Author: Editor's Desk, Tattva News

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూతో సహా మరింత కఠినమైన చర్యలను ప్రకటించింది. రెవెన్యూ, అటవీ, విపత్తు నిర్వహణ, సహాయ, పునరావాస శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, అవసరమైన అవసరాలకు మినహా కర్ఫ్యూ సమయంలో ప్రజలను రోడ్లపైకి రావడానికి అనుమతించబడదు.రెస్టారెంట్లు, తినుబండారాలు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు, 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతిస్తారు. రెస్టారెంట్‌లు లోపల ఉన్న వ్యక్తుల సంఖ్యను బోర్డుపై ప్రదర్శించాలని కూడా నిర్దేశించారు. అయితే, హోమ్ డెలివరీలపై ఎటువంటి పరిమితి లేదని తాజా మార్గదర్శకాలలో పేర్కొన్నారు. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన కార్యకలాపాలు మినహా పాఠశాలలు, కళాశాలలు ఫిబ్రవరి 15 వరకు మూసివేయబడతాయి. దేశీయ ప్రయాణాల కోసం, ఒకరు రావడానికి 72 గంటల ముందు జారీ చేసిన డబుల్ టీకా సర్టిఫికేట్ లేదా తప్పనిసరి ఆర్ టి పిసిఆర్…

Read More

మినీ సాధారణ ఎన్నికలుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న కీలకమైన ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర నేడు ప్రకటించారు. ఫిబ్రవరి 10న ఎన్నికలు  ప్రారంభమై,  మార్చి 10న ఫలితాలు ప్రకటనతో ముగుస్తుంది.  ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశలలో పోలింగ్ జరుగుతుంది. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుందని తెలిపారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుందని చెప్పారు.  పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల…

Read More

ఇటీవల జరిగిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందినప్పటికీ, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేని ఇరకాట పరిస్థితిని ఎదుర్కోవడంతో బిజెపి అనూహ్యంగా మేయర్ పదవిని గెల్చుకొంది.   మొదటిసారిగా 36 వార్డ్ లలో 14 వార్డ్ లను గెల్చుకొని, ఏకైక అతిపెద్ద పక్షంగా అవతరించిన ఆప్ కు పంజాబ్ ఎన్నికల ముందు మేయర్ పదవి గెలుచుకోవాలనే ప్రయత్నం ఫలించలేదు. గత కార్పొరేషన్ లో గల 26 స్థానాలు ఈ సారి 12కు పడిపోయినప్పటికీ బిజెపి అభ్యర్థి  సరబ్జిత్ కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంజు కత్యాల్‌పై కేవలం ఒక ఓట్ తేడాతో మేయర్ గా గెలుపొందారు.  వాస్తవానికి బిజెపి, ఆప్ అభ్యర్థులకు సమానంగా 14 చొప్పున ఓట్లు వచ్చాయి. అయితే ఆప్ కు వేసిన ఒక ఓట్ చెల్లదని ప్రకటించడంతో బిజెపి అభ్యర్థి గెలుపొందింది. దానితో అక్రమం జరిగినదని అంటూ ఆప్ సభ్యులు ఎన్నికలు జరిగిన అసెంబ్లీ హాలులో రసభ సృష్టించారు. ఇద్దరు…

Read More

వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని బిజెపి సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ భరోసా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ధర్మయుద్ధంలో టీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ‘ ఇటీవల అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అభినందన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన రాత్రి చీకట్లు తొలగి కొత్త సూర్యోదయం అవుతుందని చెప్పారు. ఈ సంఘర్షణ పోరాటాన్ని ప్రకటించడానికే తాను ఇక్కడకు వచ్చానని ఆయన వెల్లడించారు. ‘ సీఎం కేసీఆర్‌ భయకంపితులై ఉన్నారని చెబుతూ ఇంతగా భయపడే పిరికి సీఎంను తానెక్కడా చూడలేదని చౌహాన్‌ ఎద్దేవా చేశారు. ‘ప్రజలు, ఉద్యోగులు, ప్రతిపక్షాలు, ఇతర వర్గాల ప్రజలు ఏవైనా సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వాలు సమాధానాలివ్వడం సంప్రదాయం. భయపడే వారే ప్రశ్నించే వారిని జైల్లో పెడతారు. అదే తెలంగాణలో జరుగుతోంది..’అనిపేర్కొన్నారు. ఇక్కడ సమస్యలపై ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో…

