Author: Editor's Desk, Tattva News

పాకిస్థాన్ ఉగ్రవాది మెహమ్మద్ అరిఫ్ అలియాస్ అష్ఫాఖ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తోసిపుచ్చారు. 24 ఏండ్ల కింద జరిగిన ఎర్రకోట దాడి ఘటనలో ఈ ఉగ్రవాదికి విచారణల అనంతరం ఉరిశిక్ష తీర్పు వెలువడింది. తాను ఇంతకాలం జైలులో ఉన్నానని, తనకు విధించిన మరణశిక్షను రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలో సమీక్షించి రద్దు చేయడం ద్వారా క్షమాభిక్ష పెట్టాలని ఈ దోషి మొరపెట్టుకున్నారు. ఈ అప్పీల్ రాష్ట్రపతికి మే 15వ తేదీన చేరింది. దీనిని ఆమె మే 27న తిరస్కరించారని రాష్ట్రపతిభవన్ అధికార వర్గాలు మే 29న తెలిపాయి. రాష్ట్రపతి నుంచి తిరస్కారం వెలువడటంతో తనకు ఉన్న హక్కు మేరకు ఆయన సుప్రీంకోర్టును తిరిగి ఆశ్రయించారు. శిక్ష తీవ్రతను తగ్గించాలని కోరారు. ఇంతకాలం ఖైదులోనే ఉన్నందున దీనిని పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే పూర్వాపరాలు పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు మరణశిక్ష సబబే అని సమర్థించింది. రెడ్‌ఫోర్టుపై దాడిని…

Read More

ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) బుధవారం విడుదల చేసిన లింగ వ్యత్యాస సూచీలో భారత్‌ ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 129వ స్థానంలో నిలిచింది. 146 దేశాల జాబితాలో ఐస్‌లాండ్‌ అగ్రస్థానం దక్కించుకోగా, సూడాన్‌ చివరి స్థానంలో నిలిచింది. ఆదాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య తదితర అంశాలపై అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఐస్‌ల్యాండ్‌ 93.5%, భారత్‌ 64.1% స్కోర్‌ సాధించాయి. ప్రపంచం మొత్తంగా 68.5 శాతం స్కోరు సాధించిందని, పూర్తి లింగ సమానత్వం సాధించేందుకు మరో 134 ఏండ్లు లేదా ఐదు తరాలు పడుతుందని డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక అభిప్రాయపడింది. దక్షిణాసియా దేశాల వరకు చూస్తే లింగ వ్యత్యాస సూచీలో భారత్‌ కంటే బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ ముందు స్థానాల్లో ఉండటం గమనార్హం. ఇక పాకిస్థాన్‌ చివరి నుంచి రెండవ(145వ) స్థానంలో ఉన్నది. ఆర్థిక లింగ సమానత్వం తక్కువ ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్‌, సూడాన్‌, ఇరాన్‌, పాకిస్థాన్‌, మొరాకో సహా…

Read More

ఈ నెల 24వ తేదీ నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు ఆరంభమవుతాయి. ముందుగా దిగువసభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తరువాతి దశలో స్పీకర్ ఎన్నిక జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ బుధవారం తెలిపారు. ఇక పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఈ నెల 27న ప్రసంగిస్తారు. దీనితో కొత్త ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రజాపరిచయం అవుతుంది. వచ్చే ఐదు సంవత్సరాలకు ప్రభుత్వ విధివిధానాలు, కార్యాచరణ అంశాలను రాష్ట్రపతి వివరిస్తారు. జులై 3వ తేదీన సెషన్ ముగుస్తుందని తెలిపారు. కొత్తగా కొలువుదీరిన పాత మోదీ కేబినెట్ నుంచి జులై చివరిలో బడ్జెట్ సమర్పణ ఉంటుందని వెల్లడైంది. తొలి సమావేశం మూడు రోజులు కొత్త సభ్యుల ప్రమాణస్వీకారంతోనే సాగుతుంది. సభాపతిని ఎంచుకోవడం కూడా జరుగుతుంది. తిరిగి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అయ్యారు. దీనితో ఆమె వరుసగా మూడుసార్లు బడ్జెట్ సమర్పించిన దేశ తొలి…

Read More

కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం లభించింది. అయితే, మోదీ 3.0 కేబినెట్‌ లోని 71 మంది మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్‌ కేసులుఉన్నట్లు తాజాగా వెల్ లడైంది. కాగా వీరిలో ఇద్దరు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు , ఐపిసి 307 సెక్షన్ కింద ఇవి నమోదు అయి ఉన్నట్లు స్వయంగా వీరే తెలియచేసుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ సహా మొత్తం 28 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ తెలిపింది. ఆయా ఎంపీలు తమ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపిసి 370 పరిధిలో హత్యాయత్నం కేసు నమోదు అయి ఉన్న ఇద్దరు కూడా మంత్రులు కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ మంత్రులిద్దరిలో ఒక్కరు…

