Author: Editor's Desk, Tattva News

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణాన్ని దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించాయిరు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణాలను పరిశీలించిన కెసిఆర్, పలు అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు తగట్లు కార్యాచరణను నిర్దేశించుకోవాలని ఉన్నతాధికారులను, గుత్తేదారులను ఆయన ఆదేశించారు. నూతన సచివాలయ భవనం అత్యాధునిక వసతులతో అన్ని హంగులతో నిర్మిస్తున్నామని చెబుతూ దేశంలోని అన్ని సచివాలయాలకు రోల్డ్ మాడల్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను, వాటి నాణ్యత గురించి అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను ఆయన కలియతిరిగారు. ఈ గదుల్లో వెంటిలేషన్ బాగా వస్తుందని కెసిఆర్…

Read More

సీఎం చెప్పినచోట సంతకం చేయడానికి తానేమీ రబ్బర్ స్టాంప్ కాదని అంటూ తెలంగాణ గవర్నర్ డా. తమిళి తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల `అమర్యాదకరంగా’ వ్యవహరిస్తున్నట్లు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆమె తన స్వరం పెంచారు. చెన్నైలో కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్తో తనకు కొంత `అంతరం’ ఏర్పడిన మాట మాటే నిజమేనని గవర్నర్ అంగీకరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని అంటూ ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పట్ల పరుషమైన పదజాలం ఉపగించారు. ఇది మంచిది కాదని అంటూ హితవు చెప్పారు. ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నానని.. ఇద్దరూ భిన్నమైనవారంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. ఆమె అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి బిజెపి భాగస్వామి కాగా, తెలంగాణ సీఎం బిజెపిపై యుద్ధం ప్రకటించారు. తద్వారా ఆయా సీఎంలకు బిజెపితో ఉన్న సంబంధాలను బట్టి గవర్నర్ లకు కూడా వారితో సంబంధాలు ఉంటాయని…

Read More

ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పూరీలో జరిగిన మత ఘర్షణలకు విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్ పేర్లు రావడం రాజకీయంగా కలకలం రేపుతున్నది. వారు అనుమతి లేకుండా హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపారని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసిన పోలీసులు, తర్వాత దానిని వెనుకకు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పేర్లు లేకుండా మరో ప్రకటన విడుదల చేశారు. హనుమాన్‌ జయంతి రోజున సాయంత్రం అనుమతి లేకుండా ర్యాలీని చేపట్టినందుకు నిర్వాహకులపై ఢిల్లీ పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాగా, శనివారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన రెండవ కేసు ఇది. ర్యాలీ నిర్వాహకులపై ఐపిసిలోని 188 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారిలో ఒకరిని విచారిస్తున్నట్లు ఈశాన్య ఢిల్లీ డిసిపి ఉషా రంగానీ తెలిపారు. అయితే, శనివారం ఉదయం, మధ్యాహ్నం చేపట్టిన మరో రెండు ఊరేగింపులకు తగిన అనుమతి ఉందని ఆమె చెప్పారు. అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపు…

Read More

బిజెపియేతర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా, నెలల తరబడి తమ వద్దనే ఉంచుకోవడం పట్ల ఆయా పార్టీలు తీవ్ర అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాయి. అయితే, మొదటిసారిగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఈ విషయమై తన పర్యటనలో నిరసన ప్రదర్శనలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల నుండి చెప్పుకోదగిన ఇబ్బందులు ఎదురు కాకపోవడం గమనార్హం. గవర్నర్ వ్యవస్థ ద్వారా ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను తమకు కేంద్రంలో మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితులు కలిపించడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదా అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి. ఆధ్యాత్మిక పర్యటన కోసం మైలాడుదురై వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మంగళవారం నిరసన ఎదురైనది. మైలాడుదురైలో ధర్మపుర ఆధీన రథోత్సవ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు వివిధ పార్టీలకు…

Read More

గత ఏడాది కాలంగా కాంగ్రెస్ లో కీలక పదవి కోసం బేరసారాలు చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చివరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీలు జరుపుతున్న ఆయన ఈ విషయమై సమాలోచనలు జరిపారు. ఈ విషయమై పార్టీలో సహచరులతో కూడా సోనియా సంప్రదించగా, వారంతా ఆమె నిర్ణయానికి వదిలివేశారు. గత ఏడాది సహితం ఇటువంటి చర్చలు జరిగాయి. గత ఆగష్టు లో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కొందరు నాయకులు కూడా చెప్పారు. అయితే ఏ పదవి ఇవ్వాలి అన్నదానిపై ఒక అవగాహనకు రాలేక, ప్రశాంత్ కిషోర్ అప్పటి నుండి ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇదివరలో సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడిగా కీలక పాత్ర వహించిన అహ్మద్ పటేల్ హోదా తనకు కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నికలకు సంబంధించి తన నిర్ణయమే తుది నిర్ణయం కావాలని, సోనియా…

Read More

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటు-ంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులు, వీరమహిళలతో ఆయన సమావేశమవుతూ తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు చాలా మక్కువని చెప్పారు. ఈ ప్రాంత పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఉంటారని వివరించారు. ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతనం, సమస్యలను స్వయంగా చూశారని, ఆదిలాబాద్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆయనకు తెలుసునని తెలిపారు. అందుకనే ఆదిలాబాద్‌ తండాలో అక్కడి మహిళలు అడగ్గానే మంచినీటి బోరు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కోరుకుంటే నాయకత్వం రాదని,…