Read More

బంగ్లా యుద్ధం – 23 జుల్ఫికర్ అలీ భుట్టోతో జూలై 1972 సిమ్లా ఒప్పందంపై ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సంతకం చేయడంతో యుద్ధంలో అపూర్వ విజయం సాధించిన భారత్ దౌత్యంలో ఓటమి చెందిన్నట్లు అయింది.  ఈ ఒప్పందం అధికారికంగా యుద్ధాన్ని ముగించింది.  యుద్ధంలో  గణనీయమైన, విలువైన భూభాగాన్ని , జనాభాలో సగానికి పైగా కోల్పోయినప్పటికీ కూడా పాక్ దౌత్యపరంగా, రక్షణ పరంగా మరింత బలోపేతం కాగలిగింది. నిత్యం భారత్ కు సవాల్ గా పరిణమించింది. సిమ్లా ఒప్పందం సందర్భంగా లభించిన అపూర్వమైన అవకాశాన్ని భారత్ నిష్కర్షగా వ్యవహరించి, సద్వినియోగం చేసుకోలేక పోవడంతో గత 50 ఏళ్లుగా దేశం భారీ మూల్యం చెల్లించుకో వలసి వస్తున్నది.  స్పష్టమైన విజయం సాధించినప్పటికీ, పశ్చిమాన ఆక్రమించిన 5,800 చదరపు మైళ్ల (15,022 చదరపు కి.మీ.) భూభాగాన్ని వదులుకోవడంతో పాటు, 93,000 మంది పాకిస్థానీ యుద్ధ ఖైదీలను స్వదేశానికి రప్పించడంతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన అనేక డిమాండ్లను భారత్ విచిత్రంగా…

Read More

ఒక వంక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులందరు ఆయనకు బాసటగా నిలిచి, కేసీఆర్ పాలనపై గొంతెత్తి నిరసనలు వ్యక్తం చేయడం ద్వారా  తెలంగాణాలో అధికార పక్షంకు తామే అసలైన రాజకీయ ప్రయామ్నాయం అనే సంకేతం ప్రజలకు ఇవ్వగలిగారు.  అయితే స్వయంగా కాంగ్రెస్ వారసులు రాజీవ్ గాంధీ, ప్రియాంకాగాంధీ  ఎంపిక చేసి, ఎన్నో ఆశలతో రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తే, తన దూకుడుతనంతో మొదట్లో పార్టీ కార్యకర్తలలో కొంత ఉత్సాహం కలిగించ గలిగినా ఇప్పుడు పార్టీలో దాదాపు ఏకాకిగా మిగిలిపోయి, దిక్కుతోచక నిస్తేజంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.  కేసీఆర్, బిజెపి కుమ్మక్కై, కాంగ్రెస్ ను అణచడంకోసం, బండి సంజయ్ ను నాయకుడిగా చేసేందుకు `అరెస్ట్ నాటకం’ ఆదారంటూ ఇంటి వద్ద నుండి ట్వీట్ లు  ఇవ్వడం తప్ప సొంత పార్టీలో వ్యవహారాలు చక్కబెట్టలేక పోతున్నారు.  కాంగ్రెస్ అంటేనే  కుమ్ములాటలు.. గ్రూప్ రాజకీయాలు..…

Read More

ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాము. పెట్టుబడులు గాని, నూతన సాంకేతిక ఆవిష్కరణలు గాని గ్రామీణ రంగం, వ్యవసాయంకు చేరడం లేదు. అయినప్పటికీ కరోనా మహమ్మారి సమయంలో గ్రామాలే దేశానికి రక్షణగా నిలిచాయి. కరోనా వచ్చి వేలాది ఉద్యోగాలను లాగేసింది. లక్షల మంది ఉపాధిని కొల్లగొట్టింది. అయితే, గ్రామాలు మాత్రం పెద్ద ఎత్తున ఆడుకున్నాయి. 2021లో నిరుద్యోగం, ఉపాధి లేమితో పట్టణాలు బిక్కుబిక్కుమంటే, గ్రామాలలో కావాల్సినంత పని దొరికింది. కరోనా రెండో వేవ్ తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి రంగంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో అక్టోబర్ మినహా మిగిలిన 11 నెలల్లో గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో నిరుద్యోగం అధికంగా నమోదైంది. పట్టణాల్లో ఆసక్తి, నైపుణ్యాలున్నా పని దొరకలేదు. గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. వానలు బాగా పడి కాలం…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటన సందర్భంగా ఆయన భద్రతను ఉల్లంఘించిన నేపథ్యంలో పంజాబ్ పోలీసు అధికారులపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్రం పరిశీలిస్తోందని తెలుస్తున్నది. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలను ఢిల్లీకి పిలిచి వివరణలు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు నిరసనకారులు రహదారిని అడ్డుకోవడంతో, పంజాబ్‌లోని హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లైఓవర్‌పై ప్రధానమంత్రి కాన్వాయ్ బుధవారం నిలిచిపోయింది. దీనిని “ప్రధానమంత్రి భద్రతలో పెద్ద లోపం” అని పేర్కొంటూ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వం నుండి నివేదికను కోరిం మరిది. “ఈ లోపానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని” కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఎస్‌పిజి చట్టంలోని నిబంధనల ప్రకారం తప్పు చేసిన అధికారులపై చర్యలు…

Read More

మార్చి 2020 నుండి 94 దేశాల్లో దాదాపు 2000 మంది జర్నలిస్టులు కరోనాతో మరణించారు. గత సంవత్సరం, 2021లో, కనీసం 1400 మంది మీడియా కార్యకర్తలు వైరస్‌కు గురయ్యారు. అంటే సగటున నెలకు 116 మంది లేదా రోజుకు 4 మంది మృతి చెందారని జెనీవాలో ప్రెస్ ఎంబ్లమ్ క్యాంపెయిన్ (పిఈసీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. మహమ్మారి వల్ల ఏ ఖండమూ తప్పించుకోలేదు. మార్చి 1, 2020 నుండి పిఈసీ ద్వారా నమోదు చేసిన 1940 మంది జర్నలిస్టులలో, లాటిన్ అమెరికా సగం మంది బాధితులు లేదా 955 మంది మరణాలతో ముందంజలో ఉంది. ఆసియాలో 556 మంది మరణించారు. ఐరోపా 263, ఆఫ్రికా 98 మరియు ఉత్తర అమెరికాలో 68 మంది ఉన్నారు. 50 మందికి పైగా క్షతగాత్రులపై ఇంకా విచారణ కొనసాగుతోంది. జర్నలిస్టుల మరణాలకు కారణం కొన్నిసార్లు పేర్కొనలేదు లేదా వారి మరణాలు ప్రకటించకపోవడంతో, బాధితుల వాస్తవ…

Read More

కేసీఆర్ సర్కారుపై ఉధృతంగా పోరాడండి, ఎక్కడా తగ్గొద్దు అంటూ బీజేపీ రాష్ట్ర నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెబుతూ 2023 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంచేశారు. గత సాయంత్రం హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టినదని తెలిపారు. ఇక్కడ పార్టీ బలోపేతం కోసం సీరియస్ గా పని చేయాలని చెప్పారు. నాయకుల మధ్య మంచి సమన్వయం ఉండాలని చెబుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ల సమస్యలపై పోరాడితేనే నాయకులుగా ఎదుగుతారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ బాగా బలీయంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కడా రాజీపడకుండా ఉద్యమించాలని సూచించారు. అయితే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు ఆశించి మాత్రం పని చేయవద్దని హితవు చెబుతూ అలా అయితే పార్టీలో భవిష్యత్తు…

Read More