Author: Editor's Desk, Tattva News

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తన తొలి ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఐదు ప్రశ్నలు సంధించారు. గౌరవంతో మోహన్ భగవత్‌ను ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని కేజ్రీవాల్ చెప్పారు. మోదీ ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడం, వారిని ప్రలోభపెట్టడం ద్వారా లేదా ఈడీ, సిబిఐలతో బెదిరించడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టే విధానం సరైనదేనా? భారతీయ జనతా పార్టీ రాజకీయాలతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏకీభవిస్తుందా? అని అడిగారు. అవినీతిపరులని మోదీ స్వయంగా పిలిచిన వ్యక్తులను తన పార్టీలో చేర్చుకున్నారు. అలాంటి రాజకీయాలను మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. బిజెపి తప్పుదారి పట్టకుండా చూసుకోవడం ఆర్ఎస్ఎస్ బాధ్యత. ఎప్పుడైనా మోదీని తప్పుడు పనులు చేయకుండా ఆపారా? జేపీ నడ్డా లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఆర్‌ఎస్‌ఎస్ అవసరం లేదని అన్నారు.…

Read More

ఆర్మీ సిబ్బందితో వెళుతున్న ప్రత్యేక రైలును పేల్చివేసే కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఏకంగా 10 డిటోనేటర్లను దుండగులు అమర్చారు. అయితే అదృష్టం కొద్దీ ఎలాంటి నష్టం జరగకుండానే కుట్ర భగ్నమైంది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్యానికి చెందిన ప్రత్యేక రైలు జమ్మూకశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళుతున్న సమయంలో సగ్‌ఫాటా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ డిటోనేటర్లను గుర్తించారు. ఒక డిటోనేటర్ పేలడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ట్రైన్‌ను ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ వెంటనే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించాడు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటిఎస్), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రైల్వే, స్థానిక పోలీసు సీనియర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలావుండగా ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను రైల్వే భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని కాన్పూర్‌లో…

Read More

తిరుపతి లడ్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమ పరిపాలన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల మధ్య విభేదాలు సృష్టించేందుకు పవిత్ర లడ్డు గురించి చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని జగన్ ఆరోపించారు.  ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకొని వాస్తవాలను నిగ్గు తేల్చాలని, కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడాలని ఆయన ఆ లేఖలో కోరారు. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలుపుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణ పెద్ద వివాదానికి దారి తీసింది.  జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు మరియు చేప నూనెను ఉపయోగించిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆలయ పవిత్రతను వైఎస్ఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని నాయుడు ఆరోపించారు.…

Read More

కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే, జనసేన నేత పంతం నానాజీ  ఓ డాక్టర్‌పై `చంపేస్తా’ చేయి ఎత్తడం, అతని అనుచరులు దాడి చేయడం పెను దుమారానికి కారణం అయింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో అంతా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  తప్పు చేస్తే ఏ పార్టీ అయినా చట్టం అందరికీ ఒకటే అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకు హెచ్చరిక ఇవ్వడంతో ఆ డాక్టర్‌కు క్షమాపణలు చెప్పారు.  కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో శివారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.  కాలేజీ గ్రౌండ్‌లో బయటి వ్యక్తులు వాలీబాల్‌ ఆడుతుండటంతో తమకు ఆడుకునే అవకాశం దక్కడం లేదని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి…

Read More

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘ప్రాయశ్చిత్త దీక్ష’ చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకున్నారు.  తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులు మౌనంగా ఉండి మహా అపరాధం చేశారని, అందుకే తాను దీక్ష తీసుకున్నానని పవన్ చెప్పారు.  అయితే, ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసం కాదని ఆయన స్పష్టత  ఇచ్చారు.  దోషులకు తప్పకుండా శిక్ష పడాలని, టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. చర్చికి, మసీదులో జరిగితే జగన్ ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.…

Read More

అమృత్ టెండర్లలో సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందిచిన అమృత్ పథకంలో సిఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని ధ్వజమెత్తారు. సిఎం తన అధికారాన్ని ఉపయోగించి తన బావమరిదినికి పనులు అప్పగించారని విమర్శించారు. = ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోదా కంపెనీకి అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఈ స్కాం రూ. 8,888 కోట్లు ఉంటుందని, ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సిఎం పదవి పోతుందని స్పష్టం చేశారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ చట్టం సెక్షన్ 7,11,13 ప్రకారం సిఎం, ప్రజాప్రతినిధులు తన కుటుంబ సభ్యుల కోసం ఆశ్రిత పక్షపాతం చూపుతూ అధికార దుర్వినియోగం…

Read More

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే వార్తల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలియగానే తన మనసు వికలమైందని.. ఈ దారుణాన్ని మొదట్లోనే కనిపెట్టలేకపోయామనే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. “అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది” అని తెలిపారు.  “అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ…

Read More

ఆప్ సీనియర్ నేత అతిషీ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై తీహార్ జైలు నుంచి బయటకు వచ్చి రాజీనామా చేస్తానని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. మరోసారి అధికారం చేపట్టడానికి ముందు తమకు ఢిల్లీ ప్రజల నుండి తాము నిజాయితీపరులమన్న సర్టిఫికేట్ కావాలని కేజ్రీవాల్, ఆయన సహచరుడు సిసోడియా కోరారు. రానున్న ఎన్నికల్లో ఆ సర్టిఫికెట్ లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆప్ సీనియర్ నేత అతిషి ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజ్ నివాస్ లో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో 17వ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్ సీనియర్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం రాజ్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో…

Read More

నటసామ్రాట్, పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఫిల్మ్ హెరిజ్ ఫౌండేషన్ ఎన్‌ఎఫ్‌డిసి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాతో కలిసి ‘ఏఎన్‌ఆర్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏఎన్‌ఆర్ ఐకానిక్ ఫిలిం ’దేవదాసు’ స్క్రీనింగ్‌తో ఈ ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ’దేవదాసు’ (1953), ’మిస్సమ్మ’ (1955) ’మాయాబజార్’ (1957), ’భార్య భర్తలు’ (1961), ’గుండమ్మ కథ’ (1962), ’డాక్టర్ చక్రవర్తి’ (1964), ’సుడిగుండాలు’ (1968), ’ప్రేమ్ నగర్’ (1971), ’ప్రేమాభిషేకం’ (1981) ’మనం’ (2014) సహా ఏఎన్‌ఆర్ ల్యాండ్‌మార్క్ మూవీస్‌ను దేశవ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ హెరిజ్ ఫౌండేషన్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ 10 మాస్టర్ పీస్ మూవీ ప్రింట్‌లను 4కెలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నాయి. అద్భుతమైన క్యాలిటీలో ఈ క్లాసిక్స్‌ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత…

Read More

ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో  ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన స్నేహితుడి మొబైల్‌ వినియోగించినా సాంకేతికత సాయంతో అరెస్ట్ చేశారు.  విద్యా సాగర్‌ను డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్‌ దగ్గర శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మూడో అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చిన అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఇవాళ విజయవాడకు తీసుకొస్తున్నారు.  తనపై ఫోర్జరీ పత్రంతో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని ముంబై నటి ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్.. ఐపీఎస్‌ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నిలు కీలకంగా ఉన్నారన్నారు. నటి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఏ1గా కుక్కల విద్యాసాగర్‌ను…

Read More