Read More

ఏపీలో వైసిపి శ్రేణులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ, జనసేన  వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుధవారం వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.  రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యకర్తల పైన దాడులు చేయడం, ఇళ్లు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు లేఖలు రాశామని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలు రోజు రోజుకూ క్షీణిస్తున్నాయని, వాటిని పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి…

Read More

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రబాబుతోపాటు పవన్‌ కళ్యాణ్‌, మరో 23 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్‌లో ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పవన్ కల్యాణ్​, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పవన్‌ కళ్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్‌, గుమ్మడి సంధ్యారాణి, బి.సి.జనార్దన్‌రెడ్డి, టి.జి.భరత్‌, ఎస్‌.సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి…

Read More

టిడిపి అధినేత తన మంత్రివర్గంలో సీనియర్ నాయకులకు దాదాపుగా మొండిచెయ్యి చూపించారు. కొత్తవారికి పెద్ద పీట వేశారు. మొత్తం 24 మంది మంత్రులలో 17 మంది కొత్తవారే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా చేరుతున్నారు. జనసేన నుండి ముగ్గురు, బిజెపి నుండి ఒకరు మంత్రివర్గంలో చేరుతున్నారు. ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది.  నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి, కుప్పం)కొణిదెల పవన్ కళ్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)నాదెండ్ల మనోహర్ (తెనాలి)పి.నారాయణ (నెల్లూరు సిటీ)వంగలపూడి అనిత (పాయకరావుపేట)సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)కొలుసు పార్థసారధి (నూజివీడు)డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)కందుల దుర్గేష్ (నిడదవోలు)గుమ్మడి…

Read More

గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఎనిమిది మాసాలుగా సాగుతున్న యుద్ధం ముగింపు లక్షంగా కాల్పుల విరమణ ప్లాన్‌ను ధ్రువీకరిస్తూ ఐక్యరాజ్య సమితి (యుఎన్) భద్రతా మండలి తన తొలి తీర్మానాన్ని సోమవారం ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను యుఎస్ ప్రాయోజిత తీర్మానం స్వాగతించింది. బైడెన్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. మూడు దశల ప్లాన్‌కు అంగీకరించవలసిందిగా పాలస్తీనా తీవ్రవాద వర్గం హమాస్‌ను తీర్మానం కోరింది. ఈ ప్రతిపాదనను తాము ‘సకారాత్మకంగా’ భావిస్తున్నట్లు హమాస్ తొలుత తెలిపింది. ‘తీర్మానంలోని షరతులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, బేషరతుగా పూర్తిగా అమలు చేయాలని’ ఇజ్రాయెల్, హమాస్‌లను తీర్మానం కోరింది. తీర్మానానికి అనుకూలంగా భద్రతా మండలిలోని 15 మంది సభ్యులలో 14 మంది వోటు వేయగా, రష్యా గైర్ హాజరైంది. అంతకుముందు సోమవారం విలేకరులతో అమెరికా ఉప రాయబారి రాబర్ట్ వుడ్ మాట్లాడుతూ, ‘ఈ యుద్ధాన్ని కనీసం తాత్కాలికంగానైనా…

Read More

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని బీజేపీ ఎంపిక చేసింది. భువనేశ్వర్‌లో మంగళవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో మాఝీని శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బీజేపీ పరిశీలకులుగా నియమితులైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, భూపేంద్ర యాదవ్‌ పర్యవేక్షణలో ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రిని ఎంపిక జరిగింది.  ఇదే సమావేశంలో డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్ దేవ్, ప్రవతి పరిడాలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బుధవారం సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్‌ జనతా మైదానంలో కొత్త సీఎంతో పాటు క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేయనుంది. ఇందకు సంబంధించిన చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహన్ చరణ్ మాఝీ కెంఝోర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి 2000 అసెంబ్లీ ఎన్నికల్లో కేంఝోర్ నుంచి పోటీచేసిన మోహన్.. 2004 ఎన్నికల్లోనూ తిరిగి విజయం సాధించారు. తర్వాత అదే స్థానం నుంచి వరుసగా రెండు ఎన్నికల్లో 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ, 2019లో మూడోసారి విజయం అందుకున్న…

Read More

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారులో ఉన్న 71మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులే. వారి సగటు ఆస్తుల విలువ రూ.107.94 కోట్లు. ఈ వివరాలతో కూడిన నివేదికను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా ఆరుగురు మంత్రుల ఆస్తుల విలువ మాత్రం భారీగా ఉంది. వీరిలో అత్యధిక ఆస్తులు కలిగిన కేంద్రమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.5705.47 కోట్లు. వీటిలో దాదాపు రూ.5598.65 కోట్ల చరాస్తులు, రూ.106.82 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. ఇక రెండో స్థానంలో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.424.75 కోట్లు. ఇందులో రూ.62.57 కోట్ల చరాస్తులు, రూ.362.17 కోట్ల స్థిరాస్తులు…

Read More