూ.518 కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో 25 పనులు పూర్తి కాగా, మరో రూ.287 కోట్లకు సంబంధించిన…

Read More

మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ’13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’ ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ చెప్పారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారన్న మోదీ, అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్యనాయుడు పోరాడారని గుర్తు చేసుకున్నారు. అత్యయిక పరిస్థితి సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారన్న మోదీ, గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖలో తనదైన ముద్రవేశారని పేర్కొన్నారు.…

Read More

లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నూతన ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా రెండేళ్లు సేవలందించిన జనరల్‌ మనోజ్‌ పాండే పదవీ విరమణ చేయగా, ఆయన నుండి బాధ్యతలు చేపట్టారు. 2022 ఏప్రిల్‌ 30న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మే 30న పదవి విరమణ చేయాల్సి వుంది. అయితే కొత్త చీఫ్‌ని ప్రకటించడంలో జాప్యం కారణంగా కేంద్రం ఆయన సర్వీసును నెలరోజుల పాటు పొడిగించింది. జూన్‌ 11న వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేదిని నూతన చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది 1984 డిసెంబర్‌ 15న సైన్యం (జమ్ము కాశ్మీర్‌ రైఫిల్స్‌)లో చేరారు. కమాండ్‌ ఆఫ్‌ రెజిమెంట్‌ (18 జెకెరైఫిల్స్‌), బ్రిగేడ్‌ (26 సెక్టార్‌ అస్సాం రైఫిల్స్‌), డిఐజి, అస్సాం రైఫిల్స్‌ (తూర్పు), 9 కార్ప్స్‌ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. నార్తర్న్‌ ఆర్మీ…

Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 111వ ఎపిసోడ్‌లో పలు అంశాలపై మాట్లాడారు. అయితే చివరి 110 ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారం కాగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. తర్వాత ఇన్ని రోజులకు తాజాగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే గతంలో మరణించిన తన తల్లి హీరా బెన్‌ను గుర్తు చేసుకున్న ప్రధాని ఎమోషనల్ అయ్యారు.  మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కొత్త ప్రచారాన్ని చేపట్టారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాంట్‌ ఫర్‌ మదర్‌’ పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నట్లు చెప్పారు. అమ్మ పేరుతో తాను ఒక మొక్కను నాటానని.. మీరు కూడా తల్లి పేరుతో మొక్కను నాటండి అని సూచించారు.…

Read More