మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నీట్ పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీకేజీ వెనుక మాస్టర్‌మైండ్ సంజీవ్ ముఖియా ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని నలంద జిల్లా అతనిది. అతన్ని సంజీవ్ సింగ్ అని కూడా పిలుస్తారు. తాజా నీట్ స్కామ్‌లో ఇతనే ప్రధాన సూత్రధారి అని అంచనా వేస్తున్నారు. గతంలో సంజీవ్ ముఖియా అనేక అక్రమాలకు పాల్పడినట్లు అతనికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. రెండు దశాబ్ధాల క్రితం కూడా అతను పేపర్ లీకేజీలకు పాల్పడ్డాడు. గతంలో అతను నలంద కాలేజీ నూర్‌సారాయి బ్రాంచీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేశాడు. 2016లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లీకేజీ వెనుక కూడా ఇతని హస్తం ఉన్నట్లు తేలింది. సాల్వర్ గ్యాంగ్‌ను అతను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. రవి అత్రి అనే వ్యక్తి అతనికి సహకరిస్తున్నాడు. లీకేజీ అయిన ప్రశ్నాపత్రాలకు సమాధానాలు ఇస్తుంటారు. కానిస్టేబుల్…
Author: Editor's Desk, Tattva News
లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లాకే అవకాశం కల్పించాలని ఎన్డీయే కూటమి నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేయనుండగా.. విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏకు 293, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. కొంతమంది స్వతంత్ర ఎంపీలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కానీ ఎన్డీయే కూటమికి సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే, ఓం బిర్లాను స్పీకర్‌గా కొనసాగిస్తే.. డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని విపక్షాలు చేసిన ప్రతిపాదనను ఎన్డీయే కూటమి తిరస్కరించింది. దీంతో స్పీకర్ పదవికి అభ్యర్ధిని నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని రాహుల్ గాంధీ…
ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకార విజయం సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో ఓడించి టైటిల్‍ను దూరం చేసిన ఆసీస్‍ను.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 కీలక మ్యాచ్‍లో భారత్ చిత్తుచేసింది. కాస్త రివేంజ్ చీర్చుకుంది. అలాగే, సూపర్ 8లో మూడింట మూడు గెలిచి సెమీఫైనల్‍కు టీమిండియా దూసుకెళ్లింది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్1 సూపర్-8 మ్యాచ్‍లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‍ల్లో భారత్ సెమీస్ చేరడం ఇది ఐదోసారి. సెమీస్ రేసులో నిలవాలంటే ఆ జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కంగారూలను 24 పరుగుల తేడాతో ఓడించింది. చాలాకాలం తర్వాత భారత సారథి రోహిత్ శర్మ (41 బంతుల్లో 92, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) తనలోని ‘హిట్‌మ్యాన్’ను బయటకు తీసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో…
ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిసి రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు తమకు అవసరమని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు తమకు అప్పగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
వైఎస్‌ఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్ వర్సిటీగా మార్చాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మొదటి సమావేశంలో గత ప్రభుత్వం వర్సిటీ పేరు మార్చడం వల్ల వైద్యులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైద్యులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వర్సిటీ పేరు మార్చాలని నిర్ణయించామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టూ భర్తీ చేయలేదని పేర్కొంటూ 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ఈ పక్రియ జులై 1 నుండి ప్రరంభించి డిసెంబర్ 10 నాటికి పూర్తి చేయనున్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 80 శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం…
జూన్ 27వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో బలమైన,చురుకైన ప్రతిపక్షంగా రాజ్యసభలో వ్యవహరించాలని తమ పార్టీ ఎంపీలకు బిజెడి అధ్యక్షుడు, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిశానిర్దేశం చేశారు. తమ పార్టీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలతో సమావేశమైన ఆయన రాష్ట్రానికి చెందిన సమస్యలపై కూడా సభలో కేంద్ర సర్కారును నిలదీయాలని సూచించారు. బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని, రాజ్యసభలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలని సూచించారు. నవీన్ పట్నాయక్‌తో జరిగిన సమావేశం గురించి రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర మీడియాకు వివరించారు. బీజేడీ ఎంపీలు ఈసారి కేవలం రాష్ట్ర సమస్యలపై మాట్లాడటమే కాదు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒడిశా ప్రయోజనాలని విస్మరిస్తే ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు పేలవమైన మొబైల్ కనెక్టివిటీ, మితంగా ఉన్న బ్యాంకు శాఖల సమస్యల్ని కూడా లేవనెత్తుతారని వెల్లడించారు. బొగ్గు రాయల్టీని సవరించాలన్న ఒడిశా డిమాండ్‌ను గత…
18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు రాధామోహన్ సింగ్, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఫగ్గన్ సింగ్ కులస్తే, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు కింజారపు, తదితరులు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం లోక్ సభలో అడుగుపెట్టేవారిలో సగానికి పైగా కొత్తవారే ఉన్నారు. మొత్తం 543 మంది సభ్యుల్లో 280 మంది సభ్యులు కొత్తవారు ఉండగా 262 మంది గతంలో లోక్ సభలో సభ్యులుగా పని చేసిన అనుభవం ఉంది.. మొత్తం తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు…
కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో మృతిచెందారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసిన ఆయన 2022 జనవరి 25న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన రామచంద్రయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందారు. ఆయనకు భార్య బాపనమ్మ, కుమారుడు బాబూరావు, కుమార్తెలు వాణి, వసంత, సుమలత ఉన్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి తన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, రూ.14 లక్షల వరకు అప్పులు తెచ్చి ఖమ్మం, హైదరాబాద్, విజయవాడకు తీసుకెళ్లి వైద్యం చేయించామని రామచంద్రయ్య కుమారుడు బాబూరావు తెలిపారు. పద్మశ్రీ లభించిన సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తామన్న…
పద్దెనిమిదవ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. సోమ, మంగళవారం లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తరువాత 26న లోక్‌సభ స్పీకరు ఎన్నిక జరగనుంది. 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో లోక్‌సభ ప్రొటెం స్పీకరుగా మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. మహతాబ్ తర్వాత పార్లమెంటు హౌస్‌కు చేరుకుని ఉదయం 11 గంటలకు లోక్‌సభను ప్రారంభిస్తారు. 18వ లోక్‌సభ తొలి సమావేశం సందర్భంగా ఇటీవల మరణించినవారికి సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించడంతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీని తరువాత లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను సభ టేబుల్‌పై ఉంచుతారు. లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకరు భర్తృహరి మహతాబ్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత లోక్‌సభ నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం…
పునర్వినియోగం వాహకనౌకల (రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ ఆర్‌ఎల్‌వి ఎల్‌ఇఎక్స్) సామర్థాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్టు పేర్కొంది. అంతరిక్షం లోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు , వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్ ప్రయోగాలను చేపడుతోంది. తద్వారా ఆర్‌ఎల్‌వీల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం పునరుద్ఘాటిస్తున్నట్టు తెలిపింది. ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ (ఎల్‌ఇఎక్స్ 03) సిరీస్‌లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గ లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఎటిఆర్)లో ఆదివారం ఉదయం నిర్వహించినట్టు వెల్లడించింది. ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్01, ఎల్‌ఈఎక్స్ 02 మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్టు తెలిపింది.…