Author: Editor's Desk, Tattva News

కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్ ధారణ పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత  దేవాలయ  ఉత్సవాలలో ముస్లింలు  షాపులు ఏర్పాటు చేసుకోవడంపై నిషేధం విధించారు. హలాల్ అమ్మకాలపై వివాదం చెలరేగింది. తాజాగా ఇప్పుడు ఒక పాఠశాల బైబిల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, కొత్త వివాదాన్ని రాజేసింది. బెంగళూరులోని 105 ఏళ్లుగా నడుస్తున్న క్రైస్తవ మిషనరీ పాఠశాల  క్లియరెన్స్ హైస్కూల్ చేసిన చర్య పట్ల హిందుత్వ సంస్థల ఆగ్రహానికి కారణమవుతుంది.  ‘తమ పిల్లలు స్కూల్ కు బైబిల్ తీసుకెళ్లడాన్ని అభ్యంతర పెట్టబోము’ అంటూ ఈ పాఠశాల తల్లిదండ్రుల నుంచి అంగీకారాన్ని క్లియరెన్స్ స్కూల్ తీసుకుంటున్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.  దీనిపై హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ మాట్లాడుతూ.. క్రిస్టియన్ కాని విద్యార్థులను సదరు పాఠశాల బలవంతంగా బైబిల్ చదివిస్తోందని ఆరోపించారు. కానీ, క్లియరెన్స్ స్కూల్ తన తీరును సమర్థించుకుంది. తాము బైబిల్ ఆధారిత విద్యా బోధనను అందిస్తున్నట్టు…

Read More

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. అవినీతి ఆరోపణలపై ఒక సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి  కె ఎస్ ఈశ్వరప్ప మంత్రివర్గం నుండి రాజీనామా చేయవలసి  రాగా, అంతటితో ఆరోపణలు ఆగడం లేదు.  దానితో దిక్కుతోచక, గతంలో గుజరాత్ లో చేసిన్నట్లు మొత్తం ప్రభుత్వం, పార్టీ వ్యవస్థను మార్చాలనే ఆలోచనలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాలకు పైబడిన వయస్సు పేరుతో పక్కకు తప్పించిన మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్డ్యూరప్ప జోక్యం ఇప్పుడు అవసరమని పలువురు భావిస్తున్నారు.  బెంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ద్వారా కర్ణాటక రాజకీయాలలో ప్రవేశించడం కోసం చూస్తున్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 21న బెంగళూరులో రైతుల కోసం జరిపిన రాజకీయ ర్యాలీలో ప్రధానంగా  కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల అవినీతిని ప్రస్తావించారు.  “దీనికి ముందు (కాంగ్రెస్) ప్రభుత్వం 20 శాతం (కమీషన్) ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం (బిజెపి) 40 శాతం ప్రభుత్వం. ఢిల్లీలో, మాకు జీరో శాతం…

Read More

సురక్షితం కాని లైంగిక సంపర్కం కారణంగా దేశంలో హెచ్‌ఐవి బారిన పడుతున్నవారి సంఖ్య లక్షల్లో నమోదవుతున్నది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా వెలువడ్డ ఈ సంఖ్య ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నది. ఈ సమాచారం ప్రకారం అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా దేశంలో 17 లక్షల మందికి పైగా హెచ్‌ఐవీ బారిన పడ్డారు. ఆర్‌టిఐ ప్రశ్నకు సమాధానంగా నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎసిఒ) ఈ సమాచారాన్ని వెలువర్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ ఆర్టీఐ కింద ఈ సమాచారాన్ని కోరారు.ఆర్టీఐ సమాచారం ప్రకారం.. 2011-2021 మధ్య భారత్‌లో మొత్తం 17,08,777 మంది హెచ్‌ఐవి బారిన పడ్డారు. అయితే, గత పదేండ్లలో హెచ్‌ఐవీ బారిన పడిన వారి సంఖ్య తగ్గింది. 2011-12లో హెచ్‌ఐవీ సోకినవారు 2.4 లక్షల మంది ఉన్నారు. 2020-21లో అది 85,268కి పడిపోవటం గమనించాల్సిన అంశం. ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. అత్యధిక హెచ్‌ఐవి కేసులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉన్నాయి.…

