ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో తెగతెంపులు చేసుకున్న తర్వాత పార్టీ పటిష్టంపై మాయావతి దృష్టిసారించారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గత ఏడాది డిసెంబర్‌లో తన రాజకీయ వారసుడిగా అతడ్ని ఎంపిక చేశారు. కాగా, ఈ ఏడాది మే నెలలో మాయావతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి, వారసుడిగాను ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బీఎస్పీ నేతలు ఆశ్చర్యపోయారు. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు…
Author: Editor's Desk, Tattva News
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంత స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన్నా ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు సోమవారం ఈ అంశంపై విచారణ కోరుతామని తెలిపారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలను చూపడంలో ఈడీ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించాలని కోరగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్‌పై…
పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయం ఆలోచిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్ను రేటు ఎంత ఉండాలనేది రాష్ట్రాలు సూచిస్తే , దీనిపై ముందుకెళ్తామని ఆమె తెలిపారు. జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోవా, మేఘాలయ ముఖ్యమంత్రులు, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా ఉప ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్థిక మంత్రులు పయ్యావుల కేశవ్, భట్టి విక్రమార్క, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వడ్డీ లేని కాపెక్స్ రుణాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలు కోరాయని, మధ్యంతర బడ్జెట్‌లో దీనిని రూ.1.30 లక్షల కోట్లకు పెంచినట్లు…
నీట్-యూజీ, యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలతో పరీక్షల వ్యవస్థపై అనుమానాలు పెరుగుతున్న వేళ కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నీట్ యూజీ లీకేజీ వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. నీట్ యూజీ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయి విచారణ కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ‘అవకతవకలపై కొన్ని ఫిర్యాదులతోపాటు మోసం, మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. సమగ్ర సమీక్ష తర్వాత దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’ అని విద్యాశాఖ పేర్కొంది. ఈ నిర్ణయానికి కంటే ముందు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) ఛైర్మన్, ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది. అలాగే ఎన్‌టీఏ సంస్కరణల ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివారం…
రాష్ట్రాభివృద్ధే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంపీలకు సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, పథకాలు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభలో లేవనెత్తాల్సిన, ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన విధివిధానాల్ని వారికి వివరించారు. అమరావతి నిర్మాణానికి పొలం అమ్మి 25 లక్షలు విరాళంగా ఇచ్చిన వైద్య విద్యార్థిని వైష్ణవికి ఉన్న శ్రద్ధ కూడా మాజీ సీఎం జగన్‌కు లేదని మండిపడ్డారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్‌రావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ విప్‌గా గంటి హరీష్‌ను ఎంపిక చేశారు. ఈ సారి లోక్‌సభలో తెలుగుదేశం సంఖ్యాబలం పెరిగినందున 16 మంది ఎంపీలు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో జరిగిన…
సింగరేణి సంస్ధపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని, కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా సింగరేణిని దోచుకుని ఆర్థిక విధ్వంసం చేశారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామనేది పచ్చి అబద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు చాలా ప్రధానమైనదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం జరుగుతోందని వెల్లడించారు. సింగరేణి వ్యవస్థను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారని కిషన్రెడ్డి దుయ్యబట్టారు. 2014లో సింగరేణి అకౌంట్లో 3,500 కోట్ల…
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాశీలో శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాశీలో పేరొందిన పండితుల్లో ఒకరిగా గుర్తింపుపొందారు లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. అయితే, ఆయన పూర్వీకులు తరతరాలుగా కాశీకి వచ్చి నివసిస్తున్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత కాశీ పండితుడు గాగా భట్ వంశానికి చెందిన వారు లక్ష్మీకాంత్ దీక్షిత్. కాగా భట్ 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి అధ్యక్షత వహించిన ప్రధాన పూజారి. వేదాలు, వైదిక ఆచారాలు, భారతీయ పురాతన సంప్రదాయాలపై పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్‌కు విశేష పరిజ్ఞానం ఉంది. లక్ష్మీకాంత్ దీక్షిత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఏడాది…
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు.. అయితే నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో కూల్చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం కోసం బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైఎస్సార్‌సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.. అయితే శనివారం ఉదయం అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ…
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించే బాధ్యతను ఒక థర్డ్ పార్టీ సంస్థకు జాతీయ పరీక్ష సంస్థ(ఎన్‌టీఏ) అప్పగించింది. కాగా, ప్రజలు ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం కచ్చితంగా జవాబు చెప్పాల్సిందేనని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞల్క్య శుక్ల ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘ఎన్‌టీఏలో నిర్వహణలోపం ఉందనే అభిప్రాయం ఉంది. పలు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు 15- 20 నిమిషాలు ఆలస్యంగా ఎలా వెళ్తాయి? ఒకే కేంద్రానికి చెందిన 7-8 మంది విద్యార్థులకు 100 శాతం మార్కులు ఎలా వస్తాయి? 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు ఎలా వస్తాయి? ఎన్‌టీఏ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ…
సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని, గనులు కేటాయించకపోతే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తిపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై ప్రధానమంత్రితో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. పదో విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను హైదరాబాద్ వేదికగా కిషన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్‌లను కేంద్రం వేలానికి ఉంచింది. వీటిని దక్కించుకునేందుకు బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క సింగరేణి గనులకు సంబంధించి పలు అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని, సింగరేణికి కేంద్రం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని విక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థ కొంగు బంగారం వం టిదన్న భట్టి 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు…