జమ్ముకశ్మీర్ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ స్కీమ్, కురు హైడ్రోపవర్ ప్రాజెక్టు సివిల్ వర్కు కాంట్రాక్టుల్లో లంచగొండితనంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై సిబిఐ రెండు కేసులను దాఖలు చేసింది. ముఖ్యంగా ఈ రెండిటిలో లంచగొండితనం జరుగుతోందంటూ సాక్షాత్తు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నేరుగా ఆరోపణలు చేయడం, దానిపై సిబిఐ రెండు కేసులను దాఖలు చేయడం సంచలనం కలిగిస్తుంది. ఈమేరకు నిందితులకు సంబంధించిన జమ్ము, శ్రీనగర్, ఢిల్లీ, ముంబై, నొయిడా, కేరళ లోని త్రివేండ్రం, బీహార్ లోని దర్భాంగా తదితర 14 ప్రాంతాల కార్యాలయాల్లో సిబిఐ సోదాలు ప్రారంభించింది. జమ్ముకశ్మీర్ ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్సు స్కీమ్ కాంట్రాక్టును రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించడంలో 2017 -18 లో దాదాపు రూ. 60 కోట్లు విడుదల కావడంలో లంచగొండితనం చోటుచేసుకుందని వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఇదే విధంగా కురు హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు (హెచ్‌ఇపి) కు…
Author: Editor's Desk, Tattva News
దేశంలోని రాజకీయపార్టీలలో బిజెపికే అత్యధిక విరాళాలు అందాయి. ఏడు ఎలక్టోరల్ ట్రస్టులకు కలిపితే మొత్తం మీద రూ 258. 49 కోట్లు దక్కాయి. ఇందులో అత్యధికంగా బిజెపి ఇందులో సగానికి బాగా పైగా అంటే దాదాపు 82 శాతం వరకూ పొందింది. ఈ అంశాన్ని ఎన్నికల హక్కుల వేదిక ఎడిఆర్ తమ విశ్లేషణల క్రమంలో తెలిపింది. దేశంలో రాజకీయ పార్టీలకు తగు రీతిలో విరాళాల కోటాలను అందించేందుకు ఎలక్టోరల్ ట్రస్టులు ఏర్పాటు అయ్యాయి. ఈ ట్రస్టులకు వివిధ కార్పొరేటు ట్రస్టులు, వ్యక్తుల నుంచి విరివిగానే చందాలు అందుతున్నాయి. వీటిని ట్రస్టులు రాజకీయ పార్టీలకు చేరవేస్తోంది. ఎన్నికల దశల వ్యయాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సరైన పారదర్శకత పెంచడం ఈ ట్రస్టులు తమ లక్షంగా పెట్టుకున్నాయి. ఈ దిశలో వెలిసిన ఏడు ట్రస్టులు 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ల నుంచి వ్యక్తుల నుంచి అందిన విరాళాల వివరాలు అందించాయి. ఇవన్నీ కలిపితే…
ఉక్రెయిన్ పై దాటి ప్రారంభించిన సుమారు రెండు నెలలు అవుతుండగా రష్యా సేనలు కీలక పారిశ్రామిక నగరమైన మేరియుపోల్ తమ వశమైయిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అందుకోసం పోరాడిన రష్యా సేనలను ఆయన అభినందించారు. ఇక ఆ ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుంచి మేరియుపోల్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అజోవ్ సముద్రంలోని మారియుపోల్‌పై పూర్తి నియంత్రణ సాధించడం రష్యాకు ప్రధాన వ్యూహాత్మక విజయం. ఇది తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదుల భూభాగాలకు విలీనమైన ‘క్రిమియా’ను అనుసంధానించడంలో సహాయపడుతుంది. రష్యా ఆక్రమించిన క్రిమియాకు, రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్ బాస్…
గురుకులాల్లో చదివే విద్యార్థులు బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారని బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విద్య, ఆహారం, వసతి… ఇవీ గురుకులాల్లో విద్యార్థులకు అందించాల్సినవని ఆమె చెప్పారు. అయితే, చదువు పరిస్థితి ఎలా ఉన్నా… చాలాచోట్ల భద్రత గాలిలో దీపం అన్నట్లుందని ఆమె విమర్శించారు. అపరిశుభ్ర వాతావరణం, కనీస జాగ్రత్తలు కొరవడడంతో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థులు పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారని ఆమె తెలిపారు. చదువుకుందామని వస్తే ప్రాణాలే పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ధ్వజమెత్తారు. వంట గది శుభ్రతను విస్మరిస్తుండడం, కుళ్లిన ఆహార పదార్థాలు కూరగాయలను వంటకు ఉపయోగిస్తుండడంతో తరచూ ఎక్కడో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని విజయశాంతి చెప్పారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తుంటే.. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోందని ఆమె…