Read More

ఉక్రెయిన్ యుద్ధం పేరుతో కొద్దిరోజులుగా వంటి నూనెల ధరలు గణనీయంగా పెరగడం కాకతాళీయం కాదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న `ఆత్మనిర్భర్ భారత్’ లో వంటనూనెలను దేశంలోనే లభించేటట్లు చూడటం పట్ల ఆసక్తి చూపక పోవడమే అని పరిశీలకులు భావిస్తున్నారు. స్వదేశంలో నూనెగింజల పంటలకు తగు ప్రోత్సాహం లేకపోవడంతో దేశీయ అవసరాలలో మూడింట రెండొంతులు ఆధారపడవలసి వస్తున్నది. గత రెండేళ్లలో వంట నూనెల ధరలు రెట్టింపుకు పైగా పెరిగాయి. రూ 110 గా ఉన్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర ఇప్పుడు రూ 230  అమ్ముతోంది. భారత్‌ వాడుకునే 23 మెట్రిక్‌ టన్నుల నూనెల్లో 15 మెట్రిక్‌ టన్నులు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. కేవలం ఎనిమిది టన్నులను మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నాం. వంట నూనెల దిగుమతులలో మూడో ఆదానీ కంపెనీలు చేస్తుండడంతో, వాటి ప్రయోజనం కోసం దేశంలో ఉత్పత్తులు పెంచేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. గట్టి ప్రయత్నం చేసి ఉంటే ఐదేళ్లలోనే వంటనూనెల దిగుమతి భారాన్ని తగ్గించేవారని,  గతంలో 1985…

Read More

ఇంతకు ముందు తరం ఎదుర్కొన్న బాధలను నేటి తరం కాశ్మీరీ యువత చవిచూడ రాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  జమ్ము ప్రాంతంలోని సాంబా జిల్లాలో ఆదివారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ సభలో ఆయన పాల్గొంటూ రూ.20 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా  ప్రారంభించారు.  అభివృద్ధి ద్వారా ‘ఢిల్లీ నుంచి దూరాన్ని’ తగ్గించే లక్ష్యంతో ఈ పనులను చేపట్టినట్టు ఆయన అభివర్ణించారు. ఆగష్టు, 2019లో  జమ్ముకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్ర ప్రాంతాలుగా విడగొడ్డిన తర్వాత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. సాంబా సభలో ప్రధాని ప్రసంగిస్తూ ‘నా మాటలు నమ్మాల్సిందిగా జమ్ముకాశ్మీర్‌ యువతను కోరుతున్నా. మీ తల్లిదండ్రులు, మీ తాతవ్వలు ఎదుర్కొన్న బాధలను మీరు పడకూడదు. అలా చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. `ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ కింద ప్రత్యేక శ్రద్ధతో గత 8 ఏళ్లుగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తద్వారా సాంస్కృతికంగా, భాషా పరంగా ఉన్న ఎడబాటును,…

Read More

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఇమాన్యుయెల్‌ మాక్రాన్‌ మరోసారి ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. నాటో వ్యతిరేక, వలస వ్యతిరేక వైఖరి తీసుకున్న మితవాద నాయకురాలు లీ పెన్‌కు ఇది వరుసగా రెండవ సారి ఓటమి.  మాక్రాన్‌కు 58.2 శాతం ఓట్లు పోల్‌ కాగా, లీపెన్‌కు 41. 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌, ప్రాథమిక ఓట్ల లెక్కింపు సరళి తెలియజేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో వీరిద్దరి మధ్య తేడా 66.1- 33.9 శాతంగా ఉండేది. ఈ సారి ఆ మార్జిన్‌ కాస్తా తగ్గింది.  ఒక సారి అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి రెండోసారి అవకాశం ఇవ్వడానికి ఫ్రాన్స్‌ ప్రజలు తిరస్కరించడం 2002 నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ సారి దానికి బ్రేక్‌ పడింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపెన్‌పై గెలిచి 39 ఏళ్ల మాక్రాన్‌ ఫ్రాన్స్‌ లో అతిపిన్న వయసు…

