Author: Editor's Desk, Tattva News

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జరుపనున్న జమ్మూ కాశ్మీర్ పర్యటనపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370, రాష్ట్ర హోదాలను రద్దుచేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఆయన ఈ ప్రాంతంలో మొదటిసారిగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి కీలక ప్రకటన చేస్తారా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. 2019లో తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, మోదీ తగిన సమయంలో ఎన్నికలు జరపడంతో పాటు జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 2018లో బిజెపి-పిడిపి సంకీర్ణం పతనమైనప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలనలో ఉంది. సాంబాలోని పల్లిలో జాతీయ పంచాయతీరాజ్ సదస్సు సందర్భంగా మోదీ జమ్మూకు వస్తున్నారు.మూడంచెల పంచాయతీ రాజ్ సంస్థలలోని 280 జిల్లా అభివృద్ధి మండలి (డిసిసి) సభ్యులు, 280 మంది బిగిసి చైర్మన్‌లు, 4,190 మంది సర్పంచ్‌లతో సహా 33,000 మందిని పైగా ఈ సదస్సుకు…

Read More

కొత్త రక్షణ సహకార ఒప్పందంపై భారత, బ్రిటన్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్‌ జాన్సన్‌లు సంతకాలు చేశారు. రక్షణ, వాణిజ్యం, క్లీన్‌ ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో దీపావళినాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు మోదీ, బోరిస్‌ జాన్సన్లు ఢిల్లీలో భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో మంచి పురోగతి సాధించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఒప్పందాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇది భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య స్వేచ్ఛా ఒప్పందంలా ఉండనుందని పేర్కొన్నారు. భారత్‌ సొంతంగా యుద్ధ విమానాలను తయారీ చేసేందుకు బ్రిటన్‌ కూడా సాయం చేస్తుందని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చారు. అన్ని దేశాల ప్రాదేశికతను, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని…

Read More

కొద్దికాలంగా కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్న గుజరాత్ లో పటీదార్ ఉద్యమ నేత, ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ముందు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా, హార్దిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన హార్దిక్ తాజాగా ఉన్నఫలంగా తాను రాముడి భక్తుడినని ప్రకటించుకొన్నారు. అలాగే బిజెపిని ప్రశంసించారు. బిజెపికి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయని, వాటిని మనం అంగీకరించాలని స్పష్టం చేశారు. ఇటీవల ఒక ప్రాంతీయ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు,  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి బిజెపి నాయకత్వం,  నిర్ణయ సామర్థ్యాలు తనను ప్రభావితం చేశాయని స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌తో కలత చెంది బీజేపీని పొగడడం చెబుతూ  ఫోన్ ఎలా అప్‌డేట్ అవుతుందో…

Read More

గత రెండేళ్లకు పైగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెన్షన్ లో ఉంచిన చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్‌ అధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఒకా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. సస్పెన్షన్‌ కాలం పూర్తయినందున మళ్లీ సర్వీసులోకి తీసుసస్పెన్షన్ కొనసాగేది లేదని సుప్రీం స్పష్టం చేస్తూ 1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్…

Read More

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేత బోండా ఉమాకు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్‌ ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి పరామర్శ సమయంలో వాగ్వాదం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, అత్యాచార బాధితురాలిని భయకంపితం చేసిన సంఘటనలపై విచారణకు చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరుకావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు కావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు. కాగా, టిడిపి అధినేత పరామర్శకు వెళ్లే సమయానికి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ…

Read More

కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రి పూట జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. తవ్వకాలను అడ్డుకున్నారనే కోపంతో ఆర్ఐపై ఇసుకాసురులు దాడికి పాల్పడ్డారు. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకున్నారు. దీంతో మట్టి మాఫియా ఆయనపై దాడి చేశారు. ఆర్ఐ మొహంపై పిడిగుద్దులు కురిపించారు. ఆర్ఐని చంపేస్తామంటూ మట్టిమాఫియా హెచ్చరించింది. గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై గతంలోనే దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేసినట్లు ఆర్ఐ అరవింద్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తిరిగి ప్రారంభమైన తవ్వకాలను అడ్డుకున్న తనపై మట్టి మాఫియా దాడి చేసినట్లు పేర్కొన్నారు. తన చొక్కా పట్టుకుని.. మెడలోని…

