సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ..కోట్లాది మంది ప్రజల అకాంక్షలను నెరవేర్చుతూ టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అసాధారణ ఆటతో తొలిసారి విశ్వకప్ ఫైనల్‌కు దూసుకొచ్చిన దక్షిణాఫ్రికా చివరి వరకు గట్టిపోటీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. చిరస్మరణీయ ఆటతో అదరగొట్టిన టీమిండియా తన ఖాతాలో రెండో ప్రపంచకప్ ట్రోఫీని జతచేసుకుంది. ఇంతకుముందు 2007లో భారత్ తొలిసారి టి20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. బార్బడోస్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణాలో విషజ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం, పారిశుద్ధ లోపం కారణంగా వైరల్ ఫీవర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో ఆసుపత్రుల ముందు జనాలు క్యూ కడుతున్నారు. వీటితో పాటు మలేరియా, డెంగీ అనుమానిత కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం దోమలు, పారిశుద్ధ్య లోపం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. వర్షాలు, పారిశుద్ధ లోపం కారణంగా వచ్చే విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య సేవలు, తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులకు తగిన సూచనలు ఇవ్వడం, జిల్లాలలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. నివారణ చర్యలు చేపడుతూనే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ఎక్కువగా దాహం వేయడం,…
లడఖ్‌లోని న్యోమా చుషుల్ ప్రాంతంలో శనివారం తెల్లవారు జామున వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) సమీపాన శ్యోక్ నదిలో ఆకస్మికంగా వరదలు సంభవించడంతో మిలిటరీ టి72 ట్యాంక్ మునిగిపోగా ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఒ) సహా ఐదుగురు జవాన్లు మునిగిపోయారని అధికారులు వెల్లడించారు. ఈ దురదృష్టకర ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రగాఢ విచారం వెలిబుచ్చారు. లెహ్‌కు 148 కిమీ దూరంలోని మందిర్ మోఢ్ సమీపంలో అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు ఒక ఎక్సర్‌సైజ్ సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ‘శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక సైనిక శిక్షణ కార్యక్రమం నుంచి వస్తున్న ఒక సైనిక ట్యాంక్ తూర్పు లడఖ్‌లో ససేర్ బ్రంగ్సా సమీపాన శ్యోక్ నదిలో అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకున్నది. రక్షక బృందాలు హుటాహుటిని ఆ ప్రదేశానికి వెళ్లాయి. కానీ అధిక నీటి ప్రవాహం వల్ల రక్షణ…
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జ్యూడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 100 రోజులకు పైగానే ఆమె జైలులో ఉంటున్నారు. కవిత అటు రౌస్ అవెన్యూ కోర్టులోనూ బెయిల్ దొరకలేదు. ఇటు ఢిల్లీ హైకోర్టులోనూ దొరకట్లేదు. రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో కవిత అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. అయితే, కవిత అప్రూవర్‌గా మారకుండా ఉండడానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి.. వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తోందని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. భూస్వాములకు, రియల్టర్లకు రైతుబంధు నిలిపేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలను రేవంత్ రెడ్డి…
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. దాంతో కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది. శనివారంతో మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. విచారణ కోసం కేజ్రీవాల్‌ను రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 12 వరకు కేజ్రీ రిమాండ్ కొనసాగనుంది. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి ఈ కేసు పరిశోధన 2022 ఆగస్టు నుంచి కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. మార్చి 21న మొదట ఈడి ఆయన్ని అరెస్టు చేసింది. తర్వాత మే 10న మూడు…
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బిజెపి నేత రాథోడ్ రమేశ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భౌతికకాయం ఇచ్చోడ నుంచి అంబులెన్స్‌లో ఉట్నూరుకు తరలించారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్, ఎంపీగా రాథోడ్ రమేశ్ గతంలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా వ్యవహారించారు. 2009 లో టీడీపీ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన రమేశ్ రాథోడ్, తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. తర్వాత బీజేపీలో చేరి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం యత్నించగా, చివిరి నిమిషంలో బీజేపీ అధిష్ఠానం బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడం నగేశ్‌కు…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2004, 2009లో మంత్రిగా సేవలందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతా ఆయనను డీఎస్ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి పార్థీవదేహాన్ని తరలించనున్నారు. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డీఎస్.. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 1989లో…
నీట్ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. నీట్‌పై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్‌కు అధికారపక్షం అంగీకరించకపోవటంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని, ఆ సందర్భంగా నీట్‌పైనా చర్చ జరపవచ్చన్న ప్రభుత్వ సూచనకు విపక్షాలు అంగీకరించలేదు. దీంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే.. నీట్‌తోపాటు ఇతర పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలపై చర్చను కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర కార్యకలాపాలను రద్దు చేసి పేపర్ లీకేజీలపై చర్చను చేపడదామని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. ఇటీవల దివంగతులైన 13 మంది మాజీ ఎంపీలకు తొలుత నివాళి అర్పిద్దామని చెప్పారు. నివాళి ముగియగానే విపక్ష ఎంపీలు మళ్లీ తమ డిమాండ్‌ను కొనసాగించారు.…
భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయి జైల్లో ఉన్న ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలయ్యారు. భూ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఝార్ఖండ్ సీఎం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడైన సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం సోరెన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికల వేళ ప్రచార నిమిత్తం బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన ఝార్ఖండ్ హైకోర్టు ఈ నెల 13న తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం బెయిలు మంజూరు చేస్తూ జస్టిస్ రొంగొన్ ముఖోపాధ్యాయ తీర్పు ఇచ్చారు. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు…
టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణం ఒక యజ్జంలా సాగగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోకి రాగానే ముందూ వెనకా ఆలోచించకుండా, ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలవరం పనులు ఆపేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రత్యామ్నాయం చూడకుండా, ఏజెన్సీని రద్దు చేశారని, ప్రాజెక్ట్ మీద అవగాహన ఉన్న అధికారులని బదిలీ చేశారని, దానితో 2020 నవంబర్ వరకు పనులు మొదలు కాలేదని, వీటి పర్యవసానమే నేడు పోలవరానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిందని చంద్రబాబు ఆరోపించారు. సవాళ్లను అధిగమించి తాము పోలవరం నిర్మాణం చేపట్టామని, ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గతంలో గిన్నీస్ బుక్ ఆఫ్…