Author: Editor's Desk, Tattva News

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనలేక ఆయన సినిమా నటించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమాను ప్రదర్శించే థియేటర్ల పట్ల వేధింపు చర్యలకు దిగుతున్నట్లు చెలరేగుతున్నాయి. శుక్రవారం ఈ సినిమా విడుదలకు ఏపీ, తెలంగాణలో చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకున్న సమయంలో ఏపీలో భీమ్లా నాయక్ మూవీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్‌ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పాత ధరలకే టికెట్‌లు విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్‌ చేశారు.  దీంతో ఎగ్జిబిటర్లలో ఆందోళన నెలకొంది. లక్షలు పెట్టి సినిమాను కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో…

Read More

న్యూ యార్క్ టైమ్స్ కధనం ప్రకారం, బ్యాంక్ క్రెడిట్ సూయిస్సే నుండి లీక్ అయిన ఒక డేటా లీక్ మధ్యప్రాచ్యం అంతటా శక్తివంతమైన వ్యక్తుల ప్రైవేట్ సంపద వ్యవహారాలపై గగ్గోలుకు దారితీసింది. రాజకీయ నాయకుల ఆర్థిక వ్యవహారాలలో చాలా కాలంగా పారదర్శకత లేని ఈ ప్రాంతంలోని ప్రస్తుత, మాజీ పాలకులు విదేశీ బ్యాంకులలో గణనీయమైన సంపదను దాచుకున్నారని లీక్ వెల్లడించింది. లీక్ అయిన డేటాలో ఉన్న ఏకైక దేశాధినేత జోర్డాన్ రాజు అబ్దుల్లా II. అతని రాజ్యానికి అమెరికన్ల నుండి కనీసం $22 బిలియన్ల సైనిక, ఆర్థిక సహాయం లభించింది. డేటా ప్రకారం, కింగ్ అబ్దుల్లాకు ఆరు స్విస్ ఖాతాలు ఉన్నాయి. అందులో ఒకదానిలో 2015లో $224 మిలియన్లకు పైగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం, 2011లో అరబ్ స్ప్రింగ్ తిరుగుబాటు సమయంలో ఈజిప్టు అధ్యక్షుడు హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడవడానికి ముందు, అతనికి సన్నిహితంగా ఉన్న వ్యాపారవేత్తలు, అలాగే అతని కుమారులు అపారమైన సంపదను…

Read More

బాల్యం నుంచే చిన్నారుల్లో ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన అలవాట్లను పెంపొందించడంతోపాటు ఇందుకు తగినట్లుగా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. చెన్నైలోని రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా నేషనల్ వాష్ (వాటర్, సానిటైజేషన్ అండ్ హైజీన్) కాన్ క్లేవ్ – 2022 ను ప్రారంభిస్తూ అంగన్ వాడీలు, ప్రాథమిక పాఠశాలల నుంచే ఈ అలవాటును ప్రోత్సహించడం ద్వారా పెరిగి పెద్దయ్యాక మంచి అలవాట్లను కొనసాగించేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్) – హైదరాబాద్ ఆధ్వర్యంలో, కేంద్ర జలశక్తి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలు, యునిసెఫ్, ఇతర సంస్థల సంయుక్త సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘పంచాయతీల స్థాయిలో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, స్వచ్ఛత’ అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన…

Read More

కరోనా సమయంలో పార్టీలు చేసుకున్నారంటూ అధికార పక్షం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు మెడకు మరో ఉచ్చు బిగియనుంది. మహమ్మారి సమయంలో ప్రజలకు, కంపెనీలకు సాయం అందించేందుకు బ్రిటన్‌ చేపట్టిన పలు పథకాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ది గార్డియన్‌ కథనం పేర్కొంది.  మొత్తం 16 బిలియన్‌ పౌండ్లు (రూ. 1.62 లక్షల కోట్లు) అవినీతి జరిగిందని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ తేల్చినట్లు వెల్లడించింది. దీంతో పాటు ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ వ్యక్తిగత పథకాల్లో మోసాలు, నష్టాలను లెక్కగట్టి 2022 చివరి నాటికి ఎంత రికవరీ చేస్తారో వెల్లడించాలని లేఖను పంపింది.  కరోనా సమయంలో యుకె ప్రభుత్వం 129 మిలియన్‌ పౌండ్లను విడుదల చేయగా.. ఈ పథకాలు వేగంగా అమలు చేయడంలో పలుచోట్ల మోసాలు, కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. బలవంతపు సెలవుపై పంపిన ఉద్యోగులను ఆదుకొనేందుకు ప్రవేశపెట్టిన ‘ ది కరోనా వైరస్‌ జాబ్‌ రిటెన్షన్‌ స్కీం’లో భారీగా…