Read More

దివంగత లతా దీననాథ్ మంగేష్కర్ తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు ముంబైలో స్వీకరించారు. దేశానికి, సమాజానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. 92 ఏళ్ల లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.  లతా మంగేష్కర్ ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో అస్వస్థతతో కన్నుమూశారు. దివంగత లతా మంగేష్కర్ తొలి స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు హాజరయ్యారు.  ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకుంటూ దివంగత లతా మంగేష్కర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ”లతా దీదీ నాకు పెద్దక్క వంటింది. ఆమె సరస్వతీ దేవికి ప్రతిరూపం. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుంది. లతా మంగేష్కర్ స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేది” అని ప్రధాని కొనియాడారు.  కాగా, దేశానికి, ప్రజలకు అసమాన సేవలందించిన…

Read More

‘‘బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రానికి సీఎంకు ఏ విధంగా అయితే బాస్ గా ఉంటారో… గ్రామానికి సర్పంచ్ సర్వాధికారిగా ఉంటారు. గ్రామాల్లో ఏయే అభివ్రుద్ధి పనులు కావాలనే విషయంపై గ్రామ ప్రజలే గ్రామ సభ నిర్వహించుకుని నిర్ణయం తీసుకునే అధికారం కల్పిస్తాం” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.  అంతిమంగా సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు గల్లా ఎగరేసుకునేలా వారి గౌరవాన్ని ఇనుమడింపజేస్తామని హామీ ఇచ్చారు.  జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రజా సంగ్రామ యాత్ర 11వ రోజున లంచ్ శిబిరం వద్ద సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సహా స్థానిక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నర్వ గ్రామ సర్పంచ్ సంధ్య అధ్యక్షత వహించారు.  కార్యక్రమానికి హాజరైన సర్పంచులు మాట్లాడుతూ తాము ఉత్సవ విగ్రహాల్లా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం చెట్లు…

Read More

భారతదేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన వాతావరణాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ ప్రయత్నంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటుచేసి క్రీడావ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించాలని కోరారు.  ఆదివారం బెంగళూరులో ‘ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021’ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.  దేశవ్యాప్తంగా దాదాపు 200 విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన 4500 మంది యువ క్రీడాకారులను, క్రీడా ప్రముఖులు, ప్రైవేటు రంగం ప్రతినిధులు, పాల్గొన్నారు. విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో క్రీడలకు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలో ఇస్తున్న ప్రాధాన్యత, ప్రోత్సాహం ఒలింపిక్స్ లో ఆ దేశం సాధిస్తున్న పతకాల పట్టికలో కనబడుతోందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.  క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రైవేటు రంగం, సామాజికవేత్తలు, ప్రముఖ క్రీడాకారులు తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పారు. క్రీడా మౌలికవసతుల…

Read More

ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్న తరుణంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తున్న నిధులు, రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి సంక్షేమ పథకాలకు వినియోగిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర వివరాలు అందజేయాలని, ఆ తర్వాతే కొత్త రుణాలకు అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట ఏకంగా గవర్నర్‌నే హామీగా పెడుతూ రూ. 25 వేల కోట్ల వరకు అప్పు చేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై న్యాయస్థానాలతో పాటు కేంద్రం కూడా ఆరా తీస్తోంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ అన్ని అంశాలపై కేంద్రానికి ఓ నివేదికను అందజేసినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసి, తెలంగాణ…

Read More