ఆక్రమణల తొలగింపు పేరుతో ఢిల్లీలోని రెండు రోజుల క్రితం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న హంగీర్‌పురిలో అకస్మాత్తుగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఇళ్లు, దుకాణాలను బుధవారం బుల్డోజర్లతో కూల్చివేస్తుండటం రాజకీయ దుమారం రేపింది. కూల్చివేతలు ఈ ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అయితే సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేతలు నిలిచిపోయాయి. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి తమకు అందలేదన్న సాకుతో అధికారులు దాదాపు రెండు గంటల పాటు తమ పనిని కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎక్కడయితే హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో అదే ప్రాంతంలో అక్రమ కట్టడాలంటూ అధికారులు కూల్చివేత పనులు మొదలు పెట్టారు.భద్రతకోసం సుమారు 400 మంది పోలీసులను వెంటబెట్టుకొని తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ కట్టడాలంటూ వరసపెట్టి కూల్చివేసుకుంటూ వెళ్లారు.ఈ క్రమంలో పలు తోపుడు బండ్లు, దుకాణాల్లో భాగాలు ధ్వంసమైనాయి. ఈ క్రమంలో పిటిషనర్ హుటాహుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యుపి,…
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక స్వయం ప్రకటిత దైవంగా చెప్పుకొనే వాని ఆశ్రమంలో మహిళలు లైంగిక వేధింపులు గురవుతూ ఉండడం, అక్కడ యువతులను నిర్బంధించి వారి కుటుంభ సభ్యులను కూడా కలుసుకోనీవడం లేదనే ఆరోపణలు పట్ల ఢిల్లీ హైకోర్టు దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. వీరేంద్ర దేవ్ దీక్షిత్‌కుచెందిన ఆశ్రమంలో వెలుగుచూసిన దారుణాలపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఆశ్రమంలో 160 మందికి పైగా యువతులు అమానవీయ స్థితిలో జంతువుల మాదిరిగా దుర్భర జీవితం గడుపుతున్నారని వ్యక్తమైన ఆరోపణలపై విచారం వ్యక్తం చేసింది. ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం పేరుతో వీరేంద్ర దేవ్ దీక్షిత్‌కు చెందిన ఆ ఆశ్రమంలో వీరేంద్ర చేతుల్లో 100 మందికిపైగా యువతులు తీవ్ర లైంగిక వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018లో ఆశ్రమంలోని 40 మందికి పైగా యువతులను ఢిల్లీ పోలీసులు రక్షించారు. అప్పటి నుంచి వీరేంద్ర దేవ్ దీక్షిత్ పరారీలో ఉన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు తాజాగా…
ఐటీవల తెలంగాణలోని 40 రైస్ మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేస్తే 4,53,896 ధాన్యం సంచులు మాయమైనట్టు తేలిందని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆ ధాన్యం సంచులు ఏమయ్యాయో స్పష్టత కావాలని, ఆయా రైస్ మిల్లర్లపై రాష్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. నిబంధనల ప్రకారం మిల్లుల్లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో అంత ఉండటం లేదని చెబుతూ రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాసినా స్పందన లేదని చెప్పారు. మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఓ నాయకుడు తనకు లేఖ రాశారని గుర్తు చేశారు. వాస్తవానికి రైస్ మిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని, దర్యాప్తునకు ఆదేశించే అధికారం కేంద్రానికి లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా, 40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ పంపిస్తామని ఈ నెల 14న తెలంగాణ పౌర సరఫరాల…
తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ మీడియా సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం పట్ల మంత్రి తలసాని శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మీరు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారా? రాజకీయ నాయకులా? అంటూ ప్రశ్నించారు. తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య అంతరం ఏర్పడినట్లు చైన్నైలో ఓ సమావేశంలో ఆమె చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై ఇటువంటి విమర్శలు ఏమిటని మంత్రి నిలదీశారు. ఓ రాజకీయ నాయకురాలి వలే ఆమె ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాజ్యాంగం పరంగా తన బాధ్యత నిర్వర్తించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమవని చెబుతూ నామినేటెడ్ వ్యక్తులం కాదని ఘాటుగా స్పందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్నిపరిమితులు ఉంటాయి అన్నారని చెబుతూ అది…
మంత్రి కేటీఆర్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నాయకుడి మాదిరి మాట్లాడారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ విమర్శించారు. ఓవైసీల మెప్పు కోసం మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దారుస్సలాం ఆదేశాలను పాటించే టీఆర్ఎస్‌కు బీజేపీని విమర్శించే స్థాయిలేదని స్పష్టం చేశారు. తుచ్ఛమైన ఓట్ల కోసం టీఆర్ఎస్ నేతలు బిచ్చగాళ్ళ మాదిరి మారిపోయారని లక్ష్మణ్ మండిపడ్డారు. పాత బస్తీలో కనీసం తనిఖీలు చేపట్టే దమ్ము ఉందా? విద్యుత్ బకాయిలు వసూలు చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మజ్లీస్ హుకుం జారీ చేస్తే కానీ పాత బస్తీలో అడుగు పెట్టలేని పరిస్థితి టీఆర్ఎస్‌దని ఎద్దేవా చేశారు. పోలీసులు, అధికారులపై ఎంఐఎం దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి రాముడి పేరు పెట్టుకున్న కేటీఆర్.. ఏనాడైనా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? అని ప్రశ్నించారు. యూపీలో రేషన్ పొందుతోన్న వారిలో ముస్లింలే ఎక్కువ మంది…
మొబైల్ సర్వీసెస్ విభాగంలో వినియోగదారులు రిలయన్స్ జియోకు మరోసారి షాకిచ్చారు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులను చేజార్చుకుంది. రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులను పోగొట్టుకోవడం వరుసగా మూడవసారి. ఫిబ్రవరిలో ఈ సంస్థ నుండి 36.6 లక్షల మంది వినియోగదార్లు నిష్క్రమించారు. దీంతో జియో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 40.27 కోట్లకు వచ్చి చేరింది. భారతి ఎయిర్‌టెల్ మాత్రం కొత్తగా 15.91 లక్షల మందిని చేర్చుకుంది.దేశంలో టెలికం మొత్తం వినియోగదారుల సంఖ్య 2022 ఫిబ్రవరిలో 116.6 కోట్లకు చేరిందని, జనవరితో పోలిస్తే ఇది 0.29 శాతం తగ్గుదలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) పేర్కొంది. తూర్పు యుపి, జమ్ము, కాశ్మీర్, హర్యానా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మొబైల్ వినియోగదారులు తగ్గుముఖం పట్టారని, బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు స్వల్పంగా తగ్గి 78.34 కోట్ల నుండి 78.33 కోట్లకు చేరారని ట్రాయ్ తెలిపింది.ఫిక్స్‌డ్ లైన్ చందాదార్లు క్రమంగా పెరుగుతున్నారు. వీరి సంఖ్య…