‘రైల్వే ఆస్తులు ప్రజలందరివీ.. వాటికి నష్టం చేకూర్చొద్దు’ అంటూ నిరసన కారులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఎన్టీపీసీ ఫలితాల్లోని అవకతవకలు బీహార్‌ని కుదిపేస్తున్నాయి. ఫలితాల అవకతవకలను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. పలు రైల్వే స్టేషన్లలో బోగీలకు నిప్పుపెట్టి, పోలీసులపైకి రాళ్లు రువ్వి నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా.. అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఎన్‌టిపిసి (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్), లెవల్ 1 పరీక్షలను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. రిక్రూట్‌మెంట్ పరీక్షల ఎంపిక క్రమం పట్ల అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రెండు రోజులుగా హింసాత్మక నిరసనలకు, ఆందోళనలకు దిగారు. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు. ఈ సమస్యల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆర్‌ఆర్‌బీ ఛైర్మన్లందరూ అభ్యర్థుల…
Author: Editor's Desk, Tattva News
గుడివాడలో స్థానిక మంత్రి సారధ్యంలో చట్టవిరుద్ధమైన క్యాసినో నిర్వహించారని తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్రమైన రాజకీయ ఉద్రిక్తలు రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష నాయకులు శాంతిభద్రతల మధ్య చెలరేగిన వివాదం సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా టిడిపి చెందిన మాజీ ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్నను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ పై వదిలి పెట్టివేయడం గమనిస్తే ఇటువంటి ఆరోపిణలు చేస్తున్నవారిపై ప్రభుత్వం తీవ్రంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఏమీ జరగలేదని అధికార పక్ష నేతలు వాదిస్తుండగా, సంక్రాతి సంబరాల పేరుతో నిర్వహించిన క్యాసినో కు గోవా నుండి చీర్ గర్ల్స్ ను తీసుకు వచ్చి, అల్లరి కావడంతో విమానంపై వెనుకకు పంపించారని అంటూ టిడిపి నేతలు విమాన టికెట్లు, పేర్లతో సహా ఆరోపణలు చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందిస్తూ దివంగత…
కేరళలోని సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి నిరోధక సంస్థ నివేదికను తిరస్కరించే అధికారాలను పొందే విధంగా ఉండే విధంగా కేరళ లోకాయుక్త చట్టాన్ని సవరించడానికి వివాదాస్పద ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. అవినీతి గురించి ఎక్కువగా మాట్లాడే సిపిఎం నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వ అవినీతి చర్యలను కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. గత వారం, ఆన్‌లైన్ ద్వారా అమెరికా నుండి ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో, కేరళ లోకాయుక్త చట్టం, 1999ని సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేసింది. ఈ సవరణ లోకాయుక్త తీర్పును “ఆమోదించడనైకి లేదా తిరస్కరించడానికి” ప్రభుత్వానికి అధికారాలు దాఖలు చేస్తుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం, లోకాయుక్తకు సిఫార్సులు చేసే లేదా ప్రభుత్వానికి నివేదికలు పంపే అధికారాలు మాత్రమే ఉంటాయి. గత ఎల్‌డిఎఫ్ హయాంలో, మంత్రి తన కార్యాలయ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కేరళ లోకాయుక్త గుర్తించడంతో ఉన్నత విద్యాశాఖ మంత్రి కెటి జలీల్ రాజీనామా చేయవలసి వచ్చింది. రాష్ట్ర మైనార్టీల…
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ లకు పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. కళాకారుడు ప్రభా ఆత్రే, ప్రముఖ సాహిత్యకారుడు రాధేశ్యామ్ కేంహలకు కూడా పద్మ విభూషణ్ లను ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ నేత, మాజీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, సిపిఎం నేత మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య లకు పద్మ భూషణ్‌ను ప్రకటించింది. టెక్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లకు కూడా పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది. 128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి పద్మశ్రీలు దక్కాయి. ఒలింపిక్స్ గోల్డ్…
జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ కేంద్రం జారీచేసిన ఆంక్షలను ఖాతరు చేయకుండా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం అర్ధాంతరంగా రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ ఉత్తరువులు జారీచేసింది. 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గం ప్రాతిపదికన 26 జిల్లాలుగా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత రాత్రి ఉత్తరువులు జారీచేసింది. మంగళవారం ఉదయమే ఈ ప్రతిపాదనను తిరిగి తెరపైకి తీసుకు వచ్చి, ఆన్ లైన్ లోనే మంత్రివర్గం ఆమోదం పొంది, రాత్రికల్లా ఉత్తరువులు జారీచేసింది. ఆన్‌లైన్‌లోనే కొత్త జిల్లాల వివరాలను మంత్రులకు పంపారు. వాటిని పరిశీలించిన మంత్రులు అంగీకారం తెలిపారు. 1974 జిల్లాల ఏర్పాటు చట్టంలో సెక్షన్ 3(5) ప్రకారం (ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ యాక్ట్) కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ భౌగోళిక పరిస్థితుల రీత్యా అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండుగా మార్చారు. ఈ మేరకు…
కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ విస్తృతంగా ఉందని, మనం అప్రమత్తంగా ఉండాలని, మన రక్షణలో అలసత్వం వహించకూడదని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దేశ ప్రజలను హెచ్చరించారు. 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు కొనసాగించాలని కోరారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా మేము అసాధారణమైన సంకల్పం, సామర్థ్యాన్ని ప్రదర్శించామని చెప్పడానికి తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. లెక్కలేనన్ని కుటుంబాలు భయంకరమైన విపత్తులను చవిచూశాయని అంటూ వారి బాధను చెప్పడానికి తన దగ్గర మాటలు లేవని, అయితే చాలా మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో శాస్త్రవేత్తలు,నిపుణులు ఇచ్చిన జాగ్రత్తలను పాటించడం నేడు ప్రతి దేశ పౌరుడి జాతీయ అభిమతంగా మారిందని రాష్ట్రపతి చెప్పారు. ఈ సంక్షోభం పరిష్కారం కానంత వరకు మనం ఈ దేశ ధర్మాన్ని పాటించాలని చెప్పారు. వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ రోగుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా…
పేద ప్రజలకు తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలతో లబ్ధిచేకూరుస్తామని రాజకీయ పార్టీలు, నేతలు, ఎన్నికల వేళ చేస్తున్న వాగ్దానాల పట్ల సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది. ఉచిత వాగ్దానాలు సాధారణ బడ్జెట్‌ను మించి ఉంటున్నాయని, ఇలాంటి జనాకర్షక హామీలు గుప్పించడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ఇక నుంచైనా ఉచిత వాగ్దానాల వర్షం కురిపించే రాజకీయ పక్షాలను, నేతలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై తమ వైఖరి తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింపజేయాలని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని న్యాయవాది అశ్విన్ ఉపాధ్యారు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను…
ఎనిమిదేళ్ల వయసులోనే ధైర్యంగా ఓ ఉగ్రవాదిని ఎదిరించి మాట్లాడింది. ఆర్మీ క్వార్టర్స్‌లో చొరబడి దాడి చేస్తున్న పాకిస్థాన్ జైషే మహ్మద్ ఉగ్రవాదికి ముఖాముఖీ మాట్లాడి. తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో పాటు క్వార్టర్స్‌లో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అప్పటికే ఆ ఉగ్రవాది చేసిన గ్రనేడ్ దాడిలో గాయపడినా చెక్కు చెదరని ధైర్యంతో నిలిచి గంటపైగా మాట్లాడి అతడిని దాడి ఆపేలా ఒప్పించింది. అక్కడి నుంచి తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఒప్పించింది. సురక్షితంగా కొంత దూరం వెళ్లాక తెలివిగా ఆర్మీ జవాన్లకు సమాచారం ఇచ్చి, ముష్కరుల అంతం చూసింది. ఈ చిన్నారి చూపిన తెగువ, ధైర్యానికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పుస్కారానికి ఎంపికైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అవార్డును అందుకోవడంతో పాటు ఆయన ప్రశంసలు కూడా పొందింది. ఈ వీర బాలిక పేరు గులుగు హిమ ప్రియ. ఈ చిన్నారి తండ్రి గులుగు సత్యనారాయణ ఆర్మీలో హవల్దార్‌గా…
ఐఏఎస్ కేడర్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా బిజిపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతికూలంగా స్పందిందిస్తున్నాయి. దానితో, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదాలకు దారితీస్తుంది. ఐఏఎస్ క్యాడర్ నిబంధనలు, 1954లో సవరణలను బహిరంగంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ సవరణలను ఆమోదించవద్దని కోరుతూ ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు వ్రాసారు. జనవరి 12న, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అన్ని రాష్ట్రాలకు పంపిన నోటీసులో ఐఏఎస్ కేడర్ అధికారుల డిప్యుటేషన్‌కు సంబంధించిన 1954 నాటి నిబంధనలతో 6వ నిబంధనకు ప్రతిపాదిస్తున్న సవరణపై వారి అభిప్రాయాలు కోరింది. ఐఏఎస్ కేడర్ నియమావళిలో సవరణలు మూడు అఖిల భారత సర్వీస్ అధికారుల సెంట్రల్ డిప్యుటేషన్‌లో ఈ సవరణ కేంద్ర ప్రభుత్వంకు ఎక్కువ నియంత్రణకు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే సివిల్ సర్వెంట్లను కేంద్ర…
భారత్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని నేతాజీ ముందే ఊహించారని ఆయన కుమార్తె అనితా బోస్ పిఫాప్ తెలిపారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రజలను ఉద్దేశించి జర్మనీ నుంచి ఆమె ఓ సందేశాన్ని విడుదల చేశారు. నమస్కారంతో తన సందేశాన్ని ప్రారంభించిన అనిత.. ‘‘భారతదేశానికి నమస్కరిస్తున్నా. మహమ్మారితో దేశం పోరాడుతున్న ఈ సమయంలో భారతీయ ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నా. ప్రజలు నిత్యం స్మరించుకునే భారత బిడ్డ, నా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 సంవత్సరాల క్రితం కటక్‌లో జన్మించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేతాజీని గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. దేశంపై తన తండ్రికి ఉన్న ‘విజన్’ గురించి మాట్లాడుతూ.. ‘‘నేతాజీ ఆలోచనాపరుడు మాత్రమే కాదు, చేతల మనిషి కూడా. దేశంపై ఆయనకో ‘విజన్’ ఉంది. ఈ దేశం ఆధునికమైనది, తత్వశాస్త్రంలో, మతపరమైన సంప్రదాయాలలో చరిత్రలో వేళ్లూనుకుపోయింది.…