Read More

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద బోరిస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి రాజ్‌ఘట్‌ చేరుకున్నారు. అక్కడ మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు.  వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంలోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉండగా.. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడుతూ వచ్చింది.  బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్‌ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ‘భారత్- యూకే మధ్య పరిస్థితులు ఇంతకముందు కంటే ఇప్పుడు మరింత బలంగా, మంచిగా ఆన్నాయి’ అని బోరిస్ జాన్సన్ తెలిపారు. బ్రిటన్‌ ప్రధానికి కలుసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.  సుధీర్ఘకాలంగా ఎదురుచుస్తున్న నా స్నేహితుడు @ బోరిస్‌ జాన్సన్‌కు భారత్ లో చూడటం చాలా అద్భుతంగా ఉంది.  చర్చలు కోసం…

Read More

సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. గురువారం సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటూ విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం మేరకు పనిచేయాలని ఆయన సూచించారు .స్వాతంత్య్రం అనంతర భారతదేశం పురోగతిలో సివిల్ సర్వీసెస్ అధికారులు గణనీయమైన పాత్రను పోషిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి.. పేదరికం, లింగ వివక్షత, సాంఘిక వివక్షత, మూఢ నమ్మకాలు వంటి సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు భవిష్యత్ లోనూ విశేషమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ దిశగా సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రత్యేకమైన దృష్టిసారించాలని సూచించారు. ఈ విషయంలో రాజకీయ సిద్ధాంతాలు,…

Read More

తెలంగాణ సీఎంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు `డిక్టేటర్‌షిప్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్నారని అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి  తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి ఎద్దేవా చేశారు.  రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఎనిమిదో రోజైన గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశంలో తన కార్యాలయానికి రాకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే అని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు తప్ప అభివృద్ధి శూన్యం అని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.  ఎవరైనా సమాజ అభివృద్ధిలో, ఉద్యోగాల్లో సామాజిక న్యాయం పాటిస్తారని.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం తాగుబోతులను తయారు చేయడానికి సోషల్‌ జస్టిస్ ను  పాటించడం ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నేడు రాష్ట్రంలో లిక్కర్ నే ఆదాయ…

Read More

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్  కుమార్‌ పాన్ మసాలా ప్రచారం కోసం  విమల్‌ ఇలాచీ యాడ్‌లో నటించినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ యాడ్‌లో అక్షయ్ తోపాటు ప్రముఖ బాలీవుడ్‌ స్టార్స్‌  అజరుదేవగణ్‌, షారుఖాన్‌ కూడా నటించారు. ఈ యాడ్‌లో అక్షయ్ కుమార్‌ నటించినందుకు సోషల్‌మీడియాలో ఆయనపై ట్రోల్స్‌ మొదలయ్యాయి.  దీనికి అక్షయ్  కుమార్‌ స్పందించి క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో.. ‘నేను ఈ యాడ్‌లో నటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఇక ముందు ఇలాంటి యాడ్‌ల్లో నటించను’ అని హామీ ఇచ్చారు.  ఇటీవల ఆయన చేసిన ఓ పాన్ మాసాలా యాడ్ ఎంతోమంది సినీ అభిమానులతోపాటు నటుడి అభిమానులకి కోపం తెప్పించింది. అదే పాన్ మాసాలా ప్రొడక్ట్ అయినా దీంతో సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ ప్రకటన విషయంపై అభిమానులకి క్షమాపణలు తెలుపుతూ ఈ హీరో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటనను  విడుదల చేశారు.   ‘నన్ను క్షమించండి.…

Read More