వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి తొలిసారి హస్తగతం కానుంది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన ప్రతిసారీ గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈసారి జరిగిన హోరాహోరీ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయకేతనం ఎగురవేశారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ విజయం మాత్రం తీన్మార్‌కే దక్కింది. తొలిసారి గ్రాడ్యుయేట్స్ స్థానం హస్తగతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మూడురోజుల పాటు కొనసాగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 19 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. అయితే గెలుపు కోటా రావాలంటే 1,55,095 ఓట్లు కావాలి. తీన్మార్ 32,282 ఓట్ల దూరంలో ఉన్నారు. రెండో స్థానంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఉన్నారు.…
Author: Editor's Desk, Tattva News
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఏడుగురు నక్సలైట్లు మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గోబెల్ గ్రామ సమీపంలోని ఒర్చా అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ్‌పూర్, కొడగావ్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన నొలీపెల .ఇలంలా కి.కంవః గాకెండచ ఇండొ టిబెటన్ బార్డర్ పోలీసుకు చెందిన 45వ బెటాలియన్‌తో కూడిన ఉమ్మడి భద్రతా దళం నక్సల్స్ కోసం కూంబింగ్ జరిగినపుడు ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. కాల్పుల పోరు ఆగిపోయిన అనంతరం పోలీసులు వెళ్లి చూడగా యూనిఫారాలలో ఉన్న ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలు కనిపించాయని వారు చెప్పారు. వారి నుంచి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మరణించిన నక్సల్స్ సంఖ్య 122కి చేరుకుంది. మే 23న నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అడవిలో…
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మోదీ 3.0’ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. జూన్ 9వ తేదీన సాయంత్రం 7.15 గంటలకు మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు సమ్మతి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ సహా ఎన్డీయే కూటమిలోని నేతలు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు…
కర్ణాటక బిజెపి ఎంఎల్ సి కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో శుక్రవారం కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిట్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. రాహుల్ గాంధీకి మాజీ ఎంపీ, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ సోదరుడు డి.కె. సురేశ్ రూ. 75 లక్షలు విలువ చేసే తన ఆస్తిని షూరిటీ గా ఇచ్చారు. కాగా కోర్టు కేసు విచారణను జులై 30కి వాయిదా వేసింది. రాహుల్ గాంధీని స్వాగతించడానికి పార్టీ కార్యకర్తలు, అడ్వొకేట్లు కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. కోర్టు ప్రక్రియ ముగిశాక కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి శివకుమార్ ఒకే కారులో కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. రాహుల్ గాంధీ చాలా సంతోషంగా కనిపించడమే కాక, కారులో నుంచి పార్టీ కార్యకర్తలకు చేయి ఊపుతూ వెళ్లారు దీనికి ముందు…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్డడీకి కోరుతూ శుక్రవారం సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జూన్ 21 వరకు కవిత కస్డడీని పొడిగించింది. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదేరోజున సీబీఐ ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. సీబీఐ కేసులో కవితపై దాఖలైన ఛార్జిషీట్‌ను కోర్టు విచారణకు తీసుకుంది. ఈ క్రమంలోనే.. కవిత చేసిన అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. జైలులో తాను చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని ధర్మాసనాన్ని కవిత కోరింది. కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ఆమెకు కావాల్సిన పుస్తకాలు అందించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో.. కవితకు కొంత ఊరట లభించినట్టయింది.…
వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని తమ నేతగా ఎన్నుకోడానికి ఎన్డీయే ఎంపీలు ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనం సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఎన్డీయే పక్షనేతగా మోదీ పేరును కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా.. అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు బలపరిచారు. ఇక, అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్డీయే పక్షనేతగా మోదీ మూడోసారి బాధ్యతలు తీసుకోవడం చరిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రదాని మోదీ మూడు నెలల పాటు రాత్రి పగలు తేడా లేకుండా ప్రచారం నిర్వహించి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. దేశ చరిత్రలోనే ఇది అత్యంత ముఖ్యమైన రోజని చెబుతూ గత పదేళ్లలో మోదీ సారథ్యంలో దేశం చరిత్రాత్మక విజయాలు సాధించిందని కొనియాడారు. మేకిన్ ఇండియా కార్యక్రమం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం మెగా కుటుంబంలో ఎనలేని సంతోషాన్ని నింపింది. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం ముగించుకొని హైదరాబాద్ వచ్చిన కళ్యాణ్, నేరుగా జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ కు మెగా కుటుంబ సభ్యులు గులాబీల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తల్లి అంజనాదేవి పవన్ కళ్యాణ్ కు గుమ్శడికాయతో దిష్టి తీయగా చిరంజీవి సతీమణి సురేఖ హారతిచ్చి ఇంట్లోకి స్వాగతించింది. చిరంజీవి రాగానే భావోద్వేగంతో పవన్ పాదాభివందనం చేసి ఆలింగనం చేసుకున్నారు. పట్టరాని ఆనందంతో మురిసిపోయిన మెగాస్టార్, తమ్ముడు కళ్యాణ్ కు గులాబీ మాల వేసి ఆశీర్వదించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి కళ్యాణ్.. తల్లి అంజనా దేవి, వదిన సురేఖకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. సురేఖ పవన్ సతీమణి అనా కొణిదెలకు సారెను అందజేసి స్వాగతించారు. కళ్యాణ్ రాకతో చిరు నివాసంలో సంబురాలు…
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీయేలో మిత్రపక్షాల నుండి బిజెపికి డిమాండ్ల సెగ ఎదురవుతుంది. ఇప్పటిదాకా ఎన్డీయేలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా ఎదురులేకుండా పోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ డిమాండ్లను బీజేపీ ముందు ఉంచుతున్నాయి. తాజాగా, అగ్నిపథ్ పథకంపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, లోక్‌జన్‌శక్తి (రామ్‌విలాస్ పాశ్వాన్) పార్టీలు కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ పథకాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశాయి. ఎన్డీయేకు బేషరతు మద్దతు తెలుపుతున్నామని పేర్కొంటూనే బీజేపీ ముందు జేడీయూ పలు డిమాండ్లు ఉంచింది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని జేడీయూ నేత కేసీ త్యాగీ తెలిపారు. ఈ పథకంపై చాలా వ్యతిరేకత వ్యక్తమయిందని, ఎన్నికల్లోనూ దీని ప్రభావం పడిందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తాము ఘర్షణ పడాలని కోరుకోవడం…
తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కన్నా 63 సీట్లు తగ్గాయి. అయితే ఓట్లపరంగా చూస్తే ఈ తేడా చాలా స్వల్పంగా ఉన్నది. 2019 ఎన్నికల్లో బీజేపీ 37.7 శాతం ఓట్లు పొందగా, ఈసారి 36.56 శాతం ఓట్లు సాధించింది. అంటే కేవలం 1.20 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. అయినప్పటికీ 63 సీట్లను కోల్పోయింది. యూపీలో ఓటింగ్ గణాంకాలు 2019 మాదిరిగానే కన్పించినప్పటికీ ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు కమలం పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఇక దక్షిణాదిన ఆ పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్పప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లు పెరగలేదు. ఉదాహరణకు తమిళనాడులో ఓట్ల శాతం 10 శాతానికి పెరిగినా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ విషయంలో దానికి వ్యతిరేకంగా జరిగింది.…
బాలీవుడ్ క్వీన్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌కు ఘోర అవమానం జరిగింది. శుక్రవారం జరగనున్న ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో విధుల్లో ఉన్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనను చెంపదెబ్బ కొట్టారని కంగనా రనౌత్ ఆరోపించడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గం మండి నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని కంగనా రనౌత్ ఆరోపించారు. అయితే రైతులను అగౌరవపరిచినట్లు కంగనా రనౌత్ వ్యాఖ్యలు చేసినందుకే ఆమెను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబులు కుల్విందర్ కౌర్ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం. కంగనా రనౌత్ వెల్లడించిన వివరాల ప్రకారం యూకే 707 విమానంలో చండీగఢ్…