Read More

ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అంటే 110 రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నా, మన దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి గల కారణం ఎన్నికలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మరింతగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ ముడిచమురు ధర 99.38డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పెట్రో ధరలు ఎన్నికల అనంతరం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. కనీసం లీటర్ కు రూ 10 చొప్పున పెరగవచ్చని భావిస్తున్నారు.  ప్రపంచ చమురు ఉత్పత్తిలో 10 శాతానికి పైగా వాటా రష్యాదే. అంతేగాక ఐరోపా దేశాలకు సహజవాయు అవసరాలను మూడో వంతు రష్యానే తీరుస్తోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఐరోపా దేశాలకు రష్యా చమురు సరఫరా చేయడం అసాధ్యమనే చెప్పుకోవాలి.  ఎందుకంటే…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయ్ అయిన మల్లన్న సాగర్ లోకి నీటిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు విడుదల చేశారు. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటిని విడుదల చేసి, రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్ పంప్ హౌస్ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ తో మొత్తంగా ఉమ్మడి మెదక్ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోని దాదాపు 11.29…

Read More

పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం, అతని అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి బుదవారం ఉదయం 6 గంటలకు నవాబ్ మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఓ గంట సేపు ప్రశ్నించిన అనంతరం 7:30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అనంతరం దక్షిణ ముంబయిలోని బల్లార్డ్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని ఇడి కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మాలిక్‌తో పాటు ఆయన కుమారుడు, న్యాయవాది అమిర్‌ మాలిక్‌ కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై మహారాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ స్పందిస్తూ ముందస్తు నోటీసు లేకుండా మాలిక్‌ను విచారించడం ద్వారా ఇడి నిబంధనలను…

Read More

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరగనున్న నాలుగో దశ పోలింగ్‌ మొత్తం ఏడు దశల ఎన్నికల సరళిని, ఫలితాలను నిర్ధేశించే అవకాశం ఉంది. మొదటి మూడు దశలలో పుంజుకున్న సమాజవాద్ పార్టీ ఈ దశలో నెగ్గుకు రాగలిగితే, ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవంక, నలుగురు కేంద్ర మంత్రులకు ఈ దశ ప్రతిష్ఠాత్మకంగా మారింది. మొదటి మూడు దశలలో మొత్తం 403 స్థానాల్లో 172 స్థానాలకు దాదాపు ముఖాముఖీ పోటీ వలే బీజేపీకి, ఎస్పీల మధ్య జరిగాయి. అయితే ఈ సారి బహుముఖ పోటీలు ఉన్నాయి. మిగిలిన మూడు దశలు సహితం అదే విధంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో 59 స్థానాలకు జరుగుతున్న ఈ దశ ఎన్నికలు.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అజయ్‌ మిశ్రా, స్మృతీ ఇరానీ, కౌశల్‌ కిషోర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ కుటుంబ ప్రాబల్యం ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం…

Read More

తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డిఎంకె తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. చెన్నై కార్పొరేషన్‌లో క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడిఎంకెకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోను డిఎంకె జోరు కొనసాగుతోంది. కోయంబత్తూరులో 75 శాతానికి పైగా స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొత్తం 1374 వార్డులకు గాను డిఎంకె 425 స్థానాల్లో జయభేరి మోగించగా, 75 చోట్ల అన్నా డిఎంకె గెలుపొందింది. అయితే సొంతంగా పోటీచేసిన బిజెపి అనూహ్యంగా పలుచోట్ల తన ఉనికి చాటుకో గలిగింది. అలాగే పురపాలికల్లో 3843 వార్డు సభ్యులకుగాను డిఎంకె 1832 గెలుచుకోగా, అన్నాడిఎంకె 494 స్థానాలకు పరిమితమైంది. అలాగే 7,621 పట్టణ పంచాయతీలకుగాను డిఎంకె 4261 చోట్ల గెలుపొందగా, అన్నాడిఎంకె 1178 చోట్ల గెలుపొందింది. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 200 వార్డులకుగాను 195 వార్డుల ఫలితాలు వెలువడగా, 146 చోట్ల…

Read More

పలు బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్లతో ఘర్షణకు తలబడుతుంటే, సిపిఎం అగ్రనేత అయిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాత్రం నేరుగా గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ను కలసి ఆయనతో తన ప్రభుత్వంకు ఏర్పడిన పలు వివాదాలను పరిష్కరించుకోవడం కేరళ సిపిఎం నాయకుల మధ్య కలకలం రేపుతున్నది. గవర్నర్ తో ఘర్షణకు దిగి మధ్య తరగతి, విద్యావంతులైన ప్రజల దృష్టిలో అపఖ్యాతి పాలు కావడంకన్నా, సర్దుబాటు ధోరణి ప్రదర్శించడం వ్యూహాత్మక ఎత్తుగడగా విజయన్ తన చర్యను సమర్ధించుకున్నట్లు తెలుస్తున్నది. ఘర్షణ ధోరణులు విడనాడి సుపరిపాలనపై దృష్టి సారింపలేని ఈ సందర్భంగా పలువురు సిపిఎం నేతలు సహితం స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై గత గురు, శుక్రవారాల్లో జరిగిన పార్టీ-రాష్ట్ర సెక్రటేరియట్‌ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంలో అర్థం లేదని ఈ సందర్భంగా భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవడం ద్వారా రాష్ట్ర…

Read More