Read More

గల్వాన్ ఘటనలో భారత బలగాల నుంచి చైనా తీవ్ర ప్రతిఘటన చవిచూసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఉద్రిక్తతలను సడలించేందుకు బలగాలను ఉపసంహరించుకునే దిశగా పలు దఫాలుగా ఉభయ పక్షాలు చర్చలు జరిగినప్పటికీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) సమీపంలో రెచ్చగొట్టే చర్యలను బీజింగ్ కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా చైనా మరో రెచ్చగొట్టే చర్యకు దిగినట్టు తెలుస్తున్నది. లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలో 3 కొత్త మొబైల్ టవర్లను చైనా ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలుగుచూశాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు సమీపంలో కూడా చైనా గతంలో ఇలాంటి ఎత్తుగడే అమలు చేసింది. తాత్కాలిక గ్రామాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లో ఏదైనా దుశ్చర్యకు పాల్పడే యోచనలో చైనా ఉందా అనేది తాజా చర్చనీయాంశమవుతోంది. భారత్‌ వైపు ఉన్న లద్దాఖ్‌లోని ప్రాంతాలను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ ఇటీవల ఒక వార్తపత్రిక…

Read More

ఆంధ్ర ప్రదేశ్ కు వరప్రసాదంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనబడటం లేదు. వాస్తవానికి 2018 నాటికే పూర్తిచేయాలనుకున్నా, 2020కు వాయిదా పడింది. 2022 గడుస్తున్నా పూర్తయ్యే అవకాశాలు కనబడటం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్ట్ నత్తనడకన నడుస్తున్నది. దానితో 2024 ఎన్నికల లోపుకూడా పూర్తయ్యే అవకాశాలు కనబడటం లేదు. అందుకు ప్రధానంగా రెండు అవరోధాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం టిడిపి హయాంలో శరవేగంగా చేపట్టినా నిర్వాసితుల పునరావాసం మాత్రం కొలిక్కి రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ వ్యయంకన్నా నిర్వాసితుల పునరావాసంకు ఎక్కువ వ్యయం కానున్న దృష్ట్యా ఆ మొత్తాన్ని ఎవ్వరు భరించాలని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాలేక పోతున్నాయి. మరోవంక ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదం పలు అవరోధాలను ఎదుర్కొంటున్నది. డ్యాం డిజైన్‌ లో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు, సంస్థలు రూపొందించిన డిజైన్‌ ప్రతిపాదనలపై ఇంతవరకు ఏకాభిప్రాయం రాకపోవటమే దీనికి ప్రధాన కారణం. …

Read More

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎన్పీయే(నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్) గా రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు ట్విట్టర్ వేదికగా అభివర్ణించారు. ‘భారతదేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇంధన ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్టానికి చేరుకున్నాయి’ అని గుర్తు చేశారు. `ఎల్‌పిజి సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికం మన దేశంలోనే ఉంది. వినియోగదారుల విశ్వాసం అత్యల్పంగా ఉందని ఆర్‌బిఐ చెబుతోంది’ అంటూ కెటిఆర్ పేర్కొన్నారు. ‘దీనిని మనం ఎన్డీయే ప్రభుత్వం అని పిలవాలా? లేక ఎన్పీయే ప్రభుత్వం అనాలో? అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. మరోవైపు…విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) చట్టానికి అతీతంగా ఉందా? అంటూ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పూరిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామని విశ్వహిందూ పరిషత్ బెదిరించినట్లు…

Read More

దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తుతున్న మత ఘర్షణలు, కల్లోలంల గురించి వార్తలు, కథనాలను నివేదించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యున్నత స్థాయిలో వృత్తిపరమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సంయమనంతో వ్యవహరించాలని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ( ఇజిఐ) సంపాదకులను, పాత్రికేయులనూ కోరింది. జర్నలిజంలో అనేక ఆదర్శప్రాయమైన లక్ష్యాలు, వృత్తిపరమైన విధులు, కర్తవ్యాలు వుంటాయని, సామాజిక శాంతిని పరిరక్షింస్తూనే, మత సామరస్యతను కాపాడుతునే విధులు నిర్వర్తించాల్సి వుంటుందని పేర్కొంది. అంతేకానీ పుకార్లను వ్యాప్తి చేయరాదని, పక్షపాతంతో వ్యవహరించరాదని గిల్డ్‌ స్పష్టం చేసింది. ‘ఘర్షణలు చెలరేగిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి వార్తలు సేకరించే విలేకర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, కష్ట నష్టాల గురించి ఎడిటర్స్‌ గిల్డ్‌కు తెలుసు. అయితే ‘రెండు మతాలల మధ్య ఘర్షణలకు సంబంధించి వార్తలు ఇచ్చేటపుడు ఆ కథనాల ప్రజంటేషన్‌లో కొద్దిపాటి బాధ్యత, శ్రద్ధ తీసుకోవాల్సి వుంటుంది’ అని సూచించింది. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియాలో ఇది చాలా అవసరం…

Read More